ప్రధాన మంత్రి కార్యాలయం

స్పిక్ మైకే అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి.

130 కోట్ల మంది కలిసి వచ్చినప్పుడు అది సంగీతం అవుతుంది : ప్రధానమంత్రి


దేశ సమిష్టి బలానికి సంగీతం మూలంగా మారింది : ప్రధానమంత్రి

Posted On: 01 JUN 2020 7:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈ రోజు స్పిక్ మైకే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, సంగీతకారుల ఉత్సాహం నిరాటంకంగా కొనసాగుతోంది.   కోవిడ్-19 మహమ్మారి కారణంగా యువతలో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఈ సమావేశం యొక్క ఇతివృత్తం దృష్టి సారించిందని ప్రధాని ప్రశంసించారు.

చారిత్రాత్మకంగా పరిశీలిస్తే, యుద్ధం మరియు సంక్షోభ సమయాల్లో,  సంగీతం ఒక ఉత్తేజకరమైన పాత్రను మరియు సమైక్య పాత్రను ఎలా పోషించిందో ఆయన గుర్తు చేశారు.

అలాంటి సమయాల్లో ప్రజల నుండి శౌర్యాన్ని బయటకు తీసుకురావడానికి, కవులు, గాయకులు, కళాకారులు పాటలు మరియు సంగీతాన్ని ఎల్లప్పుడూ రచిస్తూ ఉండేవారని ఆయన అన్నారు. 

ప్రపంచం అదృశ్య శత్రువుతో పోరాడుతున్న ప్రస్తుత సమయంలో కూడా గాయకులు, గీత రచయితలు మరియు కళాకారుల రచనలు, పాటలు పాడటం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో మొత్తం దేశాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మ్రోగించడం, శంఖం ఊద డం వంటి కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారో ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

130 కోట్ల మంది ప్రజలు ఒకే రకమైన భావాలు, భావోద్వేగాలతో కలిసి వచ్చినప్పుడు అది కూడా సంగీతంగా మారుతుందని ఆయన అన్నారు.

సంగీతంలో సామరస్యం, క్రమశిక్షణ అవసరం ఉన్నట్లే, కరోనా మహమ్మారిపై పోరాడటానికి ప్రతి వ్యక్తికీ ఇలాంటి సామరస్యం, నిగ్రహం, క్రమశిక్షణ ఉండవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఈ సంవత్సరం స్పిక్ మైకే సదస్సులో ప్రకృతి నడక, వారసత్వ నడక, సాహిత్యం, సంపూర్ణ ఆహారం, యోగా, నాద్ యోగా వంటి కొత్త అంశాలను ప్రవేశపెట్టినందుకు ఆయన ప్రశంసించారు.

నాద యోగా గురించి వివరిస్తూ, భారతదేశంలో,  సంగీతానికి, స్వీయ శక్తికి ప్రాతిపదికగా నాదం పరిగణించబడుతోందని, ఆయన చెప్పారు.

యోగా మరియు సంగీతం ద్వారా మన అంతర్గత శక్తిని నియంత్రించేటప్పుడు ఈ నాదం దాని ఆరోహణం లేదా బ్రహ్మనాదానికి  చేరుకుంటుందని ఆయన అన్నారు.

సంగీతం, యోగా రెండూ ధ్యానం మరియు ప్రేరణ యొక్క శక్తిని కలిగి ఉండటానికి కారణం, ఆ రెండూ అపారమైన శక్తి వనరులని ప్రధానమంత్రి తెలిపారు. 

సంగీతం ఆనందానికి మూలంగానే కాకుండా, సేవా సాధనంగా మరియు తపస్సు యొక్క రూపంగా కూడా ఉందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

మానవాళికి సేవ చేయడానికి తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప సంగీత విద్వాంసులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారని ఆయన అన్నారు.

ప్రాచీన కళను, సంగీతాన్ని నేటి ఆధునిక సాంకేతికతతో మేళవించడం కూడా ఈ కాలపు డిమాండ్ అని ప్రధానమంత్రి అన్నారు.

రాష్ట్రాలు మరియు భాషల సరిహద్దులకు మించి, నేడు సంగీతం 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' యొక్క ఆదర్శాన్ని గతంలో కంటే ఎక్కువగా  బలపరుస్తోందని ఆయన అన్నారు.

ప్రజలు తమ సృజనాత్మకత ద్వారా సోషల్ మీడియాలో కొత్త సందేశాలను ఇస్తున్నారని, కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న ప్రచారాన్ని మరింత పెంచుతున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. 

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మన పోరాటంలో ఈ సమావేశం కొత్త దిశను ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

*****(Release ID: 1628541) Visitor Counter : 394