హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించే చర్యలను ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో సమీక్షించిన - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
ఢిల్లీలో రెట్టింపుకానున్న -ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షల సామర్థ్యం
ఢిల్లీలో వైద్య సిబ్బంది కొరత దృష్ట్యా, సి.ఏ.పి.ఎఫ్. ల నుండి అదనపు వైద్యులు, అనుబంధ వైద్య సిబ్బందిని అందించాలని నిర్ణయించారు. వారిని త్వరలో విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు
వచ్చే 48 గంటల్లో ఢిల్లీ ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యలో బిపాప్ యంత్రాలు మరియు అధిక ప్రవాహ నాసికా కాన్యులాస్ సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖను ఆదేశించిన - శ్రీ అమిత్ షా
మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్న - ఎయిమ్స్, ఢిల్లీ ఎన్.సి.టి. ప్రభుత్వం, ఎమ్.సి.డి. బృందాలు
కోవిడ్-19 రోగులకు వెంటనే చికిత్స అందించడానికి వీలుగా ప్లాస్మా థెరపీ మరియు ప్లాస్మా నిర్వహణ కోసం ప్రామాణిక నిబంధనలను జారీ చేయనున్న - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో, సంచార పరీక్షా ప్రయోగశాలలను మోహరించనున్న - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఐ.సి.ఎం.ఆర్.
ధౌలా కువాన్ వద్ద డి.ఆర్.డి.ఓ.కు ఉన్న ప్రస్తుత వైద్య సదుపాయాన్ని, ఐ.సి.యు.లతో కూడిన మరో
Posted On:
15 NOV 2020 8:36PM by PIB Hyderabad
పెరుగుతున్న కేసుల సంఖ్య, రాజధాని ఆసుపత్రులలో వైద్య మౌలిక సదుపాయాల సామర్థ్యంపై అధికమౌతున్న ఒత్తిడి నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్, షా ఈ రోజు, ఢిల్లీలోని కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి; ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్; ఢిల్లీ ముఖ్యమంత్రి; ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి; హోంశాఖ కార్యదర్శి; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) కార్యదర్శి; ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి.కె.పాల్; ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్; డి.ఆర్.డి.ఓ. కార్యదర్శి; సాయుధ దళాల వైద్య సేవల (డి.జి.ఏ.ఎఫ్.ఎం.ఎస్) డైరెక్టర్ జనరల్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ముందుగా, డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కోవిడ్-19 యొక్క దిగజారుతున్న పరిస్థితిని వివిరంగా తెలియజేశారు. రోజు వారీ రికార్డఅవుతున్నయాక్టీవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సూచించారు. కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్) నియంత్రణలో కొనసాగుతున్నప్పటికీ, అంకితమైన కోవిడ్-19 పడకలు, వెంటిలేటర్లు, ఐ.సి.యు. లతో ఉన్న పడకల వంటి ఆరోగ్య మరియు వైద్య మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, నిఘాను మెరుగుపరచడం, నియంత్రణ చర్యలను ఖచ్చితంగా అమలు చేయడం, పరీక్షలను పెంచడం, అవసరమైన వైద్య మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మించడం చాలా అవసరం.
ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా, ఢిల్లీలోని ప్రయోగశాలల సామర్థ్యాన్ని సముచితంగా వినియోగించుకోవడం ద్వారా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.& ఎఫ్.డబ్ల్యూ) మరియు ఐ.సి.ఎం.ఆర్. అభివృద్ధి చేసే, సంచార పరీక్షా ప్రయోగశాలలను, సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలలో మోహరించడం ద్వారా, దేశంలోని ఇతర ప్రాంతాలలో వినియోగంలో లేని కొన్ని పరీక్షా ప్రయోగశాలలను తాత్కాలికంగా ఢిల్లీకి తరలించడం ద్వారా, ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అధికంగా సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా, ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షల సామర్ధ్యాన్ని రెట్టింపు చేయాలని ఆదేశించారు. ఇటీవలి వారాల్లో బాగా పెరిగిన పాజిటివ్ కేసుల రేటును తగ్గించడానికి ఇది చాలా ముఖ్యమైన చర్యగా పరిగణించడం జరిగింది.
ఆసుపత్రి సామర్థ్యం మరియు ఇతర వైద్య మౌలిక సదుపాయాల లభ్యత గణనీయంగా పెరగాలని కూడా శ్రీ అమిత్ షా ఆదేశించారు. ధౌలా కువాన్ వద్ద డి.ఆర్.డి.ఓ.కు ఉన్న ప్రస్తుత వైద్య సదుపాయాన్ని, ఐ.సి.యు.లతో కూడిన మరో 250-300 పడకలతో విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం, అందుబాటులో ఉన్న మొత్తం 1000 కోవిడ్-19 పడకల నుండి 250 పడకలు ఐ.సి.యు. లతో అందించడం జరిగింది. చత్తర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన 10,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను కూడా ఆక్సిజన్ సామర్థ్యంతో పడకల లభ్యతను పెంచే ఉద్దేశంతో బలోపేతం చేయవలసి ఉంటుంది. వచ్చే 48 గంటల్లో ఢిల్లీ ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యలో బిపాప్ యంత్రాలు మరియు అధిక ప్రవాహ నాసికా కాన్యులాస్ సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.
ఢిల్లీలో వైద్య సిబ్బంది కొరత దృష్ట్యా, సి.ఏ.పి.ఎఫ్. ల నుండి అదనంగా వైద్యులు, అనుబంధ వైద్య సిబ్బందిని అందించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది, వారిని త్వరలో ఢిల్లీకి విమానంలో పంపించనున్నారు. ఆసుపత్రులలో రోగులను చేర్చుకునే పరిస్థితికి అనుగుణంగా కోవిడ్-19 వైద్య మౌలిక సదుపాయాల లభ్యతను భౌతికంగా తనిఖీ చేయడానికి, ఆ వివరాలను అందరికీ కనబడే విధంగా ప్రదర్శించేలా నిర్ధారించడానికీ, ముందుగా నిర్ణయించిన విధంగా, ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రత్యేకంగా అంకితమైన బహుళ-విభాగ బృందాలు సందర్శించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎం.సి.డి) గుర్తించిన కొన్ని ఆసుపత్రులను కూడా కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చడం జరుగుతుంది. వీటిని ప్రత్యేకించి స్వల్ప లక్షణాలతో ఉన్న రోగులకు వసతి కల్పించడం కోసం వినియోగిస్తారు. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్యను జాగ్రత్తగా చూసుకోవడానికి, తగిన సంఖ్యలో పడకలు / వెంటిలేటర్లు / ఐ.సి.యు. లు అందుబాటులో ఉండే విధంగా, వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ మరియు ప్లాస్మా నిర్వహణ కోసం ఎమ్.ఓ.హెచ్.ఎఫ్. & డబ్ల్యూ ఒక ప్రామాణిక విధానాన్ని జారీ చేయాలని కూడా నిర్ణయించారు.
అంతకుముందు రూపొందించుకున్న, కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, కాంటాక్టు గుర్తింపు, క్వారంటైన్ మరియు స్క్రీనింగు వంటి మొత్తం నియంత్రణ చర్యలను, ముఖ్యంగా సమాజంలో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండే వర్గాల విషయంలో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కూడా హోంమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. తద్వారా, ఈ చర్యలను అమలు చేయడంలో అవాంతరాలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ నియంత్రణ వ్యూహాలను ఖచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిరుత్సాహం ఉండకూడదు. సంబంధిత అధికారులు, ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్నవారు, ఈ విషయంలో సమ్మతిని నిర్ధారించడానికి వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు మరియు ఈ విషయంలో గమనించిన ఏదైనా అతిక్రమణను తీవ్రంగా పరిగణించబడుతుంది. కోవిడ్-19 రోగులలో - ఇంట్లో ఐసోలేషన్ లో ఒంటరిగా ఉన్నవారిని గుర్తించి, వారికి అత్యవసర వైద్య సహాయం అవసరమని భావించిన వెంటనే, వారిని, సాధారణ ఆసుపత్రులకు తరలించవలసిన అవసరాన్ని హోంమంత్రి ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. ఎయిమ్స్, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎం.సి.డి. లు) బృందాలు సంయుక్తంగా, మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత, సర్వేలో వివిధ రోగ లక్షణాలను గుర్తించిన వ్యక్తులను పరీక్షించి, అవసరమైన చికిత్సను అందిస్తారు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా అనుసరించవలసిన, తగిన ప్రవర్తనపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యూహాన్ని రూపొందించుకోవాలనీ, దీర్ఘకాలిక వైద్య, ఆరోగ్య పరిస్థితులపై వ్యాధి యొక్క ప్రతికూల ప్రభావం గురించి వారికి తెలియజేయాలనీ, హోంమంత్రి ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసు కమీషనర్ (సి.పి), అవసరమైన చర్యలు, ముఖ్యంగా ముఖానికి మాస్కులు ధరించడం వంటి నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలనీ, కోవిడ్-19 తగిన ప్రవర్తనను పాటించడంలో ఎటువంటి ఉదాసీనత పనికి రాదనీ కూడా ఆయన ఆదేశించారు.
చివరగా, కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గే విధంగా చూడవలసిన అవసరాన్ని హోంమంత్రి పునరుద్ఘాటించారు
. బాధిత వ్యక్తులకు, ముఖ్యంగా పేద మరియు బలహీనంగా ఉన్నవారికి సకాలంలో అవసరమైన వైద్య చికిత్సను అందించడంలో ఎటువంటి అంతరాలు రాకుండా నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ తో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్) యొక్క పొరుగు ప్రాంతాలలో కూడా నెలకొన్న కోవిడ్-19 యొక్క పరిస్థితిపై, రాబోయే వారాల్లో నిరంతర ప్రాతిపదికన సమీక్షించడం జరుగుతుందని, ఆయన తెలియజేశారు.
*****
(Release ID: 1673090)
Visitor Counter : 335