PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
11 NOV 2020 5:52PM by PIB Hyderabad

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)
*106 రోజుల తర్వాత ఇండియాలో తొలిసారిగా యాక్టివ్ కేస్‌లోడ్ 5 లక్షల మార్కుకు దిగువకు పడిపోయింది.
* మొత్తం రికవరీలు 80 లక్షలు దాటాయి
* గత 24 గంటలలో 44,281 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం 50,326 యాక్టివ్ కేసులు కోలుకున్నాయి.
*మొత్తం కోవిడ్ పరీక్షలు 12 కోట్లను దాటాయి.
*కోవిడ్ నుంచి రికవరీ రేటు 92.79 శాతానికి పెరిగింది.
*మొత్తం కేసులలో మరణాల రేటు 1.48 శాతం, ఇది మరింత తగ్గుతూ వస్తోంది.
*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ 7 రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితిని , ప్రజారోగ్య చర్యలను సమీక్షించారు.
#Unite2FightCorona
#IndiaFightsCorona


కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో పలు అంశాలలో ఇండియా మున్నెన్నడూలేని శిఖరాలను అధిరోహించింది.
యాక్టివ్ కేస్‌లోడ్ 5 లక్షల దిగువకు పడిపోయింది.
మొత్తం రికవరీలు 80 లక్షలు దాటాయి.
మొత్తం పరీక్షల సంఖ్య 12 కోట్లు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ మహమ్మారి పై పోరాటంలో ఇండియా పలు కీలక మైలురాళ్ళను దాటింది. దేశంలొ యాక్టివ్ కేస్‌లోడ్ గత 106 రోజులలో తొలిసారిగా 5 లక్షల మార్కుకు దిగువకు చేరింది. ఈరోజు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,94,657 గా ఉంది. జూలై 28న ఇది 4,96, 988 గా ఉ ంది. దీనితో యాక్టివ్ కేస్‌లోడ్ మొత్తం పాజిటివ్ కేసులలో 5.73 శాతంగా ఉంది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2,00,000 కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కేసులకు పైగా ఉ న్నాయి. రెండు రాష్ట్రాలు ( మహారాష్ట్ర, కేరళలలో) 50,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటలలో 44,281 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా 50,326 యాక్టివ్ కేసులు కోలుకున్నాయి. కొత్త కేసులను మించి కోలుకున్న వారి సంఖ్య ఉండడం వరుసగా ఇది 39 వ రోజు. ఇదే సమయంలో మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య, కోలుకున్న కేసుల సంఖ్య మధ్య తేడా కూడా పెరిగింది. మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 80 లక్షల మార్కు దాటింది. మొత్తం కోలుకున్న వారిసంఖ్య ఈరోజుకు 80,13,783 గా ఉ ంది. కోలుకున్న కేసులు, యాక్టివ్ కేసుల మధ్య అంతరం 75,19,136కు పెరిగింది. రికవరీ రేటు 92.79 శాతానికి పెరిగింది. మరో ముఖ్యమైన అంశం, ఇండియాలో కోవిడ్ పరీక్షల సంఖ్య 12 కోట్లు దాటింది. గత 24 గంటలలో 11,53,294 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా నమోదౌతున్న కేసుల సంఖ్య 50,000 కంటే తక్కువగా ఉన్నాయి. 77 శాతం కొత్త కేసులు పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో ఒకరోజులో కోలుకున్న వారి సంఖ్య గరిష్ఠంగా 6,718 గా ఉంది. కేరళలో 6,698 కేసులు కోలుకున్నాయి. ఢిల్లీలో 6,513 కోలుకున్న కేసులు ఉన్నాయి. కోవిడ్ కేసులలో అగ్రభాగాన ఉన్న 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 78 శాతం కొత్త కేసులు నమోదు చేశాయి. ఢిల్లీలో గరిష్ఠంగా 7,830 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం 6,010 కేసులతో కేరళదిగా చెప్పుకోవచ్చు. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలు కోవిడ్ మరణాలలో 79 శాతం కలిగి ఉన్నాయి. గత 24 గంటలలో 512 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాల రేటు 1.48గా ఉంది. ఇది మరింత తగ్గుతూ వస్తోంది.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671870
