ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని మూడు ప్రముఖ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవం జరిగిన సందర్భంలో ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
24 OCT 2020 1:53PM by PIB Hyderabad
నమస్కారం.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ గారు, గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు శ్రీ సి.ఆర్. పాటిల్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా రైతు సోదరులు, గుజరాత్ రాష్ట్ర సోదర, సోదరీమణులారా,
గుజరాత్ అభివృద్ధి కి సంబంధించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులకు ఈ రోజు న మా అంబే ఆశీస్సులతో ప్రారంభోత్సవం జరుగుతోంది. నేడు కిసాన్ సూర్యోదయ యోజన, గిర్ నార్ రోప్-వే తో పాటు దేశంలోనే అతి పెద్ద , ఆధునిక కార్డియేక్ ఆసుపత్రి గుజరాత్ రాష్ట్రానికి లభించాయి. ఈ మూడు ఒక విధంగా గుజరాత్ రాష్ట్ర శక్తి కి, భక్తి కి, ఆరోగ్యానికి ప్రతీకలు. వీటన్నిటికి గాను గుజరాత్ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు.
సోదర సోదరీమణులారా, గుజరాత్ ఎల్లప్పుడూ అసాధారణ శక్తితో కూడిన ప్రజలకు చెందిన భూమి. పూజ్య బాపు, సర్ దార్ పటేల్ ల నుంచి గుజరాత్ కు చెందిన పలువురు కుమారులు దేశానికి సామాజిక, ఆర్థిక నాయకత్వాన్ని అందించారు. కిసాన్ సూర్యోదయ యోజన ద్వారా గుజరాత్ మళ్లీ ఓ కొత్త పథకం తో ముందుకు రావడం నాకు సంతోషంగా ఉంది. సుజలామ్ - సుఫలామ్, సావునీ పథకం తర్వాత గుజరాత్ రైతులకు ఇప్పుడు సూర్యోదయ యోజన ఒక మైలురాయిగా నిలువనుంది. కిసాన్ సూర్యోదయ యోజన లో గుజరాత్ రైతుల అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమైంది. విద్యుత్ రంగంలో కొన్నేళ్లుగా గుజరాత్ లో జరుగుతున్న పనులు ఈ పథకానికి అతిపెద్ద పునాదిగా మారాయి. ఒకప్పుడు గుజరాత్ లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం పెద్ద సవాల్ గా ఉండేది. పిల్లల చదువులు, రైతులకు సాగునీరు, పరిశ్రమల ఆదాయాలు, ఇవన్నీ ప్రభావితం అయ్యేవి. అందువల్ల, విద్యుత్ ఉత్పత్తి నుండి ప్రసారం వరకు ప్రతి రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించే పని ని ఉద్యమం తరహా లో చేయడం జరిగింది.
దశాబ్దం క్రితం సౌరశక్తి కి సంబంధించి సమగ్ర విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. 2010లో పాటన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించినప్పుడు, ఒక రోజు భారతదేశం ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ మార్గాన్ని ప్రపంచానికి చూపించగలదని ఎవరూ ఊహించలేదు. నేడు, భారతదేశం సౌర శక్తి ఉత్పత్తి, వినియోగం ల పరంగా ప్రపంచంలో అగ్రదేశాలలో ఒకటిగా ఉంది. గత ఆరు సంవత్సరాల్లో సౌర శక్తి ఉత్పత్తి పరంగా దేశం ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకుని వేగంగా ముందుకు సాగుతోంది.
సోదర సోదరీమణులారా,
గ్రామాలతో సంబంధం లేని వారు, వ్యవసాయంతో సంబంధం లేని వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసివుంటుంది.. రైతులకు సాగు కోసం ఎక్కువగా రాత్రి సమయంలోనే విద్యుత్తు లభిస్తుందనే సంగతి. పొలంలో సాగు అవసరాలకు నీటిని అందించే సమయంలో రైతులు రాత్రంతా మేల్కొనాల్సి ఉంటుంది. కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభమవుతోన్న జూనాగఢ్, గీర్ సోమనాథ్ వంటి ప్రాంతాల్లో అడవి జంతువుల వల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉండేది. అందువల్ల, కిసాన్ సర్వోదయ యోజన రాష్ట్రంలోని రైతులను సంరక్షించడమే కాకుండా వారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో రైతులకు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగు అవసరాలకు నీటిని అందించేందుకు వీలుగా మూడు దశలలో విద్యుత్ లభించనుంది. ఇది నూతన నవోదయమే కదా!
