PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 16 NOV 2020 6:05PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • వరుసగా 44వ రోజునా కొత్త కేసులకన్నా కోలుకున్నవే అధికంగా నమోదు
  • గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 43,851 కాగా, కొత్త కేసులు కేవలం 30,548 మాత్రమే
  • దేశంలో చురుకైన కేసుల సంఖ్య మరింత తగ్గి 4.65 లక్షలకు పరిమితం
  • కోలుకునేవారి జాతీయ సగటు మరింత మెరుగుపడి 93.27 శాతానికి చేరిక
  • భారతదేశంలో నిర్ధారిత కేసుల సంచిత సగటు మరింత తగ్గి నేడు 7.19 శాతంగా నమోదు
  • ఢిల్లీలో కోవిడ్‌-19పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా  సమీక్ష; మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలపై ఆదేశాలు

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

భారత్‌లో వరుసగా 44వ రోజునా కొత్త కేసులకన్నా కోలుకున్నవే అధికం; చురుకైన కేసుల సంఖ్య 4.65 లక్షలకు తగ్గుదల

భారత్‌ వరుసగా 44వ రోజు కూడా కొత్త కేసులకన్నా కోలుకునే కేసుల సంఖ్య పెరుగుదలను కొనసాగించింది. ఈ మేరకు గత 24 గంటల్లో 43,851 మంది కోవిడ్ పీడితులు కోలుకోగా, 30,548 కొత్త కేసులు మాత్రమే నమోదవడం గమనార్హం. ఈ రెండింటి తేడా 13,303తో సమానంగా ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య కూడా పతనమై 4,65,478కి దిగివచ్చింది. అమెరికా, ఐరోపా దేశాలుసహా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కేవలం 30,548 స్థాయికి తగ్గడం చరిత్రాత్మకంగా పేర్కొనవచ్చు. ఇక కోలుకునేవారి జాతీయ సగటు కూడా మరింత మెరుగుపడి ఇవాళ 93.27 శాతానికి చేరింది. తదనుగుణంగా ఇప్పటిదాకా 82,49,579 మంది కోలుకోగా, గత 24 గంటల్లో వ్యాధినుంచి బయటపడినవారిలో 78.59 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. వీరిలో ఢిల్లీలో అత్యధికంగా 7,606 మంది, కేరళలో  6,684 మంది, పశ్చిమ బెంగాల్‌లో 4,480 మంది వంతున కోలుకున్నారు. అలాగే కొత్త కేసులలో 76.63 శాతం కూడా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. ఇందులో కేరళ 4,581, ఢిల్లీ 3,235, పశ్చిమ బెంగాల్ 3,053 వంతున కేసులతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 435 మరణాలు సంభవించగా, వీటిలో 78.85 శాతం మరణాలు కూడా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. ఆ మేరకు ఢిల్లీ  21.84 శాతంతో (95) దాదాపు ఐదో వంతు మరణాలు నమోదుచేసింది. ఇక మహారాష్ట్ర 13.79 శాతం (60) మరణాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రతి 10 లక్షల జనాభాకు మరణాల జాతీయ సగటు 94 కాగా, 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతకన్నా ఎక్కువగా ఉంది. ఇక 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల శాతం జాతీయ సగటును మించి నమోదవుతోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673193

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు 147వ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హర్షవర్ధన్

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673239

ఢిల్లీలో కోవిడ్-19పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  సమీక్ష; మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలపై ఆదేశాలు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోవిడ్-19 ప‌రిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిన్న స‌మీక్షించారు. 

