ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

3 నెలల తరువాత కనిష్ఠంగా కొత్త పాజిటివ్ కేసులు

చికిత్సలో ఉన్నవారు 6.25 లక్షలు; 11 వారాల తరువాత అతితక్కువ సంఖ్య

Posted On: 27 OCT 2020 11:41AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ అనేక కీలకమైన మైలురాళ్ళు దాటుతూ ముందుకు సాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 36,470 కాగా ఇది గడిచిన మూడు నెలల కాలంలో అతి తక్కువ కావటం విశేషం. జులై 18న 34,884 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు కోలుకుంటూ ఉండటంతో బాటు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6.25 లక్షలకు తగ్గింది, ఆ విధంగా కోలుకున్న 6,25,857 కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 7.88% మాత్రమే అయ్యాయి.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CN9D.jpg

ఈ విధమైన ఫలితాలు ఆశాజనకంగా, ఉత్సాహపూరితంగా ఉండటానికి కారణం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో, సహకారంతో దృష్టి సారించి పనిచేయటమే. పెద్ద ఎత్తున కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం, సరైన నిఘా ద్వారా వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించి పరీక్షల ద్వారా నిర్థారించి, ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించటం, కేంద్రం నిర్దేశించిన ప్రామాణిక చికిత్సావిధానాలు పాటించటం ద్వారా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. అదే సమయంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, సహాయక కార్యకర్తలు దేశం నలుమూలలా అంకితభావంతో అందించిన సేవలు కూడా దీనికి కారణమయ్యాయి. ఇప్పుడు చికిత్సలో ఉన్న 35% కేసులు కేవలం 18 జిల్లాలకు చెందినవే కావటం గమనార్హం.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BA5J.jpg

చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ రావటంతో బాటు కోలుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో పెరుగుతూ వస్తున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారు 72 లక్షలు దాటారు ( 72,01,070 మంది). చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ ప్రస్తుతం 65,75,213 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 63,842 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 90.62% కు చేరింది. వీరిలో 78% మంది పది రాష్ట్రాలవారే ఉన్నారు. ఒకే రోజులో 9,000 మందికి పైగా కోలుకున్న మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 8,000 పైబడ్డ కర్నాటక రెండో స్థానంలో ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003B6DV.jpg

కొత్తగా నిర్థారణ అయిన పాజిటివ్ కేసులలో 76% కేవలం 10 రాష్ట్రాలనుంచే వస్తున్నాయి. అందులో కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నాలుగేసి వేలకు పైఒగా కేసులు నమోదవుతూ ఉండగా మహారాష్ట, కర్నాటక లో మూడేసి వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TAPE.jpg

గడిచిన 24 గంటలలో 488 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 80% మరణాలు కేవలం పది జిల్లాల్లోనే సంభవించాయి.  వరుసగా రెండో రోజు కూడా 500 లోపే మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో  అత్యధికంగా ఒకరోజులోనే 84 మరణాలు నమోదయ్యాయి. భారత్ లో ఇప్పుడు కోవిడ్ మరణాల శాతం 1.5 కు తగ్గింది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057CHV.jpg

****



(Release ID: 1667778) Visitor Counter : 195