PIB Headquarters
కోవిడ్-19 పిఐబి, డైలీ బులిటన్
Posted On:
08 DEC 2020 5:36PM by PIB Hyderabad
* 5 నెలల విరామం తర్వాత దేశంలో రోజువారీ కోవిడ్ కొత్తకేసుల సంఖ్య తక్కువగా నమోదు
* 26,567 కొత్తకేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి. కొత్తగా కోవిడ్‌నుంచి కోలుకున్న కేసులు 39,045 నమోదు.
* మొత్తంయాక్టిక్‌కేస్‌లోడ్3.83 లక్షలు, ఇది 4 శాతం కంటే తక్కువ
* మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది- రోజువారి మరణాలు 400 లోపుకు చేరుకున్నాయి.
*రికవరీ రేటు 94.5 శాతానికి మెరుగుపడింది.
*కోవిడ్ -19 వాక్సిన్ అభివృద్ధిలో ఇండియా ముందువరుసలో ఉంది. : డాక్టర్ హర్షవర్ధన్
5 నెలల విరామం అనంతరంకొత్తకోవిడ్ కేసులు రికార్డుస్థాయిలో తక్కువగా నమోదు.
మొత్తం యాక్టివ్ కేస్‌లోడ్ 3.83 లక్షలు. ఇది నాలుగు శాతం మార్కుకంటే దిగువకు చేరిక
క్రమంగా తగ్గుతున్న కోవిడ్ మరణాల సంఖ్య . రోజువారీ కోవిడ్ మరణాలు 400 కంటే తక్కువ
కోవిడ్ పై పోరాటంలో ఇండియా కీలకమైన మైలురాయిని దాటింది. గత 24 గంటలలొ కొత్తగా నిర్ధారణ అయిన కోవిడ్ కేసుల సంఖ్య 27,000 దిగువకు (26,567) చేరాయి. 2020 జూలై 10 కొత్త కోవిడ్ కేసులు 26,506 గా ఉండేవి. మరో విజయం ఏమంటే, ఇండియా యాక్టివ్ కేస్‌లోడ్ ఈరోజు నాలుగుశాతం దిగువకు చేరింది. యాక్టివ్‌కేసులు గణనీయంగా 3.83 లక్షల దిగువకు చేరాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,83,866 కు చేరాయి. ఇవి మొత్తం కేసులలో 3.96 శాతం. గత 24 గంటలలో కోవిడ్ నుంచి 39,045 మంది కోలుకున్నారు. దీనితో గత 24 గంటలలో మొత్తం యాక్టివ్ కేస్‌లోడ్ నుంచి 12,863 కేసులు నికరంగా తగ్గాయి . రోజువారీ కొత్త కేసుల కన్న కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. రికవరీ కేసుల రేటు ఈరోజు 94.59 శాతంగా ఉంది. మొత్తం కోలుకున్న కేసులు ఈరోజు 91,78,946 గా ఉ న్నాయి. 76.31 శాతం కొత్తగా కోలుకున్న కేసులు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి. కోవిడ్ నుంచి 7,345 మంది ఈరోజు మహారాష్ట్రలో కోవిడ్‌నుంచి కోలుకుని ముందు వరుసలో నిలువగా, కేరళలో 4,705 మంది కోలుకున్నారు. ఢిల్లీలో 3,818 మంది కొత్తగా కోలుకున్నారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొత్త కేసులలో 72.5ం శాతం కలిగి ఉ న్నాయి. కేరళ గత 24 గంటలలో 3,272 కేసులను నమోదు చేసింది. మహారాష్ట్ర 3,075 కొత్త కేసులు నమోదు చేసింది. పశ్చిమబెంగాల్ 2,214 కొత్త కేసులు నిన్న నమోదుచేసింది. గత 24 గంటలలో నమోదైన 385 మరణాలలో 75.58 శాతం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే ఉన్నాయి. కొత్తగా సంభవించిన మరణాలలో 16.36 శాతం ఢిల్లీ నుంచి ఉన్నాయి. అవి 63 మరణాలు. పశ్చిమ బెంగాల్ లో మరణాల సంఖ్య 48 కాగా, మహారాష్ట్రలో 40 మరణాలు కొత్తగా నమోదయ్యాయి. రోజువారీ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నది. గడచిన 24 గంటలలో కొత్తగా 400 మరణాల కంటే తక్కువ నమోదు అవుతూ వచ్చాయి.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679072
కోవిడ్ వాక్సిన్ అభివృద్ధిలో ఇండియా ముందువరుసలో ఉంది. : డాక్టర్ హర్షవర్ధన్
ఇండియాలో 30 వాక్సిన్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయని కేంద్ర శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక, భూ విజ్ఞానం, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. నిన్న డిఎస్‌టి-సిఐఐ ఇండియా పోర్చుగల్ టెక్నాలజీ సమ్మిట్ 2020 ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. పోర్చుగల్ భాగస్వామ్య దేశంగా ఇది ఫ్లాగ్‌షిప్ ఈవెంట్. ఇండియాలో వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న 30 వాక్సిన్‌లలో రెండు అత్యంత అడ్వాన్సు దశలో ఉ న్నాయని ఆయన అన్నారు. కోవాక్సిన్‌ను ఐసిఎంఆర్- భారత్ బయోటెక్ కోలాబరేషన్‌తో రూపుదిద్దుకుంటుండగా, కోవిషీల్డ్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. రెండూ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రితెలిపారు. మన