కోవిడ్ పరిస్థితులు, ప్రజారోగ్య చర్యలపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యమంత్రులు, రాష్ట్రస్థాయి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు 7 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అడిషనల్ ఛీఫ్ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి , ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖను కూడా చూస్తున్న శ్రీ టి.ఎస్.రావత్, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరేన్ సింగ్, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ రాజేష్ తోపే, మిజొరం ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆర్. లాల్‌తంగ్లియానా, గోవా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణే, త్రిపుర పాఠశాల విద్య, ఉన్నత విద్య, న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్ ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్రాలలో ఆందోళన కలిగిస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయన , ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిందిగా కోరారు. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పెద్ద సంఖ్యలో యాక్టివ్ కేస్‌లోడ్ కనిపిస్తున్నదని, ఎక్కువ మరణాల రేటు 2.6 శాతం ఉందన్నారు. ఇది ముంబాయి పరిసరాలలో 3.5 శాతం వరకు ఉంటుందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో సిఎఫ్ ఆర్ జాతీయ సగటు కంటే ఎ క్కువగా 1.64 శాతం వద్ద ఉందన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో మణిపూర్‌లో పెరుగుతూ వస్తున్నాయన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడమంటే అంతర్గతంగా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనడానికి సూచన అన్నారు. మొత్తం మరణాలలో 40 శాతం మరణాలు గోవాలో కేవలం గత నెలరోజులలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఐజ్వాల్ ,మిజోరంలలో 70 శాతం కేసులు కేంద్రీకృతమై ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. త్రిపుర, మేఘాలయలలో ఎక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. అవి ఎక్కువగా 45-60 సంవత్సరాల వయసు మధ్య వారిలో ఉన్నాయి. ఇవి నియంత్రించగలిగినవే కోవిడ్ వ్యాధి వ్యాప్తి గొలుసును అడ్డుకునేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రధాన్యతను డాక్టర్ హర్షవర్ధన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కోవిడ్ నిరోధానికి సంబంధించి ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించడం బలమైన సామాజిక వాక్సిన్ అని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671928
కోవిడ్ కు వ్యతిరేకంగా ఇండియా సాగిస్తున్న పోరాటాన్ని బ్రిక్స్ దేశాల ఆరోగ్యమంత్రులకు వివరించిన కేంద్ర మంత్రి డాక్టర్
హర్షవర్ధన్.
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈరోజు పాల్గొన్నారు. వికేంద్రీకృతం అయినా కేంద్రీకృత యంత్రాంగం సార్వత్రికంగా, అందుబాటులో చౌకధరకు ఆరోగ్య సంరక్షణను ప్రతి ఒక్కరికీ అందుబాటులో తెచ్చేందుకు కృషిచేస్తున్నామని, కోవిడ్ పై ఈ వ్యూహమే తమను నడిపిస్తున్న శక్తి అని ఆయన అన్నారు. ఇండియా కోవిడ్ -19 స్పందన వైరస్‌ను నిర్వీర్వం చేసే చర్యలతోపాటు సానుకూల, గ్రేడెడ్ విధానాన్ని అనుసరిస్తున్నదని అన్నారు. ప్రాథమిక దశలోనే పేషెంట్లను పరిశీలించి, వ్యాధిగ్రస్తులను ఐసొలేషన్‌లో ఉంచడం, లాక్‌డౌన్ విధింపు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు, ఆరోగ్యసేవలు విపరీతమైన ఒత్తిడికి గురికాకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై , ప్రజల అలవాట్లలో మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం వంటివి వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వ్యూహంగా ఉపయోగపడిందన్నారు. అలాగే ఆర్ధిక వ్యవస్థను దశల వారీగా జాగ్రత్తగా సహేతుక రీతిలో బాధ్యతాయుతంగా తిరిగి తెరవడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో గల జనాభాను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలతో కూడిన స్పందనను ఇండియా చేపట్టిందని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672087
భవిష్యత్ సన్నద్థతతో ఏర్పడుతున్న జామ్‌నగర్, జైపూర్ ఆయుర్వేద సంస్థలను 2020 నవంబర్ 13న ప్రారంభించనున్న ప్రధానమంత్రి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, జామ్‌నగర్‌లో ఆయుర్వేదలో బోధన , పరిశోధన ఇన్‌స్టిట్యూట్ (ఐటిఆర్ ఎ)ను , జైపూర్‌లో నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్.ఐ.ఎ)ను ఐదవ ఆయుర్వేద దినోత్సవమైన నవంబర్ 13న వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సంస్థలు 21 శతాబ్దంలో ఆయుర్వేద అభివృద్ధి , ప్రగతిలో అంతర్జాతీయ నాయకత్వం వహించనున్నాయి.
ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని 2016నుంచి ప్రతిఏటా ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం 2020 నవంబర్ 13 గా ఉంది. ఆయుర్వేద దినోత్సవం అంటే ఆయుర్వేదానికి, సమాజానికి పునరంకితం కావడం. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కోవిడ్ నియంత్రణలో ఆయుర్వేదం పాత్ర అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ముఖ్యాంశంగా ఉంది.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671918
భారతదేశ తయారీరంగ సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు , ఎగుమతులను పెంచేందుకు ఆత్మనిర్భర్‌లో భాగంగా 10 కీలక కంగాలకు పిఎల్ఐ పథకాన్ని వర్తింప చేస్తూ కేబినెట్ నిర్ణయం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాన్ని , దేశంలో తయారీ రంగ సామర్ధ్యాన్ని , ఎగుమతులను పెంచేందుకు -ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 10 కీలక రంగాలకు వర్తింపచేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ఈ రంగాలు, అడ్వాన్స్ కెమిస్ట్రీ, సెల్ (ఎసిసి) బ్యాటరీ (నీతి ఆయోగ్ , డిపార్టమెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్), ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రాడక్టులు ( మినిస్ట్రీ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఆటోమొబైల్స్, ఆటో కాంపొనెంట్స్, (డిపార్టమెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్), ఫార్మాసూటికల్స్ డ్రగ్స్ ( డిపార్టెమంట్ ఆప్ ఫార్మాసూటికల్స్్) , టెలికం, నెట్ వర్కింగ్ ప్రాడక్టులు (డిపార్టమెంట్ ఆఫ్ టెలికం), టెక్స్‌టైల్ ప్రాడక్ట్‌లు, ఎం.ఎం.ఎఫ్ సెగ్మెంట్, టెక్నికల్ టటెక్స్‌టైల్స్ (మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్), ఫుడ్ ప్రాడక్ట్స్(మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్), అత్యున్నత సామర్ధ్యంగల సైర పివి మాడ్యూళ్లు( మినిస్ట్రీ ఆఫ్ న్యూ , రెన్యువబుల్ ఎనర్జీ), వైట్ గూడ్స్ ( ఎసిలు, ఎల్.ఇ.డి), (డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ , ఇంటర్నల్ ట్రేడ్), స్పెషాలిటీ స్టీల్ (మినిస్ట్రీ ఆఫ్ స్టీల్) ఉన్నాయి.
మరిన్ని వివరాలకు https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672092
మౌలికసదుపాయాల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం భాగస్వామ్యం విషయంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యానికి ఆర్ధిక మద్దతు అందించే పథకం కొనసాగింపు, పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ, 2024-25 వరకు మౌలిక సదుపాయాల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్)కి సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపిలకు) ఆర్ధిక మద్దతు నిచ్చే పథకం పునరుద్ధరణ, కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. దీని మొత్తం కేటాయింపు రూ 8,100 కోట్ల రూపాయలు. ప్రతిపాదిత ఈ పథకం పునరుద్ధరణ మరిన్ని పిపిపి ప్రాజెక్టులను , ఆకర్షిస్తుంది. అలాగే సామాజిక రంగాలైన ఆరోగ్యం, విద్య, వ్యర్ధ జలాలు, ఘనవ్యర్ధాల నిర్వహణ, మంచినీటి సరఫరా వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు వీలు కల్పించనుంది.
కొత్త ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు వీలు కల్పించనుంది.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671985
దేశాధిపతుల ఎస్.సి.ఒ కౌన్సిల్ 20 వ శిఖరాగ్ర సమ్మేళనం
దేశాధిపతుల ఎస్.సి.ఓ కౌన్సిల్ 20 వ సమావేశం 2020 నవంబర్ 10న జరిగింది.. ఎస్.సి.ఒ సమ్మేళనాలలో ఇది మూడవది కాగా, వర్చువల్ విధానంలో జరిగిన తొలి సమావేశంగా ఈ ఏడాదిని చెప్పుకోవచ్చు. 2017లో ఇండియా ఇందులో పూరత్ఇ స్థాయి సభ్యత్వం పొందిన తర్వాత పాల్గొన్న సమావేశంఇది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎస్.సి.ఒ నాయకుల నుద్దేశించి ప్రసంగిస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఈ సమావేశౄన్ని ఏర్పాటు చేయడం పట్ల రష్టయా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన అభినందించారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్థితులలో ప్రపంచం ఎదుర్కొనే ఆర్థిక ,సామాజిక పరిస్థితుల అంచనాలను అందుకునేందుకు సంస్కరించిన బహుళపక్ష విధానాలను అనుసరించడం అత్యావశ్యకమని అన్నారు. ఇండియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా 2021 జనవరి నుంచి ఉంటుందని,దీనితో అంతర్జాతీయ పాలనలో ఆవశ్యక మార్పులు తెచ్చేందుకు సంస్కరింపబడిన బహుళపక్ష విధానంపై దృష్టిపెడుతుందని అన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, సుసంపన్నత కు పూచీపడుతూ, ఉగ్రవాదానికి ,,అక్రమ ఆయుధాల సరఫరాకు, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఇండియా బలంగా తన వాణి వినిపిస్తుందన్నారు. భారతదేశపు అసమాన ధైర్యసాహసాలు కలిగిన సైనికులు, 50 ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక మిషన్‌లలో పాల్గొన్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. భారతదేశ ఫార్మా పరిశ్రమ కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యావశ్యక మందులను 150 కిపైగా దేశాలకు సరఫరా చేసిందని అన్నారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671855
కోవిడ్ మహమ్మారి సమయంలో అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు సిఎల్ సి, ఇపిఎఫ్.ఒ, ఇఎస్ఐసి కి చెందిన ప్రాంతీయకార్యాలయాలు , అధికారులను అభినందించిన కేంద్ర మంత్రి శ్రీ గంగ్వార్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్‌ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయిస్ స్టేట్ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఛీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఆఫీసు కోవిడ్ -19 సమయంలో చేపట్టిన కృషిని అభినందించి,గౌరవించేందుకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ అభినందన కార్యక్రమాన్ని ఏ ర్పాటు చేసింది. ఈ సంస్థలకు చెందిన అధికారులు, ప్రాంతీయకార్యాలయాలు అంకితభావంతో ఉన్నత స్థాయి వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేసినందుకు కేంద్ర సహాయ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ అభినందనలు తెలియజేసే సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్మికులు, పరిశ్రమ అభ్యున్నతికి కార్మిక మంత్రిత్వశాఖ చరిత్రాత్మక చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. 2 కోట్లమంది భవన నిర్మాణ కార్మికుల బ్యాంకు ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్టు మంత్రి చెప్పారు. సిఎల్‌సి (సి) దీనిని సజావుగా అమలు చేసేందుకు 80 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు ఆయన వివరించారు. ఇఎస్ఐసి, ఇపిఎఫ్ఒ ల నోడల్ అధికారులు, ఇతర ప్రాంతీయ కార్యాలయాలు , కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాత్రింబగళ్లు పనిచేస్తున్నాయని అన్నారు. 