ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ:

చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుముఖం

మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 5% లోపే

Posted On: 19 NOV 2020 11:30AM by PIB Hyderabad

భారతదేశంలో గడిచిన 24 గంటలలో  45,576 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా  48,493 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీనివల్ల చికిత్స పొందుతున్నవారి సంఖ్యలో నికరంగా 2917 కేసులు తగ్గాయి.  కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండటం, కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 47 రోజులుగా కొనసాగుతూ వస్తోంది. 

 

 

మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో చికిత్సపొందుతున్నవారి శాతం ఈరోజు 5% లోపుకు పడిపోయింది. రోజూ ఎక్కువమంది కోలుకుంటున్న ధోరణి  వలన చికిత్సలో ఉన్నవారు దేశంలో తగ్గుతూ ఉన్నారు.  ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4,43,303 కు చేరటానికి ఇదే కారణం. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారు ఈ రోజుకు  4.95% కు చేరారు.

 

గడిచిన 24 గంటలలో కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కోలుకుంటున్నవారి శాతం బాగా మెరుగుపడి ఈ రోజుకు 93.58% అయింది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారు  83,83,602 కు చేరారు. చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేడా  79,40,299 కు చేరింది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో  77.27%  మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారు కేరళలో అత్యధికంగా 7,066 మంది కోలుకున్నారు.  6,901 మందితో ఢిల్లీ,  6,608 మందితో మహారాష్ట్ర ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 77.28% కేవలం పది రాష్ట్రాలకు చెందినవే. గత 24 గంటలలో ఢిల్లీలో అత్యధికంగా  7,486 కేసులు రాగా, కేరళలో 6,419 ,మహారాష్ట్రలో  5,011 నమోదయ్యాయి.

 

గడిచిన 24 గంటలలో 585 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. వీరిలో 79.49%  మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా 22.39% (131 మృతులు) ఢిల్లీలోనే నమోదయ్యారు. మహారాష్ట్రలో 100 మంది, పశ్చిమ బెంగాల్ లో 54 మంది నమోదై ఆ తరువాత రెండు స్థానాల్లో ఉన్నాయి. 

****

 


(Release ID: 1673962) Visitor Counter : 165