వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ అవార్డు 2020 విజేతగా ఇన్వెస్ట్ ఇండియాను ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

Posted On: 07 DEC 2020 7:20PM by PIB Hyderabad

ఐక్యరాజ్యసమితి (యుఎన్‌సిటిఎడి) 2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడి ప్రోత్సాహక అవార్డు విజేతగా.. ఇన్వెస్ట్ ఇండియా- నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియాను ప్రకటించింది. ఈ అవార్డు ప్రదానోత్సవం 2020 డిసెంబర్ 7 న జెనీవాలోని యుఎన్‌సిటిఎడి ప్రధాన కార్యాలయంలో జరిగింది.

ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీల (ఐపిఎ) అత్యుత్తమ విజయాలు మరియు ఉత్తమ పద్ధతులను గుర్తించి ఆ మేరకు విజేతను ఎంపిక చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీలు చేపట్టిన కార్యాక్రమాలను అంచనా వేయడం ఆధారంగా యుఎన్‌సిటిఎడి ఈ మూల్యాంకనాన్ని చేపట్టింది.

కొవిడ్-19 మహమ్మారి కారణంగా పెట్టుబడి ప్రోత్సాహక ఏజెన్సీలకు అనేక సవాళ్ల ఎదురయ్యాయి. సాధారణ పెట్టుబడి ప్రమోషన్ మరియు సంక్షోభ నిర్వహణ సదుపాయం, ప్రభుత్వ అత్యవసర మరియు ఆర్థిక ఉపశమన చర్యల నోటిఫికేషన్, సంక్షోభ సహాయ సేవలను అందించడం, జాతీయ కొవిడ్-19 రియాక్షన్ వంటివాటిపై అవి దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొరోనా సంక్షోభం కారణంగా ఏజెన్సీలు తమ కార్యాలయాలు మూసివేసి తమ సిబ్బందిని ఇంటి నుండి పని చేయమని కోరాయి. మహమ్మారికి ఐపిఎల ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి మార్చి 2020 లో యుఎన్‌సిటిఎడి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. 2020 ఏప్రిల్ మరియు జూలైలలో ఐపిఎ అబ్జర్వర్ ప్రచురణలలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీల నుండి యుఎన్సిటిఎడి ఉత్తమ పద్ధతులను నివేదించింది. మహమ్మారికి ఐపిఎల ప్రతిస్పందన 2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడి ప్రమోషన్ అవార్డు యొక్క మూల్యాంకనానికి అది ఆధారం అయ్యింది.

మహమ్మారి నేపథ్యంలో బిజినెస్ ఇమ్యునిటీ ప్లాట్‌ఫామ్, ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం వెబ్‌నార్ సిరీస్,  సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ మరియు కొవిడ్ ఫోకస్  ప్రతిస్పందన బృందాలు (వ్యాపార పునర్నిర్మాణం, వాటాదారుల  ఔట్రీచ్ మరియు సరఫరాదారు ఔట్రిచ్) వంటి మంచి పద్ధతులపై తన ప్రచురణలో యుఎన్సిటిఎడి  ప్రధానంగా దృష్టిపెట్టింది. పెట్టుబడి ప్రమోషన్లలో దీర్ఘకాలిక వ్యూహాలు, తను అవలంభించే విధానాలను ఇన్వెస్ట్ ఇండియా యుఎన్సిటిఎడితో పంచుకుంది.

ఈ ఐక్యరాజ్యసమితి పెట్టుబడి ప్రమోషన్ అవార్డు పెట్టుబడి ప్రోత్సాహక ఏజెన్సీలకు అత్యంత గౌరవనీయమైన అవార్డు.యూఎన్సిడిఏడి అనే ఏజెన్సీ ఐపిఎల పనితీరును పర్యవేక్షిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉత్తమ పద్ధతులను గుర్తిస్తుంది. జర్మనీ, దక్షిణ కొరియా మరియు సింగపూర్ దేశాలు ఈ అవార్డును గతంలో గెలుచుకున్నవి.

ఇన్వెస్ట్ ఇండియా యొక్క ఎండీ & సిఈవో మిస్టర్ దీపక్ బాగ్లా మాట్లాడుతూ, “భారతదేశాన్ని పెట్టుబడికి గమ్యస్థానంగా మార్చాలన్న గౌరవ ప్రధానమంత్రి ఆకాంక్షకు ఈ అవార్డు నిదర్శనం. ఈజీ ఆఫ్ లివింగ్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంపై ఆయన దృష్టి సారించినందుకు ఇది సాక్ష్యం."అని చెప్పారు.

***(Release ID: 1678979) Visitor Counter : 189