ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 21 NOV 2020 4:20PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణి గారు, పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ శ్రీ ముకేశ్ అంబానీ గారు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ రాజగోపాలన్ గారు, డైరెక్టర్ జనరల్ ప్రొ. ఎస్. సుందర్ మనోహర్ గారు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, నా యువ సహచరులారా..

 మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు.  ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి  శుభాకాంక్షలు.  

మీరు మీ నైపుణ్యం (skill), ప్రతిభ(talent),  వృత్తినిపుణత (professionalism)తో ఆత్మనిర్భర భారత్ కు శక్తిగా మారుతారని నాకు విశ్వాసం ఉంది. ఈ రోజున PDPUతో ముడిపడున్న 5 వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శిలాన్యాసం జరిగింది. ఈ కొత్త వ్యవస్థలు, PDPU, దేశ శక్తి రంగానికే కాక వృత్తి విద్య( professional education), నైపుణ్యాభివృద్ధి , స్టార్ట్ అప్ రంగాలకు ఒక ముఖ్య కేంద్రంగా తయారవుతాయి.

సహచరులారా,

నేను చాలా కాలం నుండి ఈ విశ్వవిద్యాలయ ప్రకల్పాలతో కలిసి ఉన్నాను అందుకని PDPU దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవడం, తన ముద్ర వేయడం నాకు సంతోషాన్నిచ్చే విషయం. నేను ఈ రోజున ముఖ్య అతిథిగా కాక మీ ఈ మహోన్నత సంకల్ప పరివారంలోని ఒక సభ్యుడిగా మీ మధ్యకు వచ్చాను. ఈ విశ్వవిద్యాలయం అనుకున్నదానికంటే బాగా ముందు ఉండడం నాకు గర్వం కలిగించే విషయం. ఒకప్పుడు ఇలాంటి విశ్వవిద్యాలయం అసలు ముందుకు సాగగలదా ? అనే ప్రశ్నలు వినిపించేవి, కానీ ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, ఇక్కడి నుండి ఉత్తీర్ణులైన వృత్తినిపుణులు, వారి కర్తవ్యం ద్వారా వాటన్నింటికీ జవాబు ఇచ్చారు. గత దశాబ్దన్నర కాలంగా  PDPU “ పెట్రోలియం” రంగంతో పాటు మొత్తం ఎనర్జీ స్పెక్ట్రమ్  లోని మిగిలిన క్షేత్రాలలో కూడా విస్తరించింది. PDPU ప్రగతి చూసిన తరువాత గుజరాత్ ప్రభుత్వానికి నాదొక సూచన.  మొదట్లో పెట్రోలియం విశ్వవిద్యాలయం అనే ఆలోచన మాత్రమే నా మనస్సులో ఉండేది. ఎందుకంటే గుజరాత్ పెట్రోలియం క్షేత్రంలో ముందుకు వెళ్ళడం కోసం అది అవసరం అనిపించింది.  కానీ, దేశంతోపాటు ప్రపంచపు అవసరాలు చూసినప్పుడు, అవసరమైతే చట్టసవరణ చేసి దీన్ని పెట్రోలియం విశ్వవిద్యాలయం  నుండి ఎనర్జీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చమని గుజరాత్ ప్రభుత్వానికి నా సూచన. ఎందుకంటే దీని రూపం , పరిధి చాలా విస్తరించనున్నాయి. మీరందరూ ఇంత తక్కువ సమయంలో సాధించిన దానికి, దేశానికి అందించిన దానికి ఎనర్జీ విశ్వవిద్యాలయం అనేది దేశానికి చాలా ప్రయోజనాకారిగా ఉంటుంది.  ఈ పెట్రోలియం విశ్వవిద్యాలయ ఆలోచన నాదే అయినా ఇప్పుడు అదే ఆలోచనని విస్తరించి పెట్రోలియం స్థానంలో  పూర్తి శక్తి రంగాన్ని జోడించమని నా సూచన. మీరందరూ దీనిపై  ఆలోచన చేయండి. నా ఈ సలహా సరైనదనిపిస్తే దాని ప్రకారం చేయండి. ఇక్కడ స్థాపింపించే 45 మెగావాట్ సోలార్ పానెల్ తయారీ ప్లాంట్ , నీటి సాంకేతికత అభివృద్ధి కేంద్రం PDPU కు దేశం పట్ల ఉన్న దూర దృష్టిని తెలియజేస్తాయి.

సహచరులారా,

మీరు ఈరోజున పరిశ్రమ లోకి అడుగుపెడుతున్న సమయంలో, మహమ్మారి వలన ప్రపంచం మొత్తంలో శక్తి రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మన దేశంలో శక్తి రంగంలో ఎదుగుదలకు, సంస్థాగత స్ఫూర్తికి, ఉద్యోగాలకు ఎన్నో అవకాశాలున్నాయి. అంటే మీరు సరైన సమయంలో సరైన రంగంలోకి వెళ్తున్నారు. మన దేశంలో కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో మాత్రమే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. అందుకని పరిశోధన నుండి తయారీ వరకు మీ అవసరం చాలా ఉంది.

సహచరులారా,

దేశం ఈ రోజున తన కార్బన్ ఫుట్ ప్రింట్ ను 30 నుండి 35 శాతం తగ్గించేందుకు లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఈ మాట నేను ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళినప్పుడు భారత్ ఇది చేయగలదా? అని ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఈ దశాబ్దంలో మన శక్తి అవసరాలలో సహజ వాయువు  వాటాను 4 రేట్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మన ఆయిల్ శుద్ధీకరణ సామర్థ్యాన్ని కూడా వచ్చే అయిదేళ్లల్లో రెట్టింపు చేసేందుకు పని చేస్తున్నాం. ఇందులో కూడా మీ అందరికీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేశంలో శక్తి రక్షణతో ముడిపడిఉన్న స్టార్టప్ వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు నిరంతరం పని జరుగుతోంది. ఈ రంగంలో మీ వంటి విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఒక ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటు చేయడమైంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉన్నా, ఏదైనా వస్తువు ఉన్నా, లేదా ఏదైనా ఆలోచనను పరిశీలించదలుచుకున్నా ఈ ఫండ్ మీకు బాగా ఉపయోగ పడుతుంది. ప్రభుత్వం నుండి ఇది మీకు ఇచ్చే బహుమానం. నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో మీలో కొంత చింత ఉన్నదని నాకు అర్ధమవుతోంది. కరోనా సమయం , ఎప్పుడు ఇదంతా సరిపడుతుందో తెలీదు  అని ఆలోచిస్తూంటారు కదా. మీ మనస్సులో కలిగే చింత సహజం. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పట్టభద్రులు కావడం సులభమైన  విషయమేమీ కాదు. కానీ మీ శక్తి, మీ క్షమత ఈ సవాళ్ళ కంటే ఎన్నో రెట్లు పెద్దవని గుర్తుపెట్టుకోండి. ఎన్నడూ విశ్వాసం కోల్పోవద్దు. ప్రతికూలత ఏమిటని  కాదు.  మీ లక్ష్యం ఏంటి?, మీ ప్రాధాన్యత ఏమిటి? మీ పథకం ఏమిటి? అనే ఆలోచన ఉండాలి. అందుకని మీ దగ్గర ప్రయోజనం, దాని ప్రాధాన్యత  నిర్ణయింపబడడం కోసం చక్కటి పథకం ఉండాలి. ఎందుకంటే మీరు మీ జీవితంలో మొదటి సారి ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని ఏమీ లేదు. ఇదే  ఆఖరిదనీ కాదు. విజయవంతమైన వ్యక్తులకు సమస్యలు రావనేమీ లేదు, కానీ ఎవరైతే ప్రతికూలతలను స్వీకరిస్తారో, వాటితో పోరాడుతారో, వాటిని అధిగమిస్తారో, సమస్యలకు సమాధానాలు సాధిస్తారో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. ఏ  విజయవంతమైన వ్యక్తి నైనా చూడండి , ప్రతి ఒక్కరూ ప్రతికూలతలతో యుద్ధం చేసే ముందుకు సాగారు.

సహచరులారా,

దేశంలోని ప్రతి పౌరుడు ఒక్కసారి వందేళ్ల క్రితం కాలాన్ని గుర్తుచేసుకోవాలని నా విన్నపం. ఇవాళ మనం 2020 లో ఉన్నాం, 1920 లో ఎవరైతే  మీ వయసులో ఉన్నారో , ఈ రోజున  2020 లో మీరు అదే వయసులో ఉన్నారు.   1920 లో మీ వయసులో ఉన్నవాళ్ళ కలలు ఏమిటి? 1920 లో మీ వయసులో ఉన్నవాళ్ళ పట్టుదల ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి? వంద ఏళ్ల నాటి చరిత్రని కొద్దిగా తిప్పి చూడండి. 1920లో గడిచిన కాలం మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చాలా మహత్తు కలిగిందని గుర్తుకు వస్తుంది. విదేశిపాలన కాలంలో స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించని క్షణమే లేదు, 1857 లోని స్వాతంత్ర్య సంగ్రామం దీన్ని మలుపు తిప్పింది కానీ 1920 నుండి 1947 వరకు గిడిచిన సమయం పూర్తి భిన్నంగా సాగింది.  ఈ సమయంలో మనకు ఎన్నో ఘటనలు కనిపిస్తాయి, దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, ప్రతి వర్గం నుండి, ప్రతి క్షేత్రం నుండి అంటే దేశం మొత్తంలో ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి , గ్రామాల్లో, నగరాల్లో, చదువుకున్నవారు , ధనవంతులు, పేదవారు, ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికులయ్యారు. ప్రజలు ఏకమయ్యారు. తమ జీవితానికి సంబంధించిన కలలను ఆహుతినిచ్చి స్వాతంత్ర్య సాధనకు సంకల్పం తీసుకున్నారు. 1920 నుండి 1947 వరకు ఉన్న యువతరం తమ సర్వస్వాన్ని ఎదురొడ్డడం మనకి కనిపిస్తుంది. ఈ రోజున మనకు ఆ యువతరాన్ని చూస్తే ఈర్ష్య కూడా కలుగుతూంటుంది. అప్పుడప్పుడూ మనస్సులో అనిపిస్తూంటుంది కదా మనం కూడా  1920 నుండి 1947 సమయంలో పుట్టి ఉంటే, భగత్ సింగ్ లాగా ముందుకురికేవారమని. కానీ మిత్రులారా, మనకి ఆ రోజున దేశం కోసం మరణించే అవకాశం దొరకలేదు , కానీ దేశం కోసం జీవించే అవకాశం దొరికింది. ఆ రోజున ప్రతి పౌరుడూ  తన సర్వస్వాన్ని అర్పించి కేవలం ఒక లక్ష్యం కోసం పని చేశాడు.  ఏమిటా లక్ష్యం? అది భారతదేశ స్వాతంత్ర్యం. పరతంత్రం నుండి తల్లి భారతిని విముక్తం చేయడం.  అందులో అనేక  ధోరణులున్నాయి, వివిధ భావాల వారు ఉన్నారు , కానీ అన్నీ ఆలోచనలూ ఒకే దిశలో నడిచాయి. మహాత్మా గాంధీ నేతృత్వం కావచ్చు, సుభాష్ చంద్ర బోస్ నాయకత్వం కావచ్చు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురుల కార్యం, ధోరణులు  వేరు వేరు కావొచ్చు . మార్గాలు వేరై ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. అదే భరతమాతను విముక్తం చేయడం.  కాశ్మీరు నుండి కాలాపానీ వరకు, ప్రతి చెరసాలలో, ప్రతి ఉరికంబం మీద నుండి ఒకే నినాదం వినిపించేది , గోడలు ఒకే మాటతో ప్రతిధ్వనించేవి, ఉరి తాళ్ళు ఒకే నినాదంతో సుశోభితమయ్యేవి, ఇదే నినాదంగా , ఇదే సంకల్పంగా ఉండేది, అదే జీవిత లక్ష్యం అయ్యేది. అదే భారతమాతకు స్వాతంత్ర్యం.

నా ప్రియ నవయువ సహచరులారా,

మనం ఈ రోజున ఆ పరిస్థితులలో లేము కానీ మాతృభూమికి సేవ చేయాల్సిన అవసరం ఈ రోజుకీ అలాగే  ఉంది. ఆ రోజున ప్రజలు తమ జీవితాలను స్వాతంత్ర్యం కోసం అర్పిస్తే మనం ఆత్మనిర్భర భారత్ కోసం జీవించడం నేర్చుకోవచ్చు, జీవించి చూపించచ్చు. ఆత్మనిర్భర భారత్ కోసం మనమే ఒక ఉద్యమంగా మారాలి, ఆ  ఉద్యమంలో సైనికుడివలే పాల్గొనాలి, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించాలి. ఆత్మ నిర్భర భారత్ కోసం ప్రతి భారతీయుడు, ముఖ్యంగా నా యువ సహచరుల నుండి నేను ఆశించేది ఇదే. 

