ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) స్కీము లో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఆర్థిక మద్దతు కోసం ఉద్దేశించిన పథకాన్ని పునర్ వ్యవస్థీకరించడానికి, ఆ పథకాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
11 NOV 2020 3:51PM by PIB Hyderabad
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పథకం లో భాగంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాలు (పిపిటి స్) కు ఆర్థికంగా మద్ధతు ఇవ్వడానికి ఉద్దేశించిన కంటిన్యుయేషన్ అండ్ రీవాంపింగ్ స్కీము ను 8,100 కోట్ల రూపాయల ఖర్చు తో 2024-25 వ ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) సమావేశం ఆమోదం తెలిపింది.
పునర్ వ్యవస్థీకరించిన ఈ పథకం సామాజిక, మౌలిక సదుపాయాల కల్పన లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడానికి రెండు ఉప పథకాలను ప్రారంభించడమైంది.
ఎ. ఉప పథకం-1
ఇది వ్యర్థ జలాల శుద్ధి, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం, విద్య మొదలైన సామాజిక రంగాల అవసరాలను తీరుస్తుంది. ఈ కోవకు చెందిన ప్రాజెక్టులలో మూలధన వ్యయాలను పూర్తిగా సమకూర్చుకోవడంలో బ్యాంకు సంబంధ సామర్థ్యం రాబడి ప్రవాహాలు లోపించడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ శ్రేణి లో యోగ్య ప్రాజెక్టులు కనీసం 100 శాతం నిర్వహణ ఖర్చులను తిరిగి రాబట్టుకోవలసి ఉంటుంది. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం (టిపిసి) లో గరిష్ఠంగా 30 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం విజిఎఫ్ రూపం లో సమకూర్చుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం లో 30 శాతం వరకు అదనపు మద్ధతు ను రాష్ట్ర ప్రభుత్వం/ఈ ప్రాజెక్టు ను స్పాన్సర్ చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ/చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ సమకూర్చేందుకు వీలు ఉంది.
బి. ఉప పథకం-2
ఈ ఉప పథకం డెమన్ స్ట్రేశన్/ పైలట్ సోశల్ సెక్టర్ ప్రాజెక్టులకు మద్దతిస్తుంది. ఈ ప్రాజెక్టులు ఆరోగ్యం, విద్య రంగాలకు చెందినవి అయి ఉండవచ్చు. వీటిలో కనీసం 50 శాతం నిర్వహణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు అవకాశం ఉంది. ఆ తరహా ప్రాజెక్టులలో మొదటి అయిదు సంవత్సరాల కాలానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి మూలధన వ్యయం లో 80 శాతం వరకు, అలాగే కార్యకలాపాలు, నిర్వహణ (ఒ & ఎమ్) వ్యయాలలో 50 శాతం వరకు అందిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు లో మొత్తం ప్రాజెక్టు వ్యయం (టిపిసి) లో గరిష్ఠంగా 40 శాతం వాటాను సమకూర్చుతుంది. దీనికి అదనంగా, మొదటి అయిదు సంవత్సరాలలో వాణిజ్య సరళి కార్యకలాపాల కోసం ప్రాజెక్టు కు గరిష్ఠంగా 25 శాతం నిర్వహణ వ్యయాన్ని కూడా సమకూర్చేందుకు వీలు ఉంది.
ఈ పథకాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి 64 ప్రాజెక్టులకు ‘తుది ఆమోదాన్ని’ ఇవ్వడం జరిగింది. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం 34,228 కోట్ల రూపాయలుగాను, విజిఎఫ్ 5,639 కోట్ల రూపాయలు గాను ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 4,375 కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాశి ని పంపిణీ చేయడం జరిగింది.
ప్రయోజనాలు:
ఈ పథకం ఉద్దేశ్యాలలో సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన లో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడమూ, దీని ద్వారా మెరుగైన ఆస్తుల ఏర్పాటుకు , కార్యకలాపాలు- నిర్వహణ కు పూచీపడడమూ, ఆర్థికంగా, సామాజికంగా అవసరమైన ప్రాజెక్టులను వాణిజ్యం పరంగా ఆచరణ సాధ్యమైనవిగా తీర్చిదిద్దడమూను. ఈ పథకం దేశం లో ప్రజలకు ఎంతో ప్రయోజన కారి కాగలదు. ఎందుకంటే ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి లో సాయపడుతుంది.
