ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నియంత్రణలో అనేక శిఖరాలు అధిరోహించిన భారత్

5 లక్షలకు దిగువన చికిత్సలో ఉన్న కేసులు

80 లక్షలకు పైగా కోలుకున్నవారు, మొత్తం పరీక్షలు 12 కోట్లు

Posted On: 11 NOV 2020 11:58AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారిని అదుపుచేయటంలో భారత్ అనేక కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇంకా చికిత్స పొమ్దుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 5 లక్షలకంటే దిగువకు వచ్చింది. 106 రోజుల తరువాత మొదటి సారిగా ఈ స్థాయికి తగ్గింది. ప్రస్తుతం చికిత్స బాధ్యత 4.94,657 మందికి పరిమితమైంది. గత జులౌ 28న బాధితుల సంఖ్య 4.96.988 గా నమోదైంది. ఆ విధంగా మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్స పొందుతున్నవారి వాటా 5.73 శాతానికి తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతున్న ధోరణికి కూడా ఇది అద్దం పట్టింది. అనేక దేశాలలో కొత్తగా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో భారత్ లో సంఖ్యకు ప్రాధాన్యం లభించింది.

కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహం, అంకితభావంతో అమలు చేసిన విధానం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన సహకారం, డాక్టర్లతో సహా కోవిడ్ పోరాట యోధుల నిస్వార్థ సేవలు ఈ అద్భుతమైన ఫలితాల సాధనకు దోహదం చేశాయి. ఈరోజు 27 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో సగటున 20 వేల లోపే కోవిడ్ బాధితులు చికిత్సలో ఉన్నారు.

 

కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే 20,000 కు పైగా కోవిడ్ కేసులు ఉన్నాయి. అందులో కేరళ, మహారాష్ట్రలలో మాత్రమే ఒక్కో రాష్ట్రంలో 50 వేలకు పైగా కేసులు చికిత్సపొందుతూ ఉన్నాయి.  

గడిచిన 24 గంటలలో 44,281 కొత్త కోవిడ్ కేసులు నిర్థారణ అయ్యాయి.  మరోవైపు 50,326 మంది కోలుకొని బైటపడ్దారు.  ఇలా కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం ఇది వరుసగా 39వ రోజు.  కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికీ మధ్య సంఖ్యా పరంగా అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 80 లక్షలు పైబడి 80,13,783కు చేరింది.  దీంతో కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య అంతరం పెరిగి 75,19,126 కు చేరింది. కొలుకున్నవారి శాతం 92.79% అయింది.

 

మొత్తం వ్యాధి నిర్థారణ పరీక్షలు 12 కోట్లకు చేరాయి. గత 24 గంటలలో 11,53,294 శాంపిల్స్ పరీక్షించారు. ఈ విధంగా పరీక్షల మౌలిక సదుపాయాలు పెరిగి పరీక్షల సంఖ్య పెంచటం వలన రోజువారీ కేసులు తక్కువగా వస్తున్నాయి.  

పెద్ద సంఖ్యలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం వల్ల ఆరంభంలోనే బాధితులను గుర్తించటం సాధ్యమవుతోంది. దానివల్ల వ్యాధిని సులభంగా నియంత్రించగలుగుతున్నారు. రోజూ వస్తున్న కొత్త కేసుల సంఖ్య 50 వేలకు లోపే ఉంటున్నది.

కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కావటం గమనార్హం. మహారాష్ట్రలో ఒకే రోజు 6,718 మంది కోలుకోగా ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 6,698 మంది, ఢిల్లీలో  6,157 మంది కోలుకున్నారు.

 

కొత్తగా వస్తున్న కేసులలో 78% కేవలం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఢిల్లీ లో అత్యధికంగా 7830 కోవిడ్ పాజిటివ్ కేసులు తాజాగా నమోదు కాగా కేరళలో 6020 కేసులు వచ్చాయి.

 

కోవిడ్ మరణాలలో 79% కేవలం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలొనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 512 మంది చనిపోయారు. దీంతో మరణాల శాతం ప్రస్తుతం 1.48% గా నమోదై క్రమంగా తగ్గుతోంది. మహారాష్ట్రలొ అత్యధికంగా 110 మంది మరణించగా 83 మరణాలతో ఢిల్లీ, 53 మరణాలతో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  

***

 


(Release ID: 1671870) Visitor Counter : 192