రాజ‌ధాని ప్రాంతంలో కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతోపాటు ఆస్పత్రుల‌లో మౌలిక వైద్య వ‌స‌తుల సామ‌ర్థ్యంపై భారం పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా హోంమంత్రి పలు ఆదేశాలు జారీచేశారు. ముందుగా ఢిల్లీలోని ప్రయోగశాలల్లో ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌  సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. త‌ద‌నుగుణంగా ఉన్న స‌దుపాయాల‌ను సముచితంగా వినియోగించుకోవాల‌ని సూచించారు. ఆ మేర‌కు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ,   ఐసీఎంఆర్ రూపొందించే సంచార ప్రయోగశాలలను పేద-బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో ఉంచాల‌ని ఆదేశించారు.  ఈ దిశ‌గా దేశంలోని ఇతర ప్రాంతాలలో వినియోగంలో లేని కొన్ని సంచార ప్రయోగశాలలను తాత్కాలికంగా ఢిల్లీకి తరలించాల‌ని సూచించారు. ఇటీవలి వారాల్లో తీవ్రంగా పెరుగుతున్న కేసుల సంఖ్య‌ను తగ్గించడంలో ఇది చాలా కీల‌క‌మైన చర్యగా పరిగణించాల‌న్నారు. అలాగే ఆసుపత్రి సామర్థ్యం, ఇతర మౌలిక‌ వైద్యవ‌స‌తుల‌ లభ్యత గణనీయంగా పెరగాలని కూడా శ్రీ అమిత్ షా ఆదేశించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673090

బ్రిక్స్‌ కూటమి ఎస్‌టీఐ మంత్రులస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహణ

బ్రిక్స్‌ కూటమి (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల శాస్త్ర-సాంకేతిక-ఆవిష్కరణల శాఖ మంత్రులు నవంబర్ 13న వర్చువల్ వేదికద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యదేశాల మధ్య శాస్త్ర-సాంకేతిక సహకారం గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులను కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన/ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ముగింపు సభలో అభినందించారు, “బ్రిక్స్ ఎస్టీఐ డిక్లరేషన్-2020, బ్రిక్స్ కార్యకలాపాల కేలండర్ 2020-21 మన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మార్గ ప్రణాళికగా ఉంటుంది” అని పేర్కొంటూ ‘బ్రిక్స్ ఎస్టీఐ డిక్లరేషన్-2020’ని  ఏకగ్రీవంగా ఆమోదించారు. “కోవిడ్-19 మహమ్మారి ఒక విషమ పరీక్షగా మారింది. ఇటువంటి స్థితిలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి బహుపాక్షిక సహకారం ముఖ్యమని ఇది నిరూపించింది" అని డాక్టర్ హర్షవర్ధన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. “ఈ మహమ్మారివల్ల బ్రిక్స్‌ దేశాల్లో జనాభా అధికంగా ప్రభావితమైన నేపథ్యంలో  దీనిపై పోరులో కూటమి సభ్యదేశాల నడుమ సహకారానికి దీన్నొక అవకాశంగా వినియోగించుకోవాలి” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672919

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ‘స్థానికం కోసం స్వగళం’ నినాదానికి ప్రాచుర్యం కల్పించాలని ఆధ్యాత్మిక గురువులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి

స్వాతంత్య్ర సంగ్రామానికి భక్తి ఉద్యమమే పునాది వేసిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అదేవిధంగా నేడు ఆత్మనిర్భర్ భారత్‌ ఉద్యమానికీ దేశంలోని సాధువులు, మహాత్ములు, మహంతులు, ఆచార్యులే ప్రాతిపదికను ఏర్పరచగలరని ఆయన పేర్కొన్నారు. జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ సురీశ్వర్‌ మహారాజ్ 151వ జయంతి వేడుకలను ప్రధానమంత్రి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయంద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘శాంతి విగ్రహం” కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్య పోరాటం వంటి సామాజిక-రాజకీయ-ఆర్థిక సంఘటనలకు మతపరమైన, ఆధ్యాత్మిక పునాది గురించి ఆయన నొక్కిచెప్పడం, దీన్ని ఆత్మనిర్భర్‌ భారత్‌కూ జోడించడం ఒక ముఖ్యాంశంగా నిలిచింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673219

జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ సురీశ్వర్‌ మహారాజ్ 151వ జయంతి సందర్భంగా ‘శాంతి విగ్రహం’ ఆవిష్కరించిన ప్రధానమంత్రి

జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ సురీశ్వర్‌ మహారాజ్ 151వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ‘శాంతి విగ్రహం’ ఆవిష్కరించారు. జైన ఆచార్యుని గౌరవార్థం ఆవిష్కరించిన ఈ 151 అంగుళాల పొడవైన విగ్రహాన్ని అష్టధాతువులు… రాగి ప్రధానంగా 8 లోహాలతో తయారుచేశారు. దీన్ని రాజస్థాన్‌లోగల పాలిలోని జెట్పురలోగల విజయ వల్లభ్‌ సాధన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇద్దరు ‘వల్లభ్‌’లు ‘సర్దార్ వల్లభ్‌ భాయ్ పటేల్, జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ్‌ సురీశ్వర్‌ మహారాజ్’ గురించి ప్రధాని ప్రస్తావించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ పటేల్ ‘ఐక్యతా విగ్రహాన్ని’ జాతికి అంకితం చేసిన నేపథ్యంలో జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ్ 'శాంతి విగ్రహం' ఆవిష్కరించడాన్ని తనకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘స్థానికం కోసం స్వగళం’ నినాదానికి తన ప్రాధాన్యాన్ని కూడా ఆయన పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఆధ్యాత్మిక నాయకులందరూ ఆత్మనిర్భరత సందేశమిచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు నేడు ఆత్మనిర్భరత ప్రయోజనాల గురించి ప్రజలకు బోధించాలని అభ్యర్థించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673195

జైసల్మేర్‌లోని లోంగేవాలాలో భారత సాయుధ దళాల సైనికులతో దీపావళి వేడుకలో ప్రధాని ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673091

జైసల్మేర్ వద్ద వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673086

పత్రికాస్వేచ్ఛపై దాడులు ఎలాంటివైనా జాతీయ ప్రయోజనాలకే హాని: ఉపరాష్ట్రపతి

పత్రికా స్వేచ్ఛపై జరిగే దాడి ఎలాంటిదైనా అది జాతీయ ప్రయోజనాలకే హానికరమని, అందువల్ల ఇలాంటివాటిని అందరూ వ్యతిరేకించాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ‘కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో మీడియా పాత్ర-మీడియాపై దాని ప్రభావం’ పేరిట ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో ముందుగా రికార్డ్ చేసిన వీడియో సందేశంలో ఉప రాష్ట్రపతి మాట్లాడారు. “స్వేచ్ఛ, నిర్భీకత లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యం” అని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ప్రచురణ/ఎలక్ట్రానిక్ మాధ్యమాలు జర్నలిస్టులను ముందువరుస యోధులుగా మార్చాయన్నారు. మహమ్మారితో ముప్పును లెక్కచేయకుండా అన్ని సంఘటనలనూ నిరంతరం నివేదించడంలో వారు చూపిన సాహసాన్ని ఉప రాష్ట్రపతి ప్రశంసించారు. కోవిడ్‌ బారినపడిన అనేక మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు రెండురకాల మాధ్యమాల్లోనూ ఉద్యోగులను తొలగించిన దురదృష్టకర సంఘటనలపై శ్రీ నాయుడు విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673116

వృద్ధి చోదకశక్తులతో మమేకమై పునరుజ్జీవన భారతం నిర్మాణంలో సామర్థ్యాలను జోడించాలని యువతకు ఉప రాష్ట్రపతి పిలుపు

వృద్ధి చోదకశక్తులతో మమేకమై పునరుజ్జీవన, నవ భారత నిర్మాణంలో శక్తిసామర్థ్యాలను జోడించాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కొత్త ‘అమెనిటీస్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. ప్రతికూల భావనలను విడనాడాలని, అవినీతి-ఆకలి-దోపిడీ-వివక్షలు లేని నవభారత నిర్మాణంలో సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన యువతరానికి సూచించారు. దేశం ఒక క్లిష్టమైన సంధిదశలో ఉన్నదని, అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని శ్రీ నాయుడు వివరించారు. అన్ని రంగాల్లోనూ భారత్‌ను బలోపేతం చేయడంలో ముందంజ వేయాలని యువతను కోరారు. మహమ్మారిపై జాతి పోరాటాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ అత్యున్నత స్థానంలో ఉందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దార్శనికతతో దేశానికి మార్గనిర్దేశం చేశారన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673132

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అసోం: రాష్ట్రంలో ఇప్పటిదాకా 50 లక్షల కోవిడ్-19 పరీక్షలు పూర్తిచేసినట్లు అసోం ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఆదివారం 35 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 971కి చేరింది. అలాగే 76 మంది కోలుకోగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 9594కు పెరిగింది. ఇక తురాలో ఒక వ్యక్తి  మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 101కి పెరిగింది. ఆదివారానికి మొత్తం కేసుల సంఖ్య 10,665గా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడం కోసం సెరోసర్వే నిర్వహించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఈ సర్వే ప్రారంభం కానుంది. జనాభాలో వ్యాధి సోకినవారి శాతం తెలుసుకోవడానికి 14 జిల్లాల్లోని వివిధ వర్గాల ప్రజల్లో ప్రతిరోధకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కోవిడ్‌పై ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కాగా, కేరళలో కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిదశలో టీకా అందుకునే ఆరోగ్య కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్‌-19 టీకా ఇవ్వడం కోసం తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల సమాచారాన్ని సేకరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న కోవిడ్-19 టీకా ‘కోవిషీల్డ్’ రెండోదశ ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. కాగా, కోయంబత్తూరులోని 42 క్లస్టర్లలో '22 శాతం రక్త నమూనాల్లో ప్రతిరోధకాలు నిర్ధారణ అయినట్లు సర్వే పేర్కొంది.
  • కర్ణాటక: రాష్ట్రం నుంచి కేరళకు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు 9 నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల రోడ్డురవాణా సంస్థలు మంగళూరు-కాసరగోడ్‌ మధ్య 20 బస్సులు నడుపుతాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విజయనగరం జిల్లాలో గరివిడి నుంచి చీపురుపల్లిదాకా భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోవడం గమనార్హం. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 1056 కొత్త కేసులు నమోదవగా, 14 మంది మరణించారు. గడచిన 4 నెలల్లో కొత్త కేసులు అతి తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 18,659కు దిగివచ్చింది. గత 24 గంటల్లో 2,140మంది కోలుకోగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8,28,484కు, కోలుకునే సగటు 97.01 శాతానికి పెరిగాయి. ప్రతి 10 లక్షల జనాభాకు ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల సంఖ్య 1.71 లక్షలకు చేరగా, ప్రతి 10 లక్షల జనాభాకు కేసుల సంఖ్య 15,993కు పెరిగింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 502 కొత్త కేసులు, 3 మరణాలు నమోదవగా 1539 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 141 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,57,876; క్రియాశీల కేసులు: 14,385; మరణాలు 1407; డిశ్చార్జి: 2,42,084గా ఉన్నాయి. కోలుకునేవారి జాతీయ సగటు 93.2 శాతం కాగా, తెలంగాణలో మరికాస్త ఎక్కువగా 93.87 శాతం నమోదు కావడం విశేషం. కాగా, రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పునఃప్రారంభానికి ఎదురుచూస్తున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఈ నెల 23 నుంచి ధరణి పోర్టల్‌ద్వారా తిరిగి మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో దాదాపు 7 నెలల తర్వాత అన్ని మత-ధార్మిక ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు ఇవాళ తిరిగి తెరవబడ్డాయి. షిర్డీలోని సాయిబాబా ఆలయం, పంధర్‌పూర్‌లోని విఠల్ మందిర్, తుల్జాపూర్‌లోని తుల్జా భవానీ ఆలయం వంటి కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ఈ తెల్లవారుజామునుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో ఆదివారం 2,544 కొత్త కేసులు నమోదవగా జూన్ తొలివారం తరువాత ఒకే రోజు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో ఆదివారం 1,070 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,88,310కి చేరింది. గుజరాత్‌లో ఇవాళ ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య 3,803కు పెరిగింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడి మరో 10 మంది మరణించగా, 2,184 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,25,817కి చేరాయి. కొత్త కేసులలో జైపూర్‌ 498, జోధ్‌పూర్‌ 443 తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 18,337గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 870 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,83,927కు పెరిగింది. మరోవైపు ఇండోర్, సాగర్‌లలో రెండేసి, భోపాల్, హోషంగాబాద్, శివపురిలలో ఒక్కొక్కటి వంతున 7 మరణాలు సంభవించాయి. దీంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం మృతుల సంఖ్య 3,090కి చేరింది.

FACT CHECK

 

 

 

Image

*******



(Release ID: 1673351) Visitor Counter : 184