PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 23 OCT 2020 6:10PM by PIB Hyderabad

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన  పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఇబి చేపట్టిన నిజనిర్థారణ సమాచారం ఉంటుంది.)

#Unite2FightCorona

#IndiaFightsCorona

  • 2 నెలల తరువాత మొదటి సారిగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 7 లక్షలకంటే దిగువన
  • 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారు 20,000 కంటే తక్కువమంది
  • గత 24 గంటల్లో 73,379 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా, కొత్తగా నిర్థారణ అయిన పాజిటివ్ కేసులు 54,366
  • 10 కోట్ల పరీక్షల మైలురాయి  దాటిన భారత్, చివరి కోటి పరీక్షలు 9 రోజుల్లో నిర్వహణ, గడిచిన 24 గంటల్లో 14.5 లక్షల కోవిడ్ పరీక్షలుపరీక్షలు
  • జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం పెరుగుతూ 89.53% కు చేరిక

Image

మరో కీలకమైన మైలురాయి దాటిన భారత్ ; 2 నెలల తరువాత మొదటిసారిగా చికిత్సలో ఉన్నవారు 7 లక్షలకు లోపు;  24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నవారు 20 వేల లోపు

కోవిడ్ మీద పోరులో భారత్ మరోఈ కీలకమైన మైలురాయి దాటింది. చికిత్స పొందుతూ ఉన్న బాధితుల సంఖ్య 2 నెలల తరువాత ( 63 రోజులు) మొదటిసారిగా 7 లక్షల లోపుకు తగ్గింది. గత ఆగస్టు 22న చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,97,330 గా నమోదైంది. దేశంలో ఈరోజు నమోదైన మొత్తం పాజిటివ్  కేసులు 6,95,509 మంది. ఇప్పటిదాకా పాజిటివ్ గా నమోదైన వాళ్ళలో వీరు 8.96%.  కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారత్ లో ఎక్కువగా ఉంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 లక్షల మంది (69,48,497 మంది) కోలుకున్నారు. చికిత్స పొందుతూ ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది.  ఈరోజుకు ఆ సంఖ్య 62,52,988 కి చేరింది. పైగా, కోలుకున్నవారు చికిత్స పొందుతున్నవారికి 10 రెట్లుగా నమోదైంది. గడిచిన 24 గంటలలో 73,979 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కెసులు 54,366. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 89.53%  చేరింది. 24 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 20 వేల లోపు ఉంది. కొత్తగా కోలుకున్న వారిలో 81% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. అన్ని రాష్టాల కంటే ఎక్కువగాఒకే రోజు మహారాష్ట్రలో 16,000 మందికి పైగా కోలుకున్నారు.  13,000 మందితో కర్నాటక రెండో స్థానంలో ఉంది.   గడిచిన 24 గంటలలో కొత్తగా నిర్థారణ అయిన కేసులు 54,366 కాగా వాటిలో 78% కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. అందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో 7,000 కు పైగా కొత్త కేసులు నమోదు కాగా 5,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలో ఉంది.  గడిచిన 24 గంటలలో 690 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో దాదాపు 81% మరణాలు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే జరిగాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 198 మరణాలు సంభవించాయి.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667075

10 కోట్ల కోవిడ్ పరీక్షల మైలురాయి దాటిన భారత్, చివరి కోటి పరీక్షలు జరిగింది 9 రోజుల్లోనే, గడిచిన 24 గంటల్లో దాదాపు14.5 లక్షల పరీక్షలు