మిగిలిన వ్యవస్థను ప్రభావితం చేయకుండా పూర్తిగా సరికొత్త ప్రసార సామర్థ్యాన్ని సృష్టించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న పనికి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ పథకం కింద, రాబోయే 2-3 సంవత్సరాలలో సుమారు మూడున్నర వేల సర్క్యూట్ కిలోమీటర్ల కొత్త ట్రాంస్ మిశన్ లైన్ లను వేయడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో వెయ్యికి పైగా గ్రామాల్లో ఈ పథకం అమలవుతుందని నాతో చెప్పారు. వీటిలోసైతం ఎక్కువ పల్లెలు ఆదివాసీ బాహుళ్య ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పథకం గుజరాత్ అంతటా విస్తరించినప్పుడు, ఇది లక్షలాది మంది రైతుల జీవితాలను, వారి దైనందిన జీవితాన్ని పూర్తి గా మార్చివేస్తుంది.
మిత్రులారా ,
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, ఖర్చును తగ్గించడానికి, వారి కష్టాలను తగ్గించడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రయత్నాలను మరింత పెంచవలసి ఉంటుంది. రైతులు వారి ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛను ఇవ్వడం కానివ్వండి, లేదా వేలాది రైతు ఉత్పత్తి సంఘాలను నిర్మించడం, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి లేదా పంట బీమా పథకాన్ని మెరుగుపరచడానికి, నూరు శాతం యూరియా ను లేదా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు భూసార హెల్త్ కార్డులు ఇవ్వడం కానివ్వండి వీటి లక్ష్యం దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే. రైతుకు సాగు చేయడం కష్టం కాకూడదు. ఇందు కోసం నూతన పథకాలు నిరంతరం ప్రవేశపెట్టడం జరుగుతోంది.
నేడు దేశంలో, రైతును శక్తి ప్రదాతగా మలచే పని కూడా జరుగుతోంది. కుసుం యోజన కింద రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు-ఎఫ్‌పిఓలు, సహకార సంస్థలు, పంచాయతీలు, ఇలాంటి సంస్థలన్నీ బంజరు భూమిలో చిన్న సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో సహకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సౌర పంపులను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను రైతులు అవసరానికి అనుగుణంగా సాగునీటికోసం వినియోగించి అదనపు విద్యుత్ ను కూడా అమ్ముకోగలుగుతారు.. దేశవ్యాప్తంగా సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి సుమారు 17.50 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఇది రైతులకు నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తుంది; వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.