ప్రముఖ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌మెడికల్ రీసెర్చి ప్రయోగాల అమలులో భాగం పంచుకుంటున్నదన్నారు. అన్ని ప్రధాన వాక్సిన్ పోటీదారుల క్లినికల్ ట్రయల్స్‌కు ఇండియా ఆతిథ్యం ఇస్తోందన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున వాక్సిన్ తయారు చేసే సంస్థ. ఇది ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ తయారు చేసిన వాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నది. అలాగే జైడూస్‌కాడిలా కూడా పిహెచ్ 2 ట్రయల్స్ నిర్వహిస్తోంది. మన దేశానికి చెందిన ఫార్మా సంస్థ డాక్టర్‌రెడ్డీస్ లేబరెటరీస్, రష్యన్ వాక్సిన్‌ను తుది దశ మానవ ప్రయోగాలు అయిన అనంతరం ఇండియాలో పంపిణీ చేయనుంది. ఇది రెగ్యులేటరీ అనుమతులు పొందనుంది. ఇక ప్రపంచంలో పేటెంట్లు దాఖలు చేసిన టాప్ 10 దేశాలలో ఇండియా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కోవిడ్‌పై పోరాటం విషయంలో ఇండియా కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆయన , ప్రభుత్వ మద్దతుతో సుమారు 100 కుపైగా స్టార్టప్‌లు కోవిడ్ -19 విసిరిన సవాలుకు వినూత్న ఉత్పత్తులను అందించాయని, వినూత్న పరిష్కారాలు సూచించాయని అన్నారు.
మరిన్ని వివరాలకు:
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678972
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసి) 2020 నుద్దేశించి ఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. ఐఎంసి 2020 థీమ్ ఇన్‌క్లూజివ్ ఇన్నొవేషన్- స్మార్ట్, సెక్యూర్, సస్టెయినబుల్. ఇది ప్రధానమంత్రి దార్శనికతతో కూడిన ఆత్మనిర్భర్ భారత్‌ను , డిజిటల్ సమగ్రతను ప్రోత్సహించేందుకు , సుస్థిర అభివృద్ధి , ఎంటర్‌ప్రెన్యుయర్ షిప్, ఇన్నొవేషన్ కు సంబంధించినది. ఇది విదేశీ, స్థానికపెట్టుబడులపై దృష్టిపెట్టడమే కాక, పరిశోధన ,అభివృద్ధిని టెలికం రంగంలో ,కీలక సాంకేతిక రంగాలలోప్రోత్సహిస్తుంది, ఈ ఈవెంట్‌నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఇండియాను టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీ కి సంబంధించి గ్లోబల్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు కలసిపనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సాంకేతికతలో నిరంతరం మెరుగుపడుతుండడంతో మనం వాడే ఉపకరణాలను నిరంతరం మార్చాల్సి వస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.మొబైల్ టెక్నాలజీ వల్ల ఇవాళ బిలయన్లడాలర్ల విలువగల ప్రయోజనాలను లక్షలాదిమంది భారతీయులకు అందుబాటులోకి తేవడానికి వీలు కలిగిందని ప్రధానమంత్రి తెలిపారు. దీని ద్వారా మనం పేదలకు కోవిడ్ మహమ్మారి సమయంలో త్వరగా సాయం అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడిందన్నారు. బిలియన్ల కొద్దీ నగదు రహిత లావాదేవీలను మనం కోవిడ్ మహమ్మారి సమయంలో చూశామని, ఇది పారదర్శకతకు వీలుకల్పించిందని,అలాగే దేశంలో మొబైల్ తయారీలో విజయం సాధించడానికి ఉపయోగపడిందని అన్నారు. మొబైల్ తయారీ రంగానికి సంబంధించి అత్యంత ప్రియమైన గమ్యంగా భారత రూపుదిద్దుకుంటున్నదని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679049
ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధానమంత్రి ప్రసంగం
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679048
ఇన్వెస్ట్ ఇండియాను అభినందించిన ప్రధానమంత్రి
ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు 2020 ని గెలుచుకున్నందుకు ఇన్వెస్ట్ ఇండియాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. 2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డును ఇన్వెస్ట్ ఇండియా గెలుచుకున్నందుకు అభినందనలు అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ అవార్డును యుఎన్‌సిటిఎడి అందజేస్తుంది. ఇండియాను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా చేయడం, సులభతర వ్యాపారాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింనందుకు లభించిన యోగ్యతాపత్రమని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679048
