PIB Headquarters
కోవిడ్-19 పై పిఐబి డెయిలీ బులిటన్
Posted On:
27 OCT 2020 6:37PM by PIB Hyderabad
*గత 24 గంటలలో కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య 36,500కు తక్కువకు పడిపోయాయి (36,470),గత 3 నెలల్లో నమోదైన కేసులతో పోలిస్తే ఇవి కనిష్టం
*మొత్తం యాక్టివ్ కేసులు 6.25 లక్షలు, 11 వారాల తర్వాత కోవిడ్‌కేసుల సంఖ్య కనిష్ఠ స్థాయికి చేరాయి
*దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,857,ఇది మొత్తం కేసులలో 7.88 శాతం
* జాతీయ రికవరీ రేటు 90.62 శాతానికి పుంజుకుంది.
* వివిధ కార్యకలాపాల పునఃప్రారంభానికి సంబంధించి 30.09.2020 న జారీ చేసిన మార్గదర్శకాలను 30-11-2020 కి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ .
3 నెలల విరామం తర్వాత ఇండియాలో రోజువారీ తక్కువ కోవిడ్ కేసులు నమోదు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6.25 లక్షలు, ఇవి 11 వారాలలో కనిష్టం.
కోవిడ్ పై పోరాటంలో ఇండియా పలు కీలక మైలురాళ్లను సాధించింది. గత 24 గంటలలో కొత్త కోవిడ్ నిర్ధారణ కేసులు గత 3 నెలల్లో తొలిసారిగా 36,500 కంటే తక్కువ నమోదయ్యాయి (36,470). 2020 జూలై 18న కొత్త కేసులు 34,888 గా ఉన్నాయి. ప్రతి రోజూ గరిష్ఠ స్థాయిలో కోవిడ్ పేషెంట్లు కోలుకుంటున్నారు. దీనితో మరణాల రేటు గణనీయంగా పడిపోతున్నది. యాక్టివ్ కేసులు క్రమంగా ఇండియాలో తగ్గుముఖం పట్టాయి. మరో విజయం ఏమంటే, కోవిడ్ యాక్టివ్ కేసులు గణనీయంగా 6.25 లక్షలకు పడిపోయాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,25.857 గా ఉన్నాయి. ఇవి మొత్తం కేసులలో 7.88 శాతం. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 35 శాతం కేసులు 18 జిల్లాలనుంచే నమోదయ్యాయి. మొత్తం కోలుకున్న కేసుల 72 లక్షలు దాటాయి (72,01070) .ఇది యాక్టివ్ కేసులకు, కోలుకున్న కేసులకు మధ్య ఉన్న అంతరాన్ని పెంచింది. ప్రస్తుతం ఇది 65,75,213 గా ఉంది. 63,842 మంది పేషెంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. జాతీయ స్థాయి రికవవరీ రేటు మరింత పుంజుకుని 90.62 శాతానికి చేరింది. కొత్తగా కోలుకున్న కేసులలో 78 శాతం కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఒక్కరోజులో 9000 మందికి పైగా కోలుకుని మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. కర్ణాటకలో 8000 మందికి పైగా కోలుకున్నారు. కొత్తగా నిర్ణారణ అయిన కేసులలో 76 శాతం కేసులు 10 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచిగ రిష్ఠ స్థాయిలో కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలు ఒక్కొక్కదాని నుంచి 4000 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో 3000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి గత 24 గంటలలో 488 మరణాలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 80 శాతం కేసులు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదయ్యాయి. కోవిడ్ మరణాల సంఖ్య వరుసగా రెండోరోజుకూడా 500 కంటే తక్కువగా ఉ న్నాయి. ఒక్క రోజులో గరిష్ఠ స్థాయిలో మరణాలు (84 మరణాలు) మహారాష్ట్ర నుంచి నమోదయ్యాయి. ఇండియాలో మరణాల రేటు 1.50 శాతంగాఉంది.
మరిన్ని వివరాలకు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667778
వివిధ కార్యకలాపాల పునఃప్రారంభానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాల పొడిగింపు:
కేంద్ర హోంమంత్రిత్వశాఖ లాక్‌డౌన్ అనంతరం పున:ప‌్రారంభానికి 30-09-2020 జారీచేసిన ఆదేశాలను 30-11-2020 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్ కు సంబంధించి మార్చి 24,2020న తొలిసారిగా జారీచేసిన ఆదేశాల నుంచి, క్రమంగా కంటైన్‌మెంట్‌జోన్ల వెలుపల దాదాపు అన్ని కార్యకలాపాలను తిరిగి తెరవడం ప్రారంభించింది. చాలావరకు కార్యకలాపాలను అనుమతించినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలతో ముడిపడిన కార్యకలాపాలను కొన్ని ఆంక్షలతో, ఆరోగ్య,భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తెరిచేందుకు అనుమతించారు. మెట్రోరైలు ప్రయాణం, షాపింగ్‌మాల్స్, హోటల్ళు,రెస్టరెంట్లు, ఆతిథ్యరంగ సేవలు, మతపరమైన ప్రదేశాలు, శిక్షణ సంస్థలు, జిమ్నాజియంలు, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంటుపార్కుల తదితరాలు ఇందులో ఉన్నాయి. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి ఎక్కువ రిస్కు ఉన్న కార్యకలాపాల విషయంలో పరిస్థితిని అంచనా వేసి ,ఎస్.ఒ.పిలు పాటిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ 30-09-2020న జారీచేసినమార్గదర్శకాలకులోబడి నిర్ణీత ఆంక్షలకు లోబడి ప్రారంభించే విషయమై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుకోరడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం ఆయా సంస్థల కార్యకలాపాల ప్రారంభం, ప్రధాన ఉద్దేశం జాగ్రత్తగా కార్యకలాపాల పునరుద్ధరణ చేపట్టి ముందుకు సాగేందుకు వీలుకల్పించడం.అయితే దీని అర్థం కోవిడ్ మహమ్మారి అంతమైపోయిందని అర్థం కాదు.కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ప్రతి పౌరుడు తమ రోజువారి కార్యకలాపాలలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిఉంటుంది.
మరిన్ని వివరాలకు:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667880
కోవిడ్ కు 19 పై పోరాటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి ఆలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతా ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌హర్షవర్ధన్, 19 పై పోరాటానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) వారి ఆలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతా (సిఎస్ఆర్) ప్రచారాన్ని నిన్న ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన డిజిటల్ సిఎస్ ఆర్ ఆల్బమ్, సిఎస్ఆర్ వీడియోను ఆవిష్కరించారు. కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌చేపడుతున్న సామాజిక భద్రతా కార్యకాలాపాల కృషిని మంత్రి అభినందించారు. కోవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం సాగిస్తున్న కృషికి తోడుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనకు దేశ వ్యాప్తంగా 662 జిల్లాలలోగల 10,000 బ్రాంచ్‌ల ద్వారా 10 లక్షల మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 2020 అక్టోబర్ 2నపి.ఎన్.బి ప్రారంభించిన గ్రామ్ సంపర్క్ యోజన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు . ఈ పథకం కింద గ్రామీణ , సెమీ అర్బన్ ప్రాంతాలలోని 500 జిల్లాలలో రైతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది.
భావోరావ్ దియోరస్ సేవా న్యాస్ కు , కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు 10.37 లక్షలు అందించినందుకు ఆయన పి.ఎన్.బిని అభినందించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందేందుకు వెళ్లే పేషెంట్లకు ఉపయోగించేందుకు వీలుగా న్యాస్ ఒక వాహనం కొనుగోలుకు ఈ నిధులు అందజేశారు.
కోవిడ్ -19 పై భారతదేశం సాగిస్తున్న పోరాటం గురించి ప్రస్తావిస్తూ డాక్టర్‌హర్షవర్ధన్, భారతదేశం కోవిడ్ పై పోరాటంలో 10 వనెలలో అడుగుపెట్టిందని చెప్పారు. ఇప్పుడు ఇండియా చాలా అంశాలలో ఆత్మనిర్భర్ సాధించిందని ఆయన అన్నారు. యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని,అద్భుత రీతిన కోవిడ్ బాధితులు కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అవుతున్నారని ఆయన తెలిపారు. రికవరీ రేటు పెరిగి యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయన్నారు. ఇది కోవిడ్ అదుపునకు కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో తీసుకున్నచర్యల విజయానికి నిదర్శనమని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వాక్సిన్ వేసేట్టు చూడడం ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. అందరికీ వాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు , వాక్సిన్ పంపిణీకి మార్గసూచీ సత్వర పురోగతిలో ఉన్నట్టు ఆయనతెలిపారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667757
ఉత్తర ప్రదేశ్‌కు చెంఇన పిఎం స్వనిధి లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పిఎం స్వనిధి యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించారు. అలాగే దీని ద్వారా క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు ఎలా పొందవచ్చో తెలిపారు.