మిత్రులారా,
గుజరాత్ విద్యుత్ రంగంలో నే కాక నీటిపారుదల మరియు తాగునీటి రంగంలో కూడా గొప్ప కృషి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ గుజరాత్ నీటి పరిస్థితి ఏమిటో తెలుసు. సంవత్సరాలుగా బడ్జెట్ లో చాలా ఎక్కువ భాగం నీటి కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది... గుజరాత్‌పై ఆర్థిక భారం భారీగా ఉందని చాలామంది ఊహించి ఉండరు. . ఇంతకు ముందు ఎవరూ ఊహించలేని విధంగా గత రెండు దశాబ్దాల కృషితో నేడు గుజరాత్ లోని జిల్లాలకు, ఆ గ్రామాలకు కూడా నీరు చేరింది.ఈ రోజు మనం సర్ దార్ సరోవర్‌ను చూసినప్పుడు, నర్మదా నీటిని గుజరాత్ లోని కరువు ప్రాంతాలకు, వాటర్ గ్రిడ్ లకు రవాణా చేసే కాలువల నెట్వర్క్ ను చూడండి, వాటర్ గ్రిడ్లు చూడండి, గుజరాత్ ప్రజల కృషికి గర్వంగా ఉంది. నేడు, గుజరాత్‌లోని 80 శాతం కుటుంబాలకు కుళాయి నీరు చేరుకుంది. త్వరలో గుజరాత్ దేశంలోని ప్రతి ఇంటికీ నీటి పైపు లను అందించే రాష్ట్రాల్లో ఉంటుంది. నేడు గుజరాత్ లో కిసాన్ సర్వోదయ యోజన ప్రారంభం అవుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ తన స్వంత మంత్రాన్ని మళ్లీ పునరావృతం చేయాల్సి ఉంటుంది.. అదే ప్రతి చుక్క కు మరింత ఎక్కువ పంట అనే మంత్రి. రైతులకు పగటి పూట విద్యుత్ వచ్చినప్పుడు, ఎక్కువ నీటిని ఆదా చేయడానికి మనం సమాన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. లేకపోతే సోదరా, విద్యుత్ వస్తోంది, నీరు ప్రవహిస్తోంది, మనం హాయిగా కూర్చుందాం అనే భావనలో ఉంటే, అప్పుడు గుజరాత్ నాశనమవుతుంది, నీరు అయిపోతుంది, జీవితం కష్టమవుతుంది. పగటిపూట విద్యుత్ లభ్యత కారణంగా, రైతులకు సూక్ష్మ సేద్యం కోసం ఏర్పాట్లు చేయడం సులభం అవుతుంది. సూక్ష్మ సేద్యం రంగంలో గుజరాత్ గొప్ప పురోగతి నా సాధించింది - అది బిందు సేద్యం లేదా స్ప్రింక్లర్ అయినా.. కిసాన్ సర్వోదయ యోజన దాని మరింత విస్తరణకు సహాయపడుతుంది.
సోదర సోదరీమణులారా,
ఈ రోజు గుజరాత్ లో "సర్వోదయ" తో పాటు "ఆరోగ్యోదయ" జరుగుతోంది. ఈ "ఆరోగ్యోదయ" ఒక కొత్త విధానం. నేడు, భారతదేశపు అతిపెద్ద కార్డియేక్ ఆసుపత్రిగా, యుఎన్ మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియోలాజీ అండ్ రీసర్చ్ సెంటర్ ను ప్రారంభించడమైంది. ఇది ఎంపిక చేయబడ్డ ఆసుపత్రులలో ఒకటి, ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఆధునిక ఆరోగ్య సదుపాయాన్ని కలిగి ఉన్న దేశంలోని అతికొద్ది ఆసుపత్రులలో కూడా ఒకటి. మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సమస్యలు రోజురోజుకు పెరిగి చిన్న పిల్లల్లోకి చేరుతుండటం చూస్తున్నాం. అందుకని, ఈ ఆసుపత్రి ఒక్క గుజరాత్ కు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా గొప్ప సౌకర్యం.
సోదర సోదరీమణులారా,
గత రెండు దశాబ్దాల్లో, గుజరాత్ ఆరోగ్య రంగంలో కూడా అపూర్వమైన కృషి చేసింది. ఆధునిక ఆసుపత్రులు, వైద్య కళాశాలలు లేదా ఆరోగ్య కేంద్రాల నెట్ వర్క్ అయినా, గ్రామాలను మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో అనుసంధానించడానికి భారీ కృషి జరిగింది. గత 6 సంవత్సరాల్లో, దేశంలో ఆరోగ్య సంరక్షణ పథకాలు ప్రారంభమయ్యాయి, గుజరాత్ కూడా వాటి నుండి లబ్ది పొందుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగంగా గుజరాత్ లోని 21 లక్షల మందికి ఉచిత చికిత్స లభించింది. గుజరాత్ లో చౌకైన ఔషధాలను అందించడం కోసం 500 కి పైగా జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఇందులో గుజరాత్ లోని సాధారణ రోగులకు దాదాపు రూ.100 కోట్లు ఆదా అయ్యాయి.
