గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన పరిస్థితుల కారణంగా కష్టాల్లో ఉన్న గిరిజన చేతివృత్తుల వారిని ఆదుకొనేలా ట్రైఫెడ్ ప‌లు చ‌ర్య‌లు

- గిరిజన వాణిజ్యానికి ద‌న్నుగా నిలిచేలా అన్ని అవుట్‌లెట్ల‌ను మరియు ఈ-కామర్స్ పోర్టళ్ల‌ను తిరిగి తెరిచిన ట్రైఫెడ్‌
కోవిడ్‌-19 వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన పరిస్థితుల కారణంగా కష్టాల్లో ఉన్న గిరిజన చేతివృత్తుల వారికి

త‌గిన మ‌ద్ద‌తునిస్తూ ద‌న్నుగా నిలిచేందుకు గాను గిరిజ‌న సంక్షేమ శాఖ అధ్వ‌ర్యంలో ప‌ని చేసే

Posted On: 02 JUN 2020 4:57PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన పరిస్థితుల కారణంగా కష్టాల్లో ఉన్న గిరిజన చేతివృత్తుల వారికి
త‌గిన మ‌ద్ద‌తునిస్తూ ద‌న్నుగా నిలిచేందుకు గాను గిరిజ‌న సంక్షేమ శాఖ అధ్వ‌ర్యంలో ప‌ని చేసే
ట్రైఫెడ్ వివిధ‌ ప్రయత్నాల‌ను ప్రారంభించింది. గిరిజ‌న చేతివృత్తుల వారికి, వారు త‌యారు చేసే  ఉత్పత్తులు, వాటి అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించడంలో స‌హాయ ప‌డేందుకు గాను.. దూకుడుగా ఒక‌ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా ట్రైఫెడ్ సంస్థ ట్రైబ్స్ ఇండియా రిటైల్, ఈ-కామ‌ర్స్‌ వేదిక www.tribesindia.comను కూడా అందుబాటులోకి తె‌చ్చింది. దీని ద్వారా గిరిజన వాణిజ్యానికి మద్దతుగా ట్రైఫెడ్ సంస్థ తన అన్ని అవుట్‌లెట్ల‌ను మరియు ఈ-కామర్స్ పోర్టల్‌లను తిరిగి ప్రారంభించింది. దేశంలో గిరిజ‌నుల‌ ఉత్పత్తుల్ని దేశ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన త‌న రిటైల్ నెట్‌వర్క్ ద్వారా బ‌ల్క్ అమ్మ‌కాల మార్కెటింగ్ చేయాల‌ని ట్రైఫెడ్ నిర్ణ‌యించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లతో ఈ-కామ్ పోర్టల్స్ ద్వారా భారీ అమ్మకాల మార్కెట్ చేయాలని నిర్ణయించింది. గిరిజన మేటి చేతివృత్తిదారులు మరియు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం 100 శాతం సొమ్మును గిరిజన కళాకారులకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
ఇతర‌ ఈ-కామ్ పోర్ట‌ళ్ల‌కు డిస్కౌంట్ విస్త‌రణ‌..

 

A picture containing truckDescription automatically generated
డిస్కౌంట్ ఆఫర్‌ను గిరిజ‌నుల ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించే ఇతర ఈ-కామర్స్ పోర్టళ్ల‌కూ విస్తరించే దిశ‌గా చర్చలు జరుగుతున్నాయి. ఈ కింద పేర్కొన్న సైట్ల‌న్నీ గిరిజ‌నుల ఉత్పత్తులపై చాలా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి:
అమెజాన్ - (https://www.amazon.in/s?k=tribes+india),
ఫ్లిప్‌కార్ట్ - (https://www.flipkart.com/search?q=tribes%20india),
స్నాప్‌డీల్- (https://www.snapdeal.com/search?keyword=tribes%20india &sort=rlvncy), & GeM (https://mkp.gem.gov.in/arts-and-crafts-equipment-and-accessories-and-supplies-art-paintings/search).
స‌ర‌ఫ‌రాదారుల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ స‌మావేశాలు..
ట్రైఫెడ్ తన సరఫరాదారులతో క్రమం తప్పకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సరఫరాదారుల సమావేశంలో వేదిక‌పై జాతీయ మరియు ప్రాంతీయంగా ఉండే దాదాపు 5000 మందికి పైగా గిరిజన కళాకారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ సమయంలో గిరిజ‌న చేతివృత్తుల వారికి ఉపశమనం క‌ల్పించేలా అత్యవసర సేకరణను ప్రారంభించాలని ట్రైఫెడ్ సంస్థ త‌న అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు సూచించింది.
ప‌ని చేసుకొనేందుకు వీలుగా అనుమ‌తులు...
ట్రైఫెడ్‌కు చెందిన గిరిజన చేతివృత్తులవారు తమ ప్రాంగణంలో సరైన సామాజిక దూరపు ప్రమాణాలను పాటిస్తూ త‌మ‌త‌మ ప్రాంతాల‌లోనే ప‌ని చేసుకొనేందుకు వీలు క‌ల్పించేలా ట్రైఫెడ్ ప్రాంతీయ కార్యాలయాలు స్థానిక పాలన విభాగాల వారి నుండి అవసరమైన అన్ని అనుమతులు  పొందడానికి గాను త‌గిన చొర‌వతో ముంద‌డుగు వేసింది. వీరు త‌యారు చేసే ఆయా వస్తువుల రవాణాకు అవ‌స‌ర‌మైన అనుమతులు తీసుకొంది. కోవిడ్ -19 వ్యాప్తి మధ్య సంక్రమణను నివారించడానికి క‌చ్చితంగా పాటించాల్సిన నివారణ పద్ధతుల గురించి కళాకారులకు అవ‌గాహ‌న కూడా క‌ల్పించింది.
సబ్బులు, మాస్క్‌లు, శానిటైజర్‌ల తయారీ దిశ‌గా ప్రోత్సాహం..
కోవిడ్‌-19 నేప‌థ్యంలో సబ్బులు, ఫేస్ మాస్క్‌లు మరియు శానిటైజర్‌ల తయారీ దిశ‌గా కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ‌ నిత్యావసరపు వస్తువుల అమ్మకం కోసం ప్రభుత్వ విభాగాలు, ఇత‌ర సంస్థల వారితో కూడా ట్రైఫెడ్ సంప్ర‌దింపుల‌ను జ‌రుపుతోంది. ట్రైబ్స్ ఇండియా వెబ్‌సైట్‌, జీఈఎం వంటి అందుబాటులో ఉన్న ఈ-కామర్స్ మార్గాలను కూడా ట్రైబ్స్ ఇండియా విస్త‌రించింది. సబ్బులు, మాస్క్‌లు మరియు శానిటైజర్ల ఉత్పత్తిలో నిమగ్నమైన సరఫరాదారులందరూ ట్రైఫెడ్‌తో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారు. ఇది ఆయా వస్తువుల లభ్యతను అంచనా వేయడానికి గాను దోహ‌ద‌పడుతోంది. మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో ట్రైఫెడ్ సంస్థ ఇటీవల దాదాపు 5000 మంది చేతివృత్తుల కుటుంబాలకు ఉచిత రేషన్‌ను పంపిణీ చేసింది.

 


ఫొటో రైట‌ప్ః న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌ గ్రామంలో రేషన్ కిట్ల పంపిణీ

*****



(Release ID: 1628802) Visitor Counter : 267