ప్రధాన మంత్రి కార్యాలయం

ఇన్వెస్ట్ ఇండియా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 08 DEC 2020 9:42AM by PIB Hyderabad

యునైటెడ్ నేశన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ ఎండ్ డెవలప్ మెంట్ (యుఎన్ సిటిఎడి) ఇచ్చే 2020 యునైటెడ్ నేశన్స్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోశన్ అవార్డు ను గెలుచుకొన్నందుకు గాను ఇన్వెస్ట్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘యుఎన్ సిటిఎడి అందించే 2020 యునైటెడ్ నేశన్స్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోశన్ అవార్డు ను గెలుచుకొన్నందుకు గాను ఇన్వెస్ట్ ఇండియా కు అభినందనలు.  ఇది భారతదేశాన్ని ప్రపంచం లో పెట్టుబడి కి ప్రాధాన్య గమ్యస్థానం గా తీర్చిదిద్దడానికి, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మా ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ కు ఒక నిదర్శనం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

***(Release ID: 1679048) Visitor Counter : 12