ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబిబిఎస్ / బిడిఎస్ సీట్ల కింద ‘వార్డ్స్ ఆఫ్ కోవిడ్ వారియర్స్’ నుండి అభ్యర్థుల ఎంపిక మరియు నామినేషన్ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త క్యాటగిరిని ఆమోదించింది.

"తమ విధుల ద్వారా మానవాళి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కోవిడ్ యోధుల సగర్వమైన త్యాగనిరతిని గౌరవిస్తూ ఈ చర్యలు": డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 19 NOV 2020 12:49PM by PIB Hyderabad

2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబిబిఎస్ సీట్లకు గాను అభ్యర్థుల ఎంపిక, మరియు నామినేషన్ మార్గదర్శకాలలో 'వార్డ్స్ ఆఫ్ కోవిడ్ వారియర్స్' అనే కొత్త క్యాటగిరీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రకటించారు. కోవిడ్ రోగి చికిత్స మరియు నిర్వహణలో కోవిడ్ వారియర్స్ చేసిన గొప్ప సహకారాన్ని గౌరవించడం ఈ చర్య లక్ష్యమని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు. "ఇది తమ విధుల ద్వారా మానవాళిక కోసం నిస్వార్థ అంకితభావంతో పనిచేసిన కోవిడ్ యోధుల పవిత్రమైన త్యాగాన్ని గౌరవిస్తుంది" అని ఆయన చెప్పారు.

సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లు, "కోవిడ్ వారియర్స్" పిల్లల నుండి అభ్యర్థుల ఎంపిక మరియు నామినేషన్ల కోసం కేటాయించవచ్చు, ఈ వారియర్లు కోవిడ్ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన; లేదా కోవిడ్ 19 సంబంధిత విధి కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారు. 

రూ.50 లక్షల భీమా ప్యాకేజీని ప్రకటించినప్పుడే కేంద్రం కోవిడ్ యోధులు ఎవరో నిర్వచించింది. దీనిపై మంత్రి మాట్లాడుతూ, “కోవిడ్ వారియర్స్ అందరూ సమాజ ఆరోగ్య కార్యకర్తలతో సహా పబ్లిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్లు, వీరు కోవిడ్-19 రోగులతో ప్రత్యక్షంగా దగ్గరగా పనిచేసి ఉండవచ్చు, అటువంటి రోగుల సంరక్షణకు వ్యాధికి ప్రభావితమయ్యే ప్రమాదం వీరిలో ఉండవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది మరియు రిటైర్డ్ / వాలంటీర్ / స్థానిక పట్టణ సంస్థలు / కాంట్రాక్ట్ / రోజువారీ వేతనం / తాత్కాలిక / అవుట్సోర్స్ సిబ్బంది రాష్ట్రాలు / కేంద్ర ఆసుపత్రులు / సెంట్రల్ / స్టేట్స్ / యుటిల స్వయంప్రతిపత్త ఆసుపత్రులు, ఎయిమ్స్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐ) / ఆసుపత్రులు కోవిడ్ -19 సంబంధిత బాధ్యతల కోసం రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ దీనిలో చేర్చారు, ఈ క్యాటగిరీ అర్హతను రాష్ట్ర / యుటి ప్రభుత్వం ధృవీకరిస్తుంది" అని ఆయన అన్నారు. సెంట్రల్ పూల్ లో అయిదు ఎంబిబిఎస్ సీట్లు ఈ క్యాటగిరీకి 2020-21 సంవత్సరానికి రిజర్వు చేశారు. అభ్యర్థుల ఎంపికను మెడికల్ కౌన్సిల్ కమిటీ ( ఎంసిసి) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ -2020 లో పొందిన ర్యాంక్ ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా ఈ క్యాటగిరీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

 

*****



(Release ID: 1674279) Visitor Counter : 213