రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సముద్ర కార్యకలాపాలకు సంసిద్ధతపై సిఎన్ఎస్ సమీక్ష

Posted On: 22 OCT 2020 7:41PM by PIB Hyderabad

భారత నావికాదళపు ప్రధాన పోరాట యోధుల సంసిద్ధతను నావికాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ 22న సమీక్షించారు. కన్వర్ నావికా కేంద్రానికి ఆయనవెంట వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కుమార్ కూడా ఉన్నారు. కీలకమైన మరమ్మతులు, నిర్వహణ, విడిభాగాల మద్దతు, యుద్ధ పోరాట సామర్థ్యం పెంచుకోవటం తదితర అంశాల మీద అక్కడి సిబ్బమ్దితో సంభాషించారు. సైబర్ సెక్యూరిటీ, తీవ్రవాదుల దాడులనుంచి దళాల సంరక్షణ, అసౌష్టవ యుద్ధరంగం తదితర అంశాలమీద మాట్లాడుతూ అత్యమ్త అప్రమత్తత కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఆ తరువాత అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ హెలికాప్టర్ లో  విక్రమాదిత్య, విధ్వంసకవాహనాలు, ఫ్రిగేట్స్, కార్వెట్స్, సహాయ నౌకలు హెలికాప్టర్లతో కూడిన కారియర్ బాటిల్ గ్రూప్ చేరుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నడిచే క్షిపణి విధ్వంసక  వాహనం దగ్గర ఆయనకు ఫ్లీట్ కమాండర్ దాని నిర్వహన సంసిద్ధతను వివరించారు. ఆ తరువాత వాస్తవ పరిస్థితుల్లో సాగే ఆయుధాలతో కాల్పులు, గాలిలో యుద్ధ కార్యకలాపాలు, జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు, నౌకావిన్యాసాలు ప్రదర్శించి చూపారు.  

సహాయక నౌక దీపక్ దగ్గర నౌకాసిబ్బందితో సంభాషించిన తరువాత విమాన వాహక నౌక విక్రమాదిత్య దగ్గర కారియర్ బాటిల్ గ్రూప్ సామర్థ్యాలను పరీక్షించారు. కొద్ది నెలలుగా కోవిడ్ 19 సంబంధమైన సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ ఉన్నత స్థాయి యుద్ధ సంసిద్ధత ప్రదర్శించినందుకు వారిని నావికాదళాధిపతి అభినందించారు. వర్షాకాలంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలోనూ దేశ సముద్రతీర భద్రతను నిర్వహించటంలో అవిరామంగా కృషిచేస్తున్నారన్నారు. మిషన్ సాగర్ కింద విదేశాలలో చిక్కుకున్నవారిని తీసుకురావటంలోను, పొరుగు దేశాలకు సాయం చేయటంలోనూ చేసిన కృషిని కూడా ప్రస్తావించి అభినందించారు.

ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితిని ప్రస్తావిస్తూ, రానున్న కాలంలో నావికాదళం కార్యకలాపాలు అదే రకమైన ఉన్నతస్థాయిలో కొనసాగాలన్నారు.కారియర్ బాటిల్ గ్రూప్ కచ్చితమైన, సమర్థవంతమైన పద్ధతిలో కాల్పులు జరపటాన్ని కూడా ప్రశంసించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉందని రుజువు చేసినట్టయిందన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం బాగున్నదని కూడా నావికాదళాధిపతి ప్రస్తావించారు. నావికాదళం, వారి కుటుంబ సభ్యులు కోవిడ్ కు సంబంధించిన నియమనిబంధనలు కచ్చితంగా పాటించటం మరువరాదని సూచించారు.

నావికాదళాధిపతి గోవా చేరుకొని సముద్రతలం మీద కార్యకలాపాలను పరుశీలించారు. నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ ను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (వెస్ట్) వీడ్కోలు పలికారు.

***(Release ID: 1666909) Visitor Counter : 14