రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యుత్తమ, ఉత్తమ కమాండ్ ఆసుపత్రులకు రక్షా మంత్రి ట్రోఫీ ప్రదానం
Posted On:
16 OCT 2020 2:40PM by PIB Hyderabad
రక్షణ దళాల వైద్య సేవలు (Armed Forces Medical Services (AFMS)) అందించే అత్యుత్తమ, ఉత్తమ ఆసుపత్రులకు శుక్రవారం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ రక్షా మంత్రి ట్రోఫీ ప్రదానం చేశారు. కమాండ్ ఆసుపత్రి (వాయు దళం) బెంగళూరు, కమాండ్ ఆసుపత్రి (ఈస్టర్న్ కమాండ్) కోల్‌కతలను 2019వ సంవత్సరంలో అతి ఉత్తమ, ఉత్తమ ఆసుప్రతులుగా నిర్ణయించారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రక్షణ కార్యదర్శితో పాటుగా, రక్షణ దళాలు, పాలనకు సంబంధించిన సీనియర్ అధికారులు హాజరు అయ్యారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఈ రెండు ఆసుపత్రులను అభినందిస్తూ, ఎఫ్ ఎమ్ ఎస్ అందిస్తున్న గొప్ప సేవలను రక్షణ మంత్రి కొనియాడారు. దళాలకు వైద్య సహాయాన్ని అందించేందుకు ఎ ఎఫ్ ఎమ్ ఎస్ ఆధ్వర్యంలోని మిడ్ జోనల్, జోనల్, తృతీయ శ్రేణి వైద్యశాలలో మోహరించి, అందిస్తున్న సేవలను ఆయన మెచ్చుకున్నారు. కార్యరంగంలో ఉన్నప్పుడు, శాంతి సమయాల్లోనూ, అలాగే మానవీయ సహాయాన్ని అందించే, విపత్తు సమయంలో ఉపశమనాన్ని అందించేందుకు ఎ ఎఫ్ ఎమ్ ఎస్ అన్ని సవాళ్ళను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండవలసిన అవసరం గురించి ఎస్ ఎమ్, పిహెచ్ ఎస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, ఆర్మీ మెడికల్ కార్ప్స్ సీనియర్ కల్నల్ కమాండెంట్ అయిన లెఫ్టనెంట్ జనరల్ అనూప్ బెనర్జీ నొక్కి చెప్పారు. నిరంతరం వృత్తిపరమైన నైపుణ్యం కోసం కృషి చేసేందుకు ఎ ఎఫ్ ఎమ్ ఎస్ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
ఎ ఎఫ్ ఎమ్ ఎస్ కు చెందిన కమాండ్ ఆసుపత్రులు అందించే వైద్య సేవలలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు 1989లో రక్షా మంత్రి ట్రోఫీని ఏర్పాటు చేశారు. లెఫ్న్టనెంట్ జనరల్, తత్సమానమైన ఎ ఎఫ్ ఎమ్ ఎస్ అధికారి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆసుపత్రులను పర్యటించిన సందర్భంలో తటస్థ వైఖరితో పనితీరును అంచనా వేసి సమగ్ర ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటిస్తుంది.
***
(Release ID: 1665160)
Visitor Counter : 242