20 కంట్రోల్ రూముల ద్వారా 16 వేలఫిర్యాదులు అందుకోవడం జరిగిందని, వీటిలో 96 శాతం ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలోగా సిఎల్‌సిలు, ఇపిఎఫ్ ఒ, ఇఎస్ఐసిలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. 23 ఇఎస్ఐసి ఆస్పత్రులు కోవిడ్ 19 ఆస్పత్రులుగా మార్చడం జరిగిందని, వీటిలో 2,600 ఐసొలేషన్ బెడ్లు ఉన్నాయన్నారు. 555 కుపైగా ఐసియు బెడ్లు, 213 కు పైగా వెంటిలేటర్లు ఉన్నాయన్నారు.స్పెషల్ కోవిడ్ క్లెయిమ్‌ల కింద 12,000 కోట్ల రూపాయలను 47 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు చేసుకున్న క్లెయిమ్‌ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671989
పెన్షనర్లు జీవితంలో ఆత్మనిర్భర్ గా ఉండేందుకు సహాయపడుతున్న ప్రభుత్వం : డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జి), ప్రధానమంత్రి కార్యాలయం , సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధ నాయకత్వంలో డిపార్టమెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ , పెన్షనర్లు ఆత్మనిర్భర్‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పెన్షనర్లు ఇంటి నుంచి కూడా తమ లైప్ సర్టిఫికేట్‌ను సమర్పించే సదుపాయాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆత్మనిర్భర్ కల్పిస్తున్నదని అన్నారు. ఇంతకు ముందు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఇబ్బందులు ఎదుర్కొనే వారని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించిందని అన్నారు. అలాగే 2020 నవంబర్ 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువును పొడిగించిందని అన్నారు. బ్రహ్మకుమారి సిస్టర్ శివాని, కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆలోచనలు , ధ్యానం శక్తి గురించి నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన నిన్న పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇబ్బందికర స్థితిలో ఉన్న వారు వృద్ధులని వారికి సహాయం అందించాల్సి ఉందన్నారు. వారికి వైద్యపరమైన రక్షణ అందించడంతోపాటు తోడ్పాటు అవసరమన్నారు. ఇలాంటి ధ్యాన కార్యక్రమాలు వారికి మానసిక ప్రశాంతతను సమకూర్చడంతోపాటు వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని అన్నారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671805
భారతీయ రైల్వేదాని ఆరోగ్యసదుపాయాలలో హెచ్.ఎం.ఐ.ఎస్ అమలు రెయిల్‌టెల్ కు అప్పగింత
ఆస్పత్రి నిర్వహణను ఒకే గొడుగుకిందికి తెచ్చి, వృధాను అరికట్టేందుకు, కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించేందుకు వీలుగా ఆస్పత్రి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్.ఎం.ఐ.ఎస్)ను అమలుచేసే బాధ్యతను భారతీయ రైల్వే, రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (రెయిల్‌టెల్)కు అప్పగించింది. ఇది సమీకృత క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం. దేశవ్యాప్తంగా గల 125 ఆరోగ్యసదుపాయాలు, 650 పాలి క్లినిక్‌లకుమెరుగైన ఆస్పత్రి పాలనను , పేషెంట్ హెల్త్‌కేర్‌ను అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఆయా విభాగాల ప్రత్యేక అవసరాలకు అనువైనదిగా ఉంటుంది. దీఇన ద్వారా పేషెంట్లు తమకు సంబంధించిన అన్ని మెడికల్‌రికార్డులను మొబైల్‌లో పొందవచ్చు. ఇందుకు సంబంధించి రెయిల్ టెల్, రైల్వే మంత్రిత్వశాఖ , ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
మరిన్నివివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671762
------
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాలు అందించిన సమాచారం.
