రక్షణ మంత్రిత్వ శాఖ
ఓపీ సముద్ర సేతు - ఐఎన్ఎస్ జలాశ్వ భారతీయులను టుటికోరిన్ కి తేవడానికి కొలొంబోలో బయల్దేరింది
Posted On:
01 JUN 2020 9:53PM by PIB Hyderabad
685 మంది భారతీయ పౌరులను తమిళనాడులోని టుటికోరిన్ నౌకాశ్రయానికి చేర్చడానికి భారత నావికాదళ షిప్ జలాశ్వ 01 జూన్ సాయంత్రం శ్రీలంకలోని కొలంబోలో బయలుదేరింది.
భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ వందే భారత్ ఆధ్వర్యంలో భారత నావికాదళ ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా ఈ నౌక ఇపుడు తన మూడవ పర్యటనలో ఉంది; విదేశాల నుండి సముద్ర తీరం ద్వారా భారతీయ పౌరులను ఇంటికి తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ఐఎన్ఎస్ జలాశ్వ ఈ రోజు ఉదయం కొలంబో నౌకాశ్రయంలోకి ప్రవేశించింది, ఇప్పటికే కొలంబోలోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్న భారతీయ పౌరులను తూర్పు కంటైనర్ టెర్మినల్ వద్ద షిప్ లో ఎక్కించారు.
షిప్ ఎక్కిన వారందరికీ వైద్యపరీక్షలు చేశారు. ఐడిలను కేటాయించారు, వారి సామాను ఓడ ఎక్కే ముందు శానిటైజ్ చేశారు.
ఈ రోజు బయలుదేరిన 685 మందిలో 553 మంది పురుషులు, 125 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. సముద్రయానంలో సరైన క్వారంటైన్ నిబంధనలు పాటించేలా ప్రత్యేకంగా కేటాయించిన జోన్ల వారీగా ఓడలో వారికి వసతి కల్పించారు. ఇతర సామాజిక దూరం, క్రిమిసంహారక మరియు భద్రతా ప్రోటోకాల్‌లను కూడా ఓడ సిబ్బంది ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నౌక జూన్ 02, 2020 టుటికోరిన్ చేరుకుంటుంది.
*****
(Release ID: 1628543)
Visitor Counter : 283