ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 4.85 లక్షల లోపే

రోజువారీ కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారే అధికం

Posted On: 13 NOV 2020 12:34PM by PIB Hyderabad

భారత్ లో చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈరోజుకు 5 లక్షల స్థాయికి బాగా తగ్గి  4,84,547 కు చేరింది.లా 5 లక్షల లోపే ఉండటం వరుసగా ఇది మూడో రోజు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటి కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 5.55% మాత్రమే. కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉందటం వల్ల ఇది సాధ్యమవుతోంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001C22W.jpg

గడిచిన 24 గంటలలో కొత్తగా 44,879 కోవిడ్ పాజిటివ్ కేసులు తేలగా 49,079 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటూ వస్తోంది.  ఈ ధోరణి వరుసగా 41 రోజులుగా నమోదవుతూనే ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W776.jpg

ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 81,15,580. అంటే కోలుకున్నవారిశాతం 92.97% చేరింది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 76,31,033 కి చేరింది. గత 24 గంటలలో కొత్తగా కోలుకున్నవారిలో  77.83% మంది కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు   7,809 మంది కొలుకోగా ఆ రాష్ట్రంలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య16,05,064 కు చేరింది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DS2C.jpg

గత 24 గంటలలో కొత్తగా ధ్రువపడిన కేసులలో 76.25% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అందులో ఢిల్లీలో  అత్యధికంగా 7,053 మంది, కేరళలో  5,537 మంది, మహారాష్ట్రలో 4,496 మంది నమోదయ్యారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004U351.jpg

గత 24 గంటలలో 547 మరణాలు నమోదుకాగా అందులో 79.34% మరణాలు 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. తాజా మరణాలలో 22.3% (122) మహారాష్ట్రలో నమోదయ్యాయి. 104 మరణాలతో ఢిల్లీ, 54 మరణాలతో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055GQO.jpg

****



(Release ID: 1672606) Visitor Counter : 193