పెట్టుబడుల ప్రోత్సాహక అవార్డు 2020 విజేతగా ఇన్వెస్ట్ ఇండియాను ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి (యుఎన్‌సిటిఎడి) ఇన్వెస్ట్ ఇండియా- జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీ ఆఫ్ ఇండియాను 2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడులు ప్రోత్సాహక అవార్డు విజేతగా ప్రకటించింది. ఈ అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 7, 2020న జెనీవాలోని యుఎన్‌సిటిఎడి ప్రధాన కార్యాలయం లో జరిగింది.
ఈ అవార్డు , ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీల (ఐసిఎ) అత్యుత్తమ విధానాలకు గుర్తింపుగా ఇస్తారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678979
, ఖతార్ అమీర్ హిజ్ హైనెస్ షేక్ తమీమ్ బిన్‌హమద్ అల్ -తనిలో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ిన్ హమద్ అల్ తనితో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రధానమంత్రి ఆయనకు రానున్న ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ఖతార్ అమీర్ , కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్‌లోని భారతీయులు , ఖతార్‌జాతీయ ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇరువురు నాయకులూ ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం, ఇంధన భద్రత వంటి అంశాలలో ఇరుదేశాల మధ్య అద్భుత సహకారం గురించి చర్చించారు. అలాగే ఈ అంశాలలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలను వారు సమీక్షించారు. ఇరువురు నాయకులూ తరచూ సంప్రదింపులు జరుపుకుంటుండాలని, కోవిడ్-19 పరిస్థితులు కుదుటపడిన తర్వాత ముఖాముఖి కలుసుకోవాలని ఇరువురు నాయకులూ అంగీకరించారు.
మరిన్ని వివరాలకు :
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679071
---------------
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌మాక్రాన్‌ల మధ్య టెలిఫోన్ సంభాషణ.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హిజ్ ఎక్సలెన్సీ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తో నిన్న టెలిఫోన్‌లో సంభాషించారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి తమ సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలిజం వంటి వాటికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ సాగించే పోరాటానికి ఇండియా పూర్తి మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇరువురు నాయకులూ పరస్పర ప్రయోజనకరమైనద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. ఈ సందర్బంగావారుకోవిడ్ -19 వాక్సిన్ అందుబాటు, చౌకగాలభ్యత , కోవిడ్ అనంతర పరిస్థితులలో ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, ఇండియా -పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం,సముద్ర మార్గ భద్రత, రక్షణ రంగ సహకారం, డిజిటల్ ఎకానమీ, సైబర్ భద్రత, బహుళపక్షవిధానాన్ని బలోపేతం చేయడం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన అనంతరం ప్రాన్స్ అద్యక్షుడు మార్కాన్ భారత్‌లో పర్యటించాలన్న ఆకాంక్షను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678978
-
ఉపరాష్ట్రపతి చొరవతో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు వైద్య నిపుణులను పంపుతున్న కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో గత కొద్దిరోజులుగాపెద్ద సంఖ్యలో పిల్లలు అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రి పాలౌతుండడంతో , ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయడు ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో మాట్లాడారు. దీనితో కేంద్రం వెంటనే ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏలూరుకు వెంటనే పంపుతున్నది.
300 మందికి పైగా చిన్నారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన వార్తలను గమనించి ఉపరాష్ట్రపతి తొలుత , జిల్లాకలెక్టర్‌తో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి మంగళగిరి ఎయిమ్స్ డైరక్టర్‌తో, ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్‌తో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన పిల్లల రక్త నమూనాలను ఢిల్లీకి పంపినట్టు వారి దృష్టికి వచ్చింది. అనంతరం ఉపరాష్ట్రపతి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తో మాట్లాడి బాధిత చిన్నారులకు , వ్యాధినిర్ధారణ, చికిత్స అందించడం విషయంలో తగిన సహాయం అందించాల్సిందిగా కోరారు.. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన వెంటనే చిన్నారుల అనారోగ్యానికి గల కారణాలను కనుగొని చికిత్సకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి , ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడుకు హామీ ఇచ్చారు. రక్తనమూనాల పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి, అలాగే ఎయిమ్స్ డైరక్టర్ లు ఉపరాష్ట్రపతికి హామీ ఇచ్చారు. పిల్లలు వాంతులు, తలనొప్పి, స్పృహతప్పిపడిపోవడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
మరిన్ని వివరాలకు :
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678887
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి అందిన సమాచారం
అస్సాం: అస్సాంలో నిన్న మరో 161 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. 131 మంది నిన్న కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 213925 కు చేరింది. కోవిడ్ నుంచికోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన మొత్తం కేసులు 2,09,342 . యాక్టివ్‌కేసులు 3585, మరణాలు 995.
కేరళ : కేరళలో సంస్థల ఎన్నికలలో ఈరోజు తొలిదశ ఎన్నికలలో 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయింది. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ ఎన్నికలు నిర్వహించారుఉ. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన అనంతరం జరిగిన తొలి ఎన్నికలు ఇవి . ఈరోజు 5 జిల్లాలలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్‌పై కోవిడ్ ప్రభావం ఉంటుందని తొలుత భావించినప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు తోడు, కోవిడ్ -19 పేషెంట్లను రెగ్యులర్ ఓటర్లు ఓటు చేసిన తర్వాత ఓటువేసేందుకు అనుమతించారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి క్వారంటైన్‌కు వెళ్లిన వారిని పిపిఇ కిట్లు ధరించి ఓటు వేసేందుకు అనుమతించారు. అలప్పుజ, పథనంతిట్ట జిల్లాలలో ఇద్దరు పోలింగ్‌బూత్‌లో కుప్పకూలి మరణించారు. రాష్ట్రరాజధానిలో ఛీఫ్ ఎలక్ట్రొరల్ ఆఫీసర్ టీకా రామ్‌మీనా ఓటు రాజధాని ఒటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆయన సంబంధిత అధికారుల వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు.
తమిళనాడు : రైతుల నిరసనలకు మద్దతుగా తమిళనాడులోని పుదుక్కోటై, తిరువారూరు, మైలలదుతురై, సిర్కాజి, ఈరోడ్, సత్యమంగళం, కాంచీపురం, చెంగల్పట్టు, తంజావూరు,కరూరు జిల్లాలలో 50 శాతం దుకాణాలు దాదాపు మూసివేశారు. కాఆ 1312 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 1389 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 16 మంది నిన్న కోవిడ్‌కారణంగా మరణించారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 7,91,552 కుచేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,695 కు చేరింది. కోవిడ్ మరణాలు 11,809 కుచేరాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారు 7,69,048 గా ఉ న్నారు.
కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితిని అంచనావేసి విద్యాగమ ను తిరిగి ప్రారంభించే అంశంపై 10 రోజులలోగా నిర్ణయం తీసుకోవలసిందిగా కర్ణాటక హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. టెక్నాలజీ,ఇంటర్నెట్ సదుపాయంలేని విద్యార్ధులు , ప్రత్యేకించి గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాలలోని విద్యార్ధుల కోసం విద్యాగమ పథకాన్ని నిర్దేశించారు.
ఆంధ్రప్రదేశ్ : పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో అంతుచిక్కనివ్యాధితో అనారోగ్యం పాలైన వారికి సంబంధించి జరిపిన పరీక్షల గురించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల నమూనాలలో లెడ్, నికెల్ కనిపించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఐఐసిటి కూడా పరీక్షలు నిర్వహించినందున దాని ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయన్నారు.అంతుచిక్కని వ్యాధికి కారణాలు తెలసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు.
తెలంగాణ : తెలంగాణాలో 682 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 761 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు 2,74,540 కాగా, యాక్టివ్‌కేసులు 7,696, మరణాలు 1477 , వ్యాధినుంచి డిశ్చార్జి అయిన వారు 2,65,367.
