PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 19 NOV 2020 5:45PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

*  దేశంలో గ‌త 24 గంట‌ల‌లో 45,576 మంది కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డారు.
* దేశంలో 48,493 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో కోవిడ్ నికర కేసులు యాక్టివ్ కేస్‌లోడ్ నుంచి 2917 త‌గ్గాయి.
* కొత్త‌గా కోలుకున్న వారి సంఖ్య వ‌రుస‌గా ఈరోజు 47 వ‌రోజు కూడా కొత్త కేసుల కంటే , కోలుకున్న కేసులు  ఎక్కువ‌గా ఉన్నాయి.
*భార‌త‌దేశ క్రియాశీల కేసులోడ్ ఈరోజు 5 శాతం దిగువ‌కు ప‌డిపోయింది.
* రిక‌వ‌రీ రేటు ఈరోజు 93.58 శాతానికి మెరుగుప‌డింది.
*  2020-21 సంవ‌త్సరానికి ఎం.బి.బి.ఎస్‌,బి.డి.ఎస్ సీట్ల‌లో కేంద్రం కోటాలో  కోవిడ్ వారియ‌ర్ల పిల్ల‌ల ఎంపిక‌, నామినేష‌న్‌కు కొత్త కేట‌గిరీ ఏర్పాటు
*హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు ఉన్న‌త‌స్థాయి కేంద్ర బృందాల‌ను అత్య‌వ‌స‌రంగా పంపిన కేంద్రం

Image

కోవిడ్ నుంచి కోజూ కోలుకుంటున్న వారి సంఖ్య కొత్త కేసుల‌ను మించిపోవ‌డంతో, యాక్టివ్ కేస్‌లోడ్ త‌గ్గుతూ వ‌స్తోంది. యాక్టివ్ కేస్‌లోడ్ మొత్తం కేసులలో 5 శాతం దిగువ‌కు ప‌డిపోయింది.
గ‌త 24 గంట‌ల‌లో45,576 మంది ఇండియాలో కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఇండియా 48,493 కొత్త కేసులు కోలుకున్నాయి. దీనితో యాక్టివ్ కేస్‌లోడ్‌లో నిక‌రంగా 2,917 కేసులు త‌గ్గాయి. కొత్త రిక‌వ‌రీలు వ‌రుస‌గా గ‌త 47 రోజులుగా కొత్త‌కేసుల‌ను దాటిపోతున్నాయి. దీనితో ఇండియాలో యాక్టివ్ కేస్‌లోడ్ 5 శాతం దిగువ‌కు ప‌డిపోయింది. రోజువారీ కొత్త కోవిడ్ కేసుల కంటే కోలుకుంటున్న కేసులు ఎక్కువ ఉండ‌డంతో యాక్టివ్ కేస్‌లోడ్ భారీగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఇండియా ప్ర‌స్తుత కోవిడ్ యాక్టివ్ కేస్ లోడ్ 4,43,303. ఇది దేశ మొత్తం పాజిటివ్ కేసుల‌లో 4.95 శాతం మాత్ర‌మే. కొత్త రిక‌వ‌రీలు ప్ర‌తి 24 గంట‌ల‌లో కొత్త కేసుల‌ను మించిపోతున్నాయి. రిక‌వ‌రీ రేటు ఈరోజు 93.58 శాతానికి మెరుగుప‌డింది. దేశంలో మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 83,83 602 గా ఉంది. కోలుకున్న కేసులు, యాక్టివ్ కేసుల మ‌ధ్య వ్య‌త్యాసం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇది ప్ర‌స్తుతం 79,40,299 వ‌ద్ద ఉంది. కొత్త‌గా కోలుకున్న 77.27 శాతం కేసులు ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సంబంధించిన‌ది. కోవిడ్ నుంచి 7,066 మంది కోలుకుని కేర‌ళ అత్య‌ధిక రిక‌వ‌రీలను న‌మోదు చేసింది. ఢిల్లీ మ‌రో 6,091 రోజువారీ రిక‌వ‌రీల‌ను న‌మోదు చేసింది. మ‌హారాష్ట్ర 6,608 కొత్త రిక‌వ‌రీలు న‌మోదు చేసింది. ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు కొత్త కేసుల‌లో 77.28 శాతం న‌మోదు చేశాయి.
ఢిల్లీ గ‌త 24 గంట‌ల‌లో 7,486 కేసులు న‌మోదు చేసింది. కేర‌ళ 6,419 కొత్త కేసులు న‌మోదు చేసింది. మ‌హారాష్ట్ర నిన్న 5,011 కొత్త కేసులు న‌మోదు చేసింది. 585 మ‌ర‌ణాల‌లో 79.49 శాతం గ‌త 24 గంట‌ల‌లో ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌నుంచి న‌మోదు చేశాయి. 22.39 శాతం అంటే 131 కొత్త మ‌ర‌ణాలు ఢిల్లీ నుంచి న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో కూడా మూడంకెల స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.ప‌శ్చిమ‌బెంగాల్‌లో 54 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

