PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 23 NOV 2020 5:49PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారత్‌లో ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య మొత్తం కేసులలో 5 శాతంకన్నా తక్కువ.
  • కోలుకునేవారి జాతీయ సగటు సుస్థిరంగా 93 శాతానికి ఎగువనే.
  • వరుసగా 16వ రోజునా కొత్త కేసులు 50,000కన్నా తక్కువగా నమోదు
  • గత 24 గంటల్లో కోలుకున్న కేసులు 41,024 కాగా, కొత్త కేసులు 44,059 మాత్రమే
  • కోవిడ్‌ ప్రతిస్పందన-నిర్వహణపై మద్దతుకు హిమాచల్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
  • ఆర్థిక పునరుద్ధరణ, ఉద్యోగాలు, వాణిజ్యానికి మాత్రమే జి20 నిర్ణయాత్మక కార్యాచరణ పరిమితం కాదరాదని, మానవాళి భవిష్యత్తుకు ధర్మకర్తలుగా భూమాత సంరక్షణపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి పిలుపు.

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

మొత్తం కోవిడ్ కేసులలో చురుకైనవి 5 శాతంక‌న్నా త‌క్కువ‌; ‌కోలుకునేవారు 93 శాతానికిపైగానే; దేశంలో 16 రోజులుగా 50వేలక‌న్నా దిగువ‌నే కొత్త కేసులు

భార‌త్‌లో నేడు చురుకైన కోవిడ్ కేసులు (4,43,486) మొత్తం కేసుల‌లో 4.85 శాతం మాత్ర‌మే. ఇక కోలుకునేవారి స‌గ‌టు మ‌రింత మెరుగుప‌డుతూ 93.68 శాతంగా న‌మోదైంది. గత 24 గంటలలో 41,024 మంది కోలుకోగా, ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైనవారి సంఖ్య 85,62,641కి పెరిగింది. మ‌రోవైపు చికిత్సపొందే కేసుల‌తో పోలిస్తే కోలుకున్న కేసులు సంఖ్య పెరుగుతూ రెండింటి మధ్య వ్య‌త్యాసం 81,19,155కు చేరింది. ఇక గత 24 గంటలలో  44,059 కొత్త కేసుల న‌మోదు నేప‌థ్యంలో రోజువారీ కేసులు వ‌రుస‌గా 16వ రోజునా 50 వేలకన్నా దిగువ‌స్థాయికి ప‌రిమితమ‌య్యాయి. చలి తీవ్రత పెరిగేకొద్దీ పశ్చిమార్థ గోళంలోని అనేక దేశాల్లో కేసులు పెరుగుతుండ‌గా దీనికి భిన్నంగా భారత్‌లో మ‌హ‌మ్మారి అదుపులో ఉన్నట్టు ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. కోలుకున్న కేసుల‌లో 77.44 శాతం 10 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనివే. ఈ జాబితాలో కేర‌ళ (6,227), ఢిల్లీ  (6,154), మ‌హారాష్ట్ర (4,060) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక తాజా కేసుల‌లో 78.74 శాతం కూడా 10 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనివి కాగా, ఢిల్లీ (6,746), మహారాష్ట్ర (5,753), కేరళ (5,254) ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాల్లో నిలిచాయి. దేశ‌ంలోని 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు కొత్త కేసులు జాతీయ సగటు (6,623) కన్నా తక్కువగా ఉండ‌టం విశేషం. కాగా, 24 గంటల్లో 511 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా, వీటిలో 74.95 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి.  ఢిల్లీలో అత్యధికంగా 121 మంది (23.68 శాతం), మహారాష్ట్రలో 50 మంది, పశ్చిమ బెంగాల్‌లో 49 మంది కోవిడ్ పీడితులు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ స్థాయిలో ప్రతి 10 లక్షల జనాభాకు కోవిడ్ మృతులు 97 కాగా, దేశంలోని 21 రాష్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మ‌ర‌ణాల స‌గ‌టు ఇంత‌క‌న్నా తక్కువగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675061

కోవిడ్ ప్రతిస్పందన-నిర్వహణపై మద్దతుగా హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలు

కోవిడ్‌ ప్రతిస్పందన, నిర్వహణ చర్యల్లో మద్దతు కోసం హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి బృందాలను పంపింది. ఈ రాష్ట్రాల్లో చురుకైన కేసుల సంఖ్య (ఆస్పత్రిలో చేరేవారు లేదా ఇళ్లలోనే వైద్య పర్యవేక్షణలో ఉన్నవారి) రోజువారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పంపిన ముగ్గురేసి సభ్యులున్న ఈ బృందాలు అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న జిల్లాలను సందర్శిస్తాయి. ఆయా ప్రాంతాల్లో వ్యాధి నియంత్రణ, నిఘా, పరీక్ష, సంక్రమణ నివారణ/నియంత్రణ చర్యలను బలోపేతం చేసే దిశగా అధికార యంత్రాంగానికి తోడ్పాటు అందిస్తాయి. సకాలంలో రోగ నిర్ధారణకు ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా నిర్వహించడంలో కేంద్ర బృందాలు మార్గనిర్దేశం చేస్తాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674889   

‘బోస్టన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్‌’ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘బోస్టన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్‌’ను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ మెరుగైన నివారణ-ఆరోగ్య సంరక్షణపై పరిశోధనల దిశగా నిపుణులందర్నీ ఒక వేదికపైకి తెచ్చినందుకుగాను సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- “మనం స్పానిష్ ఫ్లూ, మొదటి-రెండో ప్రపంచ యుద్ధాలను చూడలేదు. కానీ, ఇవాళ మనమంతా నిశ్శబ్ద యుద్ధ దశలో జీవిస్తున్నాం దాదాపు 100 మిలియన్లకుపైగా ప్రజలు మరణించారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో తమ ప్రియమైన కుటుంబసభ్యులను చివరిచూపు చూసే పరిస్థితి కూడా లేకుండా అంత్యక్రియలు నిర్వర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వ్యాధినుంచి బయటపడిన లక్షలాది మందికీ అనేక సమస్యలున్నాయి, దీంతోపాటు వారిపై ఆర్థిక భారం కూడా ఉంది” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675041

పార్లమెంటు సభ్యుల కోసం బహుళ అంతస్తుల ఫ్లాట్లకు ప్రధాని ప్రారంభోత్సవం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు సభ్యులకోసం బహుళ అంతస్తుల ఫ్లాట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజు ప్రారంభించారు. న్యూ ఢిల్లీలోని డాక్టర్ బి.డి.మార్గ్ వద్ద 80 ఏళ్లకుపైగా పాతబడిన 8 పాత బంగళాల స్థానంలో 76 ఫ్లాట్లను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- పార్లమెంటు సభ్యుల కోసం ఈ బహుళ అంతస్తుల ఫ్లాట్ల నిర్మాణం కోసం హరిత భవన నిబంధనలను అనుసరించారని పేర్కొన్నారు. ఈ కొత్త ఫ్లాట్లు నివాసితులతోపాటు ఎంపీలందర్నీ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచగలవని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీర్ఘకాలం నుంచీ వేధిస్తున్న పార్లమెంటు సభ్యుల వసతికల్పన సమస్య నేడు పరిష్కృతమైందన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675048

ఎంపీల కోసం బహుళ అంతస్తుల ఫ్లాట్లను వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675047

ఎంపీల కోసం బహుళ అంతస్తుల ఫ్లాట్లను వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675047

ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంత పరిధిలోగల మీర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గ్రామ జల-పారిశుధ్య కమిటీ/నీటిసరఫరా సంఘం సభ్యులతో ఆయన ముచ్చటించారు. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌, రాష్ట్ర గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాల ద్వారా ఈ రెండు జిల్లాల్లోని 2,995 గ్రామాల్లో నివసించే 42 లక్షల మంది జనాభాకు ఇంటింటి కొళాయి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మొత్తం రూ.5,555.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాలను పూర్తిచేయనున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674934

