రైల్వే మంత్రిత్వ శాఖ

వైద్య సేవల రంగంలో రైల్ టెల్ నైపుణ్య సహకారాన్ని తీసుకోనున్న రైల్వేలు

Posted On: 10 NOV 2020 4:29PM by PIB Hyderabad

దేశవ్యాపితంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, పోలీ క్లినిక్కులను అనుసంధానం చేయడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసే భాద్యతను రైల్ టెల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ ( రైల్ టెల్)కు భారత రైల్వేశాఖ అప్పగించింది. ఎలాంటి లొసుగులు, అవాంతరాలు లేకుండా వైద్యసేవలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ' హాస్పిటల్ మేనేజిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( హెచ్ ఎం ఐ ఎస్ )' పేరిట అమలు చేస్తారు. దేశంలో ఉన్న 125 ఆరోగ్య కేంద్రాలు, 650 పోలీ క్రీనిక్ లలో దీనిని అమలు చేస్తారు. ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. వివిధ వైద్య విభాగాలు, ఆస్పత్రులు, బహుళ సేవలను అందిస్తున్న ఆసుపత్రుల సమాచారాన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. దీనివల్ల వైద్య మరియు పరికరాల వివరాలు అనుసంధానం కావడమే కాకుండా రోగులు తమ ఆరోగ్య రికార్డులను మొబైల్ ద్వారా తెలుసుకోడానికి అవకాశం కలుగుతుంది.

సాఫ్ట్ వేర్ రూపకల్పనకు సంబంధించి రైల్ టెల్ తో భారత రైల్వే మంత్రిత్వ శాఖ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. క్లౌడ్ ద్వారా హెచ్ఎంఐఎస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తారు.

ఈ సందర్బంగా మాట్లాడిన రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వీకే యాదప్ మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా వ్యవస్థలో మార్పులను తీసుకుని వస్తున్నామని తెలిపారు. అన్ని రంగాలలో డిజిటలైసెషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

ప్రత్యేకంగా రూపొందే వైద్య గుర్తింపు వ్యవస్థకు హెచ్ఎంఐఎస్ ను అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటయ్యే నైపుణ్య కేంద్రంలో ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసి సమర్ధంగా ఉపయోగించడం జరుగుతుందని ఆయన వివరించారు. రైల్ టెల్ తో రైల్వేల అనుబంధం అనేక రంగాలలో సాగుతున్నదని అన్నారు. ఈ-ఆఫీస్,వీడియోల ద్వారా నిఘా ఉంచడం, దేశవ్యాపితంగా ఉన్న రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను అందించడంలాంటి కార్యక్రమాలను రైల్ టెల్ తో కలసి అమలు చేస్తున్నామని యాదవ్ వివరించారు.

రైల్ టెల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పునీత్ చావ్లా మాట్లాడుతూ '

హెచ్ఎంఐఎస్ ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మకంగా అమలు జరుగుతున్నది. దశలవారీగా దీనిని దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తాం. రోగుల రికార్డులను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీటిని అధిగమించి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడానికి అవకాశం కలుగుతుంది.' అని అన్నారు.

ఐసీటీ ఆధారిత సేవలను రైల్ టెల్ అందిస్తున్నది. ఈ-ఆఫీస్, ఎంపీఎల్ఎస్ - వీప్ఎన్, డేటా సెంటర్ సర్వీస్,నేటివర్క్ హార్డ్వేర్ సిస్టం ఇంటెగ్రేషన్ లాంటి సేవలను సంస్థ అందిస్తున్నది.

 

***

 

 



(Release ID: 1671762) Visitor Counter : 219