నేడు, విశ్వాసం మరియు పర్యాటకం రెండూ గుజరాత్ అందుకున్న మూడవ బహుమతి తో ముడిపడి ఉన్నాయి. గిర్ నార్ పర్వతం పై దేవీ అంబ కొలువై ఉన్నారు. గోరఖ్‌నాథ్ శిఖరం, గురు దత్తాత్రేయ శిఖరం, జైన్ ఆలయం లు కూడా గిర్ నార్ కొండలపైన ఉన్నాయి. పర్వత ప్రాంతం పైకి చేరుకోవాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. అక్కడకు వెళ్లిన వారిలో ఒకరకమైన శక్తి, ప్రశాంతత వ్యక్తం అవుతాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి రోప్-వేతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వత ప్రాంతాలను చూడవచ్చు. ఇప్పటి వరకు, ఆలయానికి చేరుకోవడానికి 5-7 గంటలు పట్టే దూరం, ఇప్పుడు రోప్ వే నుండి 7-8 నిమిషాల్లో కవర్ చేయబడుతుంది. రోప్ వే రైడింగ్ కూడా సాహసాన్ని పెంచుతుంది, ఉత్సుకత ను పెంచుతుంది. గిర్ నార్ పర్వతం చట్టుపక్కల ఉన్న ఆకుపచ్చని అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. రోప్ వే సౌకర్యం తో ఎక్కువ మంది భక్తులు ఇక్కడకు వస్తారు, పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.
మిత్రులారా, నేడు ప్రారంభమైన రోప్ వే గుజరాత్ లో నాలుగో రోప్ వే. బనాస్ కాంఠా లో మాత అంబ దర్శన౦ కోస౦, పావ గఢ్ లో, సత్ పూడా లో మరో మూడు రోప్ వేలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. గిర్ నార్ రోప్ వే లో అడ్డంకులను కల్పించకపోయి ఉంటే, అది ఇన్ని సంవత్సరాల పాటు అటకెక్కి ఉండేదే కాదు. ప్రజలు, పర్యాటకులు చాలా కాలం క్రితమే ప్రయోజనం పొందుతూ ఉండే వారు. ఒక దేశంగా, ఇంత పెద్ద సదుపాయాన్ని నిర్మించడం ద్వారా ఇంత సుదీర్ఘకాలం గా నిలచిపోతే ప్రజలకు ఎంతటి నష్టం వాటిల్లిదన్న సంగతి ని కూడా మనం ఆలోచించాలి. దేశానికి నష్టం ఏమిటి? ఇప్పుడు, ఈ గిర్ నార్ రోప్ వే ప్రారంభం అవుతున్నందువల్ల ఇక్కడి ప్రజలకు సౌకర్యం అయితే లభిస్తుంది, తోడుగా ఇక్కడి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా
పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించినప్పుడే ఎక్కువ మంది మన వద్దకు వస్తారన్న సంగతిని ప్రపంచంలో పెద్ద పెద్ద పర్యాటక కేంద్రాలు, విశ్వాస సంబంధిత కేంద్రాలు అంగీకరిస్తున్నాయి. నేడు, పర్యాటకులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, అదీ కుటుంబంతో కలసి వెళ్లినప్పుడు, వారికి ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ తో పాటు లివింగ్ కూడా అవసరపడుతుంది. గుజరాత్ లో అనేక ప్రదేశాలు ఉన్నాయి, ఇది భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా మారే సంభావ్యత ఉంది. అమ్మ వారి ఆలయాలను గురించి మాట్లాడుకొంటే, గుజరాత్ లో భక్తుల కోసం సంపూర్ణ సర్క్యూటే ఉంది. నేను మాతల స్థలాలు అన్నిటినీ చెప్పడం లేదు.. గుజరాత్ లోని అన్ని మూలల్లోనూ, ఈ శక్తి రూపేణ మాతలు నిరంతరం గుజరాత్ కు ఆశీస్సులను అందిస్తున్నారు. అంబా జీ, పావ గఢ్ సరేసరి, చోటిలా చాముండా మాతా జీ, ఉమియా మాతాజీ, కచ్ఛ్ లో మాతా నో మఢ్, ఎన్నెన్నో, అంటే, గుజరాత్ లో ఒక రకమైన శక్తి నివాసమై ఉందన్న అనుభూతిని మనం పొందవచ్చును. ప్రసిద్ధ ఆలయాలు అనేకం ఉన్నాయి.
విశ్వాస ప్రదేశాలతో పాటు, గుజరాత్ లో అద్భుతమైన సామర్థ్యాలు గల అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇటీవల ద్వారక లోని శివరాజ్‌పూర్ బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ లభించిందని మీరు చూశారు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల మరింత మంది పర్యాటకులు పెరిగి, ఆదాయంతో పాటు, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు తెచ్చుకున్న సర్ దార్ సాహెబ్ కు అంకితం చేసిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం) ఇప్పుడు పెద్ద పర్యాటక ఆకర్షణగా మారుతోంది.
'కోవిడ్ మహమ్మారి ప్రారంభం కాక ముందు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని 45 లక్షల మందికి పైగా దర్శించారు. ఇంత తక్కువ కాలంలో 45 లక్షల మంది చాలా పెద్ద విషయం. ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది. పర్యాటకుల తాకిడి కూడా గణనీయంగా పెరుగుతోంది. అదేవిధంగా, నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను - అహ్మదాబాద్ లోని కాంకరియా సరస్సు. ఒకానొక సమయంలో అక్కడికి ఎవరు వెళ్ళే వారు కాదు , వేరే మార్గంలో వెళ్ళే వారు. ఆ మార్గాన్ని కొంచెం పునరుద్ధరించారు, కొద్దిగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు, మరియు ఈ రోజు పరిస్థితి ఏమిటి - అక్కడ సందర్శకుల సంఖ్య ఇప్పుడు ఏటా 75 లక్షలకు చేరుకుంటోంది. అహమదాబాద్ నగరం మధ్యలో, ఈ ప్రదేశం 75 లక్షల, మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకు గొప్ప ఆకర్షణకు కారణమైంది; చాలా మంది ప్రజల జీవనోపాధికి కూడా ఒక కారణం అయ్యింది. ఈ మార్పులు పర్యాటకుల సంఖ్యను పెంచడానికి, స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. పర్యాటకం అంటే కనీసం మూలధనం ఉన్న ప్రాంతం మరియు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది.
మన గుజరాతీ సహచరులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుజరాతీ సోదర సోదరీమణులతో నేను చేసే విన్నపం ఏమిటంటే, గుజరాత్ కు మీరు బ్రాండ్ అంబాసిడర్ లు గా మారి, ఈ రోజున ప్రపంచం అంతటా వ్యాపించిపోయారు. గుజరాత్ తన స్వంత ప్రదేశంలో కొత్త ఆకర్షణ కేంద్రాన్ని తయారుచేస్తున్నప్పుడు, భవిష్యత్తులో కూడా ఇటువంటివి నిర్మించబోతోంది, అప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మా గుజ్జు సోదరులకు చెప్తాను, మన సహచరులంతా, వారి మాటలను ప్రపంచమంతటా స్వయంగా తీసుకుపోండి. వెళ్ళండి, ప్రపంచాన్ని ఆకర్షించండి. పర్యాటక కేంద్రమైన గుజరాత్‌తో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మనం ఈ దిశగా ముందుకు వెళ్లాం, మనం ముందుకు సాగాల్సి ఉంది.
ఈ ఆధునిక సౌకర్యాలను పొందినందుకు గుజరాత్ సోదర సోదరీమణులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఆంబే ఆశీస్సులతో గుజరాత్ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. గుజరాత్ ఆరోగ్యంగా ఉండాలి , గుజరాత్ బలంగా ఉండాలి . ఈ శుభాకాంక్షలతో మీ అందరికీ కృతజ్ఞతలు. అనేకానేక శుభాకాంక్షలు.
***
(Release ID: 1667409)
Visitor Counter : 213
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam