హోం మంత్రిత్వ శాఖ

ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ , స్పైస్ హెల్త్ అభివృద్ధి చేసిన ( ఐసీఎంఆర్ ) ఆర్టీ- పిసిఆర్ లాబ్ ను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువగా నిర్వహించడానికి మరిన్ని సౌకర్యాలు

Posted On: 23 NOV 2020 7:36PM by PIB Hyderabad

ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ )తో కలసి స్పైస్హెల్త్ నెలకొల్పిన కోవిడ్ -19 ఆర్టీ- పిసిఆర్ లాబ్ ను కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఐసీఎంఆర్ లో ప్రారంభించారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ లో దీనిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కూడా పాల్గొన్నారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, స్పైస్ జెట్. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ సింగ్, స్పైస్ హెల్త్ సీఈఓ అవని సింగ్ తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్ ఆమోదించిన ఈ పరీక్షా కేంద్రానికి ఎన్ఏబిఎల్ గుర్తింపు లభించింది. కొవిడ్ -19 నిర్ధారణలో ఆర్టీ- పిసిఆర్ పరీక్షలు కీలకంగా మారాయి. వీటి ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. ఒక టెస్ట్ ను చేయడానికి 499 రూపాయలను వసూలు చేస్తారు. దీనిని ఐసీఎంఆర్ భరిస్తుంది. పరీక్షలు చేయించుకునే ఢిల్లీ ప్రజలు ఎలాంటి మొత్తాన్ని చెల్లించనవసరం ఉండదు. సామాన్య ప్రజలకు కొవిడ్ పరీక్షలను మరింత అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కొవిడ్ నిర్ధారణ కోసం నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు రాడానికి 24 నుంచి 48 గంటలు పడుతున్న సమయంలో ఆర్టీ- పిసిఆర్ పరీక్షల ఫలితాలు ఆరు నుంచి ఎనిమిది గంటలలో వస్తున్నాయి.

 

దేశవ్యాపితంగా పరీక్షా కేంద్రాలను నెలకొల్పి నమూనాలను సేకరించడానికి ఐసీఎంఆర్ తో స్పైస్ జెట్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలి కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. రానున్న రోజులలో దేశ రాజధాని వివిధ ప్రాంతాలలో ఇటువంటి కేంద్రాలను నెలకొల్పుతారు. మొదటి దశలో 10 కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో తొలుత రోజుకి 1,000 నమూనాలను పరీక్షిస్తారు. ఆ తరువాత ఈ సంఖ్యను 3,000కి పెంచుతారు.

***

 



(Release ID: 1675299) Visitor Counter : 196