అమలుకు సంబంధించిన వ్యూహం:
కొత్త పథకాన్ని మంత్రివర్గ ఆమోదం లభించిన ఒక నెల రోజుల లోపల అమలు లోకి తీసుకు రావడం జరుగుతుంది. విజిఎఫ్ పథకానికి ప్రతిపాదించిన సవరణలను స్కీము తాలూకు మార్గదర్శక సూత్రాల లో తగిన విధంగా చేర్చడం జరుగుతుంది. ప్రభుత్వ సమర్ధన లభించే ప్రాజెక్టులను పర్యవేక్షించడంలో కొత్త రూపు ను ఇచ్చిన విజిఎఫ్ ను ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవడం జరుగుతుంది.
ప్రభావం:
ప్రతిపాదించిన విజిఎఫ్ స్కీము ను కొత్త రూపులో అమలుపరచడం వల్ల ఆరోగ్యం, విద్య, వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా మొదలైన సామాజిక రంగాలలో ప్రైవేటు పెట్టుబడి కి సౌలభ్యం ఏర్పడటంతో పాటు మరిన్ని పిపిపి ప్రాజెక్టులను ఆకర్షించడం సాధ్యపడనుంది. కొత్త ఆసుపత్రులు, పాఠశాలల ఏర్పాటు కావడం ఉపాధి పరంగా నూతన అవకాశాలు అందుబాటులోకి రాగలవు.
ఖర్చు:
ఈ కొత్త పథకానికి ఆర్థిక శాఖ నుంచి బడ్జెటు పరమైన మద్ధతును అందించడం జరుగుతుంది. ప్రతిపాదిత విజిఎఫ్ పథకానికి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు అయ్యే మొత్తం వ్యయం వివరాలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:
ఆర్థిక సంవత్సరం
|
ఆర్థిక మౌలిక సదుపాయాల రంగంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యానికి (పిపిపిస్ కు) ఆర్థిక మద్దతు కై ఉద్దేశించిన పథకం
(కోట్ల రూపాయల్లో)
|
సామాజిక రంగంతో ముడిపడిన మౌలిక సదుపాయాల కల్పనలో పిపిపి లకు ఆర్థిక మద్దతు కై ఉద్దేశించిన పథకం
(కోట్ల రూపాయల్లో)
|
2020-21
|
1,000
|
400
|
2021-22
|
1,100
|
400
|
2022-23
|
1,200
|
400
|
2023-24
|
1,300
|
400
|
2024-25
|
1,400
|
500
|
మొత్తం
|
6,000
|
2,100
|
పూర్వరంగం:
పిపిపి పద్ధతి లో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ‘‘స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు పిపిపి స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’’ (వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్)ను ఆర్థిక శాఖ లోని ఆర్థిక వ్యవహారాల విభాగం 2006 వ సంవత్సరంలో ప్రారంభించింది. ఈ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు ఆర్థిక కోణంలో చూస్తే న్యాయసమ్మతమే అయినప్పటికీ, వీటికి విస్తారమైన మూలధనం అవసరమైన కారణంగా వాణిజ్యపరంగా చూసినప్పుడు అవి విజయవంతంగా పనిచేయడానికి అనువుగా ఉండవు. పైగా వీటికి ఫలితాలు లభించే కాలం కూడా సుదీర్ఘంగా ఉంటుంది. అంతేకాదు, వీటికి వినియోగ రుసుములను వాణిజ్యపరంగా లాభదాయకమైన స్థాయిలకు పెంచే స్తోమత సైతం లోపిస్తుంది. ఇప్పుడున్న పథకం లో మొత్తం ప్రాజెక్టు వ్యయం (టిపిసి) లో 40 శాతం విజిఎఫ్ వాటా ను భారత ప్రభుత్వం (జిఒఐ) మరియు ప్రాజెక్టు ఆరంభ దశ లో (20%+20%) మూలధన గ్రాంటు రూపం లో స్పాన్సరింగ్ ఆథారిటీ తరఫు న సమకూర్చడం జరుగుతుంది.
***
(Release ID: 1671985)
Visitor Counter : 321
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam