హోం మంత్రిత్వ శాఖ
పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జరీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
అప్రమత్తతతో ముందడుగు
కోవిడ్- తగిన ప్రవర్తనను అమలు చేయాలని రాష్ట్రాలు / యుటి లకు సూచన
Posted On:
27 OCT 2020 3:38PM by PIB Hyderabad
- 30.09.2020 న జారీ చేసిన 'పునఃప్రారంభానికి మార్గదర్శకాల'ను 30.11.2020 వరకు అమలులో ఉండేలా పొడిగిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
- కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల కార్యకలాపాల పునఃప్రారంభం
- 2020 మార్చి 24న ఎంహెచ్‌ఏ చేత లాక్డౌన్ చర్యలపై మొదటి ఉత్తర్వు జారీ అయినప్పటి నుండి, దాదాపు అన్ని కార్యకలాపాలు కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో క్రమంగా తెరుచుకుంటున్నాయి. చాలా కార్యకలాపాలు అనుమతించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే కొన్ని కార్యకలాపాలు కొన్ని పరిమితులతో అనుమతించారు, ఆరోగ్యం, భద్రతా జాగ్రత్తలకు సంబంధించి ఎస్ఓపి లను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కార్యకలాపాలలో - మెట్రో రైలు; షాపింగ్ మాల్స్; హోటల్, రెస్టారెంట్లు మరియు ఆతిథ్య సేవలు; మతపరమైన ప్రదేశాలు; యోగా మరియు శిక్షణా సంస్థలు; వ్యాయామశాలలు; సినిమాలు; వినోద ఉద్యానవనం మొదలైనవి ఉన్నాయి.
- కొన్ని కార్యకలాపాలకు సంబంధించి, కోవిడ్ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు పరిస్థితిని అంచనా వేయడం మరియు ఎస్ఓపి లకు లోబడి వాటి పునఃప్రారంభం కోసం నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించారు. ఈ కార్యకలాపాలలో - పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలు; రిసెర్చ్ స్కాలర్స్ కోసం రాష్ట్ర మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు; 100 మంది పరిమితికి మించి సమావేశాలను అనుమతిస్తారు.
- 30.09.2020 న ఎంహెచ్‌ఏ జారీ చేసిన చివరి మార్గదర్శకాల తరువాత, ఈ క్రింది కార్యకలాపాలు కూడా అనుమతిస్తారు కాని కొన్ని పరిమితులతో అనుమతిస్తారు:
- ఎంహెచ్‌ఏ అనుమతి ప్రకారం ప్రయాణీకుల అంతర్జాతీయ విమాన ప్రయాణం.
- క్రీడాకారుల శిక్షణ కోసం వినియోగించే ఈత కొలనులు ఉపయోగిస్తున్నారు.
- బిజినెస్ టు బిజినెస్ (బి 2 బి) అవసరాల కోసం ఎగ్జిబిషన్ హాళ్లు.
- సినిమాస్ / థియేటర్లు / మల్టీప్లెక్సులు వాటి సీటింగ్ సామర్థ్యంలో 50% వరకు.
- సామాజిక/ విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ కార్యక్రమాలు మరియు ఇతర సమ్మేళనాలు, క్లోజ్డ్ ప్రదేశాలలో గరిష్టంగా 50% హాల్ సామర్థ్యంతో మరియు 200 మంది వ్యక్తుల పరిమితికి లోబడి ఉంటాయి.