ఇలా పొదుపు చేసుకున్నమొత్తాన్ని విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలకు ఎలా వినియోగించుకోవచ్చో సూచించారు. లబ్ధిదారులు, బ్యాంకర్ల కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ కృషి కారణంగా పేదలు పండుగలు జరుపుకో గలుగుతారన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది ముఖ్యమైన రోజని, వీధి వ్యాపారులను గౌరవించుకునే రోజని ఆయన అన్నారు.స్వావలంబిత భారత్ దిశగా వీరి పాత్రను దేశం గుర్తించిందని ప్రధానమంత్రి అన్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినపుడు ఇతర దేశాలు , తమ కార్మికులు ఈ పరిస్థితిని ఎలా తట్టుకోగలరని కలవరపడ్డాయని, అయితే మన దేశంలోని కార్మికులు తాము ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని విజయం సాధించగలమని నిరూపించారని ప్రధాని కొనియాడారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667823
ఉత్తరప్రదేకు చెందిన పిఎం స్వనిధిలబ్దిదారులతో ముచ్చటిస్తూ ప్రధాని చేసిన ప్రసంగ పాఠం వివరాలు:
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667787
-----
4 వ ఇండియా ఎనర్జీ ఫోరం సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 4 వ ఇండియా ఎనర్జీ ఫోరం సిఇఆర్ ఎ వీక్ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఇండియాలో అద్భుత స్థాయిలో ఇంధన వనరులున్నాయని, ఇండియా ఇంధన భవిష్యత్తు ఉజ్వలం, భద్రతతో కూడినదని ఆయన అన్నారు. ఇంధన డిమాండ్ దాదాపు మూడోవంతుకు పడిపోవడం,ప్రస్తుతం నెలకొన్న అస్థిర ధరల పరిస్థితులు, పెట్టుబడి నిర్ణాయాలను ప్రభావితం చేశాయని,రాగల కొన్ని సంవత్సరాల పాటు అంతర్జాతీయ ఇంధన డిమాండ్ లో సంకోచం వంటి సవాళ్ల గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇండియా రానున్న రోజులలో ప్రముఖ ఇంధన వినియోగదారుగా ఎదగనున్నదని, దీర్ఘకాలికంగా చూసినపుడు ఇండియా ఇంధన వినియోగం సుమారు రెట్టింపు కానున్నదన్న అంచనాలున్నాయన్నారు.
దేశీయ విమానయాన రంగానికి సంబంఇంచి ఇండియా మూడవ అతి పెద్దదని, అలాగే విమానయాన మార్కెట్ అద్భుత రీతిన పెరుగుతున్నదని చెప్పారు.భారతీయ విమానయాన సంస్థలు 2024 నాటికి తమ విమానాల సంఖ్యను 600 నుంచి 1200కు పెంచనున్నాయన్నారు. ఇంధన అందుబాటు చౌక అయినదిగా, నమ్మకంగా ఉండాలని ఇండియాభావిస్తుందని ఆయన చెప్పారు. అప్పుడే ఆర్ధిక, సామాజిక పరివర్తనకు అవకాశం ఉంటుందన్నారు.ఇంధనరంగం ప్రజలకు సాధికారత కల్పిస్తుందని, తద్వారా వారి సులభతర జీవనానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. ఇవి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజలు, మధ్యతరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో ముందుకు పోతుననదని ఆయన అన్నారు. స్వావలంబిత భారతదేశం ప్రపంచ ఆర్ధిక శక్తిని మరిన్ని రెట్లు పెంచే ఒక శక్తి కాగలదని ఆయన అన్నారు. ఇంధన భద్రత ఈ చర్యలలో కీలకమైనదని ప్రధానమంత్రి తెలిపారు.
వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667737
ప్రధానమంత్రి ఇండియా ఎనర్జీ ఫోరంలో చేసిన ప్రారంభోపన్యాస పాఠం
వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667738
శిశు సంరక్షణ సెలవులకు సంబంధించి డిఒపిటి సంస్కరణలు.
సిబ్బంది ,శిక్షణ విభాగం ఇటీవల తీసుకువచ్చిన కొన్ని ప్రధాన సంస్కరణలను గురించి వివరిస్తూ కేంద్ర ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ (ఇంచార్జ్ ) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ శాఖ , సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్, అణు ఇంధన, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పురుష ప్రభుత్వ ఉద్యోగులు కూడా శిశు సంరక్షణ సెలవులకు అర్హులనితెలిపారు. అయితే ఈ సదుపాయం ఒంటరి తండ్రికి వర్తిస్తుందని అన్నారు. ఇందులో భార్య మరణించినవారు, విడాకులు పొందినవారు, అవివాహితులు, ఒంటరి పేరెంట్‌గా శిశువు సంరక్షణ బాధ్యతలు చేపట్టవలసిన వారికి ఇది వర్తిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఉన్న మరో వెసులుబాటు ను కూడా ఆయన తెలిపారు. సడలించిన నిబంధనల కింద , ఆ ఉద్యోగి, శిశు సంరరక్షణ సెలవులు వినియోగించుకునే క్రమంలో కాంపిటెంట్ అథారిటీ ముందస్తు అనుమతితో హెడ్‌క్వార్టర్‌ను వదిలిపెట్టి వెళ్లవచ్చని అన్నారు.
వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667692
---
భవిష్యత్ దార్శనికత, దృఢమైన నిర్ణయాలు ఇండియాలో బలమైన స్టార్టప్ వాతావరాన్ని కల్పించాయి: శ్రీపియూష్ గోయల్
భవిష్యత్ దార్శనికతతోపాటు దృఢమైన నిర్ణయాలు ఇండియాలో బలమైన స్టార్టప్ వాతావరణం ఏర్పరచిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. తొలి షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) స్టార్టప్‌ఫోరం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు. యువత మన ఆస్థి అని, ప్రస్తుత అనిశ్చితి, ఇబ్బందికర పరిస్థితులలో వారు ఎంతో సమర్ధతతో, సర్దుకుపోయే తత్వంతో ,చురుకుదనంతో స్పందించారని ఆయనతెలిపారు. అత్యంత ప్రతికూల పరిస్థితులను సైతం భవిష్యత్ శక్తిగా మలచుకునే సామర్ధ్యాన్ని స్టార్టప్‌లు ప్రదర్శించాయని ఆయన కొనియాడారు. దేశంలోని యువ సంస్థలు కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో సత్వరం స్పందించాయని, తాము అనుసరిస్తున్నవిధానాల సమాచారాన్ని విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయని కార్పొరేట్‌రంగం, ఇన్వెస్టర్లతో కలిసి పనిచేశాయని ,కార్యకలాపాల స్థాయినిపెంచాయని ఆయన అన్నారు.
వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667941
-----
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలాయాలనుంచి అందిన సమాచారం:
*పంజాబ్ : రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు సంబంధించిన సమాచారం సేకరించి సమర్పించాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు పంజాబ్ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు సంబంధించి ఈ సమాచార సేకరణ శరవేగంతో సాగుతున్నదని ,కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడిగా ఈ సమాచారాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు. త్వరలోనే కోవిడ్ -19 వాక్సిన్ అందుబాటులోకి రానున్నదన్న అంచనాలతో ,దేశంలో దీనిని కట్టుదిట్టంగా పంపిణీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సన్నద్ధమౌతున్నట్టు ఆయన తెలిపారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దీనిని పంపిణీచేయడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ సమాచార సేకరణ, డాటా అప్‌లోడింగ్ సంబంధించి ఆరోగ్యశాఖకు చెందిన 450 మంది కి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
* హిమాచల్ ప్రదేశ్ : కోవిడ్ 19 కు సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడినా వెంటనే కోవిడ్ -19 పరీక్షలకు ఆస్పత్రికి వెళ్లేలా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్,కమ్యూనికేషన్ పై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. మాస్క్‌ధరింప చేయడానికి సంబంధించి భారత ప్రభుత్వ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. డాక్టర్లు కోవిడ్ పేషెంట్లతో మెరుగైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలన్నారు. ఇది పేషెంట్లు సత్వరం కోలుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందన్నారు.ఇది పేషెంట్లకు సకాలంలో చికిత్స అందడానికి వీలు కల్పిస్తుందన్నారు. కొవిడ్ మరణాలలో చాలావరకు పేషెంట్ ఆస్పత్రిలో చేరిన 24 గంటలలోపు జరిగినవేనని అందువల్ల సకాలంలో సత్వర చికిత్స ప్రాధాన్యతను ఇది తెలుపుతున్నదన్నారు.
*అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్‌ప్రదేశ్‌లో 147 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 231 కోవిడ్ 19పాజిటివ్ కేసులు డిశ్చార్జ్ అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్-19 కారణంగా మరణించడంతో కోవిడ్ మరణాల సంఖ్య 35 కు పెరిగింది.
.* అస్సాం : అస్సాంలో మరో 215 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.నిన్న 2832మంది కోవిడ్‌నుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జిఅయ్యారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 204386 కు పెరిగింది . డిశ్చార్జి అయిన వారి సంఖ్య 188584 కుపెరిగింది . యాక్టివ్ కేసులు 1489 కాగా మరణాలు 908.
* మేఘాలయ : మేఘాలయలో మరో 48 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొత్తం నిర్ధారిత కేసులు 9066. మొత్తం కోలుకున్న కేసులు 7471 ,మరణాలు 81.
*మిజోరం: మిజోరంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరగడంతో ఈరోజు నుంచి నవంబర్ 3 వరకు లాక్‌డౌన్ విధించారు. మిజోరంలో నిన్న 34 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2527 కు పెరిగింది. యాక్టివ్ కేసులు 315 గా ఉన్నాయి
.
*నాగాలాండ్ : నాగాలాండ్ లో మొత్తం కోవిడ్ 19 కేసులు 6626కు చేరాయి. సాయుధ బలగాల కేసులు 3807 .కాంటాక్టును గుర్తించినవి 2800, ఇతర ప్రాంతాలనుంచితిరిగివచ్చిన వారు 1635.ఫ్రంట్‌లైన్ వర్కర్లు 421 కేసులు.
* మహారాష్ట్ర :. మహారాష్ట్రప్రభుత్వం, కోవిడ్ -19 ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలరేట్లను ప్రైవేటు లేబరెటరీలలో 200 రూపాయలు తగ్గించింది. కొత్తరేట్లు రూ 980 నుంచి -1800 రూపాయల వరకు ఉండనున్నాయి . పరీక్షా నమూనాల సేకరణ దూరాన్ని బట్టి ఇవి మారుతాయి.ఇంతకు ముందు ఈ రేట్లు రూ 1200 నుంచి 2000 వరకూ ఉన్నాయి. ఆర్‌టి-పిసిఆర్ రేట్లను ప్రభుత్వం తగ్గించడం ఇది నాలుగవసారి. కాగా మహారాష్ట్రలో 3,645 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.గత146 రోజులలో ఇదే తక్కువ. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
*గుజరాత్: గుజరాత్‌లో కోవిడ్‌నుంచి కోలుకున్నమొత్తం పేషెంట్ల సంఖ్య 1.50 లక్షలను దాటింది. గత 24 గంటలలో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులనుంచి1,102 మంది కోలుకున్నారు.వరుసగా ఈరోజు రెండవ రోజు గుజరాత్‌లో కోవిడ్ కేసులు వెయ్యిలోపు నమోదయ్యాయి. సోమవారం నాడు కొత్తగా 908 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 13,738 కి చేరింది.
* రాజస్థాన్: బహిరంగ ప్రదేశాలలో మస్కుధరించడాన్ని తప్పనిసరి చేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాలలో రాజస్థాన్‌ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టనుంది.మార్కులు ధరించడానికి సంబంధించి చట్టాన్ని తీసుకురానున్న తొలిరాష్ట్రం ఇది. కరోనా వైరస్‌నియంత్రణకు తప్పని సరి రక్షణగా ఈచర్య చేపడుతున్నారు.
* మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులసంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 11,237 గాఉన్నాయి. కోలుకున్న వారిసంఖ్య 1.53 లక్షలు దాటింది.కాగా భోపాల్, ఇండోర్‌లలో రోజూ200కు పైగాకేసులు నమోదౌతున్నాయి. రాష్ట్రంలోని మిగతాజిల్లాలలో కోవిడ్ కేసుల సంఖ్య వందలోపే ఉంటున్నది.
*ఛత్తీస్‌ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లో 1649 కోవిడ్ -
19 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 43 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య 1.77లక్షలకు పెరిగింది. నిన్న కొత్త కేసులు 1861 కిచేరాయి. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 22,093 గా ఉన్నాయి.
* కేరళ :శబరిమల యాత్ర సీజన్‌లో కోవిడ్ పరీక్షా పద్దతిలో మార్పు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నప్పటికీ నెలవారిపూజక వచ్చిన ఒక పోలీసు, ఒక భక్తుడితో సహా మొత్తం ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా కేవలం సర్టిఫికెట్ ఆధారంగా ప్రతిఒక్కరినీ అనుమతించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. భక్తులకు యాంటిజెన్‌పరీక్షలకు బదులు ఆర్‌టి-పిసిఆర్‌పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ కలిగినవారికి యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలన్న సిఫార్సులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్నకోవిడ్ ఆంక్షలు, ప్లస్ 1 తరగతులు కేరళలో ఆన్‌లైన్ విధానంలో కొనసాగించనున్నారు.10 తరగతి వరకు విద్యార్ధులకు నిర్వహిస్తున్న వర్చువల్ తరగతులు మాదిరే వీటిని నిర్వహిస్తారు. ప్లస్ 1 తరగతి కొత్త బ్యాచ్ కి ఆన్‌లైన్ తరగతులు నవంబర్ 2 నుంచి ప్రారంభమౌతాయి..
*తమిళనాడు: తమిళనాడు వ్యవసాయ శాఖమంత్రి దొరైకన్ను ప్రస్తుతం కోవిడ్ 19 తో పోరాడుతున్నారు. ఆస్పత్రివర్గాల కథనం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేచర్యలకు కాస్త ఎదురుదెబ్బ తగిలినట్టు తెలిపారు. పండగల సందర్భంగా కొవిడ్ విషయంలో నిర్లక్ష్యంవహిస్తే అది తీవ్రపరిణామాలకు దారితీస్తుందని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్, షాపు యజమానులను హెచ్చరించారు.రాష్ట్రంలో ఆక్సిజన్ కు పెరగుతున్నడిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులలో ద్రవరూప ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
* కర్ణాటక : కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తే దానిని పంపిణీచేయడానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న ఏర్పాట్ల విషయంలోకేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖన్నిరాష్ట్రాలు,కేంద్రపాలితప్రాంతాలకు సర్కులర్ పంపింది. దీనిప్రకారం ప్రభుత్వ,ప్రైవేటు రంగంలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌వర్కర్ల వివరాలను సేకరిస్తారు.ఈరోజు రాష్ట్ర ఆరోగ్య,వైద్యవిద్యాశాఖమంత్రి డాక్టర్ సుధాకర్ ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2021 జనవరి నాటికి వాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆయన తెలిపారు.మరోవైపు కర్ణాటకకు కాస్త ఉపశమనం కలిగించేలా,కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖంపట్టాయి. ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్ మధ్యవరకు రాష్ట్రంలో రోజుకు 8,000 నుంచి 10,000 వరకూ కేసులు నమౌదౌతూవచ్చాయి. ప్రస్తుతానికి కోవిడ్ వైరస్ వ్యాప్తి జోరుతగ్గినట్టు కనిపిస్తోంది .
* ఆంధ్రప్రదేశ్ : కోవిడ్ -19 పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యాహ్న భోజనపథకం అమలు విషయంలో పలు కీలక ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. పాఠశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం ప్రకటించింది.టీచర్లు కోవిడ్ పరీక్షలు జరిపించుకుని ఆ నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని సూచించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పాలనాయంత్రాంగాలు మాస్కు లేకుంటే ప్రవేశం లేదు అన్నదానిని అన్ని ఆధ్యాత్మిక , వాణిజ్య సంస్థల వద్ద చేపడుతున్నారు. అలాగే వినియోగదారులు భౌతికదూరం పాటిస్తున్నారా లేదా అని గమనించి దీనిపై ప్రజలకు అవగాహనకల్పిస్తున్నారు.
* తెలంగాణ : తెలంగాణాలో ఈరోజు కొత్తా 837 కోవిడ్‌పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1154 మందికోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. జిహెచ్ఎంసి పరిధిలో 185 కేసులు నమోదయ్యాయి. మొత్తంకేసుల సంఖ్య 2,32,671 కాగా,యాక్టివ్ కేసులు 17.890.మరణాలు 1315,కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,13,466 కుచేరింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జిఐఎ) కాగితంరహిత, ఈ బోర్డింగ్‌ను దేశీయప్రయాణికులకు అమలుజరుపుతున్న దేశంలోని ఏకైక విమానాశ్రయం .ఈ సదుపాయాన్ని అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ప్రస్తుతం విస్తరింపచేసిన దేశంలోని తొలి విమానాశ్రయం కూడా ఇదే.
***
(Release ID: 1668055)
Visitor Counter : 223