PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 16 OCT 2020 6:20PM by PIB Hyderabad

#Unite2FightCorona

#IndiaFightsCorona

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • ప్రతి పది లక్షల జనాభాలో అతి తక్కువ మరణాలు నమోదు చేసుకున్న భారత్, ఈ రోజు 81 గా నమోదు
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా కోలుకున్నవారి సంఖ్య 70,338, కొత్త పాజిటివ్ కేసులు 63,371
  • ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు మొత్తం కేసుల్లో  10.92% మాత్రమే. ఇప్పుడున్న సంఖ్య 8.04.528
  • ఎక్కువ మంది కోలుకుంటూ ఉందటంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.56% 

ఉన్నత స్థాయి కేంద్ర బృందాలి కేరళ, కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు

Image

ప్రతి 10 లక్షల జనాభాలో అతి తక్కువ కోవిడ్ మరణాలు భారత్ లోనే;  గడిచిన 14 రోజుల్లో మరణాలు 1100 లోపే ; 22 రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షలమందిలో మృతులు జాతీయ సగటు కంటే తక్కువ

భారతదేశంలో ప్రతి పది లక్షల జనాభాలో మృతుల సంఖ్య తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం అది 81 కి పరిమితమైంది.   అక్టోబర్ 2 నుంచి వరుసగా రోజుకు 1100 లోపు మరణాలు నమోదవుతూ వస్తున్నాయి.  ఈ ఫలితాలకు తోడుగా 22 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. కోవిడ్ బాధితులలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది 1,52% గా నమోదైంది. ఇది 2020 మార్చి 22 నుంచి నమోదైన శాతంలో అత్యంత కనిష్టం.  గడిచిన 24 గంటలలో 70,338 మంది కోలుకోగా, 63,371 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 64,53,779 గా నమొదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం 56 లక్షలు దాటింది.(56,49,251)  చికిత్సలో ఉన్నవారికంటే  కోలుకున్నవారు 8 రెట్లు ఎక్కువగా ఉన్నారు. చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 10.92% మంది మాత్రమే. అంటే 8,04,528 మంది మాత్రమే చికిత్సలో ఉన్నారు.క్కువమంది కోలుకుంటూ ఉండటంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.56% చేరింది. తాజాగా కోలుకున్నవారిలో  78% మంది 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉన్నారు. మహారాష్ట్ర ఒక్కటే గరిష్టంగా ఒక్క రోజులో 13,000 కు పైగా కోలుకున్నవారిని నమోదు చేసింది. కొత్తగా నమోదైన కేసులలో 79% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కావటం కూడా గమనార్హం. అత్యధికంగా 10,000 కు పైగా కేసులు నమోదైన మహారాష్ట్ర ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా 8,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.  గడిచిన 24 గంటలో 895 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 82% మరణాలు 10 రాష్ట్రాలనుంచే ఉన్నాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఢిల్లీ. దాదాపు 37% పైగా మరణాలు (337) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షలమందిలో జాతీయ సగటు కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665167

కేరళ, కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ కు కేంద్ర బృందాలు హుటాహుటిన తరలింపు 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను హుటాహుటిన కేరళ, కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు తరలించింది.  ఈ రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తూ ఉండటమే అందుకు కారణం.  ఆయా రాష్ట్రాలకు నోడల్ అధికారిగా వ్యవహరించే జాయింట్ సెక్రెటరీ, ప్రజారోగ్య అంశాలు చూసేందుకు ఒక ప్రజారోగ్య నిపుణుడు, ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సలో నిపుణుడైన ఒక డాక్టర్ ఈ బృందంలో ఉంటారు. ఈ బృందాలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కృషికి చేదోడు వాదోడుగా ఉంటారు. కంటెయిన్మెంట్ చర్యలు పకడ్బందీగా అమలు చేయటం, నిఘా, పరీక్షలు, ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ చర్యల్లోను, చికిత్సలోను సహకరిస్తారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665168

ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమానికి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. “పెంచు, పోషించు, నిలబెట్టు” నినాదంగా త్ ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభం కారణంగా యావత్ ప్రపంచం ముందెన్నడూ కనీవినీ ఎరుగని పరిస్థితి ఎదుర్కుంటూ ఉండగా ఈ సారి ఆహారం, పోషకాలు, ఆరోగ్యం, రోగనిరోధకత, సుస్థిరత లకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.  సరైన ఆహారం తీసుకోమని చాటి చెప్పే ఈట్ రైట్ ఉద్యమం కూడా అందరికీ సురక్షితమైన ఆహారం అందాలనే కోరుకుంటున్నదన్నారు. సురక్షితమైన, సంపూర్ణ ఆహారం ద్వారా ప్రతిపౌరునికీ ఆరోగ్యం సమకూరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పాక్షికంగా నీరు ఉండే వనస్పతి నూనెలలో వండిన వేపుడు వంటకాలు విషతుల్యంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. హృదయ సంబంధ వ్యాధుల నివారణకు ట్రాస్న్ ఫాట్ వాడకాన్ని తగ్గించాలని కూడా చెప్పారు. 

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665325

కోవిడ్ కి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి ప్రధానిన్ ఇచ్చిన పిలుపును రెడ్ క్రాస్ సొసైటీకి తెలియజెప్పిన డాక్టర్ హర్ష వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. సెంట్ జాన్స్ ఆంబులెన్స్  చైర్మన్ హోదాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. సెంట్ జాన్స్ ఆంబులెన్స్  అధ్యక్షును హోదాలో రాష్టపతి శ్రీ రామ నాథ్ కోవింద్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. మొదటి సారిగా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొంటున్నానని చెబుతూ, ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వస్తున్న నేపథ్యంలో అనేక సేవలతో వందేళ్ళు పూర్తి చేసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అసంఖ్యాకమైన ప్రజల ప్రాణాలు కాపాడటంలో సభ్యులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పదోనెలలో ఉన్న కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తుగా కోలుకోవటానికి దేశం ఎంతగానో కృషి చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664960

 ఆహార, వ్యవసాయ సంస్థ 75 ఏళ్ళ స్మారకంగా రూ.75 నాణెం విడుదల చేసిన ప్రధాని 

ఆహార, వ్యవసాయ సంస్థకు 75 ఏళ్ళు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈరోజు రూ. 75 నాణేన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదలచేశారు. ఇటీవల అభివృద్ధి చేసిన 17 రకాల పంటలను కూడా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అందరూ పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించటానికి కృషి చేస్తున్నారన్నారు.మన రైతు సోదరులు, మన అన్నదాతలు, మన శాస్త్రవేత్తలు,మన అగన్వాడీ ఆశా కార్యకర్తలు  మనం పౌష్ఠికాహార లోపం మీద చేస్తున్న పోరాటానికి పునాదులుగా అభివర్ణించారు. రైతులు తమ శ్రమతో భారత ధాన్యాగారాన్ని నింపుతూ ఉండగా ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నదన్నారు. అందువల్లనే ఇలాంటి కరోనా సంక్షోభ సమయంలోనూ భారతదేశం పౌష్టికాహార లోపం మీద పోరాడగలుగుతోందన్నారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665225

ఆహార, వ్యవసాయ సంస్థ 75 ఏళ్ళ స్మారకంగా రూ.75 నాణెం విడుదల చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం ఇక్కడ చూడవచ్చు:  

ఉత్తమ , ద్వితీయ కమాండ్ ఆస్పత్రులకు రక్షణ మంత్రి ట్రోఫీ ప్రదానం

సాయుధ దళాల వైద్య సేవల ఆస్పత్రులలో ఉత్తమ, ద్వితీయ కమాండ్ ఆస్పత్రులకు 2019 వ సంవత్సరానికి గాను రక్షణ శాఖామంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్  అక్టోబర్ 16న ట్రోఫీలు అందజేశారు. బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్ ( వైమానిక దళం), కోల్ కతా లోని ఈస్టర్న్ కమాండ్ ఈ రెండు బహుమతులూ అందుకున్నాయి. రక్షణ శాఖామంత్రి  ఈ రెండు ఆస్పత్రులూ అందించిన అత్యుత్తమ సేవలను ప్రశంసించారు. యుద్ధ సమయంలో బలగాలకు వైద్య సహాయం అందించటంతోబాటు ఎ ఎఫ్ ఎం ఎస్ కు చెందిన వివిధ ఆస్పత్రులకు వైద్య సేవలు అందించటంలోనూ కృషి చేస్తున్నాయన్నారు.

