ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి కి, కతర్ అమీర్ మాన్య శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ కి మధ్య టెలిఫోన్ లో జరిగిన సంభాషణ

Posted On: 08 DEC 2020 1:55PM by PIB Hyderabad

కతర్ అమీర్ మాన్య శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్-ధానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.


రాబోయే కతర్ జాతీయ దినాన్ని పురస్కరించుకొని మాన్య శ్రీ అమీర్ కు ప్రధాన మంత్రి తన అభినందనలను తెలిపారు. అభినందనలను వ్యక్తం చేసినందుకుగాను ప్రధాన మంత్రి కి మాన్య శ్రీ అమీర్ ధన్యవాదాలు పలుకుతూ, జాతీయ దిన వేడుకల లో కతర్ లోని భారతీయ సముదాయం ఉత్సాహం తో పాలుపంచుకొంటుందంటూ మెచ్చుకొన్నారు.  ఇటీవలే ముగిసిన దీపావళి పండుగ ను గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి కి ఆయన తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. 

పెట్టుబడి ప్రవాహాలు, శక్తి సంబంధిత సురక్ష రంగాల లో రెండు దేశాలకు మధ్య గల పటిష్ట సహకారాన్ని గురించి నేతలు ఇరువురు చర్చించడం తో పాటు, ఈ విషయం లో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలను కూడా సమీక్షించారు.  కతర్ ఇన్వెస్ట్ మెంట్ ఆథారిటి ద్వారా భారతదేశం లో పెట్టుబడులకు మార్గాన్ని సుగమం చేయడానికి గాను ఒక టాస్క్ ఫోర్స్ ను ప్రత్యేకం గా ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.  అంతేకాకుండా, భారతదేశం లోని యావత్తు శక్తి సంబంధిత వేల్యూ చైన్ లో కతార్ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలని కూడా వారు సంకల్పించారు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా తలెత్తిన సార్వజనిక స్వాస్థ్య స్థితి సాధారణ స్థాయి కి చేరుకొన్న తరువాత ముఖాముఖి భేటీ అవుదామని, క్రమం తప్పక సంప్రదింపులు జరుపుదామని నేతలు అంగీకరించారు.


***


(Release ID: 1679071) Visitor Counter : 262