PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 02 JUN 2020 6:41PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 95,526కి చేరగా... కోలుకున్నవారి శాతం 48.07కి పెరుగుదల.
  • భారత దేశంలో కోవిడ్‌-19వల్ల సంభవించిన మరణాలతో పోలిస్తే 14 తీవ్ర ప్రభావిత దేశాల్లో 55.2 రెట్లు అధికం.
  • దేశంలోని 97,581 యాక్టివ్‌ కేసులపై చురుకైన చికిత్స- వైద్య పర్యవేక్షణ.
  • స్వయం సమృద్ధ భారతానికి సంక‌ల్పం, సార్వజనీనత, సదుపాయాలు, సరికొత్త ఆవిష్కరణలు చాలా ముఖ్యం: ప్రధానమంత్రి
  • దేశానికి సామూహిక శక్తి వనరులలో సంగీతం కూడా ఒకటి: ప్రధానమంత్రి.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; దేశవ్యాప్తంగా కోలుకున్న రోగుల సంఖ్య 95,526

దేశంలో ప్రస్తుతం 97,581 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. గత 24 గంటల్లో 3,708 మందికి వ్యాధి నయంకాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 95,526కు శాతంలో అయితే 48.07కు చేరింది. ప్రపంచదేశాలతో పోలిస్తే మరణాలు కేవలం 2.82శాతమే.

 

భారత జనాభా, తీవ్ర ప్రభావిత 14 దేశాల జనాభాకు దాదాపు సమానం. అయినప్పటికీ భారత్‌తో పోలిస్తే 2020 జూన్‌ 1నాటికి ఆ 14 దేశాల్లో కేసులు 22.5 రెట్లు అధికం. అలాగే ఆ దేశాల్లో మరణాలు కూడా 55.2 రెట్లు అధికం. ఈ పరిస్థితుల నడుమ సకాలంలో కేసుల గుర్తింపు, వైద్య నిర్వహణతో మరణాల సంఖ్యను కనీస స్థాయికి తగ్గించడంపై దృష్టి సారించాం.  సాపేక్షంగా మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి ఈ రెండంచెల వ్యూహమే కారణం.

 

No photo description available.

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628804

సీఐఐ వార్షిక సమావేశాల్లో ప్రధాని ప్రారంభోపన్యాం; స్వయం సమృద్ధ భారతానికి సంక‌ల్పం, సార్వజనీనత, పెట్టుబ‌డులు, సదుపాయాలు, సరికొత్త ఆవిష్కరణలు చాలా ముఖ్యం: పీఎం

క‌రోనా కార‌ణంగా మ‌న వృద్ధివేగం మంద‌గించి ఉండొచ్చు... కానీ, భార‌త‌దేశం నేడు దిగ్బంధం ద‌శ‌ను అధిగ‌మించి, దిగ్బంధ విముక్త ద‌శ‌లోకి ప్ర‌వేశించ‌మే ఇప్పుడు మ‌న క‌ళ్ల‌ముందున్న సంపూర్ణ వాస్త‌వ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ దిగ్బంధ విముక్త తొలిద‌శ‌లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అతిపెద్ద భాగం ప్ర‌గ‌తి ప‌య‌నం మ‌ళ్లీ మొద‌లైంద‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితుల న‌డుమ భార‌త్‌ను తిరిగి స‌త్వ‌ర ప్ర‌గతి ప‌థంలోకి న‌డిపించే దిశ‌గా ‘స్వయం సమృద్ధ భారతం’ నిర్మాణానికి ఐదు అంశాలు అత్యంత ప్ర‌ధాన‌మని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సంక‌ల్పం, సార్వజనీనత, పెట్టుబ‌డులు, సదుపాయాలు, సరికొత్త ఆవిష్కరణలు అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాల్లో ఈ పంచ‌సూత్రాలూ ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. త‌ద‌నుగుణంగా ఇప్ప‌టికే ప‌లు రంగాలు భ‌విష్య‌త్ ముంద‌డుగుకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆయ‌న చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధిలో భాగంగా రైతుల‌తో భాగ‌స్వామ్యం, పెట్టుబ‌డులద్వారా సంపూర్ణ ప్ర‌యోజ‌నాలు పొందాల్సిందిగా పారిశ్రామిక రంగానికి ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల స‌ముదాయాల కోసం గ్రామాల స‌మీపంలోనే మౌలిక స‌దుపాయాలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. దేశ ప్ర‌గ‌తి ప‌య‌నంలో ప్రైవేటు రంగాన్ని ఒక ప్ర‌ధాన భాగ‌స్వామిగా ప్ర‌భుత్వం ప‌రిగ‌ణిస్తున్న‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628702

భారత పరిశ్రమల సమాఖ్య (CII) వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628587

‘స్పిక్‌ మెకే’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

ప్రస్తుత పరీక్షా సమయంలోనూ దేశంలోని సంగీత కళాకారుల స్ఫూర్తి చెక్కుచెదరలేదని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ మేరకు కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా యువతలో నెలకొన్న నైరాశ్యాన్ని, ఒత్తడిని పారదోలడం ఇతివృత్తంగా ఈ సదస్సుపై దృష్టి సారించడం హర్షణీయమన్నారు. చారిత్రకంగా యుద్ధాలు-సంక్షోభ సమయాల్లో సంగీతం ఒక స్ఫూర్తిదాయక, సంధాయక పాత్రను ఎలా పోషించిందీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటువంటి సమయాల్లో కవులు, గాయకులు, కళాకారులు పాటలు రచించి, సంగీతం సమకూర్చి ప్రజల్లో నిబిడీకృతమైన ధైర్యసాహసాలను వెలికితెచ్చేందుకు సదా కృషి చేస్తుంటారని చెప్పారు. ఆ మేరకు ప్రపంచమంతా అదృశ్య శత్రువుతో పోరాడుతున్న ఈ పరీక్ష సమయంలో కూడా గాయకులు, పాటల రచయితలు, కళాకారులు ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ఆటపాటలతో వారిలో ఉత్తేజం ఇనుమడింపజేస్తున్నారని కొనియాడారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628541

ఆపరేషన్‌ సముద్ర సేతు- కొలంబోనుంచి భారతీయులను ట్యుటికోరిన్‌ చేర్చేందుకు పయనమైన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

భారత నావికాదళ నౌక ‘జలాశ్వ’ నిన్న (01 జూన్‌ 2020) సాయంత్రం శ్రీలంక రాజధాని కొలంబో రేవులో 685 మంది భారతీయులను ఎక్కించుకుని తమిళనాడులోని ట్యుటికోరిన్‌ రేవు పట్టణానికి బయల్దేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ కింద భారత నావికాదళ నౌక ‘జలాశ్వ’ విదేశీ రేవు పట్టణాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడంలో ఈ పయనం మూడోది కావడం విశేషం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628543

ఫ్రాన్స్‌ సాయుధ బలగాల మంత్రితో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సంభాషణ

రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ఫ్రాన్స్‌ సాయుధ బలగాల మంత్రి శ్రీ ఫ్లోరెన్స్‌ పార్లీతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 పరిస్థితులుసహా ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. అంతేకాకుండా భారత్‌-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతానికి అంగీకరించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరులో రెండు దేశాల సాయుధ బలగాలు పోషిస్తున్న పాత్రను వారు ప్రశంసించారు. కాగా, కోవిడ్‌-19 విసిరిన సవాళ్లతో నిమిత్తం లేకుండా రఫేల్‌ యుద్ధ విమానాలను సకాలంలో అందజేసేందుకు ఫ్రాన్స్‌ హామీ ఇచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628669

కోవిడ్‌-19వల్ల దుస్థితిని ఎదుర్కొంటున్న గిరిజన హస్తకళాకారులకు ట్రైఫెడ్‌ సంపూర్ణ మద్దతు

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దుస్థితిని ఎదుర్కొంటున్న గిరిజన హస్త కళాకారులను ఆదుకునే దిశగా సంపూర్ణ మద్దతిస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ట్రైఫెడ్‌’  (TRIFED) వారికి హామీ ఇచ్చింది. ఈ మేరకు వారు ఉత్పత్తులను తిరిగి ప్రారంభించి ‘ట్రైబ్స్‌’ (TRIBES) ఇండియా రిటైల్‌, ఈ-కామర్స్‌ వేదికల (www.tribesindia.com) ద్వారా విక్రయానికి వీలు కల్పించే ‘ముమ్మర కార్యాచరణ ప్రణాళిక’ను ప్రకటించింది. తదనుగుణంగా గిరిజన వాణిజ్యం కొనసాగింపు నిమిత్తం ట్రైఫెడ్‌ తన విక్రయకేంద్రాలతోపాటు ఈ-కామర్స్‌ పోర్టళ్లను పునఃప్రారంభించింది. ఇందులో భాగంగా దేశమంతటాగల తమ చిల్లర వర్తక నెట్‌వర్క్‌ తోడ్పాటు, ఈ-కామర్స్‌ పోర్టళ్లద్వారా ఈ ఉత్పత్తులను ఆకర్షణీయ రాయితీతో టోకుగానూ విక్రయించేందుకు ట్రైఫెడ్‌ నిర్ణయించింది. అలాగే గిరిజన కళానిపుణులు, మహిళలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ అమ్మకాలద్వారా వచ్చే సొమ్మును వందశాతం వారికే బదిలీ చేయాలని కూడా సంకల్పించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628802

నవ్య కరోనా వైరస్‌లో సహజీవనానికి ఐదు చిట్కాలు

దేశంలో 70 రోజుల దిగ్బంధం తర్వాత ‘దిగ్బంధ విముక్తం 1.0’ కార్యాచరణ మొదలైంది. అధికారికంగా ప్రకటించిన ‘దిగ్బంధం 5.0’ దశ 2020 జూన్‌ 1 నుంచి ఆరంభం కాగా, దీంతోపాటు నియంత్రిత, దశలవారీ విధానంలో ఆర్థిక వ్యవస్థ, సామాన్య జనజీవనం కూడా సాధారణ స్థితివైపు తిరిగి పయనం ప్రారంభించాయి. సరికొత్త విధానాలకు ఇది నాంది కాగా... ఇదొక సుదీర్ఘ ప్రస్థానం కానుంది. ఈ మేరకు ‘మనం వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే’నని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ మహమ్మారిని నిలువరించే టీకా రావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది కాబట్టి, ఈ కొత్త పద్ధతులతో జీవనానికి మనం అలవాటు పడాలని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రవిజ్ఞాన ముఖ్య సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయరాఘవన్‌ “ఇండియా సైన్స్‌ వైర్‌” ప్రతినిధితో మాట్లాడుతూ- ‘వైరస్‌తో జీవనం’పై ఐదు చిట్కాలు చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628612

జోర్హట్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఈఐఎస్‌టీ కోవిడ్‌-19 పరీక్షా ప్రయోగశాల ప్రారంభం

జోర్హట్‌లోని ఈశాన్య భారత శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన సంస్థ (NEIST) ప్రాంగణంలో కోవిడ్‌-19 పరీక్షల ప్రయోగశాల ఏర్పాటైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628599

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: కోవిడ్‌పై రాష్ట్ర పోరును క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి నెలపాటు నిర్వహించ తలపెట్టిన ‘మిషన్ ఫతే’ కార్యక్ఉరమాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ మహమ్మారిపై ప్రస్తుతం ముందువరుస యోధులు పోరాడుతున్న నేపథ్యంలో ఈ ప్రచార కార్యక్రమంద్వారా ‘మిషన్ ఫతే’ పరిధి మరింత విస్తృతమై ఈ యుద్ధంలో ప్రజలను భాగస్వాములను చేస్తుందన్నారు. ఈ మేరకు ఇది ‘ప్రజల కోసం- ప్రజల చేత- ప్రజలద్వారా’ సాగే ఉద్యమంగా రూపొందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తమకు ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ ముప్పును ప్రజలు గుర్తించేలా చేయడానికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. తదనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు పాటించేలా సలహా ఇస్తూ, తద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా నడచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించేవారి సమాచారాన్ని నివేదించాలని ప్రజలకు సూచించారు.
  • హర్యానా: రాష్ట్రంలో సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటలదాకా అన్ని దుకాణాలనూ తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు హోంశాఖ మంత్రి తెలిపారు. అయితే, ఇందుకు ‘సరి-బేసి  లేదా కుడి-ఎడమ’ పద్ధతి వంటిదేదీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. దీనికి బదులుగా స్థానిక పరిస్థితులపై అంచనాల మేరకు రద్దీ మార్కెట్లలో సామాజిక దూరం నిబంధనలు పాటించడంపై పాలన యంత్రాంగం ఆదేశాలిస్తుందని తెలిపారు. కేంద్రం సూచనల మేరకు రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగతుందని చెప్పారు.
  • హిమాచల్ ప్రదేశ్: కరోనా మహమ్మారి నేపథ్యంలో దిగ్బంధం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రవేశించిన వలసదారుల కచ్చితమైన గణాంకాలు రూపొందించేందుకు రాష్ట్ర సమాచార సాంకేతిక విజ్ఞానశాఖ రూపకల్పచేసిన నైపుణ్య రిజిస్టర్‌ను ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఆసక్తిగల వారు skillsregister.hp.gov.in ద్వారా ఇందులో నమోదు కావచ్చునని ఆయన అన్నారు. వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు కూడా తమ అవసరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఇది రాష్ట్రానికి తిరిగి వచ్చినవారి విద్యార్హత, నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాలను అప్‌లోడ్ చేయడానికీ ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నైపుణ్యాలను గుర్తించడంతోపాటు నైపుణ్యాభివృద్ధి అవసరాల విశ్లేషణలోనూ ఇది దోహదకారి కానుందని పేర్కొన్నారు. అలాగే ఒక్క క్లిక్‌తో నిపుణ కార్మిక, ఉద్యోగ వనరులను గుర్తించడంలో పరిశ్రమల యాజమాన్యాలకూ సహాయపడుతుందని చెప్పారు.
  • అరుణాచల్: రాష్ట్రంలోని 68వేల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం-కేఎస్‌వై కింద రూ.2000 వంతున సహాయం అందించగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1000 వంతున మంజూరుచేసింది.
  • అసోం: రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లోగల రక్షణశాఖ పరిశోధనశాలను కోవిడ్‌-19 అధికారిక పరీక్ష కేంద్రంగా ప్రకటించేందుకు రక్షణ పరిశోదన-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో ఆమోదం తెలిపింది. కాగా, అసోంలో 28 కొత్త కేసుల నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1513కి చేరింది. ఇక కోలుకున్నవారు 284 మంది కాగా, 4 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1222 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • మణిపూర్: మణిపూర్‌లో మరో 2 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 85కు చేరగా, వీటిలో 74 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • మిజోరాం: రాష్ట్ర గవర్నర్ శ్రీ శ్రీధరన్ పిళ్ళై 2020 మే నుంచి 6 నెలలపాటు తన స్థూల వేతనంలో 30 శాతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. కాగా, కోవిడ్‌-19పై పోరాటం కోసం ముఖ్యమంత్రి కూడా తన మూలవేతనంలో 60 శాతాన్ని ఈ నిధికి విరాళంగా ఇచ్చారు. శాసన సభాపతి అధ్యక్షతన ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా తీర్మానించిన మేరకు ఈ ప్రకటన చేశారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ప్రస్తుత దిగ్బంధం నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తిరిగి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా దిమాపూర్ టాస్క్ ఫోర్స్ స్వల్ప మార్పులు చేయనుంది. కాగా, దిమాపూర్‌లో ప్రభుత్వం నడిపే పర్యాటక వసతిగృహాన్ని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చాలని నాగాలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
  • సిక్కిం: ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివస్తున్న దక్షిణ సిక్కిం పౌరుల కోసం చిసోపానిలోని సెంటర్ ఫర్ కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (డిప్లొమా కళాశాల)ని ప్రభుత్వం ఉచిత సంస్థాగత నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రంగా మార్చింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,361 కొత్త కేసులు రాగా, 76 మరణాలు సంభవించాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,013కు, మరణాలు 2,362కు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 37,543గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా అత్యధికంగా మహారాష్ట్రలో నేటిదాకా 4,71,473 నమూనాలను పరీక్షించారు. మహానగరంలోని పశ్చిమ ప్రాంతం ఇప్పటికే కరోనావైరస్‌తో పోరాడుతుండగా, రేపు మధ్యాహ్నం రాష్ట్రంలోని అలీబాగ్‌వద్ద తీరం దాటనున్న ‘నిసర్గ’ తుపాను బీభత్సాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను తీరందాటే సమయంలో 100-110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే ప్రమాదం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా, రోగలక్షణాలు కనిపించని అనుమానిత రోగులు సుమారు 150 మందిని వర్లిలోని బికెసి ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 423 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 17,217కు చేరింది. మరోవైపు గుజరాత్‌లో 25 తాజా మరణాలతో మృతుల సంఖ్య 1,063కు పెరిగింది. వివిధ ఆసుపత్రుల నుంచి రికార్డు స్థాయిలో 861 మంది రోగులకు వ్యాధి నయంకాగా, వారిని ఇళ్లకు పంపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 10,000 దాటింది. నిసర్గ తుఫాను రేపు దక్షిణ గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే కార్యక్రమం రేపు మధ్యాహ్నంకల్లా చేయాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇవాళ సంబంధిత జిల్లాల కలెక్టర్లందరినీ ఆదేశించారు. అయితే, కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా తరలింపు ప్రక్రియలో సామాజిక దూరం, మాస్కుల ధారణ, పీపీఈ కిట్ల వాడకంపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,283కు చేరగా, మృతుల సంఖ్య 358గా ఉంది. రాష్ట్రంలో ఒక్కజిల్లా మినహా మిగిలిన 51 జిల్లాలకు కోవిడ్‌ మహమ్మారి వ్యాపించగా, ఇప్పటివరకూ 5 వేలమందికిపైగా కోలుకున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 171 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,980కి చేరింది. అయితే, నేటిదాకా 6,040 మందికి వ్యాధి నయమై విడుదల కావడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,742 మాత్రమే ఉన్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం నేడు 45 కొత్త కేసులు నమోదవగా మొత్త కేసుల సంఖ్య 547కు పెరిగింది. రాయ్‌పూర్‌సహా 16 జిల్లాలను ప్రభుత్వం రెడ్ జోన్‌గా ప్రకటించగా, మరో 17 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

 

PIB FACT CHECK

 

 

******

 



(Release ID: 1628844) Visitor Counter : 262