మరిన్ని వివరాలకు : . https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665094

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆర్థిక వ్యవహారాల కమిటీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

నిన్న జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐ ఎం ఎఫ్ ) కు చెందిన ఆర్థిక వ్యవహారాల కమిటీ మంత్రిత్వస్థాయి ప్లీనరీ సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకొని మళ్లీ యథాతథ స్థితికి రావటానికి అనుసరించాల్సిన ఎజెండా మీద  ఐ ఎం ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశం చర్చించింది. సభ్య దేశాలు కోవిడ్ వలన ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితిని, దాని మీద జరుపుతున్న పోరాటాన్ని, అమలు చేస్తున్న కార్యాచరణను ఈ సందర్భంగా తెలియజేశాయి.  ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్, భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కింద తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడటానికిఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తయారీ రంగం చురుగ్గా కోలుకుంటున్నదని చెబుతూ వినియోగదారుల ఖర్చుపెట్టే సామర్థ్యాన్ని పెంచేలా దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల మేరకు చర్యలు ప్రకటించామని చెప్పారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665160

షాంఘై సహకార సంస్థ న్యాయశాఖామంత్రుల వర్చువల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఆతిథ్యం

షాంఘై సహకార సంస్థ (ఎస్ సి వో) న్యాయశాఖామంత్రుల ఏడవ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించగా సభ్య దేశాలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. భారత న్యాయ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖామంత్రి శ్రీ రవి సంకర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అనూప్ కుమార్ మెండిరాట్టా  కీలకోపన్యాసం చేశారు.  న్యాయశాఖామంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ,

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665099

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం అందరికీ చౌకగా న్యాయం అందేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేసవ్యాప్త<గా వివిధ కోర్టులలో దాదాపు 25 లక్షల కేసుల విచారణ చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాటిలో దాదాపు 9000 కెసులు వర్చువల్ పద్ధతిలో సుప్రీంకోర్టులోనే జరగటాన్ని కూదా గుర్తు చేశారు. వ్యాపారం సజావుగా సాగటానికి అనువైన చట్టాలు రూపొందించటంతోబాటు వాణిజ్యపరమైన  కోర్టుల చట్టం, ఒప్పంద వివాదాల పరిష్కార చట్టాలు చేయటం ద్వారా పెట్టుబడులకు భారత్ ను ఎంచుకునే వీలు కల్పించామన్నారు. 

మరిన్ని వివరాలకు : http://https//pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1665116

వర్చువల్/ఆన్ లైన్ విధానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మార్గదర్శకాల జారీ 

కళలు, సాంస్కృతిక రంగాలమీద కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ప్రదర్శనలు, కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చాలా వరకు రద్దుకాగా, కొన్నింటిని వాయిదావేశారు.  అయితే, కళాకారులు, సాంస్కృతిక మంత్రిత్వశాఖ డిజితల్ వేదికల వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూనే రావటం కూడా తెలిసిందే. సాంస్కృతిక మంత్రిత్వశాఖ తన కళా సంస్కృతి వికాస్ యోజన ద్వారా అనేక పథకాలు అమలు చేస్తూ వస్తోంది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు కాగలిగే కార్యక్రమాలకు నిధులు కూడా సమకూరుస్తూ వస్తోంది. అయితే, ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యేందుకు మాత్రమే ఇటీవల నిబంధనలు సడలించగా సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఇప్పటికే మంజూరు చేసిన, అనుమతంచిన  కళాకారులకు, సాంస్కృతిక సంస్థలకు సహాయం చేసే లక్ష్యంతో వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు అవకాసమిస్తూ కొన్ని నిబంధనలు మారుస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. అందువలన వేదికమీద ప్రదర్శనలు ఇవ్వలేకపోయిన, నిర్వహించలేకపోయినవారు కూడా కొంతమేరకు ప్రయోజనం పొందే వీలుంటుంది.

మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665168

క్షేత్రస్థాయి పిఐబి అధికారులనుంచి అందిన సమాచారం

పంజాబ్:  గ్రామ అధిపతులుగా సర్పంచుల నైతిక బాధ్యతను గుర్తు చేస్తూ ఆరోగ్య పరిస్థితి మీద గట్టి నిఘా పెట్టాలని, ఏ మాత్రం అనుమానమున్నా కోవిడ్ పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఈరోజు సర్పంచులకు పిలుపునిచ్చారు. కోవిడ్ బారిన పడినవారిని, వారికి దగ్గరగా మసలినవారిని గుర్తించి ఐసొలేషన్ లో ఉంచాలని కూడా కోరారు. ఇందుకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

హర్యానా: వస్తున్న పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజల కదలికలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు  ప్రామాణిక ఆచరణావిధానాలను ప్రకటించారు. షాపులలో రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం. చేతుల పరిశుభ్రత లాంటి కోవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లకు కూదా ఆదేశాలు జారీ చేశారు.

హిమాచల్ ప్రదేశ్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సెంట్ జాన్స్ అంబులెన్స్ సంస్థల వార్షిక సర్వసభ్య సమావేశాన్నుద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్  శ్రీ బందారు దత్తాత్రేయ ప్రసంగించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుని హోదాలో ఆయన ప్రసంగిస్తూ హిమాచల్ ప్రదేశ్ లో కరోనా సంక్షోభ సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలను కొనియాడారు. పేదలకు సేవచేయటానికి ముందుకురావటాన్ని అభినందించారు. మాస్కులు, శానితైజర్లు సహా అరోగ్య సహాయక వస్తు సామగ్రిని అందించినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అరుణాచల్ ప్రదేశ్: ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో మరొకరు కోవిడ్ బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 30 కి చేరింది. ఇల ఉందగా గడిచిన 24 గంతలలో రాష్ట్రంలో కొత్తగా 203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ ఉన్న 195 మంది కోలుకున్నారు. చింపూ లోని 42 పడకల ఆస్పత్రిని 152 పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి శ్రీ అలో లిబాంగ్ ఈ విషయం వెల్లడించారు.

 అస్సాం: నిన్న 1263 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీ హిమంత  బిశ్వా శర్మ ట్వీట్ చేశారు. ఇప్పటికీ చికిత్సలో ఉన్నవారికంటే ఆరు రెట్లు ఎక్కువగా కోలుకున్నట్టయింది.డిశ్చార్జ్ అయిన బాధితులు 85.09% ఉండగా చికిత్సలో ఉన్నవారి శాతం 14.47.

మణిపూర్: స్థానికంగా ఎక్కడ లాక్ డౌన్ విధించాలో పరిశీలిస్తున్నారు. ఈ రోజు మరొకరు కోవిడ్ కు న్ బలయ్యారు

మేఘాలయ: మేఘాలయలో మొత్తం 2445 మంది కోవిడ్ బాధితులు ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు, వారిలో  బి ఎస్ ఎఫ్, సాయుధ దళాలే 117 మంది. మొత్తం కోలుకున్నవారు 5646 మంది.

నాగాలాండ్: నాగాలాంద్ లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులు 7492 కాగా వారిలో 3395 మంది భద్రతాదళాలకు చెందినవారే. 2134 మంది ఆనవాలు గుర్తించారు.  1586 మంది తిరిగి వచ్చినవారు, 366 మంది సిబ్బంది  ఉన్నారు..

కేరళ: ఆరు నెలల విరామం తరువాత అయ్యప్ప భక్తులు రేపు ఆలయప్రవేశం చేయబోతున్నారు.   దర్శనానికి 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగటివ్ పత్రాలు దర్శనానికి తప్పనిసరి. కేరళ పోలీసుల దగ్గర వర్చువల్ క్యూ కోసం  ఆన్ లైన్ ద్వారా అనుమతి పొందిన 250 మందిని మాత్రమే ఒక్కో రోజు అనుమతిస్తారు. ఇలా ఉండగా ఈరోజు మరో నలుగురు కోవిడ్ తో చనిపోయారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 1093 కు చేరింది. ఈరోజు కొత్తగా 7789 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్సపొందుతున్నవారి సంఖ్య 94,517. రాష్ట్ర వ్యాప్తంగా 2.49 లక్షలమంది పరిశీలనలో ఉన్నారు.

తమిళనాడు: కోవిడ్ సమయంలో 12 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు ఆహార శాఖామంత్రి ఆర్ కామరాజ్ చెప్పారు. రైతులకు రూ. 2416.05 కోట్లు పంపిణీ చేశామన్నారు.పండుగ సీజన్ లో రఈళ్లలో భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. మాస్క్ లేకుందా ప్రయాణీకులను రైల్లో ఎక్కనివ్వరు. మదురై లో కోవిడ్ మృతుల సంఖ్య 400 దాటింది. తమిళనాడు తొలి కోవిడ్ మృతుడు నమోదైంది ఆ జిల్లాలోనే.

కర్నాటక: ఆర్ టి పిసిఆర్ పరీక్షలలో నెగటివ్ ఫలితం వచ్చినప్పటికీ కోవిడ్ లక్షనాలు కనబడుతూ ఉండటంతో అరోగ్యశాఖ మళ్లీ హెచ్చరికలు జారీచేసింది. అలాంటి కేసులకు కూదా చికిత్స అందించాలని ఆదేశించింది. పండుగ సీజన్ కావటంతో పర్యాటక ప్రదేశాలైన కొడగు, మైసూర్, మాండ్యా లలో ఇన్ఫక్షన్ వ్యాపించే అవకాశం ఉండటం వలన మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రజలు మాస్క్ ధరించేల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఈరోజు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఏదు నెలల తరువాత ఈరోజు రైల్వే టికెట్ కౌంటర్లు తెరచుకున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ : కోవిడ్ కారణంగా విద్యాసంవత్సరం దెబ్బతినటంతో సెలవులు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 2 నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. విద్యా కాలెండర్ తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పనిదినాలను ఐదు నెలలకు కుదించారు. ఉపాధ్యాయుల సెలవులమీద కూడా పరిమితి విధించాలని ఆలోచిస్తున్నారు.  వారానికి ఆరు రోజులు పనిచేసేలా కాలెండర్ తయారవుతోంది. గురువారం నాడు కోవిడ్ కేసుల సంఖ్య 4000 కు పైగా పెరిగింది. దీంతో మొత్తం కెసులు 7.71 లక్షలయ్యాయి. 5622 మంది కోలుకోవటంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 40047 కు తగ్గింది.

. తెలంగాణ: గడిచిన 24 గంటల్లో 1554 కొత్త కేసులు, 1435 మంది కోలుకున్నవారు, 7 మరణాలు నమోదయ్యాయి. 1554 లో 249 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కావటం గమనార్హం. మొత్తం కేసులు  219 224 కాగా చికిత్సలో ఉన్నవారు 23,315 మంది. డిశ్చార్జ్ అయినవారు 194653. ఫిక్కీ, ఆస్కి, ఎఫ్ టి సిసిఐ  రూపొందించిన నివేదికప్రకారం దక్షిణాదిన అద్భుత ప్రతిభ కనబరచిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. భారీ వర్షాల వలన రాష్ట్రమంతా వరదమయం అయింది. 50 మంది చనిపోయారు. వారిలో 11 మంది గ్రేతర్ హైదరాబాద్ పరిధిలోనివారే. దాదాపు రూ. 2,000 కోట్ల పంట నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

***

 

 

 

 

 

 

 


(Release ID: 1665330) Visitor Counter : 328