ఆయుష్
ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆర్థిక నిర్వహణ మరియు పాలన సంస్కరణ చర్యలు
Posted On:
19 NOV 2020 3:14PM by PIB Hyderabad
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడానికి, పాలన సంస్కరణలను వేగవంతం చేసేందుకు గాను అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రభుత్వ పథకాలు (కేంద్ర ప్రభుత్వ రంగం మరియు కేంద్ర ప్రాయోజిత) మరియు మంత్రిత్వ శాఖ యొక్క స్వయంప్రతిపత్త సంస్థలు అనే రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ ఈ చర్యలను చేపట్టారు. ఈ ఏడాది (2020) సెప్టెంబరులో జరిగిన మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో.. ఈ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలను ఆయుష్ విభాగం కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా, అదనపు కార్యదర్శి మరియు ఆర్థిక సలహాదారు శ్రీ ధర్మేంద్ర సింగ్ గాంగ్వార్ వీటిని నిర్దేశించారు. వీటిని మంత్రిత్వ శాఖలోని వివిధ యూనిట్లు ప్రాధాన్యతపై అమలు చేయడానికి నిర్ణయించారు. ఆర్థిక మరియు పరిపాలన సంస్కరణల జాబితాను రూపొందించడం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీకి నిధుల ప్రవాహాన్ని నిరంతరాయంగా జరిగేలా చూడడం మరియు ప్రోగ్రామ్/ పథకాలు లబ్ధి ప్రత్యక్ష పద్ధతిలో లబ్ధిదారులకు చేరుకునేలా చూడడం వంటివి క్షేత్ర స్థాయి కార్యకలాపాలలో గుర్తించబడిన వివిధ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. ఈ చర్యలలో భాగంగా మ్యాచింగ్ షేర్లు మరియు ముందే నిర్వచించిన నిర్ధారిత లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను సకాలంలో విడుదల చేయబడుతాయి, తద్వారా ఏ స్థాయిలోనూ నిధులు నిలువ ఉండకుండా చూసేందుకు వీలవుతుంది. ఈ చర్యలతో ప్రభుత్వ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి తరచుగా గమనిస్తున్న అడ్డంకులను దూరం చేయడానికి వీలుపడుతుంది. ఈ చొరవ యొక్క తక్షణ ప్రభావంగా మంత్రిత్వ శాఖ యొక్క స్వయంప్రతిపత్తి సంస్థలు, వివిధ పథకాలలోని యూనిట్లు ఆధునిక, వేగవంతమైన ఖాతాల నిర్వహణ వ్యవస్థ అయిన పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విధానంను పాటించేలా పలు చర్యలు చేపట్టడమైంది. పనితీరు లక్ష్యాలతో ఆయుష్ మంత్రిత్వ శాఖతో అటానమస్ బాడీస్ (ఏబీ) అవగాహన ఒప్పందంలోకి (ఎంఓయు) ప్రవేశించే పద్ధతి కూడా అవలంబించబడింది. అనేక ఏబీలకు కూడా దీనిని అమలు చేయడమైంది. ఈ అవగాహన ఒప్పందాలు స్వయం ప్రతిపత్త సంస్థల ఫలితాలు మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి మరియు వనరుల అతివ్యాప్తులు, వృథాను తొలగించడానికి సహాయపడతాయి. ముందస్తుగానే దారి మళ్లింపులు నివారించేందుకు మరియు వేగాన్ని పెంచడానికి, విద్యార్థులకు ఉపకారవేతనం వంటి అన్ని చెల్లింపులను ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) వేదిక చెల్లించేలా చర్యలు చేపట్టడమైంది. మంత్రిత్వ శాఖ యొక్క అన్ని ప్రభుత్వ పథకాల యొక్క మూడవ పార్టీ మూల్యాంకన కార్యక్రమం చేపట్టడమైంది. ఇది పారదర్శకత పెంచే దిశగా మరో చర్య. ఇది నవంబర్, 2020 నుంచి నిర్వహించబడుతుంది. ఇది ఫలితాల యొక్క లక్ష్యాల మూల్యాంకనం దోహదం చేస్తుంది. పర్యవసానంగా పనితీరు మెరుగుదలకూ దారితీస్తుంది. నేషనల్ ఆయుష్ మిషన్ (నామ్,) ఆయుష్ వ్యవస్థల ప్రోత్సాహంపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ఒక ప్రధాన ప్రాజెక్టు అని పరిగణనలోకి తీసుకొంటూ, దాని కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ ఆయుష్ మిషన్ (నామ్) - మార్చి, 2021 కోసం ఎన్-ఎఫ్ఏఎంఎస్ (ఎన్‌హెచ్‌ఎం ఫైనాన్షియల్ అకౌంటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించబడ్డాయి.నిధుల ప్రవాహాపు వాస్తవ స్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించడానికి వీలుగు డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించారు. మంత్రిత్వ శాఖలో 2020 సెప్టెంబరు నుంచి ప్రారంభించిన ఈ ఆర్థిక పరిపాలన సంస్కరణలు ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత మరియు కేంద్ర రంగ పథకాల ఫలితాలతో పాటు స్వయంప్రతిపత్త సంస్థల పనితీరులో మంచి ఫలితాలను చూపుతున్నాయి. నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, భౌతిక మరియు ఆర్థిక నివేదిక, రాష్ట్ర వార్షిక కార్యా చరణ ప్రణాళిక, డీబీటీ సంబంధిత సమాచారాన్ని ఆన్‌లైన్ రూపంలో సమర్పించేందుకు మొగ్గు చూపుతుండడంతో వివిధ యూనిట్లు పోర్టల్ వాడకం పెరుగుతోంది. ఆర్థిక అంశాల నిర్వహణతో
స్వయంప్రతిపత్త సంస్థల కార్యక్రమాల పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.
***
(Release ID: 1674078)
Visitor Counter : 288