ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రతి 10 లక్షల జనాభాలో అతి తక్కువ కోవిడ్ మరణాలు భారత్ లోనే

గడిచిన 14 రోజుల్లో మరణాలు 1100 లోపే

22 రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షలమందిలో మృతులు జాతీయ సగటు కంటే తక్కువ

Posted On: 16 OCT 2020 2:18PM by PIB Hyderabad

భారతదేశంలో ప్రతి పది లక్షల జనాభాలో మృతుల సంఖ్య తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం అది 81 కి పరిమితమైంది.  

అక్టోబర్ 2 నుంచి వరుసగా రోజుకు 1100 లోపు మరణాలు నమోదవుతూ వస్తున్నాయి.

 

ఈ ఫలితాలకు తోడుగా 22 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ట్రాలలో ప్రతి పది లక్షల జనాభాకు మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతూ వస్తోంది.

కోవిడ్ బాధితులలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది 1,52% గా నమోదైంది. ఇది 2020 మార్చి 22 నుంచి నమోదైన శాతంలో అత్యంత కనిష్టం.  

 

కోవిడ్ నిర్వహణ, స్పందన విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ను నియంత్రించటంతో బాటు తీవ్ర లక్షణాలున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించటం ద్వారా మరణాలు తగ్గించటం మీద దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో చేసిన కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి. ప్రత్యేకంగా కోవిడ్ కోసం 2212 ఆస్పత్రులు నాణ్యమైన సేవలందించాయి.  ప్రామాణిక చికిత్సావిధానాలతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఆ విధంగా చికిత్స కోసం విధి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు అందించే చికిత్సకు ఒక ప్రామాణికత వచ్చింది.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల చికిత్సకోసం ఐసియు డాక్టర్ల సామర్థ్యం పెంచటానికి ఒక విశిష్టమైన కార్యక్రమం చేపట్టటం ద్వారా మరణాలు తగ్గించగలిగారు. న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ ఈ-ఐసియు ప్రారంభించి వారానికి రెండు సార్లు మంగళ, శుక్రవారాల్లో టెలీ/వీడియో సంప్రదింపులకు ఏర్పాటు చేసింది.  ఆయా అంశాలలో నిపుణులైన డాక్టర్లు దేసవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల ఐసియు లలో చికిత్స అందిస్తున్న డాక్టర్లకు సలహాలు ఇస్తూ వచ్చారు. ఈ విధమైన సెషన్లు 2020 జులై 8న మొదలయ్యాయి.  

 

ఇప్పటి వరలు 23 టెలీ సెషన్లు జరగగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 సంస్థలు వీటిలో పాల్గొని లబ్ధి పొందాయి.  కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావటాన్ని మించి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండే పరిస్థితి సాగుతున్నది. గడిచిన 24 గంటలలో 70,338 మంది కోలుకోగా, 63,371 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 64,53,779 గా నమొదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం 56 లక్షలు దాటింది.(56,49,251)  చికిత్సలో ఉన్నవారికంటే  కోలుకున్నవారు 8 రెట్లు ఎక్కువగా ఉన్నారు.

చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 10.92% మంది మాత్రమే. అంటే 8,04,528 మంది మాత్రమే చికిత్సలో ఉన్నారు.క్కువమంది కోలుకుంటూ ఉండటంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.56% చేరింది. తాజాగా కోలుకున్నవారిలో  78% మంది 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉన్నారు. మహారాష్ట్ర ఒక్కటే గరిష్టంగా ఒక్క రోజులో 13,000 కు పైగా కోలుకున్నవారిని నమోదు చేసింది.

 

WhatsApp Image 2020-10-16 at 10.19.37 AM.jpeg

కొత్తగా నమోదైన కేసులలో 79% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కావటం కూడా గమనార్హం. అత్యధికంగా 10,000 కు పైగా కేసులు నమోదైన మహారాష్ట్ర ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా 8,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.  

 

WhatsApp Image 2020-10-16 at 10.19.37 AM (2).jpeg

గడిచిన 24 గంటలో 895 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 82% మరణాలు 10 రాష్ట్రాలనుంచే ఉన్నాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఢిల్లీ. దాదాపు 37% పైగా మరణాలు (337) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

 

WhatsApp Image 2020-10-16 at 10.19.37 AM (1).jpeg

13 రాష్ట్రాలు, కే<ద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షలమందిలో జాతీయ సగటు కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.

 

   

****


(Release ID: 1665167) Visitor Counter : 259