2020 జనవరి మొదలుకొని ఇప్పటిదాకా జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షలలో భారత్ భారీ పెరుగుదలను చాటుకుంది. 10,01,13,085 పరీక్షలతో 10 కోట్ల మైలురాయి దాటింది. గడిచిన 24 గంటలలో 14,42,722 పరీక్షలు చేయటం కూదా సరికొత్త రికార్డు. దేశంలో పరీక్షలు జరిపే లాబ్ ల సంఖ్య 2000 కు చేరగా అందులో ప్రభుత్వ లాబ్ లు 1122, ప్రైవేట్ లాబ్ లు 867 ఉన్నాయి. రోజుక్లు 15 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించగలిగే సామర్థ్యం వచ్చింది.  దీనివలన పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. జాతీయ స్థాయిలో పాజిటివ్ రేటు 7.75% గా నమోదైంది. 15 రాష్ట్రాల్లో ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో పరీక్షలు పెంచాలని సూచిస్తోంది. చివరి కోటి పరీక్షలు గత 9 రోజుల్లోనే జరిగాయి.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667047

ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ సంసిద్ధత మీద, కోవిడ్ సంబంధిత సరైన ప్రవర్తన మీద సమీక్షించిన డాక్టర్ హర్ష వర్ధన్

ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ పట్ల సంసిద్ధత, కోవిడ్ కు తగినట్టు కొనసాగించాల్సిన ప్రవర్తన తీరు తదితర అంశాలమీద ఉత్తరప్రదేశ్ ఆరోగ్య, వైద్య విద్యాశాఖామంత్రి, సీనియర్ అధికారులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్తర్ హర్షవర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా యోధుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. వీరి కృషివల్లనే దేశంలో కోవిడ్ నియంత్రణలో తగినంత మెరుగుదల  కనిపించిందన్నారు. ఒకప్పుడు రోజుకు 95,000 కు పైగా కెసులు నమోదు కాగా ఇప్పుడు 55,000 లోపు నిర్థారణ అవుతున్నాయన్నారు. కోలుకుంటున్నవారిశాతం 90% గా. మరణాలు 1,51% గా నమోదైందన్నారు. 1% లోపే మరణాలు ఉండాలన్న లక్ష్యానికి క్రమంగా దగ్గరవుతున్నామన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వచ్చే మూడు నెలల కాలం అత్యంత కీలకమని గుర్తు చేశారు. కోవిడ్ పూర్తి పరిస్థితి మీద అప్పుడే ఒక అవగాహనకు రాగలమన్నారు. పండుగల సీజన్, చలికాలం దాటగలిగితే మనం మెరుగైన స్థితిలో ఉన్నట్టు భావించాలన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో జాగ్రత్తలు మరీ ముఖ్యమని చెబుతూ మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం, చేతుల పరిఉశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని మరోమారు సూచించారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667131
 

 శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల విధానం-2020 క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేలా చూడాలని రాష్ట్రాల శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రులకు పిలుపునిచ్చిన డాక్టర్ హర్ష వర్ధన్   

కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి  డాక్టర్ హర్ష వర్ధన్  శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల విధానం-2020 క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేలా చూడాలని రాష్ట్రాల శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రులకు పిలుపునిచ్చారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల మంత్రులతో మాట్లాడుతూ ప్రతిపాదిత ఎస్ టి ఐ పాలసీ గురించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనిని అన్ని విధాలా అందరికీ ఉపయోగకరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని, ప్రతి రాష్ట్రం ఇందులో సమాన భాగస్వామిగా ఉంటుందని అన్నారు. అదే విధంగా దీని రూపకల్పనతీఓ బాటు అమలు చేయటంలో కూడా  సమాన బాధ్యత తీసుకోవాలని కోరారు. శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను ఈ విధానం పునరుత్తేజితం చేస్తుందని, ప్రాధాన్యాలను పునర్నిర్వచిస్తుందని, సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభం దీని తక్షణ అవసరాన్ని చాటిచెబుతోందని, కేంద్ర-రాష్ట్ర సత్సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్దారు.  

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666813

అక్టోబర్ 24న గుజరాత్ లో మూడు కీలక ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధాని   

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 24 న గుజరాత్ కు చెందిన మూడు కీలకమైన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నారు. గుజరాత్ రైతులకోసం కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభించటంతోబాటు యుఎన్ మెహతా కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అనుబంధంగా  చిన్న పిల్లల గుండె జబ్బుల ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అదే విధంగా అహమ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో టెలీ కార్డియాలజీ కోసం మొబైల్ యాప్ ప్రారంభిస్తారు. ఈ సమ్దర్భంగా గీర్నార్ లో రోప్ వే కూదా ప్రారంభిస్తారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666836

న్యూ ఢిల్లీలో ప్రాంతీయ ఔషధ నిల్వల కేంద్రం ప్రారంభం  

న్యూ ఢిల్లీలోని అఖిలభారత ఆయుర్వేద సంస్థ లో కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ఔషధ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ ఔషధ మొక్కల మండలి ప్రతిపాదించిన అనేక కేంద్రాల పరంపరలో ఇది రెండవది. ఆయుఢ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కోటెచా కూడా ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సహజసిద్ధమైన వ్యాధి నివారణకు, ఓషధులకు ప్రాధాన్యం పెరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్ వలన ఈ డిమాండ్ మరింత పెరిగింది. అశ్వగంధ, తులసి, కాలమేఘ, ములేథి లాంటి మూలికలకు బాగా గిరాకీ ఉంది. అందుకే వీటిని తగినంతగా సరఫరా చేసేందుకు నాణ్యమైన ముడు సరకు కోసం ఆయుఢ్ పరిశ్రమ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తోంది.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666894

అరుణాచల ప్రదేశ్ కు ఇ ఎస్ ఐ పథకం విస్తరింపు

మరింత మంది కార్మికులను ఇ ఎస్ ఐ పథకం కిందికి తెచ్చేమ్దుకు ప్రయత్నిస్తూ ఉన్న భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ సౌకర్యాన్ని నవంబర్ 1 నుంచి మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్ కు వర్తింపజేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. పాపుమ్ పారే జిల్లాలో 10 మందికి పైగా ఉద్యోగులున్న ప్రతి సంస్థ ఇ ఎస్ ఐ పథాకానికి అర్హమౌతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సంస్థ వెబ్ సైట్ www.esic.in లోను, కార్మిక మంత్రిత్వశాఖవారి శ్రమ సువిధ పోర్టల్ లోను అందుబాటులో ఉంచారు.లాంటి భౌతిక డాక్యుమెంట్ల అవసరమూ లేకుండా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ నెలకు రూ. 21,000 లోపు జీతం వచ్చేవారు ( వికలాంగులైతే రూ. 25 వేలలోపు జీతం వచ్చేవారు) ఈ పథకానికి అర్హులు.  .

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667028

 

 సముద్ర కార్యకలాపాలకు సంసిద్ధతపై సిఎన్ఎస్ సమీక్ష

 

భారత నావికాదళపు ప్రధాన పోరాట యోధుల సంసిద్ధతను నావికాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ 22న సమీక్షించారు. కన్వర్ నావికా కేంద్రానికి ఆయనవెంట వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కుమార్ కూడా ఉన్నారు. కీలకమైన మరమ్మతులు, నిర్వహణ, విడిభాగాల మద్దతు, యుద్ధ పోరాట సామర్థ్యం పెంచుకోవటం తదితర అంశాల మీద అక్కడి సిబ్బందితో సంభాషించారు. సైబర్ సెక్యూరిటీ, తీవ్రవాదుల దాడులనుంచి దళాల సంరక్షణ, అసౌష్టవ యుద్ధరంగం తదితర అంశాలమీద మాట్లాడుతూ అత్యమ్త అప్రమత్తత కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత విక్రమాదిత్య, విధ్వంసకవాహనాలు, ఫ్రిగేట్స్, కార్వెట్స్, సహాయ నౌకలు హెలికాప్టర్లతో కూడిన కారియర్ బాటిల్ గ్రూప్ చేరుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నడిచే క్షిపణి విధ్వంసక  వాహనం దగ్గర ఆయనకు ఫ్లీట్ కమాండర్ దాని నిర్వహన సంసిద్ధతను వివరించారు. ఆ తరువాత వాస్తవ పరిస్థితుల్లో సాగే ఆయుధాలతో కాల్పులు, గాలిలో యుద్ధ కార్యకలాపాలు, జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు, నౌకావిన్యాసాలు ప్రదర్శించి చూపారు. సహాయక నౌక దీపక్ దగ్గర నౌకాసిబ్బందితో సంభాషించిన తరువాత విమాన వాహక నౌక విక్రమాదిత్య దగ్గర కారియర్ బాటిల్ గ్రూప్ సామర్థ్యాలను పరీక్షించారు. కొద్ది నెలలుగా కోవిడ్ 19 సంబంధమైన సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ ఉన్నత స్థాయి యుద్ధ సంసిద్ధత ప్రదర్శించినందుకు వారిని నావికాదళాధిపతి అభినందించారు. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితిని ప్రస్తావిస్తూ, రానున్న కాలంలో నావికాదళం కార్యకలాపాలు అదే రకమైన ఉన్నతస్థాయిలో కొనసాగాలన్నారు.  నావికాదళం, వారి కుటుంబ సభ్యులు కోవిడ్ కు సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించటం మరువరాదని సూచించారు. గోవా చేరుకొని సముద్రతలం మీద కార్యకలాపాలను పరిశీలించారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666909

 పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు పంపిన సమాచారం    

  • కేరళ: నవరాత్రి వేడుకలలో భాగంగా జరుపుకునే విద్యారంభం కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట ఆరోగ్య శాఖామంత్రి కెకె శైలజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   వీలైనంత వరకు పూజా కార్యల్రమాలు ఇళ్లలోనే నిర్వహిమ్చుకోవాలని కూడా కోరారు.  క్టెయిన్మెంట్ జోన్లలో ఇళ్లబయట ఎలాంటి  కార్యక్రమాలూ అనుమతించబోమన్నారు. ఇలా ఉండగా, కాసర్ గోడ్ జిల్లాలో  కొత్తగా నిర్మించిన టాటా కోవిడ్ ఆస్పత్ర్రిని వెంటనే వాడకంలోకి తీసుకురాకపోతే నిరాహారదీఎక్ష చేపదతానని ఎంపీ రాజ్ మోహన్ ఉన్నిత్తాన్  హెచ్చరించారు. పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించటంలేదని ఆరోపించారు.   

 

  • తమిళనాడు : మార్చిలో కోవిడ్ నేపథ్యంలో నిలిపివేసిన సబర్బన్ రైలు సర్వీసులు పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. పునరుద్ధరణ వలన ప్రజలకు ఉపయోగపడటంతోబాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి దోహదపడుతుందని కూడా పేర్కొంది. ఇన్ఫెక్షన్ నియంత్రణ, పాఠశాలల మూసివేత, ఇతర బహిరంగ స్థలాల ముసివేత లాంటి కోవిడ్ నియంత్రణ చర్యల ద్వారా చెన్నై లో 96% మేరకు డెంగ్యూ కెసులు నియంత్రించ గలిగినట్టు పేర్కొంది. 
  • కర్నాటక: రాష్ట్రంలో కళాశాలలు నవంబర్ 17 నుంచి తెరుస్తున్నారు. అయితే రావటమన్నది విద్యార్థుల నిర్ణయానికే వదిలేశారు.   ప్రభుత్వం విడుదలచేసిన సమాచారం ప్రకారం గడిచిన నాలుగు నెలలతో పోల్చినప్పుడు  అక్టోబర్ లో మరణాల శాతం 1% గా నమోదైంది. గత 8 రోజులుగా కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా నమోదవుతున్నారు. మాస్కులు ధరించనివారిమీద, బహిరంగ స్థలాల్లో భౌతిక దూరం పాటించని వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.   
  • ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న కేసులలో 95.13%  సాధించింది. .ఆనవాలు పట్టటం, పరీక్షించటం, చికిత్స చేయటం అనే త్రిముఖ వ్యూహం ద్వారా ఇది సాధ్యమైమ్దని ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఇలా ఉందగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది గురువారం నాడు అధికారులకు ఆదేశాలిస్తూ. 10 రోజుల పాటు ప్రజలంతా తప్పనిసరిగా కచ్చితమైన కోవిడ్ నియంత్రణ విధానాలు పాటించేలా చూడాలన్నారు.  
  • తెలంగాణ: 1421 కొత్త కేసులు, 1221 కోలుకున్న కేసులు , 6 మరణాలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో   249 కొత్త కేసులు నిర్థారణ అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం కెసులు 2,29,001 కాగా, చికిత్సలో ఉన్నవారు 20,377 మంది, మరణాలు 1298కోలుకున్నవారు  2,07,326 గా నమోదయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో  8.8 కేసులు మాత్రమే చికిత్సలో ఉన్నాయి. మాస్కులు ధరించటం వల్లనే వ్యాధి నియంత్రణలో ఉంది.   
  • అరుణాచల్ ప్రదేశ్:  మరొకరు మరణించటంతో మొత్తం  మరణాల సంఖ్య 32 కు చేరింది. లోహిత్ లో అత్యధిక కోవిడ్ మరణాలు సంభవించాయి. మొత్తం 165 తాజా కేసుల్లో లో 43 కొత్త కేసులు నమోదయ్యాయి. చికిత్సలో ఉన్నకేసులు 2638 కి చేరింది.   
  • మహారాష్ట్ర: వరుసగా ఐదో రోజు మహారాష్ట్రలో 10,000 కు లోపు కోవిడ్ కెసులు నమోదయ్యాయి. గురువారం  7,539 కొత్త కెసులు నమోదు కాగా , 16,177 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య  1.51 లక్షలకు తగ్గింది.
  • గుజరాత్: ఆరోగ్య సిబ్బంది వివరాలు సేకరించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. కోవిడ్ వాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ముందుగా వారికి అందించేందుకే ఈ లెక్కలు తీస్తోంది. దేసవ్యాప్తంగా జరుగుతున్న లెక్కింపులో భాగంగానే ఇది జరుగుతోంది.ఈ సమాచారాన్ని కేంద్రానికి పంపుతారు.  రాష్ట్రంలో ఆరోగ్య సిబ్బంది ప్రస్తుతం  14,143 మంది కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
  • రాజస్థాన్: కొత్త కోవిడ్ కేసుల సంఖ్య, చికిత్సలో ఉన్నవారి సంఖ్య  రాజస్థాన్ లో  క్రమంగా తగ్గుతోంది. నిన్న 1,822 కొత్త కెసులు నమోదు కాగా, 2,654 మంది కోలుకున్నారు. ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 18,341.
  • మధ్య ప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ లాక్ 5 నిర్ణయం ఫలితంగా మధ్య ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ 100శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఇప్పటివరకూ అధికారులకు మాత్రమే 100 సాతం హాజరు తప్పనిసరి. ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిబంధన విధించారు.   
  • చత్తీస్ గఢ్: కోవిడ్ ఆస్పత్రులలో మెడికల్ ఆక్సిజెన్ అందుబాటులో ఉంటూ సకాలంలో కోవిడ్ బాధితులకు సరఫరా చేయగలిగేలా చత్తీస్ గఢ్ ప్రభుత్వం అన్ని వైద్య కళాశాలలలోను, 17 జిల్లా ఆస్పత్రులలోను  ఆక్సిజెన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది. వచ్చే నాలుగు వారాల్లో ఇవి ఏర్పాటవుతాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి టి ఎస్ సింగ్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,238 మంది కోవిడ్ బాధితులు చికిత్సలో ఉన్నారు.

FACT CHECK

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FGQ3.jpg

 

********

 

 

 



(Release ID: 1667203) Visitor Counter : 189