సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
శిశు సంరక్షణ సెలవులకు సంబంధించి డీఓపీటీ సంస్కరణలు
Posted On:
26 OCT 2020 7:11PM by PIB Hyderabad
పురుష ఉద్యోగులు కూడా ఇకపై శిశు సంరక్షణ సెలవులకు (సీసీఎల్) అర్హులని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, మనోవేదనలు, పెన్షన్లు, అణు ఇంధనము, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్' (డీఓపీటీ) విభాగంలో తీసుకువచ్చిన కొన్ని ప్రధానమైన సంస్కరణల గురించి మాట్లాడుతూ శ్రీ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) సదుపాయం "ఒంటరి మగ తల్లిదండ్రులుగా జీవిస్తున్న పురుషులైన ఉద్యోగులకు మాత్రమే లభిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. దీనికి తోడు వితంతువులు, విడాకులు తీసుకున్న లేదా అవివాహితులు మరియు మగ ఉద్యోగులకు కూడా సీసీఎల్ వర్తిస్తుందని తెలిపారు. పిల్లల సంరక్షణ బాధ్యతను సింగిల్ హ్యాండ్ పేరెంట్‌గా తీసుకున్న వారికి గాను సీసీఎల్ వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కల్పించడానికి.. ఇది మార్గం సుగమం చేస్తుందని
ఇది ప్రగతిశీలక సంస్కరణ అని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కొన్ని రోజుల క్రితమే జారీ చేసినప్పటికీ.. ఇది ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో చేరుకోలేదని అన్నారు. ఈ నిబంధనకు మరింత సడలింపును గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్న ఉద్యోగి ఇకపై సంబంధిత నియంత్రిత అధికారి ముందస్తు అనుమతితో తాను పనిచేసే ప్రదేశం వదిలి ఇతర ప్రదేశానికి వెళ్లేలా వీలు కల్పించినట్టుగా ఆయన తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్‌లో మొదటి 365 రోజులకు 100% సెలవు జీతం మరియు తదుపరి 365 రోజులు 80% సెలవు జీతం ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రవేశ పెట్టిన మరో సంక్షేమ చర్య ఏమిటంటే, వికలాంగ పిల్లల విషయంలో, పిల్లల 22 సంవత్సరాల వయస్సు వరకు పిల్లల సంరక్షణ సెలవు పొందే పరిస్థితికి సంబంధించిన నిబంధన తొలగించబడిందని తెలిపారు. వికలాంగ పిల్లల కోసం ఇప్పుడు పిల్లల సంరక్షణ సెలవును ఏ వయసులోనైనా ప్రభుత్వ ఉద్యోగి పొందవచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జోక్యం, పాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గత 6 సంవత్సరాలుగా డీఓపీటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సామర్థ్యానికి గరిష్ఠంగా తోడ్పడటానికి వీలు కల్పించడమే తమ ఈ నిర్ణయాలన్నింటి వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశం అని ఆయన అన్నారు. అదే సమయంలో అవినీతి లేదా స్థాయితగ్గట్టుగా పనితీరు కనబరచని వారిపై ఎలాంటి సానుభూతి గానీ లేదా సహనం ఉండదని తెలిపారు.
***
(Release ID: 1667692)
Visitor Counter : 256