ఆయుష్
న్యూఢిల్లీలోని ఏఐఐఏ వద్ద జాతీయ ఔషధ మొక్కల బోర్డు 'ప్రాంతీయ రా డ్రగ్ రిపాజిటరీ' ప్రారంభం
Posted On:
22 OCT 2020 6:11PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఏఐఐఏ వద్ద జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏర్పాటు చేసిన 'రీజినల్ రా డ్రగ్ రిపాజిటరీ'ని (ఆర్ఆర్‌డీఆర్) ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీపాద్ యెస్సో నాయక్, ఈ రోజు ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఆర్ఆర్‌డీఆర్‌ను ప్రారంభించారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపీబీ)
ప్రతిపాదించిన రిపోజిటరీ శ్రేణిలో నేడు ప్రారంభించిన ఆర్ఆర్‌డీఆర్ రెండోది.
దీనిని ట్రాన్స్-గంగా మైదాన ప్రాంతానికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కోటేచా కూడా హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సహజ వైద్యం, మూలికా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఏర్పడింది.
అశ్వగంధ, గిలోయి, తులసి, కల్‌మెగ్, ములేతి వంటి అనేక రకాల ముఖ్యమైన మూలికలకు అధికంగా డిమాండ్ ఉంది. దేశంలో ములికా ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండడంతో ఎన్‌ఎమ్‌పీబీ ఆయుష్ పరిశ్రమలకు, వినియోగదారులకు నాణ్యమైన ముడిపదార్థాల సరఫరాను నిర్ధారించడానికి గాను తగు యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో ఇప్పటికే నిమగ్నమై ఉంది. ఇందుకు గాను రా డ్రగ్ రిపోజిటరీలను స్థాపించే ప్రక్రియను వేగవంతం చేసింది. విధానాల్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఆయుష్ పరిశ్రమలకు ఔషధ మొక్కల యొక్క ప్రామాణికమైన ముడి పదార్థం యొక్క స్థిరమైన లభ్యతనిచ్చే రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించడానికి ఎన్ఎంపీబీ నిమగ్నమై ఉంది. ఔషధ మొక్కల జన్యు, రసాయన వైవిధ్యాన్ని నమోదు చేయడానికి గాను 8 ఆర్ఆర్‌డీఆర్‌లను, ఒక ఎన్ఆర్‌డీఆర్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. వీటిలో, మూడు ప్రాంతీయ రా డ్రగ్ రిపోజిటరీలు సిద్ధంగా ఉన్నాయి. ట్రాన్స్-గంగా ప్లెయిన్ రీజియన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఆర్ఆర్‌డీఆర్ పరిధిలోకి హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, పంజాబ్ రానున్నాయి. ఈ ప్రాంతం ఔషధ ముడి పదార్థాలకు భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వ్యవసాయ-వాతావరణ ప్రాంతం నుండి ముడి ఔషధ ఉత్పత్తుల సేకరణ, డాక్యుమెంటేషన్, ప్రామాణీకరణలో ఈ కొత్త ఆర్ఆర్‌డీఆర్ కీలకమైన ప్రాతను పోషించనుంది. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న'అఖిల భారత ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్' మరియు జైపూర్‌లోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద' సహకారంతో ఎన్ఎంపీబీ రాసా ఆధారంగా "ముడి ఔషధ మొక్కల ఉత్పత్తుల నాణ్యత అంచనా కోసం.. ప్రామాణిక ప్రోటోకాల్"ను కూడా ఎన్ఎంపీబీ ఇటీవల
విడుదల చేసింది.
***
(Release ID: 1666894)
Visitor Counter : 197