అస్సాం: అస్సాంలో 25,339 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా గత 24 గంటలలో 271 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీనితో అస్సాంలో కోవిడ్ పాజిటివ్ కేసుల రేటు 1.07 శాతంగా ఉంది.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో 3,791 కొత్త కోవిడ్ -10 కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 17.27 లక్షలు. గరిష్ఠస్థాయిలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు ఉండడంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష కంటే తగ్గాయి. అంటే 92,641కి చేరాయి. ముంబాయిలో 535 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 16,374గా ఉంది. కాగా, కోవిడ్ వాక్సినేషన్‌కు సంబంధించి ఆరోగ్య కార్యకర్తల సమాచారాన్ని సేకరించి అప్‌లోడ్ చేసేందుకు మొబైల్ యాప్ కోవిన్ లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం తెలిపింది.తొలిబ్యాచ్ కోవిడ్ వాక్సిన్ ను డాక్టర్లు, నర్సులు, స్వాబ్ శాంపిల్ సేకరించేవారితోపాటు పోలీసు వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వేయనున్నారు. సోమవారంనాడు,కేంద్రం ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కోవిన్ యాప్ తుది దశ కోడింగ్‌లో ఉందని, దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారని తెలిపింది.
గుజరాత్ : గుజరాత్‌లో రాష్ట్రప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలను నవంబర్ 23 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపాని అధ్యక్షతన గాంధీనగర్‌లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 9, 10 తరగతులు, మెడికల్, పారామెడికల్, ఇంజనీరింగ్, ఇతర ఫైనల్ ఇయర్ విద్యార్ధుల తరగతులను తొలి దశలో తిరిగి ప్రారంభించడానికి అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయని , స్టేక్ హోల్డర్లతో సవివరమైన చర్చలు జరిపామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సింఘ్ చుడాసమ తెలిపారు.
రాజస్థాన్ : రాజస్థాన్ లో కొత్తగా 1902 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10 మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 2008కి చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య విభాగం విడుదల చేసిన బులిటన్ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం రాష్ట్రంలో 16,725 గా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో గురువారం నాడు 900 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,79,068 కి చేరింది. 8 మంది మరణించడంతో మరణించిన వారి సంఖ్య 3,042కు చేరింది. కొత్త కేసులలో, భోపాల్‌లో 208, ఇండోర్ లో 117, గ్వాలియర్‌లో 77, జబల్‌పూర్‌లో 41 కేసులు ఉన్నాయి. భోపాల్‌లో ప్రస్తుతం 1761 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండోర్‌లో ఇవి 117, గ్వాలియర్‌లో 77, జబల్‌పూర్ 41 కేసులు ఉన్నాయి. భోపాల్‌లో ప్రస్తుతం 1761 కొత్త కేసులు ఉన్నాయి. ఇండోర్‌లో ఇవి 1707గా ఉన్నాయి. జబల్‌పూర్.గ్వాలియర్‌లలో వరుసగా 515, 543 కేసులు ఉన్నాయి.
చత్తీస్‌ఘడ్ : చత్తీస్‌ఘడ్ లో కొత్తగా 1679 కేసులు నమోదు కావడంతొ కోవిడ్ కేసులు మంగళవారం నాడు 2,04,202కు చేరాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,80,995 కు చేరింది. మరో 18 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,482 కు చేరింది.
77, జబల్‌పూర్‌లో 41 కేసులు ఉన్నాయి. భోపాల్‌లో ప్రస్తుతం 1761 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండోర్‌లో ఇవి 117, గ్వాలియర్‌లో 77, జబల్‌పూర్ 41 కేసులు ఉన్నాయి. భోపాల్‌లో ప్రస్తుతం 1761 కొత్త కేసులు ఉన్నాయి. ఇండోర్‌లో ఇవి 1707గా ఉన్నాయి. జబల్‌పూర్.గ్వాలియర్‌లలో వరుసగా 515, 543 కేసులు ఉన్నాయి.
