ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు హుటాహుటిన కేంద్ర బృందాలు
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవారు 4.85% కు తగ్గుదల
కోలుకున్న కోవిడ్ బాధితులు 93.69% కు పెరుగుదల
Posted On:
22 NOV 2020 11:24AM by PIB Hyderabad
కోవిడ్ కెకేసులు అనూహ్యంగా పెరుగుతున్నట్టు గమనించిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్నతస్థాయి ప్రత్యేక బృందాలను హుటాహుటిన పంపాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త కేసులు ఎక్కువగా రావటం, లేదా చికిత్సలో ఉన్నవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించిన కేంద్రం ఈ చర్య తీసుకుంది.
ముగ్గురేసి సభ్యులుండే ఈ ప్రత్యేక బృందాలు కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలకు వెళతాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా నిలబడి మార్గదర్శనం చేస్తాయి. నియంత్రణ, నిఘా, పరీక్షలు వంటి అంశాలలో అండగా నిలబడతాయి. అదే విధంగా సమర్థవంతమైన చికిత్సావిధానాలు అమలు జరిగేలా చూస్తాయి.
నిన్ననే హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, చత్తీస గఢ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇలాగే ప్రత్యేక బృందాలను పంపింది.
భారత్ లో ప్రస్తుతం చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,40,962 కు చేరింది. ఇది మొత్తం కేసులలో చికిత్సలో ఉన్నవారి తగ్గుదలను సూచిస్తూ 4.85% కు చేరింది. కోలుకున్నవారి శాతం కూడా మెరుగుపడి 93.69% కు చేరింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 43,493 మంది కోలుకోవటంతో ఇప్పటిదాకా 85,21,617 మంది బాధితులు బైటపడినట్టయింది..
కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య అంతరం మరింత పెరుగుతూ ప్రస్తుతం 80,80,655 కి చేరింది. .

26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 20,000 లోపు ఉంది.

7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంకా చికిత్సలోనే ఉన్నవారి సంఖ్య 20,000-50,000 మధ్య ఉండగా మహారాష్ట, కేరళ రాష్ట్రాలలో మాత్రమే ఈ సంఖ్య 50 వేలకు పైగా ఉంది.

గత 24 గంటలలో కోలుకున్నవారిలో 77.68% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కాగా, ఢిల్లీలో అత్యధికంగా 6,963 మంది, కేరళలో 6,719 మంది, మహారాష్ట్రలో 4,088 మంది కోలుకున్నారు.

గడిచిన 24 గంటలలో కొత్తగా పాజిటివ్ గా నమోదైనవారు 45,209 మంది కాగా వారిలో 76.81% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా 5,879 కేసులు రాగా, కేరళలో 5,772 కేసులు, మహారాష్ట్రలో 5,760 కేసులు నమోదయ్యాయి.

ప్రతి పది లక్షల జనాభాలో కోవిడ్ సోకినవారి సంఖ్య లెక్కించినప్పుడు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ నమోదైంది.

గత 24 గంటలో 501 మరణాలు నమోదు కాగా వాటిలో 76.45% కేవలం పది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. అత్యధికంగా 22.16% (111 మరణాలు) ఢిల్లీలో నమోదు కాగా, మహారాష్ట్రలో 62 మంది, పశ్చిమ బెంగాల్ లో 53 మంది కోవిడ్ తో చనిపోయారు. .

మరణాలలో జాతీయ సగటు 1.46% కంటే ఎక్కువ మరణాలు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదయ్యాయి.

ప్రతి పది లక్షల జనాభాల్లో మరణాలు జాతీయ స్థాయిలో 96 ఉండగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అంతకంటే తక్కువ సగటు నమోదైంది.

14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో జాతీయ సగటు మరణాలైన 96 కంటే ఎక్కువ ఉన్నాయి.

****
(Release ID: 1674889)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam