ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా 44వ రోజుకూడా కొత్త కోవిడ్ కేసులకంటే కోలుకున్నవారు అధికం

4.65 లక్షలకు దిగువన కోవిడ్ బాధితులు

Posted On: 16 NOV 2020 11:37AM by PIB Hyderabad

రోజువారీ నమోదవుతున్న కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులకంటే కోలుకుంటున్న కోవిడ్ బాధితులే ఎక్కువగా ఉందటం వరుసగా 44వ రోజు కూడా నమోదైంది. గడిచిన 24 గంటలలో  43,851 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా 30,548 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండింటి తేడా అయిన  13,303 మంది నికరంగా తేడా కనబరుస్తూ ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్యను 4,65,478 కి చేర్చింది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012TQY.jpg

 

రోజువారీ కొత్త కేసులు 30,548 కు తగ్గటమన్నది చరిత్రాత్మకం. ఒకవైపు అమెరికా, యూరోపియన్ దేశాలలో పెరుగుతూ ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం ఇలా తగ్గటం ప్రత్యేకమనే చెప్పాలి.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TNAL.jpg

పెద్ద ఎత్తున పరీక్షలు జరపాలన్న ప్రభుత్వ వ్యూహం కారణంగా సకాలంలో బాధితులను గుర్తించటం, వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యమై కొత్త కేసులు తగ్గుతూ వచ్చాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030DR4.jpg

కోలుకుంటున్న వారి శాతం మెరుగుపడి నేటికి 93.27% చేరింది. ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 82,49,579 గా నమోదైంది. గత 24 గంటలలో కోలుకున్నవారిలో 78.59% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  ఢిల్లీలో అత్యధికంగా 7,606 మంది బాధితులు కోలుకోగా కేరళలో  6,684 మంది, పశ్చిమ బెంగాల్ లో 4,480 మంది కోలుకున్నారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EE70.jpg

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 76.63%  మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వారిలో కేరళనుంచి అత్యధికంగా 4,581 కొత్త కేసులు రాగా. ఢిల్లీలో 3,235 కేసులు, పశ్చిమ బెంగాల్ లో  3,053 కేసులు వచ్చాయి. .

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0051YQW.jpg

గడిచిన 24 గంటలలో 435 మరణాలు నమోదయ్యాయి. వాటిలో 78.85% మరణాలు 10 రాష్ట్రాల్లోనే రికార్డయ్యాయి. మృతులలో  21.84% (95 మరణాలు) ఢిల్లీకి చెందినవారు. మహరాష్ట్ర లో 13.79% (60 మరణాలు) నమోదయ్యాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006EH9T.jpg

14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటు అయిన ప్రతి పదిలక్షల జనాభాలో 94 కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007FWTU.jpg

13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మరణాల శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008KYW9.jpg

 

ఐసియు లలో ఉన్న కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్లకు మార్గనిర్దేశం చేసేలా చికిత్సకు ప్రామాణిక విధానాలు రూపొందించటంలో కేంద్రం కీలకపాత్ర పోషించింది.  హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు అందించింది.  బహుముఖ ప్రజ్ఞావంతులతో కూడిన కేంద్ర బృందాలను పంపి ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించటం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతునివ్వటం తెలిసిందే.

 

****


(Release ID: 1673193) Visitor Counter : 235