పరిస్థితుల అంచనా ఆధారంగా పై కార్యకలాపాలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు
- కోవిడ్- తగిన ప్రవర్తన
- గ్రేడెడ్ రీ-ఓపెనింగ్ మరియు కార్యకలాపాల ప్రగతిశీల పునఃప్రారంభం వెనుక ఉన్న సారాంశం ముందుకు సాగడం. అయితే, ఇది మహమ్మారి ముగిసిపోయిందని కాదు. ప్రతి పౌరుడు వారి దినచర్యలో కోవిడ్-19 తగిన ప్రవర్తనను అవలంబించడం ద్వారా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కింద పేర్కొన్న మూడు మంత్రాలను అనుసరించడానికి కోవిడ్-19 తగిన ప్రవర్తనపై 2020 అక్టోబర్ 8 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఒక ‘జన్ ఆందోళన్’ ప్రారంభించారు, అవి:
- మాస్క్ ను సక్రమంగా ధరించాలి;
- తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి
- ఆరు అడుగుల సురక్షితమైన దూరాన్ని పాటించాలి.
- కార్యకలాపాల పునరుద్ధరణ విజయవంతం కావడానికి, మహమ్మారి నిర్వహణలో సాధించిన ప్రయోజనాలు నీరుగారకుండా ఉండటానికి పౌరులలో క్రమశిక్షణ మరియు యాజమాన్య భావాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది.
- కోవిడ్ -19 తగిన ప్రవర్తనను కింది స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించడానికి ప్రయత్నించాలని మరియు మాస్కులు ధరించడం, చేతి పరిశుభ్రత మరియు సామాజిక దూరం అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ఏ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు / యుటిల ప్రధాన కార్యదర్శులు / నిర్వాహకులకు సూచించింది.
కోవిడ్-19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశాలు
కోవిడ్-19 నిర్వహణకు జారీ చేసే జాతీయ ఆదేశాలు దేశవ్యాప్తంగా అనుసరణీయం కావలి. తద్వారా కోవిడ్-19 తగిన ప్రవర్తన తప్పనిసరిగా అలవడాలి.
30 నవంబర్ 2020 వరకు కంటైనేషన్ జోన్లలో లాక్డౌన్ యొక్క కఠినమైన అమలు:
- లాక్డౌన్ 2020 నవంబర్ 30 వరకు కంటైనేషన్ జోన్లలో ఖచ్చితంగా అమలు చేయబడుతుంది.
- ప్రసార గొలుసును సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసే ఉద్దేశ్యంతో ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మ స్థాయిలో జిల్లా అధికారులు గుర్తించాలి. ఈ జోన్లలో కఠినమైన నియంత్రణ చర్యలు అమలులో ఉంటాయి మరియు అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతిస్తారు
- నియంత్రణ మండలాల్లో, కఠినమైన విస్తృతి నియంత్రణ అమలుచేస్తారు,అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతిస్తారు.
- ఈ కంటెయిన్‌మెంట్ జోన్‌లను సంబంధిత జిల్లా కలెక్టర్ల వెబ్‌సైట్లలో మరియు రాష్ట్రాలు / యుటిల ద్వారా తెలియజేయబడుతుంది మరియు సమాచారం కూడా ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూతో అందజేయడం జరుగుతుంది.
- రాష్ట్రాలు కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల స్థానిక లాక్‌డౌన్ విధించరాదు.
అంతర్ రాష్ట్రీయంగాను, రాష్ట్రాల లోపల కానీ రాకపోకలకు ఎటువంటి ఆంక్షలు ఉండవు
- వ్యక్తులు, సరుకుల అంతర్-రాష్ట్ర మరియు రాష్ట్రంలోపల కదలికలు, రాకపోకలకు ఎటువంటి పరిమితి ఉండదు. అటువంటి కదలికలకు ప్రత్యేక అనుమతి / ఆమోదం / ఇ-పర్మిట్ అవసరం లేదు.
బలహీన వ్యక్తులకు రక్షణ
- దుర్బల వ్యక్తులు, అనగా, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, సహ-అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, నిత్యావసరాలను పూరించుకోడానికి, ఆరోగ్య అవసరాలు తప్పిస్తే ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఆరోగ్య సేతు ఉపయోగించాలి
- ఆరోగ్యసేతు మొబైల్ యాప్ ఉపయోగించడాన్ని నిరంతరం ప్రోత్సహిస్తుండాలి.
(Release ID: 1667880)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam