సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పెన్షనర్లకు అండగా కేంద్రం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

పెన్షనర్లకు ' కోవిడ్ సమయంలో ఆత్మవిశ్వాసం మరియు ధ్యానం ' సదస్సులో పాల్గొన్న మంత్రి

Posted On: 10 NOV 2020 5:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా జీవించడానికి చర్యలను తీసుకొంటున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృధి, ప్రధానమంత్రి కార్యాలయ పెన్షన్లు, ప్రజల సమస్యల శాఖ సహాయ ( స్వతంత్ర)  మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పెన్షనర్లు సమస్యలు లేకుండా జీవించడానికి పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. పెన్షనర్లు 'ఆత్మనిర్భర్' జీవితాన్ని గడపడానికి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీనిని పెన్షన్ కోసం పెన్షనర్లు తమ గృహాల నుంచి అందించవచ్చునని ఆయన వివరించారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల పెన్షనర్లు ఈ సర్టిఫికెట్ విషయంలో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని మంత్రి తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించడానికి గడువును నవంబర్ 31వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించామని మంత్రి వివరించారు. 'కోవిడ్-19 సమయంలో ఆలోచనా శక్తి, ధ్యానంల శక్తి' అనే అంశంపై బ్రహ్మకుమారి సంస్థ సిస్టర్ శివాని ఆధ్వర్యంలో పెన్షనర్ల కోసం ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సీనియర్ పౌరులుగా గుర్తింపు పొందిన పెన్షనర్లు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని మంత్రి అన్నారు. దీనిని గుర్తించిన కేంద్రం వీరికి అండగా నిలవాలని నిర్ణయించి ఈ దిశలో చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. వీరి సమస్యలను తెలుసుకుంటూ అవసరమైన వైద్య సదుపాయాలను అందిస్తూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేలా చూడవలసి ఉంటుందని మంత్రి అన్నారు. సీనియర్ పౌరులుగా పెన్షనర్లు తమ అనుభవాల ద్వారా సమాజంలో మార్పు తీసుకొని వచ్చే అంశంలో కీలకపాత్ర పోషించవచ్చునని మంత్రి పేర్కొన్నారు. ఉన్నదానితో సంతృప్తి పొందుతూ మానసికంకా దృఢంగా ఉండ గలిగేతే శారీరక దృఢత్వం కలుగుతుందని మన పూర్వీకులు చెప్పారని ఆయన అన్నారు. ఈ తత్వం వ్యాధినిరోధిక శక్తిని పెంపొందిస్తుంది మంత్రి వివరించారు. సానుకూల ఆలోచనలు ఒక మనిషి జీవితం సాఫీగా సాగేలా ఉపకరిస్తాయన్న బ్రహ్మకుమారీల సిద్ధాంతంతో మంత్రి పూర్తిగా ఏకీభవించారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రజల జీవనసరళిలో సమూల మార్పులు రావలసి ఉందని మంత్రి అన్నారు. ప్రతికూల ఆలోచనలకు ప్రతి ఒక్కరూ స్వస్తి చెప్పాలని మంత్రి కోరారు. భారతదేశంలో ప్రజలు ఎక్కువకాలం జీవిస్తున్నారని అయితే జీవితాన్ని సంవత్సరాలకు జోడించాలి గాని సంవత్సరాలను జీవితానికి జోడించరాదని మంత్రి అన్నారు.

 

కోవిడ్-19 సమయంలో సానుకూల ఆలోచనలతో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నించాలని సిస్టర్ శివాని పిలుపు ఇచ్చారు. తమకు తాము శక్తిని పొందుతూ దివ్వెలా ఇతరులకు వెలుగు ఇవ్వాలని ఆమె అన్నారు. సంస్కారవంత జీవనం వల్ల తమ ఆలోచనలతోపాటూ కుటుంబసభ్యుల ఆలోచనలను మాత్రమే కాకుండా ఇతరుల ఆలోచనాదృక్పథంలో మార్పులు తీసుకునిరావచ్చునని ఆమె అన్నారు. పెన్షనర్లు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటారని ఆమె అన్నారు.

పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ క్షత్రపతి శివాజీ, సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవనరైన్ మాథుర్ ఇతర సీనియర్ అధికారులు, పెన్షనర్ల సంఘాల కార్యవర్గసభ్యులు కార్యక్రమానికి ఆన్ లైన్ లో హాజరయ్యారు.

కోవిడ్ సమయంలో పెన్షనర్లను మానసికంగా దృఢంగా ఉంచాలన్న లక్ష్యంతో పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పెన్షనర్ల సంఘాల సహకారంతో పెన్షనర్ల కోసం యోగాతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించే పలు కార్యక్రమాలను నిర్వహించారు.

***

 

 

 



(Release ID: 1671805) Visitor Counter : 227