వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భవిష్యత్‌పై దృష్టి, నిర్ణయాత్మకత కలగలిసి భారత్‌లో దృఢమైన అంకుర పర్యావరణ వ్యవస్థను అందించింది: శ్రీ పియూష్ గోయల్
Posted On:
27 OCT 2020 2:01PM by PIB Hyderabad
భవిష్యత్‌పై దృష్టి, నిర్ణయాత్మకత కలగలిసి భారతదేశానికి దృఢమైన అంకుర సంస్థల (స్టార్టప్) పర్యావరణ వ్యవస్థను అందించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. మొదటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) స్టార్టప్ ఫోరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మన యువతే మన సంపద అని అన్నారు. ప్రస్తుత దుర్బలత్వం మరియు అనిశ్చితి సమయంలో వారు తగిన చురుకుదనం, అనుకరణ మరియు తమ సామర్థ్యంతో మేటిగా స్పందించారని ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో ఏర్పడిన తీవ్ర ప్రతికూలతను భవిష్యత్తులో గొప్ప సాంభవ్యతగా మార్చగల సామర్థ్యాన్ని మన అంకుర సంస్థలు ప్రదర్శించాయని శ్రీ గోయల్ అన్నారు. అనేక సందర్భాలలో సమయానుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన మేటి పరిష్కారాలను ఇవ్వడానికి అధిక శక్తిని, ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు గాను మంత్రి భారత స్టార్టప్‌లను ఈ వేదికపై ప్రశంసించారు. "వృద్ధి విషయంలో మనకు గల తృష్ణను ప్రదర్శిస్తూ
కోవిడ్ కాలంలో లక్షల మంది భారతీయులకు నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ పొందేందుకు ఉచిత ప్రాప్యతనందించేందుకు గాను ఉన్నత స్థాయి, విద్య కోసం ఎడ్యూటెక్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. అనేక రంగాలు డిజిటల్ దిశగా అడుగులు వేసేలా మన యువకులు అనేక క్లిష్టమైన యాప్స్ సృష్టించారు. ఇవి ఆయా రంగాలు కోవిడ్ మహమ్మారి సమస్యల్ని విశ్వాసంతో ఎదుర్కోనేలా సహాయపడ్డాయి. దీంతో మేము ఆర్థిక వ్యవస్థను అన్‌లాక్ చేసి ఆర్థిక కార్యకలాపాలను విస్తరించినప్పుడు ఆయా సంస్థలు విజయవంతంగా బయటపడ్డాయి.” అని ఆయన వివరించారు. కోవిడ్ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో మన ఉత్తమమైన పద్ధతులను, జ్ఞానాన్ని పంచుకోవడం, కార్పొరేట్లు & పెట్టుబడిదారులను నిమగ్నం చేయడం, మూలధన మానిటైజింగ్ & సమీకరించడం, ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం మరియు ఎక్స్పోజర్ & స్కేల్ అందించే విషయంలో భారతదేశంలోని యువ సంస్థలు వేగంగా చాలా సరళంగా స్పందించాయని శ్రీ గోయల్ చెప్పారు. వీటి ద్వారా స్టార్టప్‌ల వినూత్న ఆలోచనలతో భారీగా ఎంగేజ్‌మెంట్ పొందుతాయని చెప్పారు.
మొదటి జాతీయ స్టార్టప్ అవార్డు కార్యక్రమంలో భారతదేశం చాలా ఆసక్తికరమైన స్టార్టప్‌లను గుర్తించిందని శ్రీ గోయల్ అన్నారు. "దేశంలో మరిన్ని స్టార్టప్‌లు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు రావడానికి మేము తగు ప్రోత్సాహకరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించాము" అని ఆయన వివరించారు. అంకుర సంస్థలతో తగిన కార్యక్రమాల ఎంగేజ్‌మెంట్ విషయంలో ప్రధాని ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు. "స్టార్టప్‌లు ఆవిష్కరణ శక్తిని వ్యక్తపరిచే.. ఘాతాంక వృద్ధి ఇంజిన్లు" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అభివర్ణించారని ఆయన వివరించారు. అంకుర సంస్థలతో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన చర్చలతో సహా పలు సెషన్లను చేర్చేలా ఎస్‌సీవో చూపిన చొరవను శ్రీ గోయల్ ప్రశంసించారు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లను మహిళలు స్థాపించరని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్‌సీఓ పరిధిలోని సభ్య దేశాలలో ఆవిష్కరణ స్ఫూర్తి పెంపొందించడానికి, ఎంగేజ్‌మెంట్‌ను విస్తరించడానికి అన్ని సభ్య దేశాల సానుకూల వైఖరి యొక్క ప్రతిబింబమే ఈ రోజు ఎస్‌సీఓ స్టార్టప్ ఫోరమ్ ప్రారంభం అని శ్రీ గోయల్ అన్నారు. వ్యవస్థాపకత స్ఫూర్తి అనే అంశమే ఎస్సీఓ సభ్య దేశాలను ఒకదానితో మరోకదానిని దగ్గరకు చేర్చిన అంశమని ఆయన అన్నారు. ఎస్సీఓ స్టార్టప్ ఫోరం ప్రారంభించడం అందరిలోనూ ఆవిష్కరణలను పెంపొందించడానికి అన్ని సభ్య దేశాల సానుకూల వైఖరిని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. అన్ని సభ్య దేశాల స్టార్టప్‌లతో ఎంగేజ్‌మెంట్ అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేస్తుంది. అంకుర సంస్థల దృష్టిని మరింతగా ప్రోత్సహిస్తుంది, విస్తరిస్తుందని తెలిపారు.
(Release ID: 1667941)
Visitor Counter : 275