ప్రధాన మంత్రి కార్యాలయం

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కోసం ‘వోకల్ ఫర్ లోకల్’ కు ప్ర‌చారం చేయ‌డంలో సాయాన్ని అందించ‌వ‌ల‌సిందిగా ఆధ్యాత్మిక నాయ‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 NOV 2020 4:23PM by PIB Hyderabad

స్వాతంత్య్ర పోరాటానికి ఒక పునాదిని భ‌క్తి ఉద్య‌మం  వేసిన‌ట్లుగానే, అదే మాదిరిగా ప్ర‌స్తుతం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ఒక ఆధారాన్ని మ‌న దేశంలోని సాధువులు, మ‌హాత్ములు, మ‌హంతులు, అలాగే ఆచార్యులు అందజేయ‌నున్నార‌ని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఈ రోజు న జైన ఆచార్య శ్రీ విజ‌య్ వ‌ల్ల‌భ్ సురీశ్వ‌ర్ జీ మ‌హారాజ్ 151వ జ‌యంతి కి గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించారు. ఆ తరువాత ఆ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్ర‌సంగించారు.  ఈ సంద‌ర్భం లో ఆయ‌న ప్ర‌సంగం ముఖ్యాంశాల్లో.. స్వాతంత్య్ర పోరాటం, ప్ర‌స్తుతం చేప‌డుతున్న ఆత్మనిర్భ‌రత‌ల వంటి సామాజిక, రాజ‌కీయ, ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు ధార్మిక‌, ఆధ్యాత్మిక‌ పునాది ని ఏర్ప‌ర‌చ‌డం ఎంత‌యినా అవ‌స‌ర‌ం అన్న‌ది.. కూడా ఒక ముఖ్యాంశం గా ఉండింది.  


- Narendra Modi
@narendramodi
जिस प्रकार आजादी के आंदोलन की पीठिका भक्ति आंदोलन से शुरू हुई, वैसे ही आत्मनिर्भर भारत की पीठिका हमारे संत-महंत-आचार्य तैयार कर सकते हैं।
 
हर व्यक्ति तक वोकल फॉर लोकल का संदेश पहुंचते रहना चाहिए। मैं संतों-महापुरुषों से विनम्र निवेदन करता हूं कि आइए, हम इसके लिए आगे बढ़ें।

https://twitter.com/i/status/1328268617163522049

‘స్థానిక ఉత్ప‌త్తుల వైపు మొగ్గు చూప‌డం’ (వోకల్ ఫర్ లోకల్) అనే అంశం పై త‌న మాట‌ల‌ను శ్రీ మోదీ పున‌రుద్ఘాటిస్తూ, దేశ స్వాతంత్య్ర పోరాట పునాదుల‌ను భ‌క్తి ఆందోళ‌న బ‌ల‌ప‌ర‌చిన సంగతి ని గుర్తుకు తెచ్చారు.  సాధువులు, మ‌హంతులు, ఆచార్యులు చేసిన బోధ‌న‌లు దేశంలోని మూల‌మూల‌న ఉన్న ప్ర‌జానీకం చేత‌న‌ ను ర‌గిలించాయ‌ని మనం జ్ఞప్తి కి తెచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ చైత‌న్య‌మే ఆ త‌రువాత స్వాతంత్య్ర పోరాటానికి గొప్ప శ‌క్తిని స‌మ‌కూర్చింద‌ని కూడా శ్రీ మోదీ అన్నారు.

ఆత్మ‌నిర్భ‌ర‌త ను ప్రోత్స‌హించ‌వ‌ల‌సిందిగా ఆధ్యాత్మిక నాయ‌కుల‌కు ప్ర‌ధాన మంత్రి మ‌నఃపూర్వ‌కంగా విజ్ఞ‌ప్తి చేశారు.  స్వాతంత్య్ర స‌మ‌రానికి భ‌క్తి ఉద్య‌మ‌ం ఒక పునాది ని ఏర్ప‌ర‌చి, దానిని బలోపేతం చేసిందని, ప్రస్తుతం 21 వ శ‌తాబ్దం లో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ఒక ఆధారాన్ని సైతం క‌ల్పించేది మ‌న సాధువులు, మ‌హంతులు, ఆచార్యులేన‌ని ఆయ‌న చెప్పారు.  వారు వారి శిష్యుల‌ను ఉద్దేశించి గాని, లేదా ఆధ్యాత్మిక స‌మావేశాల‌లో గాని ఎక్కడయినా ప్ర‌సంగించేట‌ప్పుడు ‘స్థానిక ఉత్ప‌త్తుల‌నే కొనుగోలు చేద్దాం’ (వోకల్ ఫర్ లోకల్) అనే సందేశాన్ని అదే ప‌నిగా వ్యాప్తి లోకి తీసుకురావాలంటూ ఆయ‌న అభ్య‌ర్థించారు.  ఆధ్యాత్మిక నాయ‌కుల స‌మ‌ర్ధ‌న ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ సందేశం మరింత బ‌లాన్ని పుంజుకొంటుంద‌ని, ఇది స్వాతంత్య్ర స‌మ‌ర కాలం లో దేశం ఉద్వేగపరచినట్లుగానే ఆత్మ‌నిర్భ‌ర‌త దిశ‌లో దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ ను ఇస్తుంద‌ని శ్రీ మోదీ అన్నారు.


***

 

 



(Release ID: 1673219) Visitor Counter : 186