ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరో కీలకమైన మైలురాయి దాటిన భారత్

2 నెలల తరువాత మొదటిసారిగా చికిత్సలో ఉన్నవారు 7 లక్షలకు లోపు

24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నవారు 20 వేల లోపు

Posted On: 23 OCT 2020 11:35AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరోఈ కీలకమైన మైలురాయి దాటింది. చికిత్స పొందుతూ ఉన్న బాధితుల సంఖ్య 2 నెలల తరువాత ( 63 రోజులు) మొదటిసారిగా 7 లక్షల లోపుకు తగ్గింది. గత ఆగస్టు 22న చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,97,330 గా నమోదైంది.

దేశంలో ఈరోజు నమోదైన మొత్తం పాజిటివ్  కేసులు 6,95,509 మంది. ఇప్పటిదాకా పాజిటివ్ గా నమోదైనవాళ్ళలో వీరు 8.96% . ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు కోలుకుంటూ ఉండటం, మరణాలు బాగా తక్కువగా ఉండటం కారణంగా భారత్ లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య వేగంగా తగ్గుతూ ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015BSZ.jpg

 

కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారత్ లో ఎక్కువగా ఉంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 లక్షల మంది (69,48,497 మంది) కోలుకున్నారు. చికిత్స పొందుతూ ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది.  ఈరోజుకు ఆ సంఖ్య 62,52,988 కి చేరింది. పైగా, కోలుకున్నవారు చికిత్స పొందుతున్నవారికి 10 రెట్లుగా నమోదైంది. గడిచిన 24 గంటలలో 73,979 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కెసులు 54,366. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 89.53%  చేరింది.

దేశవ్యాప్తంగా పెరిగిన వైద్య మౌలిక సదుపాయాలు, కేంద్రం నిర్దేశించిన ప్రామాణిక చికిత్సావిధానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు  అమలు చేయటం, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ముందువరుసలో నిలిచి  సేవలందింఇచ్న యోధుల అంకితభావం కారణంగా కోలుకున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది.  అదే సమయంలో మరణాలు కూడా బాగా తగ్గాయి. నేటికి మరణాల శాతం 1.51% గా నమోదైంది. వీటన్నిటి ఉమ్మడి ఫలితంగా చికిత్సపొందుతున్న వారి సంఖ్య తగ్గింది. 24 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 20 వేల లోపు ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V7YZ.jpg

కొత్తగా కోలుకున్న వారిలో 81% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. అన్ని రాష్టాల కంటే ఎక్కువగాఒకే రోజు మహారాష్ట్రలో 16,000 మందికి పైగా కోలుకున్నారు.  13,000 మందితీ కర్నాటక రెండో స్థానంలో ఉంది. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZGRO.jpg

 

గడిచిన 24 గంటలలో కొత్తగా నిర్థారణ అయిన కేసులు 54,366 కాగా వాటిలో 78% కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. అందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో 7,000 కు పైగా కొత్త కేసులు నమోదు కాగా 5,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలో ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KUP1.jpg

 

గడిచిన 24 గంటలలో 690 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో దాదాపు 81% మరణాలు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే జరిగాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 198 మరణాలు సంభవించాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005D5K2.jpg     

***



(Release ID: 1667075) Visitor Counter : 169