ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
5 నెలల తరువాత భారత్ లో అతి తక్కువ కొత్త కోవిడ్ కేసులు
చికిత్సలో ఉన్నది 3.83 లక్షలమంది, మొత్తం కేసుల్లో 4% లోపు
కొనసాగుతున్న మరణాల తగ్గుదల, రోజువారీ మరణాలు 400 లోపు
Posted On:
08 DEC 2020 11:55AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ చెప్పుకోదగిన మైలురాయి దాటింది. గత 24 గంతలలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల లోపు (26,567) నమోదైంది. ఇలా జరగటం గత ఐదు నెలల్లో ఇది మొదటి సారి. 2020 జులై 10న 26,506 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రతిరోజూ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో బాటు మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండటం వల్ల చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలో 4% లోపుకు పడిపోవటం కూదా మరో మైలురాయి. చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గి 3.83 లక్షలకు (3,83,866 ) పడిపోయింది. ఇవి మొత్తం కేసుల్లో 3.96% మాత్రమే.
గత 24 గంటలలో 39,045 మంది కొత్తగా కోలుకున్నారు. దీనివలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య12,863 తగ్గింది. కొత్తగా కోలుకున్నవారు కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారికంటే ఎక్కువగా ఉండటం వల్ల కోలుకున్నవారి శాతం 94.59% కు చేరింది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 91,78,946 today. తాజాగా కోలుకున్నవారిలో 76.31% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే.
మహారాష్ట్రలో అత్యధికంగా 7,345 మంది నిన్న కోలుకోగా కేరళలో 4,705 మంది, ఢిల్లీలో 3,818 మంది కోలుకొని ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 72.50% కేవలం పది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. కేరళలో 3,272 కేసులు, మహారాష్ట్రలో 3,075 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 2,214 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
గత 24 గంటలలో 385 మంది కోవిడ్ వల్ల మరణించారు. వాళ్ళలో 75.58% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. అత్యధికంగా ఢిల్లీలో 63 మరణాలు, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో 48 మంది, మహారాష్ట్రలో 40 మంది చనిపోయారు.
దేశంలో రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో చనిపోయిన కోవిడ్ బాధితుల సంఖ్య 400 లోపే ఉంది.
***
(Release ID: 1679072)
Visitor Counter : 238
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam