ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొత్తం కోవిడ్ కేసులలో చికిత్సలో ఉన్నది 5% లోపే

93% పైగానే కోలుకున్నవారు

16 రోజులుగా రోజువారీ కొత్తకేసులు 50 వేల లోపు

Posted On: 23 NOV 2020 11:38AM by PIB Hyderabad

భారత్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ కేసుల సంఖ్య 4,43,486 కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.85%. ఆ విధంగా 5% లోపే కొనసాగుతునన్నట్టయింది. కోలుకున్నవారి శాతం 93 కు పైగా ఉంటూ ప్రస్తుతం 93.68% గా నమోదైంది. గడిచిన 24 గంటలలో 41,024 మంది కొత్తగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి బైటపడిన వారి సంఖ్య  85,62,641 కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 81,19,155 కి చేరింది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016G8H.jpg                                                                                                            

గత 24 గంటలలో  44,059 మందికి కొత్తగా కరోనా సోకింది. ఆ విధంగా గత 16 రోజులుగా 50 వేల కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. చలి తీవ్రత పెరిగేకొద్దీ పశ్చిమార్థ గోళంలోని అనేక దేశాలలో పెరుగుతున్న  పరిస్థితికి భిన్నంగా భారత్ లో కోవిడ్ అదుపులో ఉన్నట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతోంది.

కొత్తగా కోలుకున్న కోవిడ్ కేసులలో 77.44% కేసులు పది రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. అందులో కేరళ రాష్ట్రం 6,227  కేసులతో ముందుండగా ఢిల్లీ  6,154 కోలుకున్న కేసులతో, మహారాష్ట్ర  4,060  కోలుకున్న కేసులతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EQPH.jpg

కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసులలో 78.74% కేవలం పది రాష్ట్రాలలోనే బైటపడ్దాయి. అందులో ఢిల్లీలో 6,746 కేసులు, మహారాష్ట్రలో 5,753 , కేరళలో 5,254 కేసులు నిర్థారణ అయ్యాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CH9S.jpg

ప్రతి పదిలక్షల జనాభాలో జాతీయ స్థాయిలో సగటున 6,623 మందికి సోకినట్టు తేలగా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తకంటే తక్కువ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00452D9.jpg

గత 24 గంటలలో 511 మంది కోవిడ్ కారణంగా మరణించినట్టు తేలింది. ఈ మరణాలలో 74.95% కేవలం పది రాష్ట్రాల్ల్కో నమోదయ్యాయి.  ఢిల్లీ లో అత్యధికంగా 121 మంది మరణించటంతో నిన్నటి మృతుల్లో  23.68% ఢిల్లీకే వెళ్ళింది. మహారాష్ట్రలో 50 మంది, పశ్చిమ బెంగాలో 49 మంది కోవిడ్ వల్ల చనిపోయారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005732N.jpg

ప్రతి పది లక్షల జనాభాల్లో కోవిడ్ మృతులు సగటున 97 మంది ఉన్నట్టు తేలగా 21 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ జాతీయ సగటు కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయి.   

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006QWZN.jpg

***


(Release ID: 1675061) Visitor Counter : 221