ఆర్థిక మంత్రిత్వ శాఖ

2018-19 వార్షిక రిటర్న్, రికన్సిలియేషన్ స్టేట్మెంట్ దాఖలుకు గడువు పొడిగింపు

Posted On: 24 OCT 2020 3:45PM by PIB Hyderabad

   పన్ను చెల్లింపుదార్లుగా నమోదైన వారు 2018-19 సంవత్సరానికి ఫారం జి.ఎస్.టి.ఆర్.-9 ద్వారా ఆదాయంపన్ను వార్షిక రిటర్నులు దాఖలు చేసేందుకు, అలాగే, ఫారం జి.ఎస్.టి.ఆర్.-9సి ద్వారా రికన్సలియేషన్ స్టేట్మెంట్ దాఖలు చేసేందుకు గడువును పొడిగించవలసిన అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతూ వస్తున్నాయి. కోవిడ్-91 వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ నిబంధనలు, పలు రకాల ఆంక్షలు అమలు కారణంగా, దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ వ్యాపార కలాపాలు ఇప్పటికీ సాధ్యం కాలేదు కాబట్టి వార్షిక రిటర్నుల వివరాల దాఖలుకు గడువును పొడిగించాలంటూ ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తులు అందాయి. వ్యాపారాలు, ఆడిటర్లు తిరిగి సజావుగా తమ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా వార్షిక రిటర్నుల, రికన్సిలియేషన్ స్టేట్మెంట్ దాఖలుకు గడవును  2020 అక్టోబరు 31వ తేదీకి మించి పొడిగించాలని ఆ విజ్ఞప్తుల్లో కోరారు.

   ఇలా అందిన విజ్ఞప్తులు, వస్తు సేవల పన్ను మండలి (జి.ఎస్.టి. కౌన్సిల్) చేసిన సిఫార్సుల మేరకు 2018-19 సంవత్సరానికి రిటర్నులు (ఫారం జి.ఎస్.టి.ఆర్-9/జి.ఎస్.టి.ఆర్.-9ఎ), రికన్సిలియేషన్ స్టేట్మెంట్ (ఫారం జి.ఎస్.టి.ఆర్.-9సి) దాఖలు చేయడానికి చివరి తేదీని 2020, అక్టోబరు 31నుంచి,.. 2020 డిసెంబరు 31వరకూ పొడిగించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకా వెలువడవలసి ఉంది.

  సగటున రూ. 2 కోట్ల వరకూ వ్యాపారం నడిపే పన్ను చెల్లింపుదార్లు 2018-19వ సంవత్సరానికి వార్షిక రిటర్న్ (ఫారం జి.ఎస్.టి.ఆర్-9/ జి.ఎస్.టి.ఆర్.-9ఎ) ను ఐచ్ఛికంగా దాఖలు చేయాల్సి ఉంటుంది.  సగటున రూ. 5కోట్ల వరకూ వ్యాపారం జరిగే పన్ను చెల్లింపుదార్లు 2018-19వ సంవత్సరానికి రికన్సిలియేషన్ స్టేట్మంటను ఫారం-9సి ద్వారా ఐచ్ఛికంగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

****



(Release ID: 1667333) Visitor Counter : 218