PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
26 OCT 2020 6:54PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)
* భారత్ లో కోవిడ్ మరణాల శాతం మార్చి 22 తరువాత నేడు అత్యల్పం
* గత 24 గంటలలో 500 లోపు కోవిడ్ మరణాలు నమోదు
* 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణాలు 1% కంటే తక్కువ
* గత 24 గంటలలో 59.105 మంది కొత్తగా కోలుకోగా, పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కొత్త కేసులు 45,148
*జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 90.23%
మార్చి 22 తరువాత నేడు అతి తక్కువగా నమోదైన మరణాల శాతం; గత 24 గంటల్లో మరణాలు 500 లోపు ; 1% కంటే తక్కువ నమోదైన రాష్ట్రాలు 14
దేశంలో కోవిడ్ మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.5 శాతానికి చేరింది. గత 24 గంటలలో 480) మరణాలు నమోదయ్యాయి. .ఇప్పుడు 2218 కోవిడ్ ఆస్పత్రులు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాయి. 14 రాష్ట్రాలలో మరణాలు 1% లోపే ఉన్నాయి. గత 24 గంటలలో కొత్తగా కోలుకున్నవారి సంఖ్య 59,105 కాగా ఇప్పుడు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 71 లక్షలు దాటి 71,37,228 గా నమోదైంది. కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 90.23% కు చేరింది. ప్రస్తుతం మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారు 6,53,717 మంది(8.26%). కొత్తగా కోలుకున్నవారిలో 78% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కర్నాటకలో అత్యధికంగా ఒక్క రోజులో 10 వేలమందికి పైగా కోలుకోగా 7 వేలకు పైగా కోలుకున్నవారున్న కేరళ రెండో స్థానంలో ఉంది. గత 24 గంటలలో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు 45,148 నమోదయ్యాయి. జులై 22 తరువాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవటం ఇదే ప్రథమం. ఆ రోజు 37 వేల కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 82% కేసులు కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కాగా అందులో కేరళ, మహారాష్ట్ర ఆరేసి వేలకు పైగా నమోదు చేసుకోగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కర్నాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీ నాలుగేసి వేలకు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్నాయి. గడిచిన 24 గంటలలో 480 మరణాలు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 80% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ మరణాలలో 23% పైగా (112 మరణాలు) ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667595
25.10.2020 న ప్రధాని ’మనసులో మాట 2.0’ 17వ ఎపిసోడ్ ఆంగ్లానువాదం
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667409
పిఎం స్వనిధి పథకం ఉత్తరప్రదేశ్ లబ్ధిదారులతో 27న ప్రధాని ఇష్టాగోష్ఠి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 27న ఉదయం 10.30 కి ఉత్తరప్రదేశ్ కు చెందిన పి ఎం స్వనిధి పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇష్టాగోష్ఠిగా ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూదా ఆ కార్యక్రమంలొ పాల్గొంటారు. పిఎం వీధివర్తకుల ఆత్మ నిర్భర్ నిధి (పిఎం స్వనిధి) పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది కోవిడ్ 19 కు ప్రభావితమై దెబ్బతిన్న పేదలైన వీధి వర్తకులు తమ వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించటానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 24 లక్షల దరఖాస్తులు రాగా దాదాపు12 లక్షలకు పైగా దరఖాస్తుదారులకు మంజూరు కాగా అందులో 5.35 లక్షల లబ్ధిదారులకు ఇప్పటికే రుణ పంపిణీ జరిగింది.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667409
గుజరాత్ లో మూడు కీలక ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని, గుజరాత్ రైతులకోసం కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శనివారం శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లో మూడు కీలకమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. రైతులకు 16 గంటల విద్యుత్ అందించే కిసాన్ సూర్యోదయ యోజన ను కూడా ఆవిష్కరించారు. అహమ్మదాబాద్ లో యు ఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అనుబంధంగా చిన్న పిల్లల గుండె జబ్బుల ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. అదే విధంగా అహమ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో టెలీ కార్డియాలజీ కోసం ఒక మొబైల్ యాప్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిర్నార్ దగ్గర రోప్ వే ప్రారంభించారు. సామాన్యుడి పట్ల అంకితభావంతో పనిచేయటంలో గుజరాత్ ఆదర్శంగా ఉంటుందన్నారు. సుజలాం సుఫలాం సౌని పథకం తరువాత కిసాన్ సూర్యోదయ పథకం గుజరాత్ రైతుల అవసరాలు తీర్చటంలో మరో మైలురాయి చేరిందన్నారు. రైతులు పెట్టుబడులు తగ్గించుకుంటూ తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగేలా మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేలాది రైతు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, వేపపూతతో యూరియా, భూసార కార్డులు సహా అనేక కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు కావటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తు చేశారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667408
గుజరాత్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు కీలకప్రాజెక్టుల ఆవిష్కారం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667409
2018-19 సంవత్సరానికి వార్షిక రిటర్న్ లు, సమన్వయ పట్టీల దాఖలుకు గడువు తేదీల పెంపు
2018-19 సంవత్సరానికి గాను వార్షిక రిటర్న్ లు ( ఫామ్ జి ఎస్ టి ఆర్ -9). సమన్వయ పట్టీ ( ఫామ్ జి ఎస్ టి ఆర్ -9 సి) దాఖలు చేయటానికి గడువు తేదీ పొడిగించాల్సిందిగా ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు అందుతూ ఉన్నాయి. కోవిడ్ సంబంధమైన లాక్ డౌన్, ఆంక్షలు కారణంగా వ్యాపార లావాదేవీలు దేశంలోని అనేక ప్రాంతాలలో ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదని ఆ అభ్యర్థనలలో పేర్కొన్నారు. ప్రస్తుత గడువు అక్టోబర్ 31 కాగా దీనిని పొడిగించాలని, అలా చేయటం వలన వ్యాపారులకు, ఆడిటర్లకు కొంత వెసులుబాటు కలుగుతుందని తెలియజేశారు. అందువలన జీ ఎస్టీ కౌన్సిల్ సిఫార్సులను కూడా లెక్కలోకి తీసుకుంటూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రిటర్న్ లు, సమన్వయ పట్టీలు దాఖలు చేయటానికి గడువు తేదీని అక్టోబర్ 31 బదులు డిసెంబర్ 31 గా నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667333
దుష్ప్రభావాలు ఉండే రసాయనాల స్థానంలో ఊరట నిచ్చే కొత్త తరం సుస్థిర ఇన్ఫెక్షన్ నివారకాలు, శానిటైజర్లు
కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వాడుతున్న ఇన్ఫెక్షన్ తొలగించే రసాయనాలు, సబ్బుల వలన చర్మం పొడిబారి దురద పుట్టే పరిస్థితి నుంచి త్వరలోనే విముక్తి కలగబోతోంది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్టార్టప్ కంపెనీలు సంప్రదాయ రసాయనాలు వాడే ఇన్ఫెక్షన్ నాశనులకు బదులు సుస్థిరమైన ప్రత్యామ్నాయాలతో సిద్ధమయ్యాయి. అతి సన్నటి రంధ్రాలలోకి కూడా చొచ్చుకుపోయి ఇన్ఫెక్షన్ ను తొలగించే సామర్థ్యం వీటికుంది. సురక్షితమైన శానిటైజేషన్ టెక్నాలజీలతో దాదాపు 10 కంపెనీలు ఇప్పుడు ముందుకొచ్చాయి. జాతీయ శాస్త్ర సాంకేతిక వ్యాపార దక్షత అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ అగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్ 19 హెల్త్ క్రైసిస్ సంస్థ ప్రోత్సాహంతో సాగుతున్న ఈ చొరవలను బొంబాయ్ ఐఐటి లోని నవకల్పనలు, వ్యాపారదక్షత సంస్థ దీన్ని అమలులోకి తెస్తోంది. సంల్కిష్టమైన కలుషిత నీటిని, వ్యర్థ జలాన్ని శుద్ధి చేయటంలో నైపుణ్యమున్న ముంబయ్ స్టార్టప్ కంపెనీ ఇన్ ఫ్లాక్స్ వాటర్ సిస్టమ్స్ తన టెక్నాలజీని మార్పు చేసి కోవిడ్ 19 కాలుష్యాన్ని తగ్గించేలా వజ్ర పేరుతో తగిన ఇన్ఫెక్షన్ పోరాటక పరికరాల తయారీలో నిమగ్నమైంది. బహుళ దశల్లో ఇన్ఫెక్షన్ ను తొలగించే వ్యవస్థలో ఓజోన్ ను తయారు చేసేలా ఎలక్ట్రో స్టాటిక్ డిశ్చార్జ్ ని వాడుకుంటారు. అందులో యువిసి లైట్ స్పెక్ట్రమ్ వలన వైరస్ లు, బాక్టీరియా ఇతర సూక్ష్మ జీవులు నిర్వీర్యమవుతాయి. దీనివలన పిపిఇ కిట్స్ తయారీ ధరలు బాగా తగ్గుతాయి.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667300
ఉత్తరప్రదేశ్ బరేలీ లో 100 పడకల ఇ ఎస్ ఐ ఆస్పత్రికి భూమిపూజ చేసిన శ్రీ గంగ్వార్
కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ నిన్న ఉత్తరప్రదేశ్ లోని బరేలీ లో 100 పడకల ఇ ఎస్ ఐ ఆస్పత్రికి భూమిపూజ చేశారు. ఎనిమిది సార్లు బరేలీనుంచి ఎంపీగా ఎన్నికైన శ్రీ గంగ్వార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికరులు చేసిన కృషి ఫలితంగా కల నిజమైందన్నారు. తన నియోజకవర్గ ప్రజల వైద్య అవసరాలు తీర్చటానికి ఈ ఆస్పత్రి ఎంతో అవసరమన్నారు. ఇంతకుముందు పెద్ద వైద్యానికి ఢిల్లీ లేదా లక్నోలోని ఎయిమ్స్ దాకా వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. కేవలం కార్మికులకే కాకుండా, నామమాత్రపు చార్జీలతో సామాన్యులకు కూడా వైద్య సదుపాయం ఇక్కడ అందుబాటులో ఉంటుందన్నారు. భవిష్యత్తులో దీన్ని ఒక ఆదర్శ ఆస్పత్రిగా మారుస్తామన్నారు.
మరిన్ని వివరాలకు : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667587
జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గోవాలో ధరల సమీక్ష, వనరుల విభాగం ఏర్పాటు
ఔషధ శాఖలోని ఎరువులు, రసాయనాల మంత్రిత్వ్చశాఖ కింద పనిచేసే గోవాలో జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక ధరల సమీక్ష, వనరుల విభాగం ఏర్పాటుచేస్తారు. ఈ విభాగాన్ని అక్టోబర్ 22న గోవా రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా విభాగం అక్కడి ఔషధ నియంత్రణాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రప్రభుత్వంతో కలసి పనిచేసింది. దీనివలన హెచ్ సి క్యూ , పారాసెటమాల్, వాక్సిన్లు, ఇన్సులిన్ సహా ఔషధాలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుతూ వచ్చాయి. రాష్ట్రాలతో కలసి పనిచేయటం వల్ల దేశవ్యాప్తంగా ఎక్కడా మందుల కొరత లేకుండా చూడగలిగారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667323
పిఐబి క్షేత్రస్థాయి అధికారుల సమాచారం
• అస్సాం: అస్సాంలో గడిచిన 24 గంటలలో 204 కోవిడ్ పాజిటివ్ కెసులు నమోదయ్యాయి. 8753 పరీక్షలు జరపగా 2.33% పాజిటివ్ కేసులు గుర్తించారు.
• మేఘాలయ: రాష్ట్రంలో ఈ రోజు 104 మంది కతోనా నుంచి బైటపడ్దారు. చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 1605 కు చేరింది. వారిలో 53 మంది బి ఎస్ ఎఫ్, సాయుధ దళాలకు చెందినవారు.
• మిజోరం: నిన్న మిజోరంలో 146 తాజా కోవిడ్ కెసుల నిర్థారణ జరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2493 కు చేరింది. ఈ కేసుల పెరుగుదలను ఆపటానికి మిజోరం ప్రభుత్వం నిన్నటి నుంచి కోవిడ్ నివారణ పక్షం పాటిస్తోంది
• నాగాలాండ్: నాగాలాండ్ లోని ఫెక్, లాంగ్లెంగ్ జిల్లాలున్ ఇంకా కోవిడ్ రహితంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చికిత్సపొందుతున్న 1865 కేసులలో ఒక్క దిమాపూర్ జిల్లాలోనే 1372 కేసులు ఉన్నాయి.
• కేరళ: ఆయుష్ శాఖ సహాయంతో కోవిడ్ అనంతర చికిత్సాకేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కెకె శైలజ చెప్పారు. క్లస్టర్ల సంఖ్య పెరగటం వలన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగాయన్నారు. మరణాలు తగ్గించటం మీద ప్రధానంగా దృష్టి సారించామన్నారు. మిగతా రాష్ట్రాలలో మరణాల శాతం 1 కి పైగా ఉందగా కేరళలో 0.34 శాతానికి పరిమితం చేయగలిగినట్టు చెప్పారు. ఈరోజు మరో మరణం నమోదైంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1333 కి చేరింది. ఇలా ఉండగా ఈ ఏడాది కొచ్చి బినాలే ని కోవిడ్ కారణంగా రద్దు చేశారు. విజయదశమి వేదుకలని వేలాది మంది చిన్నపిల్లల అక్షరాభ్యాసంతో జరిపారు. చాలామంది పిల్లలు ఇళ్లలో కూర్చునే వేదుకలు జరపగా కొన్ని చోట్లమాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో నిర్వహించారు.
• తమిళనాడు: అక్టోబర్ 13న కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిన తమిళనాడు వ్యవసాయ శాఖామంత్రి T ఆర్, దొరైకణ్ను ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. .ముఖ్యమంత్రి ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. గురువారం ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 72 ఏళ్ల మంత్రికి అనేక ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులో అతిపెద్ద ప్రభుత్వాస్పత్రి అయిన మొదటి సారిగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిన్న ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 2869 కేసులు నమోదు కాగా 31 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7.09 లక్షలకు, మరణాలు 10,924కి చేరాయి..
• కర్నాటక : కర్నాటకలో ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించకపోతే నవంబర్ ప్రథమార్థంలో మరోవిడత కోవిడ్ అల తప్పకపోవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ తోబాటు వరదలు, ఎన్నికలు కూడా నవంబర్ 1 న జరగాల్సిన రాజ్యోత్సవ పురస్కార ప్రదానోత్సవం మీద నీలి నీడలు కమ్మాయి. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా చరిత్రాత్మక మైసూర్ దసరా ఉత్సవాలు కూడా చాలా సీదా సాదాగా పరిమితంగా జరిపారు.
• ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లో కోలుకుంటున్నవారి శాతం బాగా పెరిగి 95.36 శాతానికి చేరింది. మరణాల శాతం కూడా 0.82 శాతం దగ్గర ఆగింది. కొద్ది రోజులుగా కొత్త కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో 2,997 కొత్త కేసులు నమోదు కాగా, 3,585 మంది కోలుకున్నారు. 21 మరణాలు నమోదయ్యాయి. . దీంతో మొత్తం కోవిడ్ కేసులు 8.07 లక్షలకు, కోలుకున్నవారి సంఖ్య 7.69 లక్షలకు, మరణాలు 6,587 కి చేరాయి.. రాష్ట్రంలొ ప్రస్తుతం 30,860 మంది కరోనా బాధితులు చికిత్సలో ఉన్నారు.
• తెలంగాణ: గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 582 కొత్త కేసులు, 1432 మంది కోలుకున్న వారు , 4 మరణాలు నమోదయ్యాయి. 582 కొత్త కేసులలో 174 గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,31,834; చికిత్సలో ఉన్నది: 18,611కాగా మరణాలు 1311; కోలుకున్న వారు 2,11,912 మంది. రాష్ట్రంలో కోలుకుంటున్నవారి శాతం 91.40 కి పెరిగింది. జాతీయ స్థాయిలో అది 90.2 శాతం ఉంది. మరణాల శాతం 0.56 కాగా జాతీయ స్థాయిలో అది 1.5 శాతంగా ఉంది. .
• మహారాష్ట్ర: కోవిడ్ పరిస్థితి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రార్థనామందిరాలు తెరవకూడదన్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమర్థించుకున్నారు. వార్షిక దసరా ర్యాలీ నుద్దేశించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సారిగా చేసిన ప్రసంగంలో తమ ప్రభుత్వం కోవిడ్ ను అరికట్టటంలో ప్రజలకు అండగా నిలబడుతుందన్నారు. ఆరంభం నుంచీ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశలోనే తాము అన్నీ దశలవారీగా అనుసరించామని చెప్పారు. విపక్షాలు ఎంతగా విమర్శించినా ఇకముందు కూడా ఇదే బాటలో నడుస్తామన్నారు.
• గుజరాత్: గుజరాత్ లో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా మెరుగుపడుతూ 89.46 శాతం చేరింది. ఆదివారం నాడు 919 కొత్త కేసులు నమోదు కాగా అందులో గరిష్ఠంగా 227 కేసులు సూరత్ లోనే నమోదు కాగా అహమ్మదాబాద్ లో 174 కొత్త కేసులు వచ్చాయి.
• మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లో కోవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. చికిత్సలో ఉన్న కేసులు 11,237 కాగా నిన్న కొత్తగా 951 కేసులు నమోదయ్యాయి. 1,181 మంది కోలుకున్నారు. రాష్ట్రప్రభుత్వం అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ పండుగ సందర్భంగా జనం గుమికూడకుండా ఆంక్షలు విధించింది.
• చత్తీస్ గఢ్: చత్తీస్ గఢ్ కోవిడ్ గణాంకాలు ఆదివారం నాడు 1,75 లక్షలకు చేరాయి. కొత్తగా 1368 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. మరో 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1818 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,743 మంది చికిత్సలో ఉన్నారు.
*****
(Release ID: 1667680)
Visitor Counter : 156