మ‌రిన్ని వివ‌రాల‌కు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673962
-------------------
కోవిడ్ వారియ‌ర్ల పిల్ల‌ల‌కు 2020-21 సంవ‌త్స‌రానికి కేంద్రం కోటాలో ఎంబిబిఎస్‌,బిడిఎస్ సీట్ల‌కు ఎంపిక‌,నామినేష‌న్‌కు ప్ర‌త్యేక కేటగిరీకి కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఆమోదం.
2020-21 సంవ‌త్స‌రానికి కేంద్రం కోటాలో ఎంబిబిఎస్ సీట్ల‌కు, కోవిడ్ వారియ‌ర్ల పిల్ల‌ల కొత్త కేట‌గిరీని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పేర్కొంది. ఈ చ‌ర్య కోవిడ్ వారియ‌ర్లు, కోవిడ్ పేషెంట్ల‌కు చికిత్స‌, యాజ‌మాన్యం విష‌యంలో వారి పాత్ర‌కు గౌర‌వ‌నీయ‌మైన గుర్తింపు నిచ్చేందుకు ఈ చ‌ర్య ఉద్దేశించిన‌దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.ఇది కోవిడ్ వారియ‌ర్లంద‌రి త్యాగానికి గౌర‌వంగా ఉంటుంది. విధ‌ఙ నిర్వ‌హ‌ణ‌, మాన‌వ‌త్వంతో నిస్వార్థంగా వారు చేసిన త్యాగాల‌ను దీనిద్వారా గౌర‌వించుకోవ‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు. సెంట్ర‌ల్ పూల్ ఎంబిబిఎస్ సీట్ల‌ను కోవిఢ్ పై పోరులో ప్రాణాలు కోల్పోయిన లేదా, కోవిడ్ సంబంధిత విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించిన కోవిడ్‌ వారియ‌ర్ల పిల్ల‌ల‌నుంచి ఎంపిక‌, నామినేట్ చేస్తార‌న్నారు. కోవిడ్ వారియ‌ర్ అంటే ఎవరు అన్న దానిని భార‌త ప్ర‌భుత్వం, 50 ల‌క్ష‌ల ఇన్సూరెన్సు ప్యాకేజ్ ప్ర‌క‌టించిన‌ప్పుడే నిర్వ‌చించింద‌ని మంత్రి గుర్తుచేశారు. కోవిడ్ వారియ‌ర్లు అంటే అంద‌రు ఆరోగ్య సంర‌క్ష‌కులు, క‌మ్యూనిటీ ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వ‌స్తారు. కోవిడ్ -19 పేషెంట్ల‌తో నేరుగా కాంటాక్టుతో ఉండ‌వ‌ల‌సిన వారు, కోవిడ్‌-19 పేషెంట్ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లలో ఉన్న‌వారు, కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల సంర‌క్ష‌ణ‌లో ఈ వ్యాధి బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉన్నవారు ఉన్నారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల సిబ్బంది, రిటైర్ అయిన‌, వ‌లంటీర్‌, స్థానిక ప‌ట్ఠ‌ణ సంస్థ‌లు, కాంట్రాక్టు పై ఉన్న వారు, రోజువారీ కూలీలు, తాత్కాలిక సిబ్బంది, రాష్ట్రాలు నియ‌మించుకున్న‌ఔట్‌సోర్సు సిబ్బంది, కేంద్ర ఆస్ప‌త్రులు, కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన ఆస్ప‌త్రులు, ఎఐఐఎంఎస్‌, జాతీయ ప్రాధాన్య‌త గ‌ల సంస్థ‌లు, కోవిడ్ -19 సంబంధిత బాధ్య‌త‌ల కోసం బాధ్య‌త‌లు అప్ప‌గించిన కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల ఆస్ప‌త్రులు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేట‌గిరీ అర్హ‌త‌కు సంబంధించి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స‌ర్టిఫై చేయ‌వ‌ల‌సి ఉంటుంది.
మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674279


హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు అత్యున్న‌త‌స్థాయి కేంద్ర బృందాల‌ను అత్య‌వ‌స‌రంగా పంపిన కేంద్రం
హ‌ర్యానా, రాజ‌స్థాన్, గుజ‌రాత్, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ‌ ఉన్న‌త‌స్థాయి కేంద్ర బృందాల‌ను
పంపింది. ఢిల్లీ లో కొత్త కేసులు , కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్యలో పెరుగుద‌ల క‌నిపిస్తుండ‌డంతో హ‌ర్యానా, రాజ‌స్థాన్ ల‌పై కూడా ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఈ రాష్ట్రాల‌లోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హ‌ర్యానాకు న్యూఢిల్లీ ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా నాయ‌క‌త్వంలోని ముగ్గురు స‌భ్యుల బృందం వెళుతుండ‌గా, నీతిఆయోగ్ మెంబ‌ర్ హెల్త్ డాక్ట‌ర్ వి.కె. పాల్ రాజ‌స్థాన్ వెళ్లే బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైర‌క్ట‌ర్ ఎన్‌సిడిసి డాక్ట‌ర్ ఎస్‌.కె.సింగ్ గుజ‌రాత్ వెళ్లే బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తారు. డాక్ట‌ర్ ఎల్‌.స్వ‌స్తిచ‌ర‌ణ్‌, అడిష‌న‌ల్ డిడిజి, డిహెచ్‌జిఎస్ మ‌ణిపూర్ బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తారు.ఈ బృందాలు కోవిడ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదు అవుతున్న జిల్లాల‌ను సంద‌ర్శిస్తాయి. ఆయా రాష్ట్రాల చ‌ర్య‌లు, కంటైన్‌మెంట్‌, నిఘా, ప‌రీక్ష‌లు, ఇన్‌పెక్ష‌న్ వ్యాప్తి నిరోధం, నియంత్ర‌ణ‌, పాజిటివ్ కేసుల‌కు సంబంధించి స‌మ‌ర్ధ క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్‌కు చ‌ర్యల‌కు మ‌ద్ద‌తునిస్తాయి

మ‌రిన్ని వివ‌రాల‌కు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674075


సంక్షోభం నుంచి అవ‌కాశం : కోవిడ్ -19ను అరిక‌ట్టేందుకు ఇండియా తీసుకుంటున్న చ‌ర్య‌లు , దేశంలో టిబిని 2025 నాటికి నిర్మూలించే దిశ‌గా పునఃప్ర‌యోజ‌న‌క‌రంగా ఎలా తీర్చిదిద్ద‌వ‌చ్చో తెలిపిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స్టాప్ టిబి పార్ట‌న‌ర్‌షిప్ బోర్డు 33వ స‌మావేశాన్నిఉద్దేశించి నిన్న వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా మాట్లాడారు. కోవిడ్ -19 , ఇన్‌ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యే వ్యాధుల నిర్మూల‌న విష‌యంలో కాలాన్ని కొన్ని సంవ‌త్స‌రాల వెన‌క్కు మ‌ళ్లించింద‌ని, డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. కోవిడ్ మ‌హ‌మ్మారి, మనం కొన్ని దశాబ్దాలుగా ఎంతో క‌ష్ట‌ప‌డి సాగించిన కృషిని దారిమ‌ళ్లించింద‌ని అన్నారు. అలాగే టిబి వంటి ఎన్నో ప్రాణాంత‌క వ్యాధుల నుంచి శాస్త్ర‌వేత్త‌ల దృష్టిని ఇది మ‌ర‌ల్చింద‌న్నారు. లాక్‌డౌన్ పేషెంట్ల‌కు ఎన్నో ఇబ్బందులు క‌లిగించింద‌ని, ప్ర‌జ‌లు ఇంకా క‌రోనా వైర‌స్ భ‌యంతో ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. గ‌త ప‌ది నెల‌లుగ‌గా మ‌నం విప‌రీత‌మైన అవ‌రోధాల‌ను చూశామ‌ని, ఔష‌ధాలు అందుబాటులో లేక‌పోవ‌డం, చికిత్సా ప రీక్ష‌లు త‌గ్గిపోవ‌డం, వ్యాధి నిర్ధార‌ణ‌ల‌లో జాప్యం, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌లో అంత‌రాయం, త‌యారీ సామ‌ర్ధ్యం మ‌ళ్లింపు, పేషెంట్ల‌కు భౌతిక ప‌ర‌మైన అవ‌రోధాలు , పేషెంట్లు మందులు తీసుకునేందుకు దూర‌ప్రాంతాల‌కు వెళ్లాల్సిరావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్పడ్డాయ‌న్నారు. కోవిడ్ సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకునేందుకు భార‌త‌దేశ వ్యూహం గురించి మాట్లాడుతూ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, కోవిడ్ -19 వ‌ల్ల మనం చేసుకున్న ఆరోగ్య రంగ పటిష్ట‌త‌తో టిబి నిర్మూల‌న, ఇన్‌ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యే వ్యాధుల నియంత్ర‌ణ‌ కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డానికి ఒక మంచి అవ‌కాశం ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673936
-----------
బెంగ‌ళూరు టెక్ స‌మ్మిట్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సుద్వారా బెంగ‌ళూరు టెక్ స‌మ్మిట్‌ను ప్రారంభించారు. ఈ శిఖ‌రాగ్ర స‌మావేశాన్ని క‌ర్ణాట‌క రాష్ట్ర‌ప్ర‌భుత్వం, క‌ర్ణాట‌క ఇన్నొవేష‌న్‌, టెక్నాల‌జీ సోసైటీ (కె.ఐ.టి.ఎస్‌), సాంకేతిక ప‌రిజ్ఞానం, బయోటెక్నాల‌జీ, ఇండియాలోస్టార్ట‌ప‌ప్‌ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్కులపై (ఎస్‌టిపిఐ) క‌ర్ణాటక దార్శ‌నిక బృందం,ఎం.ఎం.యాక్టివ్ సై టెక్ క‌మ్యూనికేష‌న్స్ ఏర్పాటు చేశాయి. ఈ స‌మావేశం ఇతివృత్తం, నెక్స్ట్ ఈజ్ నౌ. కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటి క‌మ్యూనికేష‌న్లు, న్యాయ‌, చ‌ట్టం శాఖ మంత్రి, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ బి.ఎస్‌.య‌డ్యూర‌ప్ప‌, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ ఇండియా ను రెగ్యుల‌ర్ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగా కాక దీనిని ప్ర‌జ‌ల జీవ‌న విధానంగా ప్ర‌త్యేకించి పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, జీవ‌న విధానంగా రూపుదిద్దుకున్న‌ద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673991

