రక్షణ మంత్రిత్వ శాఖ
ఫ్రాన్స్ సాయుధ బలగాల మంత్రితో సంభాషించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్
భారత్ ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడానికి అంగీకారం
प्रविष्टि तिथि:
02 JUN 2020 2:26PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఎంఎస్ ఫ్లోరెన్స్ పార్లీతో టెలిఫోన్ సంభాషణ జరిపారు. వారు కోవిడ్-19 పరిస్థితి, ప్రాంతీయ భద్రతతో సహా పరస్పర ఆందోళనకు సంబంధించిన విషయాలపై చర్చించారు. భారతదేశం, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇరు దేశాల సాయుధ దళాల కృషిని ఇరువురు మంత్రులు ప్రశంసించారు.
కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ, రాఫెల్ విమానాలను సకాలంలో అందజేయడానికి ఫ్రాన్స్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
2020 నుండి 2022 వరకు హిందూ మహాసముద్ర నావికా సింపోజియం (ఐఓఎన్ఎస్) ఫ్రెంచ్ ఛైర్మన్‌షిప్‌ను రక్షణ మంత్రి ఆహ్వానించారు. 2018 నాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ జాయింట్ స్ట్రాటజిక్ విజన్ నెరవేర్చడానికి ఇరువురు మంత్రులు కలిసి పనిచేయడానికి అంగీకరించారు.
(रिलीज़ आईडी: 1628669)
आगंतुक पटल : 297
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Kannada
,
Malayalam