ఈరోజున దేశం మారుతోంది. వర్తమానంతో పాటు భవిష్య భారతాన్ని నిర్మించే పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఎటువంటి ముఖ్యమైన కాలంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. భారతదేశ స్వాతంత్ర్యానికి 2022 లో 75 ఏళ్లు, 2047 లో 100 ఏళ్లు పూర్తవుతాయి. అంటే ఈ 25 ఏళ్లు మీ అందరి జీవితాల్లో అత్యంత ప్రత్యేక సమయం. దేశంతోపాటు మీ అందరి జీవితాల్లో ముఖ్యమైన 25 సంవత్సరాలు ఒకేసారి రానున్నాయి. ఈ అదృష్టం మరెవరికీ దొరికుండదు, మీకు దొరికింది. మీరు గమనించండి, ఎవరికైతే బాధ్యతకలిగి ఉంటారో  వాళ్ళే జీవితంలో ఏదైనా సాధిస్తారు, చేసి చూపిస్తారు. విజయం మొదలయ్యేది ఈ బాధ్యత నుంచే. విఫలమైనవారి జీవితాలను గమనిస్తే వారి వైఫల్యానికి కారణం వారు పనిని బాధ్యతగా కాకుండా బరువు భావించడం కనిపిస్తుంది. చూడండి మిత్రులారా, బాధ్యత అనేది అవకాశ దృక్పధాన్ని పుట్టిస్తుంది. వారికి తమ దారిలో అడ్డంకులు కాదు అవకాశాలే కనిపిస్తాయి. బాధ్యతా భావం జీవిత ప్రయోజనంతో సమ్మిళితమై ఉండాలి. వీటి మధ్య వైరుధ్యం తగదు. బాధ్యతా భావం (Sense of Responsibility), జీవన  ప్రయోజనత్వం(Sense of Purpose) అనే ఈ రెండు పట్టాల మీద సంకల్పం అనే రైలు బండి వేగంగా పరిగెడుతుంది. మీకు నా విజ్ఞప్తి ఏమిటంటే మీలో ఈ బాధ్యతా భావాన్ని నిలుపుకోండి. ఈ బాధ్యతా భావం దేశం పట్ల , దేశ అవసరాలను తీర్చడానికి ఉండాలి. ఈ రోజున దేశం వివధ రంగాలలో వేగంగా ముందుకు వెళుతోంది.     

 

సహచరులారా,

కోరికల వల్ల అపరమితమైన సంకల్పం ఏర్పడుతుంది.  చేయడానికి చాలా ఉంది, దేశం కోసం సాధించడానికి చాలా ఉంది, కాక పోతే మీ సంకల్పం, లక్ష్యం, విఘటితమవకూడదు. నిబద్ధతతో ముందుకు వెళితే , మీలో మీకే ఒక విశాల శక్తి భండారం కనిపిస్తుంది. మీలో ఒక శక్తి కేంద్రం ఉంది, అది మిమ్మల్ని ఉరకలేయిస్తుంది, కొత్త కొత్త ఆలోచనలిస్తుంది, కొత్త శిఖరాలకు చేరుస్తుంది. ఒక్క విషయం మనసులో ఉంచుకోవాలి, ఈ రోజున మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని గురించి మనస్సులో ఒక ప్రశ్న వేసుకొండి. ఎందువలన మీరు ఇక్కడ ఉన్నారు, మంచి మార్కులు వచ్చినందునా, మీ తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉన్నందువలనా, లేక మీలో ఉన్న ప్రతిభ వల్లనా. ఇందులో వీటన్నిటి యోగదానం ఉంది, కాకపోతే ఒక ఆలోచన కూడా ఉంది. అయితే అది అస్పష్టంగా ఉంది. మనం ఈ రోజున ఎక్కడికైతే చేరుకున్నామో ఇందులో మనకంటే మన చుట్టుపక్కలవాళ్ళ యోగదానం ఎక్కువ ఉంది, సమాజ యోగదానం ఉంది, దేశ యోగదానం ఉంది. వీటన్నింటి వలన నేను ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని మనం కొన్నిసార్లు గుర్తించం. ఈరోజున మనం ఏ విశ్వవిద్యాలయంలో ఉన్నామో దీన్ని నిర్మించడంలో ఎంత మంది కార్మిక సోదరుల కష్టం ఉందో, ఎన్ని మధ్యతరగతి కుటుంబాలు చెల్లించిన పన్ను ఉందో. వీటన్నింటి నుండి ఈ విశ్వవిద్యాలయం తయారయింది. ఇలా ఎంతో మంది ఉంటారు వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియక పోవచ్చు కానీ మీ జీవితాలలో అలాంటి వాళ్ళ యోగదానం ఎంతో కొంత ఉంది. మనం  వీరందరికి ఋణపడి ఉన్నామని, వారి ఋణభారం మన మీద ఉందని గుర్తించాలి. సమాజం, దేశం మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అందుకని నాపై ఉన్న దేశ రుణాన్ని తీరుస్తాను , సమాజానికి తిరిగి ఇస్తాను అని మనం సంకల్పం తీసుకోవాలి.

సహచరులారా, మానవ జీవితానికి గతి , ప్రగతి అనివార్యం. అలాగే మన తరువాతి తరాల కోసం ప్రకృతి, పర్యావరణాన్ని రక్షించడం కూడా అవసరమే. clean energy అనేది ఉజ్వలమైన భవిష్యత్తుకు ఎలాగైతే సూచికో, అలాగే జీవితంలో మరో రెండు విషయాలు అవసరం. అవే –clean slate, clean heart. మనం తరచూ వింటూంటాం, మీరూ అంటూ ఉంటారు, వింటూంటారు - అరే వదిలేయ్యి, ఇది ఇంతే, ఇదంతా అయ్యేది కాదు, సర్దుకుపోదాం, ఎలా అయితే అలా కానీ. సాధ్యం కాదు అనే మాటలు. దేశంలో ఇలాగే అంతా నడుస్తుంది, మా దగ్గర ఇలాగే జరుగుతూ వస్తోంది, ఇదే మన పరంపర , ఇలాగే జరగాలి అని కూడా అంటూ ఉంటారు.

సహచరులారా,

ఇవన్నీ ఒడిపోయే మనస్సు చెప్పే మాటలు.  తుప్పు పట్టిన బుర్రలోంచి వచ్చేవి. ఈ మాటలు కొంత మంది మనస్సులో అతుక్కుని ఉంటాయి, వాళ్ళు ఇదే ధోరణిలోనే పనులన్నీ చేస్తూంటారు. కానీ నేటి తరం, 21 శతాబ్దపు యువతరం, clean slate తో ముందుకు వెళ్ళాలి. కొంత మంది మనస్సులలో ఉన్న ఆ అడ్డంకులను తొలగించి శుభ్రపరచాలి. అలాగే clean heart. దీని అర్ధం మీకు నేను వివరించాల్సిన అవసరం లేదు. Clean heart అంటే స్థిర చిత్తం.

సహచరులారా,

మీరు దేనిగురించైనా ముందస్తు భావనలతో బయలుదేరినప్పుడు, కొత్త విషయాలను ఆహ్వానించలేరు.

సహచరులారా,

20 సంవత్సరాల క్రితం నేను గుజరాత్ ముఖ్యమంత్రినయ్యాను. ఎన్నో సవాళ్ళు ఉండేవి, ఎన్నో అంచెల్లో పని జరుగుతూండేది. నేను కొత్తగా ముఖ్యమంత్రినయ్యాను, అప్పటివరకు ఢిల్లీలో ఉండేవాడిని, ఉన్నట్టుండి గుజరాత్ రావలసి వచ్చింది. నాకు ఉండడానికి వసతి కూడా లేదు కనుక గాంధీ నగర్ సర్కిట్ హౌస్ లో గది తీసుకున్నాను, అప్పటికి ఇంకా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. నేను ముఖ్యమంత్రి అవబోతున్నానని నిర్ణయం మాత్రం అయింది. సహజంగానే జనాలు పుష్పగుచ్చాలు తీసుకొని వచ్చేస్తున్నారు, కలుస్తున్నారు. అలా కలుస్తున్నప్పుడు మాటలలో ఒక్క విషయం మాత్రం చెప్పేవాళ్ళు, 70-80 శాతం మంది అదే విషయం చెప్పేవాళ్ళు, మీకు వింటే ఆశ్చర్యం వేస్తుంది , మోదీజీ మీరు ఏమైనా చేయండి చేయకపొండి, కనీసం రాత్రి భోజనం చేసేటప్పుడు మాత్రం విద్యుత్తు ఉండేటట్టు చూడండి అనేవాళ్ళు. ఆ రోజుల్లో విద్యుత్తు పరిస్థితి ఎలా ఉండేదో మీరు దీంతో ఊహించుకోవచ్చు.

