ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు ఫ్రాన్సు అధ్యక్షుడు గౌరవనీయులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 07 DEC 2020 10:10PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ‌తో టెలిఫోన్ లో మాట్లాడారు. 

ఫ్రాన్సు ‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధానమంత్రి, ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ ‌కు సంతాపం తెలియజేశారు.  తీవ్రవాదం, ఉగ్రవాదం, విప్లవ వాదాలకు వ్యతిరేకంగా ఫ్రాన్సు చేస్తున్న పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతునిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.

కోవిడ్-19 వ్యాక్సిన్లు సరసమైన ధరల్లో, అందుబాటులో ఉండే విధంగా పరిస్థితిని మెరుగుపరచడం;  కోవిడ్ అనంతర ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం; భారత-పసిఫిక్ ప్రాంతంలో సహకారం;  సముద్ర భద్రత, రక్షణ సహకారం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రతతో పాటు, బహుపాక్షికత, వాతావరణ మార్పు, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడంతో సహా, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా ఇరువురు నాయకులు చర్చించారు. 

ఇటీవలి సంవత్సరాలలో భారత-ఫ్రాన్సు దేశాల మధ్య నెలకొన్న పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.  కోవిడ్ అనంతర కాలంలో కూడా ఇదే విధంగా కలిసి పనిచేయాలని వారు అంగీకరించారు.

ప్రజారోగ్య పరిస్థితులు సాధారణ స్థాయికి చేరిన తరువాత భారతదేశంలో అధ్యక్షుడు మాక్రాన్‌కు స్వాగతం పలకాలన్న తమ ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

*****


(Release ID: 1678978) Visitor Counter : 308