జి20 దేశాల కూటమి అధినేతల 15వ శిఖరాగ్ర సమావేశం

సౌదీ అరేబియా 2020 నవంబరు 21-22 తేదీల్లో వర్చువల్‌ మాధ్యమంద్వారా నిర్వహించిన జి20 దేశాల కూటమి అధినేతల 15వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఏడాది జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలతోపాటు కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు-అడ్డంకులు ఉన్నప్పటికీ 2020లో రెండో శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ఈ సందర్భంగా సౌదీ అరేబియాను, ఆ దేశ నాయకత్వాన్ని ప్రధాని అభినందించారు. ఈ మహమ్మారిని మానవాళి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగానూ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగానూ ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణ, ఉద్యోగాలు, వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా మరింత నిర్ణయాత్మక కార్యాచరణకు దిగాలని పిలుపునిచ్చారు. మనమంతా మానవాళి భవిష్యత్తుకు ధర్మకర్తలమని పేర్కొంటూ, భూమాత సంరక్షణపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. 

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675232

జి-20లో భాగంగా ‘సేఫ్‌గార్డింగ్‌ ది ప్లానెట్‌: ది సీసీఈ అప్రోచ్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674988

గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల పండిట్ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి

గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల పండిట్ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘45 మెగావాట్ల ప్రొడక్షన్ ప్లాంట్ ఆఫ్ మోనోక్రిస్టలైన్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్ ’, ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ వాటర్ టెక్నాలజీ’లకు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు విశ్వవిద్యాలయంలో ‘ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ - టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్’, ‘ట్రాన్స్‌ నేషనల్ రీసెర్చ్ సెంటర్’, ‘స్పోర్ట్స్ కాంప్లెక్స్’లను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ- ప్రపంచం ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవేళ పట్టభద్రత సాధించడం అంత సులభమైన విషయం కాదన్నారు. అయితే, ఈ సవాళ్లకన్నా విద్యార్థుల ప్రతిభాసామర్థ్యాలు గొప్పవని, మహమ్మారి వల్ల ప్రపంచ ఇంధన రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో వారు పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674780

పండిట్ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674886

దేశంలోని 15 రాష్ట్రాల్లో 2020 జూన్ నుండి అక్టోబర్‌దాకా నిర్వహించిన 27 లోక్‌ అదాలత్‌లలో 2.51 లక్షల కేసుల పరిష్కారం

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సమయంలో న్యాయసేవా ప్రాధికార సంస్థలు నవ్యజీవన సూత్రానికి అనుగుణంగా సృజనాత్మక రీతిలో లోక్ అదాలత్‌ నిర్వహణను వర్చువల్ వేదికపైకి తీసుకెళ్లాయి. ఈ మేరకు 2020 జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య 15 రాష్ట్రాల్లో 27 ఇ-లోక్ అదాలత్‌లు నిర్వహించి, 4.83 లక్షల కేసులు స్వీకరించగా, 2.51 లక్షల కేసులను పరిష్కరించారు. దీంతో రూ.1409 కోట్ల విలువైన పరిష్కారాలు సాధ్యమయ్యాయి. మరోవైపు 2020 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇ-లోక్ అదాలత్‌లు ఏర్పాటయ్యాయి. వీటిలో నేటిదాకా 16,651 కేసులు స్వీకరించగా, రూ.10.74 కోట్ల విలువైన 12,686 కేసులు పరిష్కారమయ్యాయి. కోవిడ్-19, వివిధ ప్రజారోగ్య మార్గదర్శకాల అమలు నడుమ న్యాయ ప్రదానం దిశగా న్యాయ సేవల అధికారులు ఎంతో విజ్ఞతతతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంప్రదాయక పద్ధతులతో జోడించి, కేసులు పరిష్కరించడం హర్షణీయం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675106

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో అన్ని మార్గదర్శకాలనూ అనుసరిస్తున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీ

‘లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌’లో 20/11/2020 నుంచి 57 మంది శిక్షణార్థి అధికారులకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. సివిల్ సర్వీసెస్‌లో కొత్తగా ప్రవేశించే వారికోసం నిర్వహించే 95వ ఫౌండేషన్ కోర్సు కోసం 428 శిక్షణార్థి అధికారులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. కాగా- కేంద్ర హోంశాఖ, డెహ్రాడూన్ జిల్లా పాలన యంత్రాంగం మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 వ్యాప్తి గొలుసును ఛేదించే దిశగా అకాడమీ అన్ని చర్యలూ తీసుకుంటోంది. తదనుగుణంగా వ్యాధి బారినపడిన వారందర్నీ ప్రత్యేక కోవిడ్ నిర్బంధ సంరక్షణ కేంద్రానికి తరలించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674818

భారత వ్యవసాయోత్పత్తులకు ప్రోత్సాహంగా దిగుమతి చేసుకోగల దేశాల విక్రేతలు /కొనుగోలుదారులతో వర్చువల్‌ మార్గంలో సమావేశం నిర్వహించిన అపెడా

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘వ్యవసాయ, ఆహార తయారీ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ’ (అపెడా) అంతర్జాతీయ ఎగుమతిదారుల/అమ్మకందారుల సమావేశాలను నిర్వహిస్తోంది. తద్వారా భారత వ్యవసాయోత్పత్తులకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం లభిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్‌కు చేరడంలో ఎగుమతిదారులకు అవకాశం కలిగింది. కాగా, కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో భౌతిక సమావేశాలు, మార్కెట్ ప్రమోషన్ కార్యక్రమాలు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించే కృషిలో భాగంగా ‘అపెడా’ వర్చువల్ మాధ్యమాన్ని వేదిక చేసుకుంది. తదనుగుణంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో విక్రేతలు/కొనుగోలుదారుల సమావేశాలను నిర్వహించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674817

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్: అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 24 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 1,040కి పెరిగింది.
  • అస్సాం: రాష్ట్రంలో ఇవాళ 9,994 పరీక్షలు నిర్వహించగా, 86 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో వ్యాధి నిర్ధారణ సగటు 0.86 శాతంగా నమోదైంది. అసోంలో ఇప్పటిదాకా  2,07,394 మందికి వ్యాధి నయం కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,11,513గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 103 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 10,777కు చేరింది. ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 1,406గా ఉంది.
  • సిక్కిం: రాష్ట్రంలో 31 తాజా కేసులు నమోదవడంతో సిక్కింలో మొత్తం కేసుల సంఖ్య 4,722కు చేరింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్-19 పునఃవిజృంభణను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సునామీతో పోల్చారు. ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో ఉదాసీనత వద్దని, యుద్ధం మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాని, మాస్కు ధారణ, భౌతిక దూరం పాటింపు, చేతులు కడుక్కోవడం వంటి పద్ధతులను కొనసాగించాలని కోరారు.
  • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గత 24 గంటల్లో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి. గత ఐదు నెలల్లో ఇది అత్యధికం కాగా, గుజరాత్‌లో ఆదివారం మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 2నెలల వ్యవధిలో ఒకే రోజు ఇంతపెద్ద సంఖ్యలో మహమ్మారికి బలికావడం ఇదే తొలిసారి. కాగా, నేటినుంచి రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమలవుతుందని ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ ప్రకటించారు. ఈ మేరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లలో రాత్రి 9నుంచి ఉదయం 6 గంటలదాకా కర్ఫ్యూ విధిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. మాస్కుధారణ, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం నిన్న సాయంత్రం గాంధీనగర్‌లో ముఖ్యమంత్రితో సమావేశమైంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నిరోధం దిశగా అన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వివాహాలువంటి ఏదైనా కార్యక్రమంలో 100 మందికిపైగా పాల్గొన్నట్లు తేలితే విధించే జరిమానాను రూ.10,000 నుంచి 25,000కు పెంచాలని సూచించారు. కేసుల భారం అధికంగా ఉన్న 8 జిల్లాల్లో ఆదివారంనుంచి రాత్రివేల కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర మంత్రివర్గం శనివారంనాటి సమావేశంలో నిర్ణయించింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని కొత్త కరోనా కేసులలో 85 శాతం పట్టణ ప్రాంతాల్లో, 15 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా అధిక సాంద్రత ఇందుకు కారణం. కోవిడ్‌-19 మార్గదర్శకాల అమలులో నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ యువతకు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్రమణలో యువకుల శాతం అధికంగా ఉన్న కారణంగా సకల నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కేవలం 10 శాతం వృద్ధులకు మాత్రమే వ్యాధి సోకినట్లు చెప్పారు. ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,798 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1.93 లక్షలకు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు 11,765 క్రియాశీల కేసులున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: కరోనా వైరస్ సంక్రమణ నిరోధంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఉద్యోగులు హోటళ్ల ఖాతాదారులకు యాదృచ్ఛిక కోవిడ్ పరీక్ష నిర్వహించబడుతుంది. అంతేకాకుండా పండ్లు-కూరగాయల విక్రేతలకూ పరీక్షలు చేస్తారు. రాయ్‌పూర్‌లోని జనసాంద్రతగల మురికివాడల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆరోగ్యశాఖకు సూచించారు.
  • గోవా: రాష్ట్రంలో ఆదివారం 78 కొత్త కేసుల నమోదుతో గోవాలో కరోనావైరస్ కేసుల సంఖ్య  46,826కు చేరింది. ఇవాళ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 677కు పెరిగింది. రాష్ట్రంలో ఆదివారం 167 మంది మరణించగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 44,979కి చేరింది. తీరప్రాంతంలో చురుకైన కేసుల సంఖ్య ఇప్పుడు 1,170కి చేరింది.
  • కేరళ: కేరళలో టీకా తయారీ యూనిట్లను ఏర్పాటుచేసే అవకాశాలపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఔషధ కంపెనీలు తమ మందుల తయారీ లైసెన్స్‌తో టీకా తయారీకి ఉపక్రమిస్తాయి. కాగా, రాష్ట్ర రాజధానిలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను సులభతరం చేసేదిశగా భారత ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంచార కియోస్క్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి, బయటకు వెళ్లలేనివారికి ఇది ఎంతో ఉపయోగకరం కానుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4,94,664కు చేరింది. తాజాగా ఆదివారం 5,254 కేసులు నమోదవగా, ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 2,049కు చేరింది.
  • తమిళనాడు: తమిళనాడులో ప్రస్తుత ‘నివర్‌’ తుపాను తీవ్రత 2018 ఈశాన్య రుతుపవనాల నాటి ‘గజ’ తుపాను స్థాయిలో ఉండకపోవచ్చునని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.బి.ఉదయకుమార్ అన్నారు. నివర్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని సన్నాహాలూ సాగుతున్నాయని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన శిబిరాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. ఇక తమిళనాడులో ఇవాళ 1655 కొత్త కేసులు నమోదవగా, 19 మంది మరణించారు... మరో 2010 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం 7,69,995 కేసులు నమోదవగా, 11,605 మంది మరణించారు. ప్రస్తుతం 12,542 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో 2020 డిసెంబర్ 31 వరకు పాఠశాలలు, కళాశాలలను తెరవరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో తీర్మానించారు. అలాగే కోవిడ్ పరిస్థితులపై సమీక్షకు, ప్రస్తుత విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభంపై తుది నిర్ణయం దిశగా డిసెంబర్ చివరి వారంలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.
  • ఆంధ్రప్రదేశ్: కరోనాకు త్వరలోనే టీకాను ఆవిష్కరించగల సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం అనంతపూర్ జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంవద్ద సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్ లెర్నింగ్ 39వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 9, 10 తరగతుల విద్యార్థుల కోసం నవంబర్ 2 నుంచి తిరిగి తెరిచిన పాఠశాలల్లో నేటినుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం తరగతులు ప్రారంభమయ్యాయి. కాగా, 8/9 తరగతులవారికి రోజువిడిచి రోజు తరగతులు నిర్వహించనుండగా 10వ తరగతికి మాత్రం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిత్యం నిర్వహిస్తారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 602 కొత్త కేసులు, 3 మరణాలు నమోదవగా 1015 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన 2,64,128 కేసులకుగాను 95.20 శాతం కోలుకునే సగటుతో 2,51,468 మంది మహమ్మారినుంచి బయటపడ్డారు. కాగా, కోలుకునేవారి జాతీయ సగటు 93.7 శాతం కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 11,227 కాగా, మొత్తం మృతుల సంఖ్య 1433గా ఉంది.

FACT CHECK

 

 

 

 

 

 

 

 

Image

*******

 



(Release ID: 1675244) Visitor Counter : 135