  • టెక్ స‌మ్మిట్‌లో ప్ర‌ధాని ప్ర‌సంగంకోసం
    : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674017

    కోవిడ్ 19 స‌వాలును ఎదుర్కొనేందుకు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ‌శాఖ చేప‌ట్టిన చ‌ర్య‌లు చూపిన చొర‌వ ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన ఆత్మ‌నిర్భ‌ర్‌, మేక్ ఇన్ ఇండియా పిలుపున‌కు స‌మ‌ర్ధ ప్ర‌తిస్పంద‌న‌గా రూపుదిద్దుకుంది.
    -
    కోవిడ్ 19 స‌వాలును ఎదుర్కొనేందుకు కేంద్ర ఎం.ఎస్‌.ఎం.ఇ మంత్రిత్వ‌శాఖ సాంకేతిక ప‌రిజ్ఞానం ఆధారిత ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంంది. ఈ చ‌ర్య‌లు ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, మేక్ ఇన్ ఇండియా కు స‌రైన స్పంద‌న‌గా రూపుదిద్దుకున్నాయి. ఈ చ‌ర్య‌లు, చొర‌వ‌తో దేశం త‌గిన‌న్ని హ్యాండ్ శానిటైజ‌ర్లు, బాటిల్ డిస్పెన్స‌ర్లు (పంప్‌, ఫ్లిప్‌) డిమాండ్ కు త‌గిన‌ట్టుగా త‌యారుచేయ‌డ‌మే కాక‌, వీటి ఎగుమ‌తులు జ‌ర‌గ‌డానికీ తోడ్ప‌డ్డాయి. ఈ చ ర్య‌లు దేశం చేతులు శుభ్ర‌ప‌ర‌చుకునే హ్యాండ్ శానిటైజ‌ర్ల (లిక్విడ్, జెల్‌)ల విష‌యంలో స్వావ‌లంబ‌న్ సాధించ‌డ‌మే కాక‌, మాస్కుల‌, ముఖానిక కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ కవ‌చాలు, పిపిఇ కిట్లు, శానిటైజ‌ర్ బాక్సులు, ప‌రీక్షా కిట్ల త‌యారీలో స్వావ‌లంబ‌న సాధ‌న‌కు తోడ్ప‌డ్డాయి.
    మ‌రిన్ని వివ‌రాల‌కు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674070


    మిష‌న్ పూర్వోద‌య తూర్పు ఇండియాను స్వావ‌లంబ‌న దిశ‌గా తీసుకువెళ్ల‌డ‌మే కాక‌,ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్‌కు ఉప‌క‌రిస్తున్న‌ద‌న్న‌ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్‌
    ----
    కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ‌వాయు, స్టీలు శాఖ‌మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈరోజు మాట్లాడుతూ, ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ అనేది ఇండియాను అంత‌ర్జాతీయ వాల్యూచెయిన్‌లో పాసివ్ మార్కెట్‌నుంచి క్రియాశీల త‌యారీహ‌బ్‌గా రూపుదిద్దుతున్న‌దన్నారు. మ‌ర్చంట్స్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ 119వ వార్షిక సాధార‌ణ స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న‌, ఈ మాట‌ల‌న్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అంటే బ‌ల‌మైన భార‌త‌దేశ‌మ‌ని, అద్భుత త‌యారీ రంగం స్వాల‌వ‌లంబ‌న‌, అంత‌ర్జాతీయంగా స‌మీకృత ఆర్ధిక వ్య‌వ‌స్థ క‌లిగి ఉండ‌డ‌మ‌న్నారు. స్వావ‌లంబిత భార‌త‌దేశం అంత‌ర్జాతీయార్ధిక వ్య‌వ‌స్థ‌లో వేగ‌వంత‌మైన ఒక శ‌క్తిగా ఉండ‌గ‌ల‌ద‌న్నారు. ఇది స్వ‌యంకేంద్రిత వ్య‌వ‌స్థ‌ను ప్రొత్స‌హించ‌ద‌న్నారు. మిష‌న్ పూర్వోద‌య కింద‌, మ‌నం స‌మీకృత స్టీలు హ‌బ్‌ను తూర్పు ఇండియాలో నెల‌కొల్పుతున్నామ‌ని ఇది స్టీలు రంగంలో పోటీ క‌ల్పిస్తుంద‌ని, ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి క‌ల్ప‌న‌కు వీలు క‌ల్పిస్తుంద‌న్నారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి డిమాండ్ ను ధ్వంసం చేసింద‌నిఅంత‌టా అన్ని రంగాలో తిరొగ‌మనానికి కార‌ణ‌మైంద‌న్నారు. కోవిడ్‌మ‌హ‌మ్మారి సాధార‌ణ కార్య‌క‌లాపాలపై ప్ర‌భావం కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ , దేశీయంగా వివిధ ఆర్ధిక విభాగాల‌లో ప‌రిస్థితి మెరుగుప‌డుతున్న‌ది. లాక్‌డౌన్ ఆంక్ష‌లు స‌డ‌లించే కొద్దీ ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని, తిరిగి ఆర్ధిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డుతుంద‌ని అన్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజ్ , ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాన్‌యోజ‌న స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాయ‌ని , కోవిడ్ -19మ‌హమ్మారి స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు త‌గిన మ‌ద్ద‌తు అందించాయ‌ని అన్నారు. ఇఇవ‌ ఇండియా తిరిగి స‌త్వ‌రం త‌న అభివృద్ధి క‌థ‌లో నూత‌న అధ్యాయాన్ని రాయ‌డానికి వీలు క‌ల్పిస్తున్నాయ‌ని అన్నారు.

    https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674103

    ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌లో ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌, పాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌కుచ‌ర్య‌లు
    ---
    ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ ను మెరుగుప‌రిచేందుకు , పాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోయేందుకు ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంది. ఇందులో రెండు ముఖ్య‌మైన అంశాలు ఉన్నాయి. అవి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు (కేంద్ర ప‌థ‌కాలు, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలు), మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించి స్వ‌తంత్ర ప్ర‌తి‌ప‌త్తిక‌లిగిన ‌సంస్థ‌లు. ఈ చ‌ర్య‌లను ఆయుష్ కార్య‌ద‌ర్శి వైద్య రాజేష్ కొటేచా, అద‌న‌పు కార్య‌ద‌ర్శి, ఆర్ధిక స‌ల‌హాదారు ధ‌ర్మేంద్ర సింగ్ గంగ్వార్ సెప్టెంబ‌ర్ 20న జ‌రిగిన మంత్రిత్వ‌శాఖ ఉన్న‌త స్థాయి స‌మావేశంలో ప్ర‌క‌టించారు. వీటిని ప్రాధాన్య‌త ప్రాతిప‌దిక‌న మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వివిధ విభాగాలు చేప‌ట్ట‌నున్నాయి.ఆర్ధిక‌, పాల‌నాప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన జాబితాను, వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల కు రూప‌క‌ల్ప‌న‌లో నిధుల పంపిణీ ప్రాజెక్టు అమ‌లు వ్య‌వ‌స్థ‌కునిరంత‌రాయంగా నేరుగా పంపిణీ జ‌రిగేలా ఉండాల‌న్న‌వి , క్షేత్ర‌స్థాయిలో గుర్తించిన కార్య‌క‌లాపాల‌లో కొన్ని. దీనితోపాటు రాష్ట్రాల‌కు మ్యాచింగ్ షేర్‌తో స‌కాలంలో నిధుల విడుద‌ల జ‌ర‌గాల‌ని, ఏ ద‌శ‌లోనూ ఎక్క‌డా నిధులు పేరుకు పోకూడ‌ద‌ని సూచించడం జ‌రిగింది. ఈ చ‌ర్య‌లు త‌ర‌చూ ఎదుర్కొనే ఇబ్బందుల‌ను , ప్రాజెక్టుల అమ‌లులో జాప్యాన్ని తొల‌గించ‌నుంది.
    మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674078
    -------
    పిఐబి క్షేత్ర‌స్థాయి కార్యాల‌యాల‌నుంచి అందిన స‌మాచారం
    *అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మొత్తం క్రియాశీల కోవిడ్ కేసులు 1182 కు చేరాయి. మొత్తం కేసుల సంఖ్య 14 715
    *అస్సాం : అస్సాంలో గ‌త 24 గంట‌ల‌లో 23,484 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 169 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. పాజిటివ్ రేటు 0-72 శాతం

    *మేఘాల‌య : మేఘాల‌య‌లో మొత్తం కోవిడ్ యాక్టివ్ కేస‌లఉ 753 కు చేరాయి. మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 10014 కు చేరాయి.
    *సిక్కిం : సిక్కిం లో యాక్టివ్‌కోవిడ్ కేసుల సంఖ్య 296కు చేరింది. 4,124 కేసులు ఇప్ప‌టి వ‌ర‌క డిశ్చార్జి అయ్యాయి.
    * మ‌హారాష్ట్ర‌: బృహ‌న్ముంబాయి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బిఎంసి) వారం రోజుల‌పాటు కోవిడ్ -19 ప‌రీక్ష‌ల‌ను హాక‌ర్లు, షాప్ య‌జ‌మానులు, హెల్ప‌ర్లు, ర‌ద్దీ మార్కెట్‌ల‌లో ర‌వాణా ద‌రుల‌కు ,బెస్ట్‌, స్టేట్‌రోడ్‌ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ డ్రైవ‌ర్ల‌కు నిర్వ‌హించ‌డం ప్రారంభించింది. వీరు వేగంగా వైర‌స్‌ను వ్యాప్తి చెందించే అవ‌కాశం ఉన్నందున ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. దీపావ‌ళి పండుగ అయిపోవ‌డంతో ర‌ద్దీ మార్కెట్ ప్రాంతాల‌లో , ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్య‌వ‌స్థ‌లో కేసుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని కార్పొరేష‌న్ భావిస్తొంది. అద‌న‌పు మునిసిప‌ల్‌క‌మీష‌న‌ర్ సురేష్ క‌కాని మాట్లాడుతూ, న‌గ‌ర కార్పొరేష‌న్ 24 వార్డుల‌లో ఒక్కోవార్డులో 10 ఉచిత టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింద‌ని, అద‌న‌పు మునిసిప‌ల్ క‌మీష‌న‌ర్ సురేష్ క‌కాని తెలిపారు. మ‌హారాష్ట్ర కోవిడ్‌కేసులు 17,57,520 కి చేరుకున్నాయి.బుధ‌వారం నాడు కొత్త‌గా 5,011 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌త్యేకించి రోజువారీ కేసుల‌లో పెరుగుద‌ల గ‌త కొద్దిరోజులుగా సుమారు 3000గా ఉంటూ వ‌స్తున్న‌ది.
    *గుజ‌రాత్ : గుజ‌రాత్‌లో 1,281 తాజా కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో కోవిడ్ కేసులు సుమారు 1.92 ల‌క్ష‌ల‌కు చేరింది. ప‌లు జిల్లాలు అహ్మ‌దాబాద్‌లో దీపావ‌ళి అనంత‌రం కేసుల సంఖ్య పెరిగింది. గుజ‌రాత్‌లో రోజువారీ కేసుల సంఖ్య నెల రోజుల క్రితం 1200 దాటింది. కాగా ప‌రీక్ష‌లు రోజుకు 50,000 కంటే కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. కేసులు పెరుగుతుండ‌డంతో అహ్మ‌దాబాద్‌మునిసిపల్ కార్పొరేష‌న్ అధికారులు నిర్దేశిత ఆస్ప‌త్రుల‌లో బెడ్ల అందుబాటును ప‌రిశీలిస్తున్నారు. అలాగే కొత్త‌కేసుల‌ను వెంట‌నే గుర్తించేందుకు ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచుతున్న‌ట్టు అదికారులు తెలిపారు.
    * రాజ‌స్థాన్ : రాజ‌స్థాన్‌లో మ‌రోసారి కోవిడ్ యాక్టివ్ కేసులు 26 రోజుల అనంత‌రం 19,000 మార్కును దాటాయి. బుధ‌వారం నాడు రాష్ట్రంలో 2,718 కొత్త‌కేసులు నమోద‌య్యాయి. జైపూర్‌,జోధ్‌పూర్ జిల్లాలు కోవిడ్ బారిన ఎక్కువ‌గా ప‌డిన జిల్లాల‌లో ఉన్నాయి. పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు బిక‌నీర్‌, అల్వార్‌, అజ్మీర్‌, కోట నుంచి న‌మోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 40 ల‌క్ష‌ల శాంపిళ్ల‌ను ప‌రీక్షించి చూశారు. గ్రామీణ ప్రాంతాల‌లో ఎక్కువ‌మంది కోవిడ్ బారిన ప‌డుతుండ‌డంతో ఆశా స‌హ‌యోగినిల‌కు ప‌ల్స్ ఆక్సీ మీట‌ర్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్‌, గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తూ, ఈ మ‌హమ్మారిని గ్రామీణ ప్ర‌జ‌లు తేలిక‌గా తీసుకోరాద‌ని అన్నారు. మాస్కులు ధ‌రిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికేసూచించిన సూచ‌న‌ల‌ను పాటించాల‌న్నారు.
    * మ‌ధ్య‌ప్ర‌దేశ్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం 9,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు వ‌స్తున్న పుకార్ల‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఖండించింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్ర హోం మంత్రి న‌రోత్తం మిశ్రా ఇందుకు సంబంధించి వివ‌ర‌ణ ఇస్తూ, లాక్‌డౌన్ విధించేంత‌టి ప‌రిస్థితి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లేద‌ని, ఇలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ ప‌రిశీల‌న లో లేద‌ని అయ‌న అన్నారు.
    *ఛ‌త్తీస్‌ఘ‌డ్‌:
    ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఛాట్‌పూజ‌కు సంబంధించి రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. రాష్ట్ర‌ప్ర‌భుత్వం న‌దులు, ఘాట‌ల్ వ‌ద్ద చాట్‌పూజ‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి మంజూరుచేసింది. తాజామార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం , చాట్‌పూజ సంద‌ర్భంగా కేవ‌లం భ‌క్తుల‌ను మాత్ర‌మే ఘాట్‌ల వ‌ద్ద‌కు అనుమ‌తిస్తారు. సామాజిక దూరం పాటించ‌డం, మాస్కు ధ‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా గుమికూడ‌కుండాఆయా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసే నిర్వాహ‌కులు చూడాలి. ప్ర‌ద‌ర్శ‌న‌లు, ర్యాలీలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అనుమ‌తించ‌రు. ఈమార్గ‌ద‌ర్శ‌కాల‌కుతోడు గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశాల మేర‌కు బాణాసంచా ను ఉ ద‌యం 6 గంట‌ల‌నుంచి 8 గంట‌ల వ‌ర‌కు చాట్‌పూజ స‌మ‌యంలో మాత్ర‌మే వాడ‌డానికి అనుమ‌తి ఉంది.

    * గోవా: గోవా ప్ర‌భుత్వం, ప్ర‌స్తుత టూరిస్టు సీజ‌న్‌లో హోట‌ళ్ల‌కు కోత్త ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్లు (ఎస్‌.ఒ.పి) రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ‌మంత్రి విశ్వ‌జిత్‌రాణే చెప్పారు. ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్‌సావంత్‌ను కలిసిన అనంత‌రం విలేఖ‌రుల‌తో మాట్లాడుతూ ఆయ‌న టూరిస్టుల‌ను దూరంగా ఉంచేందుకు స‌రిహ‌ద్దుల‌ను మూసే ఆలోచ‌న ఏదీ లేద‌న్నారు. హోట‌ళ్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసే ఆలోచ‌న‌లో తాముఉన్నామ‌ని, హోట‌ళ్లు త‌మ‌ ప్రాంగ‌ణంలో ఒక రూమును ఐసొలేష‌న్ గ‌దిగా రిజ‌ర్వులో ఉంచడం త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్టు ఆయ‌న‌తెలిపారు.

    * కేర‌ళ : కోవిడ్ పేషెంట్ల అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల్సిందిగా కేర‌ళ హైకోర్టు రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.కోవిడ్ కార‌ణంగా రాష్ట్రంలో మూత‌ప‌డిన అన్ని సినిమా హాళ్లు ఇంకా మూసివేసి ఉంచుతున్నారు. త్వ‌ర‌లో వాటిని ప్రారంభించే ఆలోచ‌న ఏదీ లేదు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ సినిమా సంస్థ‌ల‌తో ఏర్పాటుచ‌సిన స‌మావేశంలో నిర్ణ‌యించారు. 6,419 కొత్త కోవిడ్ కేసులు న‌మోదు కాగా 7,066 కేసులు రాష్ట్రంలో తిరిగి కోలుకున్నాయి. ప్ర‌స్తుతం పాజిటివిటీరేటు 9.53 శాతం కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 1,943
    * త‌మిళ‌నాడు : కోవిడ్‌మ‌హ‌మ్మారికార‌ణంగా త‌మ అమ్మ‌కాలు త‌గ్గినందున త‌మ‌ను ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల జాబితాలో చేర్చి త‌గిన ప్ర‌యోజ‌నాలు చేకూర్చ వ‌ల‌సిందిగా త‌మిళ‌నాడు కెమిస్టులు, డ్ర‌గ్గిస్టుల అసోసియేష‌న్ రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్నికోరింది. ర‌ష్య‌న్‌పండితుతు, 50 సంవ‌త్స‌రాలుగా త‌మిళం బొధించిన అలెక్జాండ‌ర్ డుబియ‌న్‌స్కీ కోవిడ్ -19 పాజిటివ్ నిర్ణార‌ణ అయిన త‌ర్వాత ఒక ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించారు.
    * క‌ర్ణాట‌క : కోవిడ్ 19 వాక్సినేష‌న్‌ను తొలి ల‌బ్దిదారులుగా లో 94,000మందిని గుర్తించారు. 2021 ప్రారంభంలో వాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు టెక్‌స‌మ్మిట్ 2020ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న‌, కోవిడ్ లాక్‌డౌన్ కీల‌క స‌మ‌యంలో ఇండియాలోని పేద‌లు త‌క్ష‌ణ‌, త‌గిన స‌హాయాన్ని పొందేలా చేయ‌గ‌లిగింది టెక్నాల‌జీ మాత్ర‌మే న‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లో బుధ‌వారం నాడు 1791 కొత్త‌కోవిడ్‌కేసులు న‌మోద‌య్యాయి. 21 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీనితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8,65,931 కు చేరుకోగా మ‌ర‌ణాల సంఖ్య 11,578 కి చేరింది.

    * ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందిగా ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అధికారుల‌తో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఆయ‌న ఈమేర‌కు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోనూ ఇత‌ర దేశాల‌లోనూ కోవిడ్ సెకండ్ వేవ్‌వార్త‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 91,54,263 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా, 8.54 ల‌క్ష‌ల‌మందికి పాజిట‌వ్ గా నిర్ధార‌ణ అయింది. పాజిటివిటీ రేటు 9.33 శాతం. స‌గ‌టున ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మంది జ‌నాభాకు 1,71,428 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. దీనితో ప్ర‌తిరోజూ నిర్వ‌హించేప‌రీక్ష‌లు 75,000కు చేరాయి.
    * తెలంగాణా : రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్రైవేటు ల్యాబ్‌ల‌లో ఆర్‌టి-పిసిఆర్ ప‌రీక్ష‌ల రేట్ల‌ను రూ 2,200 నుంచి 850 రూపాయ‌ల‌కు త‌గ్గించింది. ఇంటి ద‌గ్గ‌ర సేక‌రించే శాంపిళ్ల‌కుచార్జీల‌ను రూ 2,800 నుంచి 1200 రూపాయ‌ల‌కు త‌గ్గించారు. మొత్తం 1607 మంది పేషెంట్లు కోవిడ్‌నుంచి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల‌లో తెలంగాణాలో 948 కోవిడ్ ‌తాజా కేసులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు 2,59,776 కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,45,293 గా ఉంది. యాక్టివ్ కేసులు 13,068 గా ఉన్నాయి.

FACT CHECK

 

 

 

Image

*******

 


(Release ID: 1674285) Visitor Counter : 224