ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర ప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి

2.6 కోట్ల కు పైగా కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటి కనెక్షన్ల‌ను అందించిన - జల్ జీవన్ మిషన్

పైపుల ద్వారా తాగునీరు పొందడం వల్ల పేద కుటుంబాల ఆరోగ్యం మెరుగుపడుతుందన్న - ప్రధానమంత్రి

ఈ నీటి ప్రాజెక్టులు విద్యాచల్‌ ప్రాంతంలో నీటి కొరత మరియు నీటిపారుదల సమస్యలను పరిష్కరిస్తాయన్న - ప్రధానమంత్రి

Posted On: 22 NOV 2020 1:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని వింధ్యాచల్ ప్రాంతంలోని మీర్జాపూర్, సోన్ భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్తాపన చేశారు.  ఆయా గ్రామాలకు చెందిన గ్రామ జల, పారిశుద్ధ్య కమిటీ /  పానీ సమితి సభ్యులతో ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రధానమంత్రి సంభాషించారు.  కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్;  గవర్నర్ ఉత్తర ప్రదేశ్, శ్రీమతి ఆనందీబెన్ పటేల్ మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.   

ఈ రోజు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల ద్వారా 2,995 గ్రామాల్లోని గృహాలకు కుళాయిల ద్వారా త్రాగు నీరు సరఫరా చేయడం జరుగుతుంది.   ఈ జిల్లాల్లోని  42 లక్షల మంది జనాభాకు ఈ ప్రోజెక్టుల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ గ్రామాలన్నింటిలో గ్రామ జల మరియు పారిశుధ్య కమిటీలు / పానీ సమితి లను ఏర్పాటు చేశారు. ఈ ప్రోజెక్టుల రోజువారీ బాధ్యతలను ఈ కమిటీలు నిర్వహిస్తాయి.   ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం 5,555.38 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.  

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన అనంతరం గత ఒకటిన్నర సంవత్సరాలలో, ఉత్తరప్రదేశ్ లోని లక్షలాది కుటుంబాలతో సహా, మొత్తం 2 కోట్ల 60 లక్షలకు పైగా కుటుంబాలకు చెందిన  గృహాలకు పైపుల ద్వారా  తాగునీటి కనెక్షన్లను ఇవ్వడం జరిగింది.   జల్ జీవన్ మిషన్ కింద, మన మాతృమూర్తులు, సోదరీమణులకు వారి ఇంటి వద్దే సులభంగా నీటి సరఫరా సౌకర్యం లభించడంతో, వారి జీవనం సులభతరమయ్యిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు మురికి నీటి వినియోగం వల్ల సంక్రమించే కలరా, టైఫాయిడ్, ఎన్సెఫాలిటిస్ వంటి అనేక వ్యాధులను తగ్గించడం కూడా ఈ పధకం ప్రధాన ప్రయోజనమని, ఆయన తెలియజేశారు.  అనేక వనరులు ఉన్నప్పటికీ, వింధ్యాచల్ లేదా బుందేల్‌ఖండ్ ప్రాంతాలు లోపాల ప్రాంతాలుగా మారాయని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  అనేక నదులు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాలు అత్యంత త్రాగునీటి కొరత గల ప్రాంతాలుగా, కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయనీ, తద్వారా చాలా మంది ప్రజలు ఇక్కడి నుండి వలస వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందనీ, ఆయన తెలిపారు.    ఈ ప్రాజెక్టుల ద్వారా, ఈ ప్రాంతాల్లో, ఇప్పుడు నీటి కొరత, నీటిపారుదల సమస్యలు పరిష్కారమవుతాయనీ, ఫలితంగా, ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుందనీ, ఆయన పేర్కొన్నారు.   

వింధ్యాOచల్ ‌లోని వేలాది గ్రామాలకు పైపుల ద్వారా నీటి సరఫరా జరిగినప్పుడు ఈ ప్రాంత పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందనీ, వారి శారీరక, మానసిక వికాసం మెరుగౌతుందని, ప్రధానమంత్రి తెలియజేశారు.  తమతమ గ్రామాల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడానికీ, ఆ నిర్ణయాలపై పనిచేయడానికీ, ఆ గ్రామ ప్రజలకు స్వేచ్ఛ లభించినప్పుడు, అది గ్రామంలోని ప్రతి ఒక్కరి విశ్వాసాన్నీ, రెట్టింపు చేస్తుందని, ఆయన పేర్కొన్నారు. స్వావలంబన గ్రామాలు, స్వావలంబన భారతదేశానికి బలం చేకూరుస్తాయని, ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 

మహమ్మారి సమయంలో ప్రతిస్పందించే పాలనను అందించడంతో పాటు, సంస్కరణల వేగాన్ని కొనసాగించడం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.  ఈ ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శ్రీ మోదీ వివరించారు.  సాగు చేయడానికి వీలులేని భూముల రైతులకు స్థిరమైన అదనపు ఆదాయాన్ని అందించడానికి వీలుగా, ఆయా భూముల్లో, సౌర విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు, అందుబాటులో ఎల్.‌పి.జి. సిలిండర్, విద్యుత్ సరఫరా, మీర్జాపూర్ ‌లోని సోలార్ ప్లాంట్, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు.

స్వామిత్వ పథకాన్ని ప్రస్తావిస్తూ, నివాస మరియు భూ ఆస్తుల కోసం ధృవీకరించబడిన యాజమాన్య దస్తావేజులను యజమానులకు పంపిణీ చేస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.  సమాజంలోని పేద వర్గాల ఆస్తిని చట్టవిరుద్ధంగా ఆక్రమించటానికి వ్యతిరేకంగా హామీ ఇవ్వడానికీ, ఆస్తిని క్రెడిట్ కోసం అనుషంగికంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించడానికీ, ఈ పధకం ఉపయోగపడుతుంది. 

ఈ ప్రాంతంలోని గిరిజన జనాభా అభ్యున్నతి కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి శ్రీ మోదీ వివరిస్తూ, ఈ ప్రత్యేక ప్రాజెక్టుల కింద అనేక పథకాలు గిరిజన ప్రాంతాలకు చేరుతున్నాయని చెప్పారు.  ఉత్తర ప్రదేశ్‌తో సహా ఇలాంటి ప్రాంతాల్లో వందలాది ఏకలవ్య మోడల్ పాఠశాలలు పనిచేస్తున్నాయనీ, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఇటువంటి సదుపాయాలను కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి చెప్పారు.  అటవీ ఆధారిత ఉత్పత్తుల ఆధారంగా ప్రాజెక్టులు కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాలకు నిధుల కొరత రాకుండా జిల్లా ఖనిజ నిధిని ఏర్పాటు చేశారు. మరియు అటువంటి పథకం వెనుక ఆలోచిస్తే,  దీనితో పాటు, ఆయా ప్రాంతాల నుండి ఉత్పత్తి చేయబడిన వనరులలో కొంత భాగం స్థానికంగా పెట్టుబడి పెట్టడానికి వినియోగించాలన్నది ఈ పథకం ఉద్దేశ్యమని ప్రధానమంత్రి తెలియజేశారు. ఉత్తర ప్రదేశ్ ‌లో ఈ నిధి కింద 800 కోట్ల రూపాయలు వసూలు చేయగా, 6000 కి పైగా ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.

ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు.  గొప్ప చిత్తశుద్ధితో, ప్రాధమిక జాగ్రత్తలను పాటించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

*****



(Release ID: 1674934) Visitor Counter : 177