ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస గృహాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
17 వ లోక్ సభ ఇప్పటికే అనేక చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకొందని స్పష్టీకరణ
Posted On:
23 NOV 2020 11:54AM by PIB Hyderabad
పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించినటువంటి బహుళ అంతస్తులు కలిగిన నివాస భవనాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్టర్ బి డి మార్గ్ లో కట్టారు. 80 సంవత్సరాలకు పైబడిన ఎనిమిది పాత బంగళాల కు చెందిన భూమి ని పునరభివృద్ధిపర్చి ఈ 76 ఫ్లాట్ లను నిర్మించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యుల కు ఉద్దేశించిన ఈ బహుళ అంతస్తుల నివాస భవనాల ను గ్రీన్ బిల్డింగ్ నియమాలను పాటిస్తూ నిర్మించడం జరిగిందన్నారు. ఈ నూతన గృహాలు ఎంపీ లతో పాటు వీటి నివాసులు అందరిని భద్రంగా, సురక్షితంగా ఉంచగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎంపీ ల గృహ వసతి చాలా కాలంగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్య గా ఉండగా, దానిని ఇప్పుడు పరిష్కరించడం జరిగిందని ఆయన చెప్పారు. దశాబ్దాల నాటి పాత సమస్యలను వాటిని తప్పించుకు తిరిగితే సమసిపోవు, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తేనే అవి కొలిక్కి వస్తాయి అని ఆయన అన్నారు. చాలా సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు దిల్లీ లో అనేకం ఉన్నాయి, వాటిని ఈ ప్రభుత్వం చేపట్టి అనుకున్న కాలాని కంటే ముందుగానే పూర్తి చేసింది అని చెప్తూ, వాటిని ఒక దాని తరువాత మరొకటి గా ఆయన ప్రస్తావించారు. కీర్తిశేషుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు ప్రధాని పదవి లో ఉన్నప్పుడు ఆంబేడ్ కర్ నేశనల్ మెమోరియల్ తాలూకు చర్చ మొదలైందని, ఆ స్మారకాన్ని 23 సంవత్సరాల దీర్ఘ కాలిక నిరీక్షణ అనంతరం ఈ ప్రభుత్వం నిర్మించిందని శ్రీ మోదీ గుర్తు చేశారు. చాలా కాలం పాటు పరిష్కారం కాకుండా ఉన్న కేంద్రీయ సమాచార సంఘం (సిఐసి) కొత్త భవనాన్ని, ఇండియా గేట్ సమీపం లో యుద్ధ స్మారకాన్ని, జాతీయ రక్షకభట స్మారకాన్ని ఈ ప్రభుత్వం నిర్మించిందని ఆయన అన్నారు.
చట్టసభ లో ఫలప్రద చర్చలతో పాటు ఫలితాలు కూడా వెలువడేందుకు ఎంపీలంతా శ్రద్ధ తీసుకొన్నారని, ఈ దిశ లో వారు ఒక నూతన శిఖరాన్ని చేరుకొన్నారంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. సభ వ్యవహారాలను నిర్వహించడంలో చక్కగా పనిచేసి, మంచి ఫలితాలను సాధించడంలో లోక్ సభ స్పీకర్ సారథ్యాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. మహమ్మారి కాలం లో సైతం కొత్త నిబంధనలతో, అనేక ముందుజాగ్రత్త చర్యలతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు కొనసాగినందుకు ఆయన ప్రసన్నత ను వ్యక్తం చేశారు. వర్షకాల సమావేశాలలో సభా కార్యకలాపాలు సాఫీ గా నడిచేందుకు ఉభయ సభలు వారాంతపు దినాలలో కూడా పని చేశాయి అని ఆయన అన్నారు.
యువతీ యువకులకు 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు చాలా ముఖ్యమైందని ప్రధాన మంత్రి చెప్తూ, 2019 ఎన్నికల తో మనం పదహారో లోక్ సభ పదవీకాలాన్ని పూర్తి చేసుకొన్నామని, మరి ఈ పదవీ కాలం దేశ అభివృద్ధి, పురోగతి ల విషయంలో చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంపాదించుకొందన్నారు. 17 వ లోక్ సభ పదవీకాలం 2019 లో మొదలైంది, ఈ కాలం లో లోక్ సభ లో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలలో కొన్ని చరిత్రాత్మకమైనవి అని ఆయన పేర్కొన్నారు. రాబోయే 18 వ లోక్ సభ కూడా దేశాన్ని కొత్త దశాబ్దంలోకి తీసుకుపోవడంలో అతి ముఖ్య పాత్ర ను పోషించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
***
(Release ID: 1675048)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam