PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
13 NOV 2020 5:47PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)
• భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 4,84,547, వరుసగా మూడో రోజు కూడా 5 లక్షల లోపు
• గత 24 గంటలలో కొత్తగా నమోదైన కేసులు 44,879 కాగా, కోలుకున్నవారు 49,079 మంది
• ఇప్పటిదాకా కోలుకున్నవారు 81,15,580 మంది, కోలుకున్నవారి శాతం 92.97%
• గత 24 గంటలలో నమోదైన 547 మరణాలలో 80% (79.34%) 10 రాష్ట్రాల్లోనే నమోదు
• రెండు అత్యాధునిక ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేసిన ప్రధాని
#Unite2FightCorona
#IndiaFightsCorona
చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 4.85 లక్షల లోపే; రోజువారీ కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారే అధికం
భారత్ లో చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈరోజుకు 5 లక్షల స్థాయికి బాగా తగ్గి 4,84,547 కు చేరింది.లా 5 లక్షల లోపే ఉండటం వరుసగా ఇది మూడో రోజు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటి కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 5.55% మాత్రమే. కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉందటం వల్ల ఇది సాధ్యమవుతోంది. గడిచిన 24 గంటలలో కొత్తగా 44,879 కోవిడ్ పాజిటివ్ కేసులు తేలగా 49,079 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఈ ధోరణి వరుసగా 41 రోజులుగా నమోదవుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 81,15,580. అంటే కోలుకున్నవారిశాతం 92.97% చేరింది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 76,31,033 కి చేరింది. గత 24 గంటలలో కొత్తగా కోలుకున్నవారిలో 77.83% మంది కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 7,809 మంది కోలుకోగా ఆ రాష్ట్రంలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య16,05,064 కు చేరింది. గత 24 గంటలలో కొత్తగా ధ్రువపడిన కేసులలో 76.25% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అందులో ఢిల్లీలో అత్యధికంగా 7,053 మంది, కేరళలో 5,537 మంది, మహారాష్ట్రలో 4,496 మంది నమోదయ్యారు. గత 24 గంటలలో 547 మరణాలు నమోదుకాగా అందులో 79.34% మరణాలు 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. తాజా మరణాలలో 22.3% (122) మహారాష్ట్రలో నమోదయ్యాయి. 104 మరణాలతో ఢిల్లీ, 54 మరణాలతో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
వివరాలకు:
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రెండు అత్యాధునిక ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేసిన ప్రధాని
5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెండు అత్యాధునిక ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేశారు. ఇవి జామ్ నగర్ లోని ఆయుర్వేద బోధన, పరిశోధన సంస్థ, జైపూర్ లోని జాతీయ ఆయుర్వేద సంస్థ. ఈ రెండూ దేశంలో ప్రీమియర్ ఆయుర్వేద సంస్థలు. జామ్ నగర్ సంస్థకు పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యమున్న సంస్థగా గుర్తింపు ఇచ్చారు. జైపూర్ సంస్థకు యుజిసి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది. ధన్వంతరి జయంత్రి సందర్భంగా అయుష్ మంత్రిత్వశాఖ ప్రతిఏటా ఆయుర్వేద దినోత్సవం పాటిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి) శ్రీ శ్రీపాద్ నాయక్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్రా, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అదోనమ్ ఘెబ్రియాసస్ ఈ సందర్భంగా వీడియో సందేశం ఇచ్చారు.యఉష్మాన్ భారత్ కిందసంప్రదాయ వైద్యాన్ని ప్రధాని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు. సంప్రదాయ వైద్యానికి భారత్ ను అంతర్జాతీయ కేంద్రంగా ఎంచుకున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, దాని డైరెక్టర్ జనరల్ కు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.ఒకవైపు భారత్ కోవిడ్ వాక్సిన్ పరీక్షలు చెస్తూనే మరోవైపు ఆయుర్వేద పరిశోధనలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతోదన్నారు.
వివరాలకు:
జామ్ నగర్, జైపూర్ లో రెండు అత్యాధునిక ఆయుర్వేద సంస్థలు ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
వివరాలకు:
17వ ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
ఆసియాన్ కు ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వియత్నాం ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈరోజు 17వ ఆసియాన్ – భారత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశానికి ఆసియాన్ లోని మొత్తం పది సభ్యదేశాలూ హాజరయ్యాయి. ఈ సందర్భంగా ప్రదాని మాట్లాడుతూ తూర్పు దేసాలమీద దృష్టిపెట్తాలన్న భారత్ ఆలొచనావిధానమే కేంద్రంగా ఆసియాన్ ఉందన్నారు. ఇండో పసిఫిక్ దూరదృష్టికి ఆసియాన్ కల్సికట్టుగామ్ బాధ్యతాయుతంగా, సుసంపన్నంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు అప్పుడే ఈ ప్రాంత భద్రతకు, అభివృద్ధికి దోహదం చేయగలుగుతామన్నారు. కోవిడ్ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ సమాజానికి భారత్ అందించిన తోడ్పాటును ప్రస్తావించారు. కోవిడ్ మీద పోరులో ఆసియాన్ పాత్రను అభినందించారు. కోవిడ్-19 ఆసియాన్ నిధికి పది లక్షల అమెరికా డాలర్లను ప్రధాని విరాళంగా ప్రకటించారు. భారత్ కు, ఆసియాన్ కు మధ్య మరింత భౌగోళిక, డిజి
టల్ అనుసంధానం కొనసాగాలన్నారు. కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం, వైవిధ్యం ప్రాధాన్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వివరాలకు:
సమాజంలోని అన్ని వర్గాలకూ సాయం చేసే ప్రభుత్వ కృషిలో భాగమే ఆత్మనిర్భర్ పాకేజ్: ప్రధాని
నిన్న ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భ పాకేజ్ సమాజంలోని అన్ని వర్గాలకూ సాయం చేయాలన్న ప్రభుత్వ విధానంలో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ సమాజంలో అన్ని వర్గాలకూ సాయం అందించే మా కృషి కొనసాగింపులో భాగమే ఆత్మనిర్భర్ పాకేజ్. ఈ చొరవ వలన ఉద్యోగాల్ సృష్టి, దెబ్బతిన్న రంగాల పునరుద్ధరణ, ద్రవ్యతం సాధించటం, తయారీ రంగానికి ప్రోత్సాహం, రియల్ ఎస్టేట్ రంగాన్ని శక్తిమంతం చేయటం, రైతులకు అండగా నిలవటం సాధ్యమవుతుంది”
వివరాలకు:
జె ఎన్ యు కాంపస్ లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని; జాతి ప్రయోజనాలకంటే సిద్ధాంతాలు ముఖ్యం కాదు: ప్రధాని
న్యూ ఢిల్లీ లోని జె ఎన్ యు కాంపస్ లో ప్రధాని నిన్న వీడియో కాన్ఫరెమ్స్ ద్వారా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జె ఎన్ యు విద్యార్థులను, దేశ యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జాతి ప్రయోజనాలకంటే సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వటం సరికాదన్నారు. ఈ ఒక్కటే మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. “ నా సిద్ధాంతం ఒక మాట చెబుతుంటే జాతి ప్రయోజనాల విషయంలోనూ నేను అదే కోణంలో ఆలోచిస్తా. అదే కొలమానంగా తయారవుతుంది. కానీ అది మంచిది కాదు. “ అన్నారు. ఎవరికి వారికి ఒక సిద్ధాంతం ఉండటం గర్వకారణమే అయినా, దేశ ప్రయోజనాల విషయానికొస్తే మాత్రం మన సిద్ధాంతాలు అందుకు వ్యతిరేకంగా ఉండకూడదన్నారు. తన ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను ఆయన విద్యార్తుల ముందు ఉంచారు. ఆత్మ నిర్భర్ భారత్ అనేది 130 కోట్ల భారతీయుల ఉమ్మడి ఆత్మసాక్షిగా మారిందని, మన ఆకాంక్షలకు చిహ్నంగా తయారైందని అన్నారు. మంచి సంస్కరణలును చెడ్ద రాజకీయాలుగా భావించే స్థాయి నుంచి మంచి రాజకీయాలుగా ఎలా మారాయో గమనించాలని కోరారు.