నా కుటుంబ నేపథ్యం ప్రకారం విద్యుత్తు ఉండడం, లేకపోవడం అంటే ఏమిటో నాకు తెలుసు. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటని నేను ఆలోచించాను. నేను అధికారులతో మాట్లాడుతున్నప్పుడు , వారితో చర్చిస్తున్నప్పుడు ఒకే సమాధానం - ఇది ఇలాగే ఉంటుంది , మన వద్ద ఉన్న విద్యుత్తుతో ఇంతే సాధ్యం, ఎక్కువ విద్యుత్తు తయారుచేసినప్పుడు చూద్దాం అనేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పరిష్కారముందా అని అడిగాను. దేవుడి దయ వల్ల ఆ స్థితిని చూసి ఒక ఆలోచన వచ్చింది. వ్యవసాయదారుడిని , గృహ సముదాయాలని మనం వేరు చేస్తే ? ఎందుకంటే వ్యవసాయంలో విద్యుత్తు చోరీ జరుగుతుందనీ, అదనీ, ఇదనీ మూస గాలి మాటలు పట్టుకు చెప్పేవారు అందరూ. నేను కొత్త వాడిని కనుక ఈ విషయం వాళ్ళకి అర్ధం చేయించడం కష్టంగా ఉండేది, కొంత మంది సీనియర్ అధిజారులు అర్ధం చేసుకునేవాళ్ళు. కొంత మందికి అర్ధమయ్యేది కాదు. నా ఈ మాటతో అధికారులు ఏకీభవించలేదు, ఎందుకంటే వాళ్ళు ఇది జరగదు అనే ముందస్తు భావనతో ఉన్నారు, అది అసాధ్యం అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఆర్థిక స్థితి లేదన్నవాళ్ళు కొందరు , విద్యుత్తు  లేదన్నవాళ్ళు కొందరు. కానీ మీకు వింటే ఆశ్చర్యమనిపిస్తుంది, ఈ విషయం తేల్చడానికి 5,7 10  కేజీల బరువైన ఫైళ్ళు తయారయ్యాయి. కానీ ప్రతీసారీ కాదు, లేదు అనే సమాధానమే వచ్చేది. నేను ఇంకా ఏదోకటి చేయాలని నిర్ణయించుకుని ఇంకో ఆలోచనపై పని చేయడం మొదలుపెట్టాను. ఉత్తర గుజరాత్ లో ఒక సొసైటీ ఉంది.  45 గ్రామాలు దీంతో కలిసి ఉండేవి. వాళ్ళని పిలిచి, నాకు ఒక ఆలోచన ఉంది దాన్ని మీరు సాకారం చేయగలరా అని అడిగాను. వాళ్ళు మమ్మల్ని ఆలోచించుకొనివ్వండని అన్నారు. ఇంజనీర్ ల సహాయం తీసుకొమ్మని నేను చెప్పాను. గ్రామంలో వ్యవసాయానికి, గృహ అవసరాలకు విద్యుత్ ను వేరువేరుగా అందించాలన్న నా ఆలోచన ముందు పెట్టాను. అందుకు వాళ్ళు మాకు దీని మీద ఖర్చు చేయడానికి 10 కోట్లు గుజరాత్ ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. అవి ఇవ్వడం నా బాధ్యత అని చెప్పాను. వాళ్ళకి అనుమతి ఇచ్చాము. వాళ్ళు పని ప్రారంభించారు. కొంచం ఈ పని చూడమని ఇంజినీర్లను అడిగాను. ఆ 45 గ్రామాల్లో గృహాలకు, వ్యవసాయానికి విద్యుత్ ప్రసారం వేరు చేశారు. దీనివల్ల వ్యవసాయానికి ఎంత సేపు విద్యుత్తు ఇవ్వాలో ఇచ్చేవాళ్ళం, దానికి వేరుగా సమయం ఉండేది, ఇళ్ళలో 24 గంటలూ విద్యుత్తు ఉండడం ప్రారంభమయ్యింది. విద్యాసంస్థల సహాయంతో దీని third party మూల్యాంకనం చేయించాను. మీకు ఆశ్చర్యమనిపిస్తుంది ఏ గుజరాత్ లోనైతే రాత్రి భోజన సమయంలో విద్యుత్తు దొరకడమే కష్టంగా ఉండేదో, అక్కడ 24 గంటలూ విద్యుత్తు ఉండడమే కాక ఒక ఆర్థిక విధానం ప్రారంభమయ్యింది. దర్జీలు కూడా వారి కుట్టుపనికి విద్యుత్తు యంత్రం ఉపయోగించడం మొదలుపెట్టారు. చాకలి వాళ్ళు కూడా విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలతో పని ప్రారంభించారు. వంట గదిలోకి చాలా విద్యుత్తు పరికరాలు రావడం మొదలయ్యింది. Ac లు, ఫ్యాన్లు, టీవీలు కొనడం మొదలయింది.  ఒక విధంగా మొత్తం జీవనం మార్పు చెందింది.  ప్రభుత్వ ఆదాయంలో కూడా పెరుగుదల కనిపించింది.

ఈ ప్రయోగం అందరు అధికారుల ఆలోచనని మార్చింది. చివరకు ఈ దారి సరైందని నిర్ణయమైంది. మొత్తం గుజరాత్ లో వెయ్యి రోజుల కార్యక్రమం తయారైంది. వెయ్యి రోజులలో వ్యవసాయ, గృహ సముదాయ విద్యుత్ ప్రసారాలను వేరు చేయడం జరుగుతుందని.  వెయ్యి రోజులలో మొత్తం గుజరాత్ లో 24 గంటలు ఇళ్ళలో విద్యుత్తు ప్రసారం జరుగుతుందని చెప్పాం. అది సాధ్యమైంది. నేను వారి ముందస్తు భావనను పట్టుకొని ఉండుంటే ఇది సాధ్యమయ్యేది కాదు, నేను clean slate లాగా ఉన్నాను. నేను కొత్త కోణంలో ఆలోచించే వాడిని దాని ఫలితమే ఇది.

సహచరులారా, మీరు ఒక మాట గుర్తుంచుకొని ముందుకెళ్లండి. అడ్డంకులు కాదు , మీ అభివ్యక్తీకరణ ముఖ్యం. మీకు నేను ఇంకో ఓదాహరణ ఇస్తాను. రాష్ట్ర స్థాయిలో సోలార్ విధానం తయారు చేసిన రాష్ట్రాలలో గుజరాత్ మొట్టమొదటిది. ఒక యూనిట్ సౌర విద్యుత్తు ఖర్చు 12-13 రూపాయల వరకు ఉండవచ్చని ఒక అంచనా ఉండింది. ఇది ఆ సమయానికి చాలా ఎక్కువ కింద లెక్క.  ఎందుకంటే , థర్మల్ విద్యుత్తు రెండు, రెండున్నర,మూడు రూపాయలకి దొరికేది. అదే విద్యుత్తు 13 రూపాయలకు అంటే , ఇవాళ రేపు గొడవ చేసే వింత ధోరణి ఎలా ఉందో మీకు తెలుసు, ప్రతి విషయంలోనూ రంధ్రాన్వేషణ చేసే ధోరణి. ఆ సమయంలో నాకు బాగా ఇబ్బందిగా ఉండేది. అయ్యా ఇది పెద్ద దుమారం అవుతుంది అని నాకు చెప్పారు. ఎక్కడ 2,3 రూపాయల విద్యుత్తు, ఎక్కడ 12-13 రూపాయల విద్యుత్తు.  కానీ సహచరులారా నాకు ఆనాడు నా ప్రతిష్టా లేక నా భావి తరాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి నిర్ణయాల వల్ల పత్రికలలో విమర్శలు వెల్లువెత్తుతాయని నాకు తెలుసు. అవినీతి ఆరోపణలు వస్తాయని, ఇంకా చాలా జరుగుతాయనీ తెలుసు. కానీ నేను clean heart (స్వచ్ఛమైన హృదయం) తో ఉన్నాను. నేను మన జీవన విధానాన్ని మార్చడానికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని నిజంగా అనుకునేవాడిని. చివరకి మేము నిర్ణయం తీసుకున్నాం. సౌర శక్తి వైపు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాం. నిజయతీతో ఈ నిర్ణయం తీసుకున్నాం, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తీసుకున్నాం, ఒక దార్శనికతతో తీసుకున్నాం.

గుజరాత్ లో సౌర ఉత్పాదక కేంద్రాల ప్రారంభం పెద్ద సంఖ్యలో జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఈ విధానాన్ని తయారు చేసినప్పుడే, కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా అదే విధానాన్ని తయారు చేసింది. అయితే  వాళ్ళు  18-19 రూపాయలుగా ధరను నిర్ణయించారు. అప్పుడు మా అధికారులు నా దగ్గరికి వచ్చి మనం 12-13 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 18-19 రూపాయలు ఇస్తామంటోంది అటువంటప్పుడు మన దగ్గరికి ఎవరు వస్తారు అన్నారు. నేను దానికి మనం 12-13 రూపాయలే ఇద్దాం , 18-19 ఇవ్వడానికి సమ్మతంగా లేను, కానీ మనం దీని అభివృద్ధి కోసం ఒక వాతావరణాన్ని , పారదర్శకతను , వేగాన్ని అందిద్దాం అన్నాను. మంచి పాలనా పద్ధతితో ముందుకెళితే ప్రపంచం ఇక్కడికి వస్తుంది, మీరు ఈరోజున చూస్తున్నారు సౌర విద్యుత్ ప్రకల్పం తీసుకున్న గుజరాత్ ఈ రోజున సౌర విద్యుత్ ఉత్పాదన లో  ఎక్కడికి చేరుకుందో, మీ కళ్ళముందు సాక్షీభూతమై ఉంది. ఈ రోజున స్వయంగా విశ్వవిద్యాలయం ఈ పనిని ముందుకు తీసుకెళ్లేందుకు ముందుకొచ్చింది. 12-13 రూపాయలతో మొదలైంది అది ఈరోజున సౌర ఉద్యమంగా మారింది. నేను ఇక్కడికి వచ్చిన తరువాత ప్రపంచ సౌర కూటమిని నిర్మాణం చేశాను. అందులో సుమారు 80-85 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అలాగే ప్రపంచం మొత్తంలో ఒక ఉద్యమంగా మారింది.  అయితే ఒకటి ఇదంతా నిబద్ధత, స్వచ్ఛమైన హృదయం తో చేయాలి. దాని ఫలితమే ఈనాడు భారత్ సౌర శక్తిలో అత్యంత వేగంగా ముందుకు వెళుతోంది. ఈ రోజున ఒక యూనిట్ ధర 12-13 నుండి తగ్గి 2  రూపాయల కంటే తక్కువకి వచ్చింది. సౌరశక్తి దేశ ప్రముఖ ప్రాధాన్యతల్లో ఒకటి అయ్యింది. 2022కి 175 గిగా వాట్ల పునరుత్పాదక శక్తికి సంకల్పం తీసుకున్నాం. దీన్ని 2022 కంటే ముందే చేరుకుంటాం అనే విశ్వాసం నాకు ఉంది. 2030 కి 450 గిగా వాట్ల లక్ష్యం పెట్టుకున్నాం. అది కూడా అంతకంటే ముందే చేరుకుంటాం అనే విశ్వాసం నాకు ఉంది.  ఈ విశ్వాసం మీకు ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది.

