ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్‌ లోని గాంధీన‌గ‌ర్‌ లో గ‌ల పండిత‌ దీన‌ద‌యాళ్ పెట్రోలియం విశ్వ‌విద్యాల‌యం 8 వ స్నాత‌కోత్స‌వం లో పాల్గొన్న ప్ర‌ధాన‌ మంత్రి

విశ్వ‌విద్యాల‌యం లోని అనేక స‌దుపాయాలను ఆయన ప్రారంభించారు

భారతదేశం లో కర్బ‌న పాద ముద్ర ను 30-35 శాతం త‌గ్గించడం తో పాటు స‌హ‌జ‌ వాయువు వాటా ను 4 రెట్లు పెంచడం మా ధ్యేయం: ప్ర‌ధాన‌ మంత్రి

స్పష్టమైన పథకాలతో ముందుకు సాగిపోవాలంటూ 21 వ శతాబ్ద‌ం యువత కు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి

Posted On: 21 NOV 2020 12:32PM by PIB Hyderabad

గుజ‌రాత్ లో గాంధీన‌గ‌ర్‌ లో గల పండిత దీన్‌ ద‌యాళ్ పెట్రోలియమ్ విశ్వ‌విద్యాల‌యం 8 వ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ పాల్గొన్నారు.  నలభై అయిదు మెగావాట్ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం గ‌ల మోనోక్రిస్ట‌లైన్ సోలర్ ఫోటోవోల్టాయిక్ పానెల్‌ కు, నీటి సాంకేతిక ప‌రిజ్ఞ‌ానానికి సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్సు కు ప్ర‌ధాన‌ మంత్రి శంకుస్థాప‌న చేశారు.  విశ్వవిద్యాలయం లో ఏర్పాటైన ‘ఇన్నొవేష‌న్‌, ఇంక్యుబేశన్ సెంట‌ర్‌ – టెక్నాల‌జీ బిజినెస్ ఇంక్యుబేశన్‌’ ను, ‘ట్రాన్స్‌లేశన‌ల్ రిసర్చ్ సెంట‌ర్‌’ ను, ‘స్పోర్ట్స్ కాంప్లెక్స్‌’ ను ఆయన ఈ సందర్భం లో ప్రారంభించారు.

విద్యార్ధుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, ప్ర‌పంచం ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద‌శ‌ లో, పట్టభద్రులు కావడం సుల‌భ‌మైన విష‌యం కాద‌ని, కానీ విద్యార్ధుల శక్తి సామ‌ర్ధ్యాలు ఈ స‌వాలు కంటే చాలా పెద్దవన్నారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌ం అంతటా శక్తి రంగంలో పెనుమార్పులు చోటుచేసుకొంటున్న కాలంలో విద్యార్ధులు ఈ ప‌రిశ్ర‌మ‌ లో అడుగుపెడుతున్నార‌ని ఆయన అన్నారు.

ఈ దృష్టి తో చూస్తే, ప్రస్తుతం భారతదేశ శక్తి రంగంలో  అద్భుత‌ వృద్ధి కి, నవపారిశ్రామికత్వానికి, ఉపాధి కి అపారమైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ప్ర‌స్తుతం దేశం తన కర్బన పాదముద్ర ను 30-35 శాతం వరకు త‌గ్గించే ల‌క్ష్యం తో ముందుకు సాగుతోంద‌ని, ఈ ద‌శాబ్దం లో మన శక్తి  అవసరాలలో స‌హ‌జ‌ వాయువు వాటా ను నాలుగింతలు పెంచే కృషి జ‌రుగుతోందని ఆయన చెప్పారు. రాబోయే 5 సంవ‌త్స‌రాల‌లో చ‌మురు శుద్ధి సామ‌ర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు కృషి జ‌రుగుతోంద‌న్నారు.  శక్తి భ‌ద్ర‌త కు సంబంధించిన అంకుర సంస్థ (స్టార్ట్- అప్) ల వాతావ‌ర‌ణాన్ని బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతోందని, విద్యార్ధులకు, వృత్తినిపుణులకు ఒక నిధి ని ఏర్పాటు చేయడమైందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

విద్యార్ధులు జీవితానికి సార్ధ‌క‌త ఉండేలా చూసుకోవాల‌ని ప్రధాన మంత్రి చెప్పారు.  విజ‌యవంత‌మైన వ్య‌క్తులకు స‌మ‌స్య‌ లు లేవు అని కాదు, స‌వాళ్ల‌ ను స్వీక‌రించి వాటితో త‌ల‌ప‌డి వాటిని ఓడించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన వారు మాత్ర‌మే సాఫల్యాన్ని సాధించ‌గ‌లుగుతార‌ని ఆయన అన్నారు.  స‌వాళ్ల‌ ను స్వీక‌రించిన‌ వారు ఆ త‌రువాత జీవితంలో విజ‌యాన్ని సాధిస్తార‌న్నారు. 1922-47 మ‌ధ్య కాల‌ంలో యువ‌తీయువకులు వారి సర్వ‌స్వాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేశార‌ని ఆయ‌న అన్నారు.  విద్యార్ధులు దేశం కోసం పాటుప‌డాల‌ని, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ఉద్య‌మం లో చేరడం తో పాటు బాధ్యత తాలూకు భావనను వికసింపచేయాల‌ని ఆయ‌న కోరారు.

సఫలత కు బీజం బాధ్య‌త‌ లో ఇమిడివుందని,  ప్రధాన మంత్రి  అన్నారు.  బాధ్య‌త‌ అనే భావన ను జీవన ఉద్దేశ్యం గా  మార్చుకోవాలన్నారు.  ఇలా మార్చుకొనే వారు మాత్రమే జీవనంలో సఫలం అవుతారని, వారికి జీవనంలో బాధ్యత తాలూకు స్పృహ‌ ఉంటుందన్నారు.  ఇక ఎవరైతే ఒక భారాన్ని మోస్తూ జీవనాన్ని గడుపుతారో వారు విఫ‌లులు అవుతార‌ని ప్రధాన మంత్రి చెప్పారు.  బాధ్య‌త‌ తాలూకు భావన
ఒక వ్యక్తి జీవనంలో అవకాశ భావన కు జన్మనిస్తుందని ఆయన తెలిపారు.  భారతదేశం అనేక రంగాలలో ముందుకు కదులుతోందని, యువ పట్టభద్రులు వచనబద్ధతతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి అన్నారు.  ప్ర‌కృతిని, ప‌ర్యావ‌ర‌ణాన్ని  ర‌క్షించడం గురించి కూడా ఆయ‌న నొక్కి చెప్పారు.

ఇరవైఒకటో శ‌తాబ్ద‌ యువ‌త లోని వర్తమాన తరం స్పష్టమైన పథకాలతో ముందంజ వేయాలి అని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  క్లీన్ స్లేట్, క్లీన్ హార్ట్ లంటే అర్థం స్పష్టమైన ఉద్దేశ్యాలు అని ఆయన వివరించారు.  ప్రపంచం ఆశ లు, అపేక్ష లు 21వ శతాబ్ద భారతదేశం పైన అధికంగా ఉన్నాయంటూ, కాగా భారతదేశం ఆశలు, అపేక్షలు విద్యార్ధుల పైన, వృత్తినిపుణుల పైన ఉన్నాయి అని ఆయన అన్నారు.



 

***



(Release ID: 1674780) Visitor Counter : 183