వివరాలకు:
ఢిల్లీ జె ఎన్ యు కాంపస్ లో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
వివరాలకు:
హోం మంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఆరు రాష్ట్రాలకు అదనపు కేంద్ర సాయంగా రూ. 4381.88 కోట్లకు ఆమోదం
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమిటీ సమావేశం జాతీయ విపత్తుల నిధికింద ఆరు రాష్ట్రాలకు కేంద్ర సాయం అందించాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో తుపానులు, వరదల బారిన పడిన రాష్ట్రాలకు ఈ సహాయం ఇస్తారు. ఆంఫన్ తుపాను నష్టానికి గాను పశ్చిమ బెంగాల్ కు రూ. 2,707.77కోట్లు, ఒడిశాకు 128.23 కోట్లు కేటాయించారు. నిసర్గ తుపాను బారిన పడిన మహారాష్ట్రకు రూ, 268.59 కోట్లు, నైరుతి రుతుపవనాల కారణంగా దెబ్బతిన్న కర్నాటకకు రూ. 577.84 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 611.61 కోట్లు, సిక్కిం కు రూ.87.84 కోట్లు ఆమోదించారు. ఇదే కాకుందా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 28 రాష్ట్రాలకు విపత్తులనిధి కింద 15,524.43 కోట్లు కూడా కేటాయించారు.
వివరాలకు:
ఆత్మ నిర్భర్ భారత్ 3.0 మీద చర్యలు ప్రకటించిన అర్థికమంత్రి
ఆర్థిక వ్యవస్థను ఉద్దీపనం చేసేలా ఆత్మ నిర్భర్ భారత్ 3.0 కింద భారత ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్ కి సంబంధించి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 12 కీలక చర్యలను ప్రకటించారు. నిన్న ప్రకటించిన మొత్తం రూ, 2.65 లక్షల కోట్లు కాగా, నిన్న మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కలసి ప్రకటించిన మొత్తం పాకేజ్ విలువ 29.87 లక్షలకోట్లకు చేరిందన్నారు. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో 15% అని అంచనా వేశారు. ఇందులో భారత ప్రభుత్వం ఇచ్చింది 9% అని, కోవిడ్ వాక్సిన్ పరిశోధన, తయారీ కోసం బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్లు ఇచ్చామని చెప్పారు.
వివరాలకు:
శాస్త్రీయ సామాజిక బాధ్యతతో సైన్సుకూ, సమాజానికీ మధ్య అనుసంధానం సాధించాలి: డిఎస్ టి కార్యదర్శి
వచ్చే కొద్ది నెలల్లోనే శాస్త్రీయ సామజిక బాధ్యత మీద ఒక విధాన రూపకల్పన పూర్తవుతుందని శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. ఇది సైన్సుకూ, సమాజానికీ మధ్య అనుసంధానం కుదుర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆయన ప్రసంగించారు. సైన్సునూ, సమాజాన్నీ అనుసంధానం చేయటం వలన శాస్త్ర సాంకేతిక రంగం బాగా బలపడి శాంతిని, అభివృద్ధిని సాధిస్తాయన్నారు. సైన్స్ నుంచి సమాచారం సమాజానికి అందటమే ఒక పెద్ద సవాలుగా ఆయన అభివర్ణించారు. సైన్స్ సమాజాన్ని చేరుకోవటం ద్వారా మాత్రమే అది సాంతికి ఉపకరణంగా పనికొస్తుంద్ని యునెస్కో, శాస్త్ర, సాంకేతిక విభాగం ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ఈ వెబినార్ లో అన్నారు.
వివరాలకు:
జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ లకు సబ్ కా విశ్వాస్ పథకం దరఖాస్తుల గడువు డిసెంబర్ 31 దాకా పొడిగింపు
కొత్తగా ఏర్పడిన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలితప్రాంతాలలో వ్యాపారం, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాతాల పన్ను చెల్లింపుదారులు సబ్ కా వికాస్ పథకాన్ని అందుకోవటానికి గడువు తేదీని 2019 నుంచి 2020 డిసెంబర్ 31 దాకా పొడిగించింది. ఈ పథకం అసలు తేదీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కున్నవారికి ఈ సౌకర్యం లబ్ధి కలిగిస్తుంది. పాత పన్ను వివాదాలు పరిష్కరించుకోవటానికి ఈ కొత్త అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ పథకం వల్ల లబ్ధిపొందిన వేలాది మంది ఇతర పన్ను చెల్లింపుదారులతో సమానంగా ఇది అందుబాటులోకి వస్తుంది. త్వరలొనే మార్గదర్శకాలు విడుదల అవుతాయి.
వివరాలకు:
పిఐబి క్షేత్రస్థాయి అధికారులనుంచి అందిన సమాచారం
· అస్సాం: అస్సాం లో మొత్తం 24350 పరీక్షలు జరపగా 202 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో 0.83% పాజిటి కేసులు గుర్తించినట్టయింది. గత 24 గంటలలో 771 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం కోలుకున్నవారు 209835 నమోదు కావటంతో కోలుకున్నవారిశాతం 97.25% గా నమోదైంది. ఇంకా చికిత్సలో ఉన్నవారు 2.29%.
· మిజోరం: మిజోరంలో కొత్తగా 25 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
· నాగాలాండ్: కొత్తగా37 కేసులు రావటంతో నాగాలాండ్ లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,615 కి చేరింది. దీంతో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 786 కి తగ్గింది.
· సిక్కిం: సిక్కింలో కొత్తగా 25 కేసులు రావటంతో మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4,368 కి చేరింది..
· కేరళ: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో మరోమారు కేరళలో కోవిడ్ విజృంభించవచ్చుననే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రచార సమయంలో అభ్యర్థులు, ప్రచారకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట ఆరోగ్య శాఖామంత్రి కెకె శైలజ విజ్ఞప్తి చేశారు. రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అదుపులోనే ఉన్నప్పటికీ వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇంటింటికీ వెళ్ళే ఒక్కో అభ్యర్థి వెంట ఐదుగురు మించి ఉండకూడదని, కరచాలనం చెయ్యవద్దని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. గత 24 గంటలలో పాజిటివ్ గా నమోదైన వారిశాతం 10% తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 77,183 కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించినవారు 1797 మంది..
· తమిళనాడు: రూ. 24 కోట్ల విలువచేసే పరికరాలతో కూడిన అంబులెన్సులను ముఖ్యమంత్రి ఏళపాడి పళనిస్వామి జెండా ఊపి ప్రారంభించారు. సచివాలయం దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆయన 108 అంబులెన్సులను ప్రారంభించారు.
· కర్నాటక: రేయింబవళ్ళు పనిచేసేలా సరికొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రపంచ బాంకు సాయంతో ఏర్పాటు చేస్తున్నట్టు విద్య, వైద్యశాఖామంత్రి డాక్టర్ కె సుధాకర్ ప్రకటించారు. ఈ పథకం అమలుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేపడతామన్నారు. దీపావళి సందర్భంగా బాణ సంచా కాల్చుకోవటానికి కర్నాటక హైకోర్టు అనుమతించింది. అదే విధంగా డిసెంబర్ 1 నుంచి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని వైద్య, ఆయుష్, దంత వైద్య, పారామెడికల్ నర్సింగ్, ఫార్మసీ కాలేజీలను పునః ప్రారంభించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.
· ఆంధ్రప్రదేశ్: ఆమోదం పొందిన ప్రైవేట్ లాబ్ లలో వసూలు చేయాల్సిన కోవిడ్ పరీక్షల రుసుమును ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వం పంపిన శాంపిల్స్ ను రూ. 800 కే పరీక్షించాలని నిర్దేశించింది. ఇలా ఉండగా, గురువారం నాడు 1728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతీ ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705 కి చేరింది. చికిత్స అనంతరం 8,22,011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా 8 9,40,488 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం 20,857 మంది చికిత్సలో ఉన్నారు. నిన్న 9 మంది చనిపోవటంతో మృతుల సంఖ్య 6837 కి పెరిగింది.
· తెలంగాణ: గత 24 గంటలలో కొత్తకేసులు 997, కోలుకున్నవారు 1222 మంది, మరణాలు 4 నమొదయ్యాయి. అందులో జి హెచ్ ఎం సి పరిధిలో 169 కొత్త కేసులు రాగా మొత్తం కేసులు 2,55,663 కి చేరాయి. చికిత్సలో ఉన్నవారు: 17,094మంది; మరణాలు 1397; కోలుకున్నవారు 2,37,172మంది.
· మహారాష్ట్ర : టీచర్లు, విద్యార్థులు లోకల్ రైళ్లలో ప్రయాణించటానికి అవకాశం కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. బోధన, బోధనేతర సిబ్బందికి కనీసం 50% హాజరు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసింది. కోవిడ్ కేసులు పెరగకపోతే దీపావళి తరువాత పక్షం రోజుల్లో లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. రోజువారీ కోవిడ్ కేసులను రెండు వారాలపాటు జాగ్రత్తగా గమనిస్తామని బృహన్ ముంబయ్ నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించారు. ఆ తరువాతే లోకల్ రైళ్ళమీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
- గుజరాత్: గత 24 గంటలలో గుజరాత్ లో 1,120 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోలుకున్నవారిశాతం మెరుగుపడి 91.29 శాతానికి చేరింది. ప్రజలు అనవసరంగా ఉచిత కరోనాపరీక్షలకు వెళ్ళవద్దని అహ్మద్వాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. చాలామంది క్యూలు కడుతూ ఉన్నట్టు గమనించి, లక్షణాలు కనబడినవారు మాత్రమే వెళ్లాలని సూచించింది. . ఎలక్షన్ స్లో ఉపయోగించే ఇంక్ మార్క్ పెట్టటం ద్వారా పదే పదే పరీక్షలకు రాకుండా చూస్తోంది.
- రాజస్థాన్ : గురువారం నాడు రాజస్థాన్ లో మరో 13 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 2,032 కి చేరాయి. కొత్త కేసులు 2,176 నమోదు కావటంతో మొత్తం కోవిడ్ కేసులు 2,19,327 కి చేరాయి.. ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం 17,352 మంది ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నారు. ఇప్పటివరకూ 1,99,943 మంది కోలుకున్నారు. జైపూర్ లో కోవిడ్ మరణాలు 391 కి చేరుకోగా జోధ్ పూర్ లో 199, అజ్మీర్ లో 151, బికనీర్ లో 149, కోటలో 116, భరత్ పూర్ లో 97, పాలి లో78 నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులలో జైపూర్ లో 475, జోధ్ పూర్ లో 366, బికనీర్ లో 258, అజ్మీర్ లో131 ఆల్వార్ లో, 95 కోట లో 71 ఉన్నాయి. ,
- మధ్యప్రదేశ్: కోవిడ్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని పవిత్ర స్థలం చిత్రకూట్ లో ఐదు రోజుల దీపావళి వేడుకలు నిరుత్సాహపూరిత వాతావరణంలో గురువారం మొదలయ్యాయి. నదీ స్నానానికి చాలా తక్కువమంది హాజరయ్యారు.. వేదుకల ప్రారంభ సూచికంగా దంతెరాస్ సాయంత్రం దీపాలు వెలిగించినవారు సైతం తక్కువగానే ఉన్నారు. నిరుడు ఇదే ప్రదేశంలో లక్ష్మీ పూజలో దాదాపు 35 లక్షలమంది భక్తులు పాల్గొని దీపాలు వెలిగించటం విశేషం.
- చత్తీస్ గఢ్: రాయ్ పూర్ లో 50% సీటింగ్ సామర్థ్యంతో కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల మల్టిప్లెక్స్ లు, థియేటర్లు తెరవటానికి అనుమతించారు. సినిమాలు ప్రదర్శించటానికి అనుమతించిన జిల్లాల్లో ఇటీవలే రాయ్ పూర్ కూడా చేరింది. శనివారం దీపావళి నాడు సినిమాల ప్రదర్శన మొదలవుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 1672807)
Visitor Counter : 233