సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వ్యాప్తి నివార‌ణ‌కు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ) అన్ని మార్గదర్శకాల‌ను అనుస‌రిస్తోంది

Posted On: 21 NOV 2020 5:43PM by PIB Hyderabad

ఈ నెల 20వ తేదీ (20.11.2020) నుండి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 57 మంది శిక్ష‌ణ‌లో ఉన్న‌ అధికారుల‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణయింది. సివిల్ సర్వీసెస్‌లో కొత్తగా ప్రవేశించే వారి నిమిత్తం నిర్వహిస్తున్న‌ 95వ ఫౌండేషన్ కోర్సు కోసం..క్యాంప‌స్‌లో మొత్తం 428 ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. కోవిడ్- 19 వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు గాను
అకాడ‌మీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డెహ్రాడూన్ జిల్లా పరిపాలన యొక్క మార్గదర్శకాలతో అన్ని చర్యలు తీసుకుంటోంది. శిక్ష‌ణ‌లో ఉంటూ కోవిడ్ సోకిన యువ అధికారుల‌ను గుర్తించి.. ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్‌లో క్వారెట‌యిన్‌లో  ఉంచారు. 20.11.2020 నుండి అకాడమీ జిల్లా అధికారులతో సమన్వయంతో 162 కంటే ఎక్కువ ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. ఈ ప‌రిస్థితుల
నేప‌థ్యంలో 03.12.2020 అర్ధరాత్రి వరకు శిక్ష‌ణ‌తో స‌హా అన్ని ర‌కాల ఇత‌ర కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో మార్గంలో నిర్వహించాలని అకాడమీ నిర్ణయించింది. సామాజిక దూరం పాటించ‌డం, తరచూ చేతులు క‌డుక్కోవ‌డం, ముఖ మాస్క్‌లు ధరించడం వంటి ప్రోటోకాల్‌ను ఆఫీసర్ ట్రైనీలు, ఇక్క‌డి సిబ్బంది క‌చ్చితంగా ‌అనుసరిస్తున్నారు. కోవిడ్-19 రక్షిత సామగ్రిలో తగినంతగా ధ‌రించిన‌ సిబ్బంది
ఆఫీసర్ ట్రైనీలకు వారి ఆహారం మరియు ఇతర అవసరాలను వారి  హాస్టళ్లలోనే పంపిణీ చేస్తున్నారు.
                             

<><><><>


(Release ID: 1674818) Visitor Counter : 206