చత్తీస్‌ఘడ్ : చత్తీస్‌ఘడ్ లో కొత్తగా 1679 కేసులు నమోదు కావడంతొ కోవిడ్ కేసులు మంగళవారం నాడు 2,04,202కు చేరాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,80,995 కు చేరింది. మరో 18 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,482 కు చేరింది.
కేరళ : కోవిడ్ -19 బారినపడి క్వారంటైన్ లో ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేరళ పంచాయతిరాజ్ చట్టాన్ని , కేరళ మునిసిపాలిటీల చట్టాన్ని సవరించేందుకు కేరళ కేబినెట్ ఈరోజు రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ సవరణ ప్రకారం ఇలాంటి ఓటర్లకు పోలింగ్ ముగియడానికి ముందు చివరి ఒక గంట సమయంల అంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వీరికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తారు. కాగా కళాశాలలు తిరిగి తెరవడానికి సంబంధించి ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి చేసిన సిఫార్సులపై రాష్ట్రప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.కోవిడ్ నిపుణుల కమిటీ , రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కళాశాలలను తిరిగి ప్రారంభించనున్నారు.
తమిళనాడు : తమిళనాడులోని వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహ సందర్శనకు పర్యాటకులను తిరిగి అనుమతించనున్నారు. అయితే కేరళలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో కన్యాకుమారి జిల్లా సరిహద్దులలో గల పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే కోవిడ్ బాధిత పేషెంట్లను నిరంతరం జాగ్రత్తగా గమనిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తెలిపారు. కాగా బిజెపి వారి వెట్రివెల్ యాత్ర అనుమతి లేకుండా ఎలా సాగుతున్నదని అంటూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేవారందరిపైనా చర్యలు తీసుకోవలసిందిగా పోలీసుశాఖను ఆదేశించింది. దాదాపు 8నెలల తర్వాత మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాథియేటర్లు తలుపులు తెరుచుకున్నాయి. అయితే నిన్న తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు.
కర్ణాటక : కర్ణాటకలో లాక్‌డౌన్ సమయంలో ఆహార భద్రతా చట్టం కింద విద్యార్ధులకు ఆహారం సరఫరా చేయడంలేదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుముందు అంగీకరించింది. రాష్ట్రంలోని స్టేక్‌హొల్డర్లతో చర్చించిన అనంతరం పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ విభాగం కమిషనర్
పాఠశాలలను డిసెంబర్ 1 నుంచి తిరిగి తెరిచేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అంచనా వేసేందుకు తిరిగి మరొ రెండు రౌండ్ల సీరో సర్వే నిర్వహించాలని అందులో ఒకటి డిసెంబర్‌లో మరొకటి మార్చిలో నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ : ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరమైన (పిపిఇ)ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి ఉపయోగించడానికి వీలైన ఎన్-95 మాస్కులతో సమానమైన మాస్కుల తయారీకి అమర రాజా గ్రూప్‌తో ఐఐటి తిరుపతి భాగస్వామ్యం వహించేందుకు ముందుకు వచ్చింది.
కృష్ణా జిల్లాలో కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు ఆరోగ్య సిబ్బంది ప్రతి మండలంలో రోజుకు 200 నమూనాలను పరీక్షించాల్సిందిగా అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాగా ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. దొనకొండ జోన్‌లోని జెడ్.పి.హైస్కూలులో 9 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విద్యార్ధులు హోం ఐసొలేషన్ లో ఉన్నారు.
తెలంగాణ : తెలంగాణాలో గత 24 గంటలలో 1196 కొత్త కేసులు నమోదయ్యాయి. 1745 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ఐదుగురు మరణించారు. జిహెచ్ఎంసిలో 192 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,53,651, యాక్టివ్ కేసుల సంఖ్య 18,027, మరణాల సంఖ్య 1390. ఆస్పత్రి నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2, 34,234.
FACT CHECK


*******
(Release ID: 1672121)
Visitor Counter : 248