సహచరులారా,

మార్పు మనలో అయినా, ప్రపంచంలో అయినా ఒక రోజు,వారం,సంవత్సరంలో సాధ్యం కాదు. మార్పు కోసం కొద్ది  ప్రయత్నమే కానీ కొద్ది కొద్దిగా నిలబెడుతూ నిరంతర ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో చేసే చిన్న చిన్న పనులు పెద్ద మార్పులు తెస్తాయి. ఎలాగంటే , మీరు ప్రతి రోజూ కొద్ది కొద్దిగా 20 నిముషాలు ఏదైనా కొత్తది చదవడం అలవాటు చేసుకోవచ్చు. అలాగే ప్రతి రోజూ 20 నిముషాలు ఏదైనా కొత్తది నేర్చునేందుకు ఎందుకు  కేటాయించకూడదు? ఆలోచించండి.  ఒక రోజులో కేవలం 20 నిముషాలే. కానీ ఒక సంవత్సరంలో ఇవే 20 నిముషాలు 120 గంటలవుతాయి. 120 గంటల ప్రయత్నం మీలో ఎంత మార్పు తెస్తుందో మీరు అనుభవిస్తే ఆశ్చర్యపోతారు.

సహచరులారా,

మీరు క్రికెట్ లో చూసుంటారు ఎప్పుడైతే ఒక జట్టు పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలో అప్పుడు వాళ్ళు లక్ష్యం ఎంత పెద్దదో ఆలోచించరు. ప్రతి ఓవర్ లో ఎంత చేయాలో మాత్రమే ఆలోచిస్తారు.

ఇదే మంత్రాన్ని ఆర్ధిక ప్రణాళికలలోనూ చాలా మంది ఉపయోగిస్తారు. ప్రతి నెలా 5 వేలు దాస్తూ పోతే రెండు సంవత్సరాలయ్యే  సరికి లక్ష రూపాయల కన్నా ఎక్కువ జమ అవుతాయి. ఇలాంటి ప్రయత్నాలు, నిరంతర కృషి మీలో సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. వాటి ఉపయోగం వెంటనే తేలియదు కానీ దీర్ఘకాలంలో ఇదే మీకు విలువైన సంపద అవుతుంది, మీకు ఒక పెద్ద శక్తి అవుతుంది.

కేంద్ర స్థాయిలో దేశం కూడా ఎప్పుడైతే ఇటువంటి నిరంతర కృషితో ముందుకెళుతుందో అప్పుడు దేశానికి కూడా ఇటువంటి ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు స్వచ్చ భారత్ అభియాన్ నే తీసుకోవచ్చు. మనం స్వచ్ఛత గురించి కేవలం గాంధీ జయంతి రోజున , అక్టోబర్ లో మాత్రమే ఆలోచించము. ప్రతి రోజూ దీని  కోసం ప్రయత్నం చేస్తాం. నేను 2014 నుండి 2019 మధ్యలో దాదాపు ప్రతి మన్ కీ బాత్  కార్యక్రమంలో దీని గురించి మాట్లాడాను, దేశ ప్రజలతో చర్చించాను, వాళ్ళకి వినతి కూడా చేశాను. ప్రతిసారి అనేక విషయాల మీద కొద్ది కొద్ది గా మాట్లాడడం జరిగింది. కానీ లక్షల కోట్ల మంది కొద్ది కొద్ది ప్రయత్నం ద్వారా స్వచ్చభారత్ ఒక జన ఉద్యమం అయింది. నిరంతర ప్రయత్న ప్రభావం ఇలాగే ఉంటుంది. ఫలితాలు ఇలాగే వస్తాయి.

సహచరులారా,

21 వ శతాబ్దంలో, ప్రపంచ ఆశలు ఆపేక్షలు భారత్ మీద ఉన్నాయి.  అలాగే భారత్ ఆశలు, ఆకాంక్షలు  మీపై ఆధారపడి ఉన్నాయి. మనం వేగంగా వెళ్ళాల్సిందే , ముందుకురకాల్సిందే. పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు  అంత్యోదయ దృష్టిని అందించారు. Nation first (దేశం ప్రథమం) అనే సిద్ధాంతంతో జీవించారు, మనం అందరం కలిసి దాన్ని మరింత దృఢపరచాలి. మన ప్రతి పనీ దేశం కోసం , ఇదే భావన తో ముందుకు వెళ్ళాలి.

మీ అందరికీ నా అభినందనలు అలాగే మీ ఉజ్వల భవిష్యత్తు కోసం అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.     

****



(Release ID: 1674886) Visitor Counter : 232