మహారాష్ట్ర :
మహారాష్ట్రలో రోజువారీ కోవిడ్ -19 కేసులు పడిపోయాయి. అయితే ముంబాయి మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎం.ఎం.ఆర్),ముంబాయి పరిసర ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో కోవిడ్ కారణంగా బాగా ప్రభావితమైన ప్రాంతం ఎంఎంఆర్ ప్రాంతం. డిసెంబర్ 7న నమోదైన మొత్తం 3,075 కోవిడ్ కేసులలో 1,050 కేసులు ఎం.ఎం.ఆర్ నుంచే నమోదయ్యాయి. (34.14 శాతం )
గుజరాత్ :
గుజరాత్‌లో ని అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. అంతకు ముందు, రాత్రి కర్ప్యూ నవంబర్ 23నుంచి అమలులో ఉంది. దీనిని డిసెంబర్ 7 వరకు పొడిగించారు. కాగా రాత్రి కర్ఫ్యూను తిరిగి ఉత్తర్వులు జారీచేసే వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాత్రి కర్ఫ్యూనుంచి కొన్ని సర్వీసులను మినహాయించారు. కొత్త ఆదేశాల ప్రకారం పోలీసు, సివిల్ డిఫెన్సు, కేంద్ర సాయుద బలగాలు, ఆగ్నిమాపక, అత్యవసర సేవలు, హోం గార్డులు, మీడియా సంస్థలు, ఎటిఎం కార్యకలాపాలు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలను రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయించారు.
రాజస్థాన్ : రాజస్థాన్ మరో 19 కరోనా సంబంధిత మరణాలు సంభవించాయి. దీనితో కరోనా మరణాల సంఖ్య 2,448 కి చేరింది. కొత్తగా 1927 కోవిడ్ కేసులు నమోదు కావడంతో సోమవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 2,82,512 కు చేరాయి. ప్రస్తుతం 21,671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ కోవిడ్ నుంచి 2,58,393 మంది కోలుకున్నారు. 1927 కొత్తకోవిడ్ కేసులలో 475 జైపూర్‌నుంచి నమోదు కాగా, 203 జోధ్‌పూర్‌నుంచి 137 కోట నుంచి 96 భరత్‌పూర్‌నుంచి 89 నాగౌర్ నుంచి 84 ఉదయ్‌పూర్‌నుంచి, 78 అల్వార్ నుంచి నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ,ఇండోర్‌లో సోమవారం నుంచి ఆంక్షలను మరింతగా సడలించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించనున్నారు. వీరు తమ కార్యకలాపాలను రాత్రి పది గంటల వరకు కొనసాగించుకునేందుకు అనుమతించనున్నారు. ఇంతకు ముందు కరోనా కారణంగా వాణిజ్య సముదాయాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతించేవారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం నాడు 1307 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో కోవిడ్ వైరస్‌సోకిన వారి సంఖ్య 2,15, 957 కుచ ఏరింది. మరో 10 మంది వైరస్ బారినపడి మరణించారు. గడచిన 24 గంటలలో మొత్తం 1245 మంది పేషెంట్లు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,99,167 కు చేరింది.
ఛత్తీస్‌ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లో కోవిడ్ -19 వైరస్ కు సంబంధించిన వివిధ పరీక్షల రేట్లు తగ్గించారు. కొత్త రేట్లు అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, పాథాలజీ కేంద్రాలలో తక్షణం అమలులోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీచేసింది. అంతకు ముందు ఆర్‌టిపిసిఆర్ పరీక్షల వ్యయం రూ 1600 ఉండగా దానని ప్రస్తుతం రూ 750 కి తగ్గించారు. అలాగే రాపిడ్ యాంటిజెన్ పరీక్ష విషయంలో రేటును 400 రూపాయలకు తగ్గించారు. దీనికి తోడు ట్రూనాట్ పరీక్ష ధరను రూ 1500లకు తగ్గించారు.
గోవా : గోవాలో కరోనా వైరస్ కేస్‌లోడ్ సోమవారం నాడు 90 పెరిగి 48,776 కు చేరింది. మరోవైపు ముగ్గురు పేషెంట్లు కోవిడ్ కారణంగా మరణించారు. కొత్తగా 154 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య701 కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 46,778 గా ఉంది. యాక్టివ్ కేసులు 1297 . మొత్తం 1575 శాంపిళ్లు నిన్న పరీక్షించారు.
*******
(Release ID: 1679237)
Visitor Counter : 323